muttaiah
-
ఙ్ఞాపకాలను వీడలేక.. తండ్రి చెంతకే..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తండ్రి చనిపోయాడనే దిగులుతో మనస్తాపానికి గురై కుమారుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన, కూలి పనులు చేసుకుని జీవించే కొమ్మడి ముత్తయ్య నెల రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి కుమారుడు కొమ్మిడి సమ్మన్న (21) తీవ్రంగా కలత చెందాడు. పలుమార్లు తల్లి రమాదేవి, భార్య నాగేశ్వరి ధైర్యం చెప్పినా పదేపదే తండ్రిని గుర్తుచేసుకుంటూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సమ్మన్న పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. సమ్మన్న చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తిరుమల్‌రావు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూడ్ ఫొటోలుగా మార్చి.. పలువురికి పంపించి బెదిరించడంతో.. -
'తాత అని పిలిపించుకుని.. డబ్బు ఆశ చూపి..' ముగ్గురు బాలికలపై.. వృద్ధుడు
కరీంనగర్: ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. తాత అని పిలిచిన వారికి డబ్బు ఆశ చూపి.. మాయమాటలు చెప్పి ఈ ఆకృత్యానికి ఒడిగడుతున్నాడు. పిల్లల ఆరోగ్యం బాగలేకపోవడంతో వారి తల్లులు మందలించగా.. అసలు విషయం బయటపడింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు రంగధామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకరు ఐదు, మరొకరు నాలుగు, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. ముగ్గురి తండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. తల్లులు కూలి పనిచేస్తూ వీరిని పోషించుకుంటున్నారు. వీరి సామాజికవర్గానికే చెందిన శివరాత్రి ముత్తయ్య (65) వీరి ఇంటి సమీపంలో ఉంటాడు. పిల్లలకు సెలవు రోజు ఇంటికి పిలిచి డబ్బులు ఇవ్వడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇలా మూడునెలలుగా తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు నాలుగురోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. తల్లులు ఆరా తీయగా జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. సదరు కామాంధుడిని కుల సంఘంలోకి పిలిస్తే రాకపోగా.. బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుల తల్లులు అంటున్నారు. దీంతో చేసేది లేక వారు గొల్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడిగితే బెదిరింపులు.. తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. కుల పెద్దలు పిలిచినా ముత్తయ్య రాలేదని, పైగా ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్ తమనే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఉరి తీయాలి.. తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన ముత్తయ్యను ఉరితీయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి నిందితుడితోపాటు ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సదరు నిందితుడిని ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. https://Follow the Sakshi TV channel on WhatsApp -
మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య
తిరుమలాయపాలెం: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామానికి చెందిన పేర్ల ముత్తయ్య(60)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపారు. సోమవారం విషయం వెలుగులోకి రావటంతో సిబ్బందితో కలసి డీఎస్పీ సంఘటనా స్థలికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. గ్రామానికి చెందిన వారే అతడిని చంపారని తేలటంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యకు సుప్రీం ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో అభియోగపత్రం నుంచి జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా మరో 4 వారాలు గడువు కావాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో మత్తయ్య పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని, రూ.50 లక్షల నగదును మత్తయ్య చేరేవేసేందుకు ప్రయత్నించారని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో విచారణ ఆలస్యమైతే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుందని విన్నవించారు. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను కోర్టు ఆదేశించింది. -
కార్తీతో శ్రీదివ్య
నటుడు కార్తీతో డ్యూయెట్లు పాడటానికి యువ నటి శ్రీదివ్య రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం వరుత్తడాద వాలిబర్ సంఘంతోనే కోలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న పెన్సిల్ చిత్రం ఒకటి. ఇప్పటికే హీరోయిన్గా డిమాండ్ పెరగడంతో పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో శ్రీదివ్యకు మరో బంర్ ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రానికి కొంబన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. కుట్టిపులి ఫేమ్ ముత్తయ్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. తొలి చిత్రం పరుత్తివీరన్‌లో పల్లెటూరి యువకుడు జీవించారని ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. అలాంటిది చాలా కాలం తరువాత మరోసారి ఈ కొంబన్ చిత్రం ద్వారా కార్తీ పల్లెవాసిగా మారనున్నారు. ఈ చిత్రానికి మొదట ఎంపిక చేయానుకున్న నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉండడంతో కాల్షీట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో అవకాశం దివ్యను వరించిందని సమాచారం. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో మద్రాస్ చిత్రంలో నటిస్తున్న కార్తీ తదుపరి నటించే చిత్రం కొంబన్ అవుతుంది. ఈ చిత్రం జూన్‌లో సెట్‌పైకి రానుంది.