Sri Divya
-
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కార్తి సోదరిగా నటించబోతున్న యంగ్ హీరోయిన్
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకిగా నటించిన నటి శ్రీదివ్య. ఇప్పుడు అక్క, చెల్లెలి పాత్రలకు పరిమితం అవుతుందా అంటే అవుననే చెప్పాలి. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తెలుగింటి అమ్మాయి శ్రీ దివ్య. ఆ తర్వాత కార్తీ, విష్ణు విశాల్, విశాల్, జీవీ ప్రకాష్‌కుమార్ వంటి హీరోల సరసన నాయకిగా నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటిది ఆ తరువాత ఈ అమ్మడు అనూహ్యంగా తెరమరుగైన పరిస్థితి. కారణాలు ఏమైనా నటిగా చాలా గ్యాప్ తీసుకున్న శ్రీదివ్య ఆ మధ్య విక్రమ్‌ప్రభు సరసన రైడ్ చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా కార్తీ సరసన నటించే అవకాశం వరించినట్లు ప్రచారం జరిగింది. కార్తీ ప్రస్తుతం తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి 96 ఫ్రేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇందులో శ్రీదివ్య కథానాయకిగా నటించడం లేదన్నది తాజా సమాచారం. ఇందులో ఆమె నటుడు కార్తీకి సోదరిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరిచే విషయమే అవుతుంది. అయితే కార్తీకి జంటగా స్వాతికొండే నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుంచి కుటుంబ బంధాలతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిసింది. -
కార్తీ సరసన తెలుగమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్
నటి శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు జంటగా వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటి శ్రీదివ్య. తెలుగులోనూ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వరించాయి. అలా ఈమె ఇక్కడ నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి కూడా. అలాంటిది ఆ మధ్య అవకాశాలు ముఖం చాటేశాయి. చాలా గ్యాప్ తరువాత విక్రమ్‌ప్రభు సరసన నటించిన రైడ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అలా మళ్లీ వార్తల్లోకి వచ్చిన శ్రీదివ్య అవకాశాలపై దృష్టిపెట్టింది. మొత్తం మీద తాజాగా లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. కార్తీతో రొమాన్స్ చేయబోతోంది. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకి ఎవరన్నది ఇప్పుటి వరకూ ప్రకటించలేదు. తాజాగా గురువారం శ్రీదివ్య పేరును అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ అమ్మడు ఇంతకుముందు కార్తీ సరసన కాశ్మోరా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో మరోసారి ఈ జంట తెరపై మెరవనున్నారన్నమాట. మొత్తం మీద శ్రీదివ్య మళ్లీ దారిలో పడిందన్నమాట. -
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్!
గత రెండు మూడు నెలల్లో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు నిశ్చితార్థం చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. చెప్పుకొంటే ఈ లిస్టులో చాలామంది తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పేసింది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీ దివ్య.. 'హనుమాన్ జంక్షన్', 'యువరాజు', 'వీడే' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 'మనసారా' అనే సినిమాతో హీరోయిన్ అయిపోయింది. దీని తర్వాత బస్‌స్టాప్, కేరింత లాంటి మూవీస్ చేసినప్పటికీ ఎందుకో టాలీవుడ్లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరసపెట్టి చిత్రాల్లో నటించింది. 2013లో మొదలుపెడితే ఇప్పటికీ చేస్తూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో శ్రీ దివ్యకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీలో తప్ప తాగి పడిపోయిందని, దీంతో ఈమె పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఛాన్సులు కూడా తగ్గిపోయాయని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుందట. ఈ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పిందట. దీనిపై ఆమె వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?
నేటి బాలలే రేపటి పౌరులు.. అన్న విధంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలనటులుగా నటించిన ఎందరో ఇప్పుడు అగ్రతారలుగా చలామణీ అవుతున్నారు. మరికొందరేమో స్టార్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లలిద్దరూ టాలీవుడ్లో సినిమాలు చేశారు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? ఒకరేమో హీరో తేజ సజ్జ.. మరొకరేమో హీరోయిన్ శ్రీదివ్య. చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా ఈ స్టిల్ యువరాజు సినిమాలోనిది. తేజ టాలీవుడ్లో బిజీ అయిపోతుంటే శ్రీదివ్య కోలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తేజ సజ్జ.. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, శ్రీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో బుడ్డోడిగా నటించి మెప్పించాడు. చిన్నతనంలోనే నటనలో ఆరితేరిన తేజ.. జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ఇష్క్, అద్భుతం చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు. బిజీ అయిపోయిన శ్రీదివ్య శ్రీదివ్య.. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే, భారతి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మనసారా సినిమాతో హీరోయిన్గా మారింది. బస్ స్టాప్, కేరింత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగింటి అమ్మాయైన శ్రీదివ్య తమిళంలో బాగా బిజీ అయింది. మలయాళంలోనూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రైడ్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Sri Divya (@sd_sridivya) చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా? -
దీపావళికి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రైడ్. దర్శకుడు ముత్తయ్య మాటలను అందించిన ఈ చిత్రం ద్వారా.. ఆయన శిష్యుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.స్డూడియోస్, ఓపెన్ స్క్రీన్ పిక్చర్స్, జీ.పిక్చర్స్ సంస్థల అధినేతలు కే.కనిష్క్, జీకే, జీ.మణికన్నన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండగ సందర్భంగా ఈనెల 10న థియేటర్లలో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. 'దర్శకుడు కార్తీ రైడ్ చిత్ర కథ చెప్పినప్పుడే అందులో యాక్షన్, ఎమోషనల్, లవ్, డాన్స్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసే అన్ని అంశాలు ఉన్న విషయాన్ని గ్రహించా. తాను కమర్షియల్ కథా చిత్రాల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. మూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత దర్శకుడు నన్ను కమర్షియల్ హీరోగా చూపించడం సంతోషంగా అనిపించిందని' అన్నారు. రైడ్ సామాజిక సమస్యతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కార్తీ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసుకున్నప్పుడే కథానాయకుడి పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉండాలని భావించానన్నారు. అదే సమయంలో మాస్ హీరోగానూ కనిపించాలని అనుకున్నానని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విక్రమ్‌ప్రభు కరెక్ట్ అని యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పారన్నారు. ఈ పాత్రకు విక్రమ్‌ప్రభు పూర్తి న్యాయం చేశారన్నారు. దర్శకుడు ముత్తయ్య సంభాషణలు ఈ చిత్రానికి వాణిజ్యపరంగా పక్కా బలంగా నిలిచాయన్నారు. -
చాలాకాలం తర్వాత ఈ హీరోయిన్‌తో కలిసి నటించా: హీరో
ఇటీవల ఇరుగప్పట్రు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో విక్రమ్ ప్రభు. ఆయన తాజాగా నటించిన చిత్రం రైడ్. ముత్తయ్య మాటలు రాసిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు, మేనల్లుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథనం, దర్శకత్వం బాధ్యతలను కార్తీ నిర్వహించగా ఎం.స్టూడియోస్ పతాకంపై ఎస్.కె.కనిష్క్ జీకే జి.మణికన్నన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్ శ్రీ దివ్య నాయకిగా నటించిన ఇందులో నటి అనంతిక, సెల్వ, దర్శకుడు వేలు ప్రభాకరన్, సౌందరరాజన్, రిషి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కదిరవన్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంభాషణలు అందించిన దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ కుంభం మరుదు వంటి గ్రామీణ కథా చిత్రాలు చేసిన తరువాత సిటీ నేపథ్యంలో చిత్రాన్ని చేయాలని భావించారన్నారు. అలా శివరాజ్ కుమార్ కథానాయకుడుగా నటించిన తగరు చిత్ర రీమేక్ హక్కులను పొందానని చెప్పారు. ఆ సమయంలో విక్రమ్ ప్రభు నటించిన ఠాణాక్కారన్ చిత్రం ప్రేక్షకులకు రీచ్ అయిందని, దీంతో తగరు ఆయనకు చూపించగా ఇందులో నటించడానికి సమ్మతించారన్నారు. అయితే ఆ సమయంలో తాను దర్శకత్వం వహిస్తున్న విరుమాన్ చిత్ర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అల్లుడు కార్తీకి బాధ్యతలను అప్పగించానన్నారు. విక్రమ్ ప్రభు మాట్లాడుతూ ఈ చిత్రాలు ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపారు. ఇది కమర్షియల్ అంశాలతొ కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. నటి శ్రీదివ్యతో చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. చదవండి: Ananya Panday: ఆదిత్యతో డేటింగ్ రూమర్స్.. సిగ్గుపడుతూ ఒప్పేసుకున్న హీరోయిన్! -
ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!
మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లికి అంతా రెడీ. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడిన ఇతడు.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడు. సరే దీని గురించి పక్కనబెడితే ఓ తెలుగు హీరోయిన్ ప్రేమలో పడినట్లు ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏం కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగమ్మాయి. కానీ టాలీవుడ్లో మారుతి దర్శకత్వం వహించిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో మాత్రమే నటించింది. ఆపై తమిళ సినిమాలే చేస్తూ అక్కడ సెటిలైపోయింది. శివకార్తికేయన్ 'వరుత్తపడాద వాలిబర్ సంఘం' అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఈమెకి వరసపెట్టి ఛాన్సులు వచ్చాయి. అలా 'కాక్కీ సట్టై', 'జీవా', 'ఈటీ', 'మరుదు', 'బెంగుళూర్ నాట్కల్', 'పెన్సిల్' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ప్రస్తుతం విక్రమ్ ప్రభు 'రైడ్' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన ఈ బ్యూటీ.. 'త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పింది. దీంతో ఎవరా కుర్రాడు? ఎప్పుడు పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) -
నా మూడేళ్ల కల ఇది
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్‌లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్‌తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా. -
సినిమాలోకం చాలా విచిత్రమైంది
తమిళసినిమా: సినిమాలోకం చాలా విత్రమైంది. ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో..? ఎవరిని ఎలా ఢమాల్ అని కిందకు పడేస్తుందో ఊహించడం కష్టం. ఇంతకు ముందు వరుస విజయాలతో దూచుకుపోయిన వారు తరువాత అనూహ్యంగా వెనుకపడిపోతున్నారు. అలాంటి వారిలో నటి శ్రీదివ్య ఒకరని చెప్పాలి. ‘వరుత్తపడాద వాలిభన్’చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసి హిట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిన తెలుగమ్మాయి శ్రీదివ్య. తరువాత జీవా, కాక్కీసట్టై, ఈటీ, సంగిలి బుంగిలి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మపై పక్కింటి అమ్మాయి అనే మంచి ఇమేజ్ పడింది. అలాంటిది ఇటీవల ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాదు ఇళయదళపతితో ‘మెర్శల్’చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది ఈ బ్యూటీ. కాల్షీట్స్ సమస్యతో శ్రీదివ్య వదులుకున్న ఆ అవకాశం నటి నిత్యామీనన్‌ను వరించిందట. మెర్శల్ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్ ఉన్నా, ఎక్కువ క్రెడిట్ నటి నిత్యామీనన్కే దక్కిందన్నది గమనార్హం. కారణాలేమైనా ప్రస్తుతం కోలీవుడ్‌లో అధర్వకు జంటగా నటిస్తున్న ‘ఒల్తైకు ఒల్తై’ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. దీంతో అంతకు ముందు మాతృభాషలో నటించిన శ్రీదివ్య ఇప్పుడు మళ్లీ అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పక్కింటి అమ్మాయి ఇమేజ్ కారణంగానే అవకాశాలు దగ్గరకు రావడం లేదన్న అభిప్రాయానికి వచ్చింది శ్రీదివ్య. తను ఇక లాభం లేదు ఆ ఇమేజ్ను బ్రేక్‌చేసి అందాలారబోతలో విజృంభించాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తం మీద ఇకపై గ్లామర్‌నే నమ్ముకోవడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. మరి ఈ కొత్త రూటు శ్రీదివ్యను మళ్లీ బిజీ చేస్తుందేమో చూడాలి. -
అందాలార బోతకు నేనూ సై
సినిమాకు గ్లామర్ ఒక భాగంగా మారిన రోజులివి. ఆ బాధ్యతనిప్పుడు కథానాయికలే సమర్థవంతంగా నిర్వహించేస్తూ తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని నటి నయనతార, అనుష్క, తమన్నా, హన్సిక వంటి బ్యూటీస్ ముందుగానే కనిపెట్టి ఆ విధంగా అందాలను వెండి తెరపై విచ్చలవిడిగా ఆరబోసి అగ్రనాయికల స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. యువ నటి శ్రీదివ్యకీ విషయం ఆలస్యంగా అవగతం అయినట్లుంది. తాజాగా అందాలారబోతకు నేను సైతం అంటూ దర్శక నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. నటుడు శివకార్తికేయన్ కు జంటగా వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ చిత్రంలో చక్కగా లంగా ఓణీ ధరించి పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాందించుకోవడంతో పాటు, తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఆ తరువాత జీవా, కాక్కీసటైæ్ట. ఈటీ, మరుదు, బెంగళూర్ నాట్కల్, కాషో్మరా, మా వీరన్ కిట్టు ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాందించుకుంది. శ్రీదివ్య నటించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ హోమ్లీ పాత్రల్లోనే కలిపించారని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఈ భామకు సక్సెస్ శాతం బాగా పడిపోయింది. అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జీవాకు జంటగా నటిస్తున్న సంగిలి పుంగిలి కదవై తోర చిత్రం మాత్రమే చేతిలో ఉంది. ఈ మధ్య విడుదలైన మా వీరన్ కిట్టు చిత్రంపై శ్రీదివ్య చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అది చాలా నిరాశనే మిగిల్చింది. అంతే కాదు అమ్మడికి ఇక్కడ కొత్త అవకాశాలేమీ రావడం లేదు. దీంతో సొంత గడ్డపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే అక్కడ కొన్ని అవకాశాలు వస్తున్నా, గ్లామరస్‌గా నటించాలన్న డిమాండ్ వస్తోందట. దీంతో మరో దారి లేని శ్రీదివ్య గ్లామరే శరణ్యం అనుకుని అందాలారబోతకు సై అంటున్నారట. అంతే కాదు నిండా మునిగిన తరువాత చలేమిటన్న చందాన కోలీవుడ్‌లోనూ తనకు తెలిసిన దర్శకులకు తాను గ్లామర్‌కు రెడీ అని సిగ్నల్స్ పంపిస్తోందట. అయితే గ్లామర్‌గా నటించడానికి సిద్ధం అన్నానని మరీ శృంగారనటిగా మార్చకండి అంటూ విన్నవించుకుంటునట్లు కోలీవుడ్‌లో చాలా వేగంగా జరుగుతున్న ప్రచారం. -
మళ్లీ జాతీయ అవార్డు అందుకుంటా!
