ఇలా కూడా లవ్ చేయొచ్చా! | Varadhi release on 17th April | Sakshi
Sakshi News home page

ఇలా కూడా లవ్ చేయొచ్చా!

Published Sun, Apr 12 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

ఇలా కూడా లవ్ చేయొచ్చా!

ఇలా కూడా లవ్ చేయొచ్చా!

ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీ దివ్య, హేమంత్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం’’ అని చెప్పారు. శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత గాఢంగా లవ్ చేస్తుందో నా పాత్ర తెలియజేస్తుంది. అసలు ఇలా కూడా లవ్ చేయవచ్చా అని చూసినవాళ్లకు అనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇందులో నేను శాడిస్ట్ లక్షణాలున్న పాత్ర చేశాను. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందరికీ గుర్తుండిపోతుంది’’ అని క్రాంతి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement