కార్తీతో శ్రీదివ్య
నటుడు కార్తీతో డ్యూయెట్లు పాడటానికి యువ నటి శ్రీదివ్య రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం వరుత్తడాద వాలిబర్ సంఘంతోనే కోలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న పెన్సిల్ చిత్రం ఒకటి. ఇప్పటికే హీరోయిన్‌గా డిమాండ్ పెరగడంతో పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో శ్రీదివ్యకు మరో బంర్ ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది.
వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి కొంబన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. కుట్టిపులి ఫేమ్ ముత్తయ్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. తొలి చిత్రం పరుత్తివీరన్‌లో పల్లెటూరి యువకుడు జీవించారని ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. అలాంటిది చాలా కాలం తరువాత మరోసారి ఈ కొంబన్ చిత్రం ద్వారా కార్తీ పల్లెవాసిగా మారనున్నారు. ఈ చిత్రానికి మొదట ఎంపిక చేయానుకున్న నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉండడంతో కాల్‌షీట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో అవకాశం దివ్యను వరించిందని సమాచారం. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో మద్రాస్ చిత్రంలో నటిస్తున్న కార్తీ తదుపరి నటించే చిత్రం కొంబన్ అవుతుంది. ఈ చిత్రం జూన్‌లో సెట్‌పైకి రానుంది.