చిత్రంపై ఎంతో నమ్మకం ఉంటేగానీ విజయంపై గానీ, అవార్డులపైగానీ అచచంలమైన నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని దర్శకుడు సుశీంద్రన్, నటుడ సముద్రకని వ్యక్తం చేస్తున్నారు.వెన్నెల కబడ్డి కుళు, జీవా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకుడు సుశీంద్రన్, నటుడు విష్ణువిశాల్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మా వీరన్ కిట్టు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను నటుడు పార్తిబన్ పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాలలో నిర్వహించారు.చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు, దర్శకుడు సముద్రకని, టీజర్‌ను దర్శకుడు రంజిత్ ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ అళగర్సామి కుదురై చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నానన్నారు. ఈ మావీరన్‌కిట్టు చిత్రానికిగానూ మరోసారి జాతీయ అవార్డును అందుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు విష్ణువిశాల్ మాట్లాడుతూ తాను దర్శకుడు సుశీంద్రన్‌తో కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇదన్నారు. ఇది కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ చిత్ర టీజర్ చూడగానే దర్శకుడు సమాజానికి ఏదో చెప్పబోతున్నారని, కథానాయకుడు సమాజ సమస్య కోసం పోరాడే కథా చిత్రం ఇదని తెలుస్తోందన్నారు.ఇక న టుడు పార్తిబన్ మాట్లాడుతూ ఆయిరత్తిల్ ఒరువన్, అళగి చిత్రాల తరువాత తనకు అంత మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం మా వీరన్ కుట్టి అని పేర్కొన్నారు. కారణం ఇందులో తనది అంత వైవిధ్యభరిత పాత్ర అని తెలిపారు. హౌస్‌ఫుల్ చిత్రం తరువాత ఈ చిత్రం తనకు పలు అవార్డులను అందిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
విష్ణువిశాల్‌తో మరోసారి శ్రీదివ్య
సక్సెస్ఫుల్ చిత్ర జంట కాంబినేషన్లో మరో చిత్రం అంటే దానికి తప్పకుండా క్రేజ్ ఉంటుంది. జీవా చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువిశాల్, శ్రీదివ్య తాజాగా మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. జీవా చిత్ర షూటింగ్ సమయంలో ఈ జంట గురించి పలు వదంతులు ప్రచారం అయ్యాయి. కాగా నటుడు విష్ణువిశాల్, దర్శకుడు సుశీంద్రన్‌లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో విష్ణువిశాల్ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు సుశీంద్రన్ ఆ తరువాత ఆయనే హీరోగా జీవా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ కాంబినేషన్ మరో విజయానికి రెడీ అవుతోంది. నిజానికి సుశీంద్రన్ నటుడు ఉదయనిధి హీరోగా చిత్రం చేయాల్సింది. ఆ చిత్రం వాయిదా పడటంతో విష్ణువిశాల్‌తో చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో నాయకిగా ముందు మంజిమా మోహన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఈ అవకాశం నటి శ్రీదివ్యను వరించింది. ఇది రొమాంటిక్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నాయి. ఇందులో నటుడు పార్తీబన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న ప్రారంభం కానుంది. వేల్లైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విష్ణువిశాల్ నటిస్తున్న చిత్రం ఇదే. -
అతిథిగా లక్కీ నాయకి
సినిమాల్లో హిట్ పెయిర్‌గా కొందరు ముద్ర పడతారు. అలా పేరు తెచ్చుకున్న జంటల్లో శివకార్తికేయన్, శ్రీదివ్య ఒకరు. వీరిద్దరి కెరీర్‌ను అనూహ్యంగా పెంచేసిన చిత్రం వరుత్తపడాదవాలిభర్ సంఘం. అదే విధంగా ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం కాక్కీసట్టై. ఇదీ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్, శ్రీదివ్య హిట్ పెయిర్‌గా ముద్ర పడింది. తాజాగా శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం రెమో. ఇందులో ఆయనకు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఇంతకు ముందు రజనీమురుగన్ చిత్రంలో శివకార్తీకేయన్‌తో జత కట్టారన్నది గమనార్హం. రెమో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే చిత్ర నిర్మాత డి.రాజా గ్రాండ్‌గా నిర్వహించి చిత్ర హైప్‌ను ఇంకా పెంచేశారు. ఇందులో శివకార్తికేయన్, లక్కీ హీరోయిన్ శ్రీదివ్య అతిథిగా దర్శనమీయనున్నారన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇందుతో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రంలోనూ దర్శకుడిగానే నటిస్తున్నారు. దీంతో ఇదేదో సినిమా నేపథ్యంలో సాగే చిత్రం అనిపిస్తోంది కదూ. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెమో చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా భాగ్యరాజ్కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
మాస్.. మాస్‌గా..!
విశాల్, శ్రీదివ్య జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విశాల్ కెరీర్లో ‘రాయుడు’ క్రేజీ చిత్రమవుతుంది. మేలో పాటలను, అదే నెల 20న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేల్రాజ్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సమర్పణ: విశాల్. -
నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు
నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదని తెగ ఇదైపోతోంది నటి శ్రీదివ్య. అదృష్టం అంటే ఈ అమ్మడిదే అనక తప్పదు. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్ తెరపై మెరిసిన ఆంధ్రా పోరి శ్రీదివ్య. ఆ తరువాత జీవా, కాక్కీసట్టై చిత్రాల విజయాలతో హీరోయిన్గా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ బ్యూటీ గ్లామర్ జోలికి పోకుండా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలను చేతిలో పెట్టుకున్న శ్రీదివ్య ఇటీవల విడుదలైన బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో చక్కని అభినయంతో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఈ సక్కనమ్మతో చిన్న చిట్‌చాట్.. ప్ర: తెలుగమ్మాైయై ఉండి పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారు. అక్కడ అవకాశాలు రావడం లేదా? జ: నేను బాల నటిగా పరిచయమైంది తెలుగులోనే. హీరోయిన్ స్థాయికి ఎదిగిందీ అక్కడే. అయితే నాకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెడుతున్నది తమిళసినిమానే. నాలోని నటనా ప్రతిభను చాటుకునే విధంగా మంచి కథా పాత్రలతో కూడిన అవకాశాలు ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే ఇతర భాషా చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదు. ప్ర: బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో తొలిసారిగా డబ్బింగ్ చెప్పినట్టున్నారు? జ: తెలుగులో నేను నటించిన అన్ని చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తమిళంలో జీవా, కాక్కీసట్టై చిత్రాలకు డబ్బింగ్ చెప్పాలని ఆశించాను. అయితే వాయిస్ టెస్ట్ తెలుగు యాస తెలుస్తోందని రిజెక్ట్ చేశారు. దాంతో స్వచ్ఛమైన తమిళ భాష ఎలా మాట్లాడాలన్నది నేర్చుకుని బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కార్తీ సరసన కాస్మోరా చిత్రం, విశాల్‌కు జంటగా మరుదు, జీవాతో ఒక చిత్రం చేస్తున్నాను. ప్ర: విశాల్ మీ కంటే చాలా హైట్. ఆయనకు జంటగా ఎలా మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నారు? జ: నిజమే నేను కాస్త పొట్టే. మంచి పొడుగైన విశాల్‌తో నటించడానికి స్టూల్ సాయం తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో మదురై యాసలో మాట్లాడి నటించడం వినూత్న అనుభవం అనే చెప్పాలి. తెలుగమ్మాయినైనా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుని నటిస్తున్నాను. ప్ర: పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట? జ: నేనిప్పటి వరకూ ఎవరి వద్దా పారితోషికం డిమాండ్ చేసింది లేదు. ప్రస్తుత నా స్థాయికి తగ్గ పారితోషికమే చెల్లిస్తున్నారు. ప్ర: లక్ష్మీమీనన్, కీర్తీసురేష్, నందిత, ఐశ్వర్యారాజేష్ లాంటి వారు కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. వారిని పోటీగా భావిస్తున్నారా? జ: ఒకే చిత్రంలో పలువురు హీరోయిన్లు నటిస్తే అప్పుడు వారి ప్రతిభను నిరూపించుకోవడానికి పోటీ ఉంటుంది. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది. అయితే నేనెవరినీ పోటీగా భావించడం లేదు. ప్ర: ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటున్నార ట. ఎవరినైనా ప్రేమించారా? జ: కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా. అయితే నేను ప్రేమించే వ్యక్తిని ముందుగా నా తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అభిప్రాయాన్ని అడుగుతాను. వారికి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ప్రేమించారా? అని అడుగుతున్నారు. నేను నటినైన తరువాత ఇప్పటి వరకూ నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు. నేనెవరితోనూ అంతగా కలివిడిగా మాట్లాడను. నాతో మాట్లాడడానికి భయం కారణంగానే బహుశా ఎవరూ ఐ లవ్యూ చెప్పడానికి సాహసించడం లేదేమో. -
రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య
ప్రస్తుతం బెంగళూరు నాట్కల్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రీదివ్య, సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సమంత, ఆర్య, బాబీ సింహా, లక్ష్మీరాయ్‌లు నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. తమిళనాట ఈ శుక్రవారం రిలీజ్ అయిన బెంగళూర్ నాట్కల్ డిసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీదివ్య, షూటింగ్ సమయంలో రానా తనను తెగ ఇబ్బంది పెట్టాడని చెప్పింది. అయితే రానా, శ్రీదివ్యను ఇబ్బంది పెట్టింది వ్యక్తిగతంగా కాదులేండి. రానా, శ్రీదివ్యలు ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి హైట్ మ్యాచ్ కాకపోవటంతో షూటింగ్ సమయంలో నానా తంటాలు పడాల్సి వచ్చిందట. కార్ సీట్ నుంచి ప్రతీ విషయంలో శ్రీదివ్యను హైట్‌గా చూపించటం కోసం తెగ కష్టపడాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని సరదాగా మీడియాతో షేర్ చేసుకుంది శ్రీదివ్య. -
అజిత్‌తో రొమాన్స్ చేయాలి
అవకాశాలనే కాదు వరుస విజయాలను అందుకుంటున్న యువ నాయకి శ్రీదివ్య. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని పక్కన పెట్టి తమిళ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ నాయకిగా కొనసాగుతోంది. వరుత్తపడాద వాలిబర్సంఘం చిత్రంతో విజయాలను నాంది పలికిన ఈ బ్యూటీ తాజాగా విడుదలైన ఈటీ చిత్రం వరకు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా ఆర్య, రానా, బాబీసింహలతో కలిసి నటించిన బెంగళూర్ నాట్కళ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీకి జంటగా కాష్మోరా చిత్రంలో నటిస్తోంది. శ్రీదివ్యను ఏక కాలంలో విజయ్, అజిత్‌లతో నటించే అవకావమం వస్తే తొలి చాయిస్ ఎవరికి ఇస్తారూ? అన్న ప్రశ్నకు ఏలాగోలా ఇద్దరితో నటించాలని కోరుకుంటాను అని తెలివిగా బదులిచ్చింది. ఇంకా మాట్లాడుతూ అజిత్‌కు తాను సెట్ అవుతానా అన్నది తెలియదనీ, ఇంతకు ముందే వేదాళం చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. అయితే అజిత్‌తో హీరోయిన్గా రొమాన్స్ చేయాలని ఆశపడే తాను ఆయనకు చెల్లెలిగా నటించడానికి ఎలా ఒప్పుకుంటానని, అందుకే ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు శ్రీదివ్య చెప్పింది. -
హీరోయిన్స్ కు షాక్ ఇచ్చిన శ్రీదివ్య
-
యోగా సర్వరోగ నివారిణి
♦ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ♦ గుంటూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గుంటూరు స్పోర్ట్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ముఖ్యభాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నగరంపాలెంలోని కేకేఆర్ పంక్షన్ ప్లాజాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అన్ని రోగాలకు యోగా సర్వరోగ నివారిణి అన్నారు. శరీరం, మెదడు చురుగ్గా పనిచేయడానికి యోగా దోహదకారి అవుతుందన్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఆయుధం కావాలన్నారు. ఆరో తరగతి నుంచి యోగాను ఓ పాఠ్యాంశంగా చేర్చితే పిల్లలు మానసిక పరిపక్వత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ మాట్లాడుతూ యోగాపై విద్యార్థులు ఆసక్తిపెంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే మాట్లాడుతూ జీవితంలో యోగా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. యోగా దినోత్సవంలో భాగంగా శిక్షకులు డాక్టర్ కె.కొండయ్య 20 రకాల ఆసనాలతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో యోగా చేయించారు. కార్యక్రమంలో యోగా శిక్షకురాలు శ్రీవిద్య, సంయుక్త కలెక్టర్-2 ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ ఉమాసుందరి, వివిధ శాఖల అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
శివకార్తికేయన్‌కు నో చాన్స్
బుల్లితెర నుంచి వెండితెరపై కొచ్చి హీరోగా వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న నటుడు శివకార్తికేయన్. హీరోగా ఎదగడంతో పాటు క్రేజీ హీరోయిన్లతో జతకట్టాలని తెగ ఉబలాటపడుతున్నారని సమాచారం. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటి శ్రీదివ్యతో డ్యూయెట్లు పాడిన శివకార్తికేయన్, ఆ తరువాత ప్రియాఆనంద్, హన్సిక అంటూ పాపులర్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న రజనీ మురుగన్ చిత్రంలో నయనతారతో రొమాన్స్ చేయాలని ఆశపడ్డారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తాజాగా సమంతాతో స్టెప్స్ వేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇప్పుడీ చిత్రంలో సమంత నటించడం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. సమంత ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలున్నాయి. తమిళంలో విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రుదుకుళ్లే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సూర్యతో అంజాన్ చిత్రం తరువాత 24 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అదే విధంగా వేల్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ధనుష్‌తో నటిస్తున్నారు. ఆ తరువాత మరోసారి ఇళయదళపతి విజయ్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవి గాక తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తన డైరీ పూర్తి కావడంతో శివకార్తికేయన్‌తో జత కట్టే అవకాశం లేదన్నది సమంత సన్నిహిత వర్గాల సమాచారం. -
అందాలు ఆరబోయాలట
అందాలను విచ్చల విడిగా ఆరబోయడానికి నేను సైతం అంటున్న నేటి హీరోయిన్ల మధ్య దేనికైనా హద్దులు ఉంటాయని అంటోంది నటి శ్రీదివ్య. ఈ అచ్చ తెలుగు అమ్మాయి తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా విజయాలు సాధించి పక్కింటి అమ్మాయి ఇమెజ్‌ను సొంతం చేసుకుంది. అలాంటి ఇమెజ్‌ను పొందడం తన అదృష్టాంగా భావిస్తున్న శ్రీదివ్య దానిని దూరం చేసుకోనని అంటోన్నది. వర్తపడాద వాలిబర్ సంఘం చిత్రం విజయంతో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన జీవా కూడా విజయం బాట పట్టడంతో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. 2010లో మనసారా చిత్రంతో టాలీవుడ్లో పరిచయమైన శ్రీ దివ్యను టాలీవుడ్కంటే కోలీవుడ్ అధికంగా ఆదుకుందని చెప్పక తప్పదు. తమిళ చిత్ర పరిశ్రమలోనే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఈ బ్యూటీ పేర్కొంది. అయితే, ఎక్కువగా లంగావోని, చీర కట్టు పాత్రలకు పరిమితం చేస్తున్నారని, అది కాస్త చింత కల్గించే విషయమేనని అంటోంది. తనకు మోడ్రన్ దుస్తులు ధరించాలంటే, చాలా ఇష్టం అని, అయితే మోడ్రన్ పాత్రలు వేరు, గ్లామరస్ పాత్రలు వేరని చెబుతున్నది. ఇటీవల ఓ చిత్రంలో అందాల ఆరబోయాలని చెప్పడంతో అది ప్రముఖ హీరోతో నటించే చిత్రమైనా నిరాకరించినట్లు పేర్కొంది. తాను పాత్రల వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. తన ముఖంలోని అమాయకత్వమే తనకు ప్లస్ అని పేర్కొంది. ప్రస్తుతం శ్రీ దివ్య పెన్సిల్, ఈటీ, బెంగళూరు డేస్ రీమేక్ చిత్రం, కవలై వేండాం చిత్రాలతో పాటుగా కార్తీతో ఓ చిత్రం చేయనున్నది. -
అక్కడ... ప్రయోగాలెక్కువ!
‘‘కొంత విరామం తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రం ‘వారధి’. కథ బాగా నచ్చి, ఈ చిత్రం ఒప్పుకొన్నా. తెలుగమ్మాయిని అయినా ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. వరుసగా మంచి అవకాశాలు రావడంతో అంగీకరిస్తున్నా. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలెక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ స్టార్స్‌తో తీసే సినిమాలనూ ఆదరిస్తారు.. కొత్తవాళ్లు నటించినవీ అంగీకరిస్తారు. లక్కీగా ఇప్పటివరకూ నేను అక్కడ చేసినవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రిలాక్స్ అవడానికి కూడా తీరిక లేనంత బిజీ. అంతా ఆ దేవుడి ఆశీర్వాదమే’’. - శ్రీదివ్య -
ఇలా కూడా లవ్ చేయొచ్చా!
ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీ దివ్య, హేమంత్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం’’ అని చెప్పారు. శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత గాఢంగా లవ్ చేస్తుందో నా పాత్ర తెలియజేస్తుంది. అసలు ఇలా కూడా లవ్ చేయవచ్చా అని చూసినవాళ్లకు అనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇందులో నేను శాడిస్ట్ లక్షణాలున్న పాత్ర చేశాను. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందరికీ గుర్తుండిపోతుంది’’ అని క్రాంతి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ. -
శ్రీదివ్యపై దుష్ర్పచారం
నటి శ్రీ దివ్య అంటే గిట్టని వాళ్లు, ఆమె ఎదుగుదలను భరించలేనివారు ఆమెపై దుష్ర్పచారంతో దాడికి దిగుతారట. పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. కోలీవుడ్‌లో మొదట విడుదలైన వరుత్త పడాద వాలిబర్ సంఘంతో విజయాన్ని అందిపుచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జీవా, వెళ్లక్కార దురై వంటి చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ పలు అవకాశాలను దక్కించుకుంటూ వెళుతున్నారు. గ్లామర్ విషయంలో హద్దులు విధించుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటున్న శ్రీదివ్య నటుడు అధర్వతో జత కట్టిన ఈటి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీ దివ్య కళాశాల విద్యార్థినిగా నటించారు. అదే విధంగా త్వరలో కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నటుడు శివకార్తికేయన్‌తో ఒక చిత్రంతో పాటు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీదివ్యపై కొందరు పని కట్టుకుని మరి దుష్ర్పచారం చేస్తున్నారట. చూడటానికి చిన్నమ్మాయిలా కనిపించినా శ్రీ దివ్య వయసు 28 ఏళ్లు అని, ఆ విధంగా చూస్తే యువ నటి కాదని, తమిళ హీరోల కంటే తెలుగు హీరోలతో డ్యూయెట్లు పాడటానికే ఆసక్తి చూపిస్తారని, అక్కడ అవకాశాలు వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వైపే చూడరంటూ దుష్ర్పచారాలను చేస్తున్నారట. అయితే ఇవన్నీ ఈ చెవిలో విని ఆ చెవి ద్వారా వదిలేస్తున్నారట శ్రీదివ్య. పండ్లున్న చెట్టుకే రాళ్లన్న చందాన క్యాజువల్‌గా తీసుకుంటున్నారట. -
ఆ ప్రేమకు వారధి ఎవరు..?
ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం - ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మిస్తున్నారు. సతీష్ కార్తికేయ దర్శకుడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘నలుగురి బాధలో సంతోషాన్ని వెతుక్కునే హీరోకూ, నలుగురూ బాగుండాలనే హీరోయిన్‌కీ మధ్య ప్రేమకథ ఎలా నడిచిందనేది ఆసక్తికరమైన అంశం’’ అని పేర్కొన్నారు. సతీష్ కార్తికేయ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. కథ, కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందుకు తగ్గట్లే హేమంత్, శ్రీదివ్య, క్రాంతి చాలా చ క్కగా నటించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్. -
వరుస చిత్రాలతో జీవా బిజీ
యువ నటుడు జీవా ఇటీవల రేస్‌లో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. యాన్, అంతకుముందు నటించిన నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ ఫుల్ ఎనర్జీతో రెడీ అవుతున్నారు జీవా. వరుసగా మూడు చిత్రాలకు సైన్ చేసేశారు. అందులో ఒకటి మార్చి 15న ఆరంభం కానుంది. రామ్‌నాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార పేరు ప్రచారంలో ఉంది. అయితే ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో లక్కీ నాయకి శ్రీదివ్యకు అవకాశం వరించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నిర్ధారించింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో కూడిన విభిన్న కథా చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. చాలా గ్యాప్ తరువాత జీవా గ్రామీణ కథా చిత్రంలో నటించనున్నారన్నమాట. ఈ చిత్రం తరువాత యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించనున్న చిత్రంలోనూ ఆ తరువాత రాజేష్ ఎం దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు -
అరకోటి ఇస్తే ఓకే
అరకోటి కొట్టు కాల్ షీట్స్ పట్టు ఇది యువ నటి శ్రీ దివ్య తాజా స్లోగన్ అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇంకా చాలా షరతులున్నాయట. అవేమిటో తెలుసుకోవాలనుందా? కోలీవుడ్‌లో ఈ అమ్మడి కెరీర్ బ్రహ్మాండమైన విజయంతో మొదలైంది. శివకార్తికేయన్‌తో శ్రీ దివ్య నటించిన వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం ప్రజాదరణ పొందింది. ఈ మధ్య విక్రమ్ ప్రభుతో జతకట్టిన వెళ్లక్కార దురై విజయం సాధించింది. ఇలా వరుసగా నటించిన మూడు చిత్రాలు సక్సెస్ అవ్వడంతో శ్రీదివ్య ఊహలతోపాటు ఆశలకు రెక్కలొచ్చేశా యి. ప్రస్తుతం ఆమె చేతిలో మరో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు శివకార్తికేయన్, విష్ణు విశాల్ , జి.వి.ప్రకాష్, విక్రమ్ ప్రభు లాంటి వర్ధమాన హీరోలతోనే జతకట్టడంతో ఇప్పుడిక స్టార్ హీరోల సరసన నటించాలనే ఆశ పెరుగుతోందట. దీంతో చిన్న హీరోల అవకాశాలకు కాల్షీట్స్ లేవంటూ నిరాకరిస్తోందట. ఇక ఆమె పెడుతున్న షరతుల విషయానికొస్తే చిన్న హీరోల చిత్రాలైతే స్టార్ దర్శకులైనా ఉండాలని, ప్రముఖ హీరోల చిత్రాలైతే యువ దర్శకులైనా ఫర్వాలేదని అంటోందట. తాజాగా మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తమిళం, తెలుగు భాషల రీమేక్‌లో ఆర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ శ్రీదివ్యను వరించింది. అంతకుముందు తెలుగులో బస్టాప్ వంటి విజయవంతమైన చిత్రంలో నటించడంతో ద్విభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో ఈ భామ పారితోషికాన్ని పెంచేసిందట. ఈమె శివకార్తికేయన్‌తో రెండో సారి నటించిన కాకిసట్టై ఈ నెల 27న తెరపైకి రానుంది. -
నాని సరసన...
బస్‌స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తదితర చిత్రాల్లో నాయికగా నటించిన మన తెలుగమ్మాయి శ్రీదివ్య గుర్తుంది కదూ! ప్రస్తుతం తమిళంలో అయిదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీదివ్య త్వరలో నాని సరసన ఓ తెలుగు చిత్రం చేయనున్నారు. -
నాపై ఫిర్యాదు తగదు
నాపై ఆ చిత్రాల నిర్మాతలు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని యువ నటి శ్రీ దివ్య అంటున్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో విజయబాట పట్టిన ఈ ఆరణాల తెలుగమ్మాయి కోలీవుడ్‌లో ఇప్పుడు బిజీ హీరోయిన్. ఇటీవల విడుదలైన జీవా చిత్రం కూడా ఈ బ్యూటీ హిట్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం కాక్కిసట్టై, పెన్సిల్, వెళ్లక్కార దురై మొదలగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలకు ముందు కాట్టుమల్లి, నగర పురం చిత్రాలను అంగీకరించారు. ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ పారితోషికం వేల సంఖ్యలోనే ఉండేది. ప్రస్తుత అరకోటి వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. చిత్ర నిర్మాణం పూర్తి కాని కాట్టుమల్లి, నగరపురం చిత్రాలను పూర్తి చేయడానికి ఈ అమ్మడు ప్రస్తుత పారితోషికం చెల్లిస్తేనే కాల్షీట్స్ కేటాయిస్తానని శ్రీదివ్య అంటున్నట్లు ఆ చిత్రాల నిర్మాతలు, తమిళ నిర్మాతలు మండలిలో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన శ్రీ దివ్య అన్ని చిత్రాలకు సహకరిస్తున్నానన్నారు. అలాంటిది తనపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. ఇక కాట్టుమల్లి చిత్రం విషయానికొస్తే అది రెండేళ్ల క్రితం ఒప్పుకున్న చిత్రం అని వెల్లడించారు. అప్పుడు ప్రారంభమైన ఆ చిత్ర షూటింగ్ అనూహ్యంగా ఆగిపోయిందని తెలిపారు. అందుకు చిత్ర యూనిట్లో నెలకొన్న అయోమయ పరిస్థితినే కారణమన్నారు. తనకు నిర్మాతల తరపు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అందువల్లనే ఆ చిత్ర కాల్షీట్స్ను ఆ చిత్ర దర్శక, నిర్మాతలు ఫిర్యాదు చేశారని శ్రీ దివ్య అంటున్నారు. -
జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ
పెన్సిల్ కోసం యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ జపాన్ వెళుతున్నారు. ఆయనతోపాటు యువ నటి శ్రీ దివ్య కూడా బయలుదేరుతోంది. ఈ యువ జంట అక్కడ డ్యూయెట్స్ పాడేసుకుని చెన్నైకి తిరిగి రానున్నారు. అసలు విషయానికొస్తే అతి పిన్న వయసులోనే సంగీత దర్శకుడైన వాడిగా పేరు తెచ్చుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా అవతారమెత్తి నటిస్తున్న తొలి చిత్రం పెన్సిల్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో రెండు చిత్రాల్లో హీరో అయిపోయిన జి.వి. తన తొలి చిత్రం పెన్సిల్ కోసం హీరోయిన్ శ్రీ దివ్యతో కలిసి యువళ గీతం పాడుకోవడానికి జపాన్ వెళ్లనున్నారు. వీటిలో ఒక రొమాన్స్ గీతం కూడా ఉందట. దీని గురించి జి.వి.ప్రకాష్‌కుమార్ తెలుపుతూ ఆదివారం రాత్రి బయలుదేరి టోక్యో చేరనున్నట్లు చెప్పారు. అక్కడి సుందర నగర అందాలను పెన్సిల్ చిత్రంలోని పాటల కోసం చిత్రీకరించనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తి అయినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ పూర్తి అయితే ఇక చిన్న చిన్న ప్యాచ్ వర్కు మాత్రమే మిగిలి ఉంటుందన్నారు. దర్శకుడు మణి నాగరాజ్ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నారని చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందన్నారు. పెన్సిల్ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క జి.వి. సంగీత దర్శకుడిగా 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజారాణి చిత్రం ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చెప్పకపోయినా ఈ చిత్రంలో ఇళయదళపతి నటించనున్నట్లు సమాచారం. -
షాక్ అయిన శ్రీదివ్య
నటి శ్రీ దివ్య చాలా దిగ్భ్రా ంతికి గురయ్యారు. తమిళంలో హీరోయిన్గా ఎదుగుతున్న తెలుగమ్మాయి శ్రీ దివ్య. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం జీవా చిత్రంలో విష్ణు విశాల్ సరసన యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌కు జంటగా పెన్సిల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితోపాటు శివకార్తికేయన్‌తో ఒక చిత్రం, విక్రమ్ ప్రభుకు జంటగా మరో చిత్రం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. విష్ణు విశాల్ రొమాన్స్ చేసిన జీవా చిత్రం ఈ నెల 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో శ్రీ దివ్యకు ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. అదేమిటంటే ఆ మధ్య నటి శ్వేతాబసు వ్యభిచార కేసులో అరెస్టయి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆ కలకలం సద్దుమణగకముందే ఇటీవల ఆంధ్ర రాష్ట్రం గుంటూరుకు చెందిన నటి దివ్యశ్రీని పోలీసులు బ్రోతల్ కేసులో అరెస్టు చేశారు. అయితే దివ్యశ్రీకి బదులు శ్రీ దివ్య ఫొటోలను కొన్ని వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు. ఇది తెలిసిన శ్రీ దివ్య షాక్‌కు గురయ్యారు. పేర్ల తికమకతోనే ఇలా జరిగిందని గ్రహించిన శ్రీ దివ్య తాను దివ్యశ్రీని కాదని తన పేరు శ్రీ దివ్య అని ఫోన్లలో విచారిస్తున్న వారికి క్లారిటీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వెబ్‌సైట్స్‌లో తన ఫొటోలను తొలగించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు నటి శ్రీ దివ్య. -
ఆమె శ్రీదివ్య కాదు.. దివ్యశ్రీ!
ఇటీవల గుంటూరులో వ్యభిచార రాకెట్లో ఓ హీరోయిన్ పట్టుబడింది. కొన్ని మీడియా వర్గాల్లో ఇలా పట్టుబడిన నటి పేరు శ్రీదివ్య అని వచ్చింది. కానీ, వాస్తవానికి అక్కడ పట్టుబడిన నటి దివ్యశ్రీ అని పోలీసు వర్గాలు తెలిపాయి. బీటెక్ బాబు సినిమాలో నటించిన హీరోయిన్ దివ్యశ్రీ కాగా.. బస్ స్టాప్ సినిమాతో ఫేమ్‌లోకి వచ్చిన నటి శ్రీదివ్య. వీరిద్దరి పేర్ల మధ్య ఉన్న సారూప్యత కారణంగా ఇద్దరి పేర్ల విషయంలో కొంత గందరగోళానికి గురై.. ఒకరి బదులు మరొకరి పేరును ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జేకేసీ కాలేజి రోడ్డు సమీపంలోని స్వర్ణభారతి నగర్ ప్రాంతంలో ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు గుంటూరు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో వాళ్లు వెళ్లి అక్కడ సోదాలు చేసి.. దివ్యశ్రీని అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మరో చిత్రంలో నటిస్తోంది. ఇంటి యజమానిని కూడా తాము అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ సోదాల్లో పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వాళ్లు బ్రోకర్లుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. -
తెలుగమ్మాయిని పట్టించుకోని టాలీవుడ్
-
అవన్నీ వదంతులే
ప్రస్తుతం అదృష్టం వెంటాడుతున్న యువ కథనాయికల్లో నటి శ్రీదివ్య ఒకరు. కోలీవుడ్‌లో తొలి చిత్రమే (వరుత్త పడదా వాలిభర్ సంఘం) శత దినోత్సవ చిత్రంగా ఈ బ్యూటీకి అమరింది. ఆ తర్వాత మరో చిత్రం తెరపైకి రాలేదు. అయినా ఈ భామకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతుండడం విశేషం. సక్సెస్ పవర్ ఏమిటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీదివ్య సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సరసన పెన్సిల్, అధర్వకు జంటగా ‘ఈటి’, శివకార్తికేయన్‌తో ‘తాణా’ విష్ణు విశాల్‌కో జోడిగా ‘జీవా’, విక్రమ్ ప్రభుకు జంటగా ‘వెళ్ళైక్కారదురై’, విమల్ సరసన ‘కాట్టుమల్లి’, నగర్‌పురం అంటు ఏక కాలంలో సప్త చిత్రాలతో యమ బిజీగా ఉన్న శ్రీ దివ్యపై పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా పారితోషికం పెంచేశారని, నిర్మాతని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని శ్రీదివ్య ఖండిస్తున్నారు. అవన్నీ వదంతులేనంటున్న ఈ లక్కీ గర్ల్ మాట్లాడుతూ, తాను చాలా శ్రమ జీవినన్నారు. తానెలాంటి అమ్మాయినో తన నిర్మాతలకు బాగా తెలుసన్నారు. వృత్తిపరంగా తన పని తాను కరెక్ట్‌గా చేసుకుపోతానని చెప్పారు. ఏ నిర్మాతనూ తాను ఇబ్బంది పెట్టింది లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు ఎందుకు ప్రచా రం చేస్తున్నారో అర్థం కావడం లేదని నటి శ్రీదివ్య వాపోతున్నారు. -
అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు
ఆశ కైనా హద్దులుండాలన్నది నీతి సూక్తి. ఎంత ప్రతిభ, ప్రాచుర్యం ఉన్నా అత్యాశకు పోతే బెడిసికొడుతుంది. ఈ విషయం నటి శ్రీ దివ్యకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. టాలీవుడ్లో చిన్నచిత్రాలు చేసుకుంటున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి కోలీవుడ్లోకి వరుత పడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలి చిత్రమే అమ్మడికి అనూహ్య విజయాన్ని ఇచ్చిం ది. అదనంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కట్టబెట్టింది. అంతే మరో చిత్రం విడుదల కాకుండానే నాలుగైదు చిత్రాల అవకాశాలు ఈ అమ్మడి ముంగిట వాలాయి. అటు సక్సెస్, ఇటు ఛాన్స్‌లు శ్రీ దివ్యను సంతోషంలో ముంచెత్తాయి. యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న పెన్సిల్ చిత్రంలో అవకాశం పొంది ఆయన తొలి హీరోయిన్గా పేరొందింది. అలాగే శిష్ణు, విశాల్ సరసన జీవా, చిత్రంలోను, అధర్వతో ఈట్టి చిత్రంలోను, శివకార్తికేయన్‌కు జంటగా టాణా చిత్రంలోను నటిస్తూ ప్రముఖ యువ హీరోయిన్లకు పోటీగా తయారైంది. ఇంతవరకు బాగానే ఉంది. హీరోయిన్‌గాను మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇలా చేతి నిండా చిత్రాలు ఉండడంతో అమ్మడిమైండ్ సెట్ మారిపోయిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. పారితోషికం ఒక్కసారిగా పెంచేసిందట. చిన్న చిత్రాల అవకాశాలు వెల్లువెత్తుతుంటే అలాంటి వాటిని నిలువరించడానికి ఈ ముద్దుగుమ్మ అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీకి భారీ అవకాశం వచ్చింది. అదే కార్తీ సరసన కొంబన్ చిత్రంలో నటించే లక్కీఛాన్స్. అయితే అలవాటులో పొరపాటులా ఈ చిత్రానికి శ్రీదివ్య రూ.50 లక్షలు పారితోషికం డిమాండ్ చేసిందట. దీంతో షాక్ అయిన చిత్ర దర్శక, నిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చే ఆలోచనకు నీళ్లుదొలివేశారు. ఇప్పుడా అవకాశం మరో లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్‌ను వరించింది. శ్రీదివ్యకు ఈ భారీ అవకాశం అలా పోయింది. -
కార్తీతో శ్రీదివ్య
నటుడు కార్తీతో డ్యూయెట్లు పాడటానికి యువ నటి శ్రీదివ్య రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం వరుత్తడాద వాలిబర్ సంఘంతోనే కోలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ భామ ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న పెన్సిల్ చిత్రం ఒకటి. ఇప్పటికే హీరోయిన్గా డిమాండ్ పెరగడంతో పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో శ్రీదివ్యకు మరో బంర్ ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రానికి కొంబన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. కుట్టిపులి ఫేమ్ ముత్తయ్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. తొలి చిత్రం పరుత్తివీరన్‌లో పల్లెటూరి యువకుడు జీవించారని ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. అలాంటిది చాలా కాలం తరువాత మరోసారి ఈ కొంబన్ చిత్రం ద్వారా కార్తీ పల్లెవాసిగా మారనున్నారు. ఈ చిత్రానికి మొదట ఎంపిక చేయానుకున్న నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉండడంతో కాల్షీట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో అవకాశం దివ్యను వరించిందని సమాచారం. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో మద్రాస్ చిత్రంలో నటిస్తున్న కార్తీ తదుపరి నటించే చిత్రం కొంబన్ అవుతుంది. ఈ చిత్రం జూన్‌లో సెట్‌పైకి రానుంది. -
ఎక్స్‌పోజింగ్‌కు నో
వర్ధమాన తారలలో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచుకుని విజయానికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతున్న నటి శ్రీదివ్య. పదహారణాల అచ్చ తెలుగు ఆడపడుచైన ఈ ముద్దుగుమ్మ బస్టాప్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని వరుత్త పడాద వాలిభర్ సంఘం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ కూడా తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే కోలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటికిక్కడ మంచి డిమాండే ఉంది. సక్సెస్‌తో పాటు తన హోమ్లీ లుక్ కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం శ్రీ దివ్య చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. మరికొన్ని అవకాశాలు ఎదురుచూస్తున్నాయట. అలాగే ఈ అమ్మడు యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ సరసన నటిస్తున్న పెన్సిల్, అధర్వతో రొమాన్స్ చేస్తున్న ఈటి, శివకార్తికేయన్‌తో మరోసారి జత కడుతోంది, నటుడు విష్ణు, జీవా చిత్రాలతో పాటు విక్రమ్ ప్రభు సరసన నటిస్తున్న శ్రీ దివ్య ఏం చెబుతోందంటే.. ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిలో ఈటి, జీవా చిత్రాల్లో కళాశాల యువతిగాను, పెన్సిల్ చిత్రంలో పాఠశాల అమ్మాయిగాను నటిస్తున్నారు. అయితే ఈమూడు పాత్రలు ఒక్కొక్కటి ఒక్కో కోణంలో సాగుతాయి. ఈటి చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఇక జీవా చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. అలాగే తానా చిత్రంలో నర్సు పాత్రలో కనిపిస్తాను. రిపీట్ పాత్రల్లో నటించాలనుకోవడం లేదు. అలాగే చెట్లు పుట్టలు తిరుగుతూ పాటలకే పరిమితమయ్యే పాత్రలను అంగీకరించను. అది టాప్ హీరోల చిత్రాలైనా నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను. పాత్ర నచ్చితే నూతన దర్శకత్వంలో అయినా నటించడానికి రెడీ. పెన్సిల్ చిత్రంలో నటించడానికి ప్రధాన కారణం ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్ కథాంశంతో సాగే కథా చిత్రం. అదే విధంగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌కు నేను వీరాభిమాని. ఆయన పాటలంటే చాలా ఇష్టం. అలాంటిది ఆయన సరసన నటించడం ఆనందంగా ఉంది. నటుడు శివకార్తికేయన్‌ది చాలా ఫ్రెండ్లీ నేచర్. వరుత్త పడాద వాలిభన్ చిత్రంలో ఆయన సహకారం మరువలేనిది. నటుడు విక్రమ్ ప్రభులో గొప్ప నట వంశం నుంచి వచ్చాననే గర్వం కించిత్ కూడా ఉండదు. ఇక నటుడు అధర్వతో పెద్ద పరిచయం లేదు. ఆయనతో కలసి రెండు రోజులే నటించినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో నటించడానికి ఒక్క భాష మినహా తారతమ్యం లేదు. అలాగే మణిరత్నం, గౌతమ్ మీనన్, తెలుగు దర్శకుడు కె.విశ్వనాథ్ చిత్రాల్లో నటించాలని ఆశ. మౌనరాగం, అలప్పాయిదే, వారణం ఆయిరం, ఎందిరన్ తదితర నాకు నచ్చిన చిత్రాల్లో కొన్ని. ప్రస్తుతం ఉన్న హోమ్లీ ఇమేజ్‌నే కోరుకుంటున్నాను. గ్లామరస్ పాత్రలు జోలికి పోదలచుకోలేదు. అందాలారబోత అవకాశాలంటే సారీ చెప్పేస్తానని శ్రీ దివ్య అంటున్నారు. -
కోలీవుడ్‌లో మరో తెలుగమ్మాయి
కోలీవుడ్‌లో ఇప్పటివరకు, బాలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతోంది. తాజాగా తమిళ దర్శక నిర్మాతల దృష్టి టాలీవుడ్ భామలపై పడుతోంది. ఇప్పటికే కలర్స్ స్వాతి, బిందుమాధవిలాంటి టాలీవుడ్ బ్యూటీలు కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. మరో యువ నటి దివ్యశ్రీ వరుత్తపడాదవాలిబర్ సంఘం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే హిట్ నాయకి పేరును సొంతం చేసుకుంది. ప్రస్తుతం, యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ సరసన పెన్సిల్ తదితర చిత్రాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా మరో తెలుగమ్మాయి శ్రీముఖి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతోంది. ఇంతకు ముందు రాటినం వంటి విజయవంతమైన చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన కె.ఎస్.తంగసామి తాజాగా దర్శకత్వం వహిస్తూ ముఖ్య భూమికను పోషిస్తున్న చిత్రం ఎట్టుతిక్కుం మదయానై.. ఆర్య తమ్ముడు సత్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీముఖి హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శ్రీముఖి చాలా ఆశలు పెట్టుకుందట. ఆమె మాట్లాడుతూ తొలి చిత్రంలోనే నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్ర లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఎట్టుతిక్కు మదయానై కోలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉన్నట్టు తెలిపింది. చిత్ర దర్శకుడు కె.ఎస్.తంగసామి కూడా శ్రీముఖికి తమిళ భాష తెలియకపోయినా చెప్పింది అర్థం చేసుకుని చక్కగా నటించిందని కితాబిస్తున్నారు. -
చీరకట్టులో శ్రీదివ్య
చీరకట్టుతో మెచ్యూరిటీని, మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌ను ప్రదర్శిస్తూ నటిగా ప్రమోషన్ పొందిన ఆనందంలో మునిగి తేలుతోందట నటి శ్రీదివ్య. ఈ తెలుగు భామ వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఈ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా అందరినీ ఆకట్టుకుంది. చిత్రం ఘన విజయం సాధించడంతో అమ్మడికి గిరాకీ పెరిగింది. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా పెన్సిల్ పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటించే అదృష్టం ఈ బ్యూటీకే దక్కింది. ఇందులో శ్రీదివ్య పాఠశాల విద్యార్థినిగానే నటిస్తోందట. అంతేకాదు మరికొందరు దర్శక నిర్మాతలు పాఠశాల విద్యార్థిని పాత్రలతో కూడిన కథ వినిపించడంతో అన్ని ఆ తరహా పాత్రలేనా అంటూ నిరాశకు లోనయ్యిందట. కళాశాల విద్యార్థినిగా ప్రమోషన్ కోసం ఎదురుచూసిన ఈ చిన్నదానికి తాజాగా ఈ చిత్రంలో తను ఆశించిన కళాశాల విద్యార్థిని పాత్రే లభించిందట. నటిగా తన కెరీర్ ప్రమోషన్‌గా భావిస్తున్న శ్రీదివ్య ఈ చిత్రంలో తన వయసుకు మీరి మెచ్యూరిటీగా కనిపించడానికి కొన్ని సన్నివేశాల్లో చీర కట్టి నటించిందట. అలాగే పాటల సన్నివేశాల్లో మోడ్రన్ దుస్తుల్లో అందాలు ఆరబోయడానికి సిద్ధం అవుతోందట. దీంతో తనకు స్టార్స్ సరసన నటించే అవకాశాలు రావడం ఖాయమంటూ కలలు కంటోందట. -
అధర్వకు జంటగా శ్రీ దివ్య
టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీ దివ్యకు కోలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఒకటి తరువాత మరొకటి అంటూ వరుసగా చిత్రాలు చేసుకుపోతోంది. ప్రతిభ ప్రాతిపదిక అన్నది ఈ చిన్నదాని విషయంలో నిజం అయ్యింది. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రం సక్సెస్ కావడం శ్రీదివ్యకు బాగా ఉపయోగపడింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయి అన్న ఇమేజ్ సంపాదించుకున్న ఈ సుందరికి తమిళ చిత్ర పరిశ్రమలో ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు హీరోగా పరిచయం అవుతున్న పెన్సిల్ చిత్రంలో నటిస్తున్న శ్రీ దివ్యకు తాజాగా అధర్వతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరూ కలసి నటించనున్న చిత్రానికి ‘ఈ తి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు రవి అరసు మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి రానుంది. ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్, వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీదివ్య కాట్టుమల్లి, సుశీంద్రన్ దర్శకత్వంలో విష్ణు సరసన నటించనుంది. -
శ్రీదివ్యకు అవకాశాల క్యూ
శ్రీదివ్యకు కోలీవుడ్‌లో గిరాకీ పెరుగుతోంది. సినీరంగంలో ఒక్క విజయం తారల తలరాతలనే మార్చేస్తుంది. ఇందుకు ఉదాహరణ లెన్నో. శ్రీదివ్య ఇదే కోవకు చెందుతుంది. టాలీవుడ్లో విజయం కోసం పోరాడిన ఈ తెలుగమ్మాయికి కోలీవుడ్‌లో విజయం లభించింది. తొలి చిత్రం వరుత్త పడాద వాలిభర్ సంఘంతోనే శ్రీదివ్య హిట్ చిత్రాల నాయికల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను రెండు అవకాశాలు వరించాయి. అందులో ఒకటి ప్రముఖ యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ సరసన నటించే పెన్సిల్ చిత్రం. విష్ణు, విశాల్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలోనూ శ్రీ దివ్య నాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి వీర ధీరమారన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రీదివ్య మాట్లాడుతూ సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో తాను కళాశాల విద్యార్థినిగా నటించనున్నట్లు తెలిపింది. ఈ పాత్ర తనకు చాలా నచ్చిందని చెప్పింది. చిత్ర షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుందని వెల్లడించింది. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలలో నటించే విషయమై చర్చలు సాగుతున్నట్లు పేర్కొంది. చదువు, నటన రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. -
జీవీకి జంటగా తెలుగమ్మాయి శ్రీదివ్య
యువ సంగీత దర్శక తరంగం జి.వి.ప్రకాష్‌కుమార్ హీరో అవతారమెత్తనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పెన్సిల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మణి నాగరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో గూండా చట్టాన్ని వాడుకోలేకపోయాం. హీరోయిన్గా మొదట ప్రియా ఆనంద్‌ను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడామెకు బదులు శ్రీదివ్యను ఎంపిక చేశారు. ఈ పదహారణాల తెలుగమ్మాయి ఇటీవల వరుత్తపడాద వాలిభర్ సంగం చిత్రం ద్వారా కోలీవుడ్లోకి ప్రవేశించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో శ్రీదివ్యపై దర్శక నిర్మాతల దృష్టి పడింది. తాజాగా ఈమె పొందిన అవకాశం పెన్సిల్ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ తొలి వారంలో ప్రారంభం కానుందని జి.వి.ప్రకాష్‌కుమార్ తెలిపారు. ఈ నెలాఖరున జీవీ, శ్రీదివ్యలకు ఫొటో షూట్ నిర్వహించనున్నారట. తాను విద్యాభ్యాసం చేసిన శెట్టినాడు విద్యాశ్రమంలో షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నట్లు జీవీ తెలిపారు. ఇందులో తాను ప్లస్-2 విద్యార్థిగా నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
‘నగరపురమ్’
బస్‌స్టాప్, మల్లెలతీరంలో... ఫేం శ్రీదివ్య, అఖిల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నగరపురమ్’. ఎన్.పి.సారథి దర్శకుడు. రావు అప్పారావు నిర్మాత. నిర్మాణానంతర పనులు పూర్తి కావచ్చిన ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘గతంలో వచ్చిన కాలేజ్ నేపథ్య చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన చిత్రం. అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. కంటతడి పెట్టించే సన్నివేశాలతో పాటు కడుపుబ్బ నవ్వించే హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేకతని, ఈ నెలలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వాహణ: జి.కోటేశ్వరరావు, ఎ.నాగరాజ్, సమర్పణ: ఎం.వి.నారాయణ, సహ నిర్మాత: ప్రదీప్‌కుమార్ ఆర్.ఎం., నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహ సినీ ఎంటర్టైన్మెంట్స్.