Kranti
-
కుటుంబంలో చిచ్చుపెట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టి తనను బెదిరిస్తే బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ఆయన శుక్రవారం పిఠాపురంలో మీడియా సమావేశంలో స్పందించారు. వివాహమైన రోజు నుంచే తన కుమార్తె మెట్టినింటి మనిషయ్యిందన్నారు. పెళ్లిగాక ముందు వరకే తమ మనిషి అని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. తన కుమారులు మాత్రమే తన మనుషులన్నారు. తన కుమార్తె మామ, జనసేన నాయకులు ఆమెతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు బెదిరించినా బెదిరేది లేదని చెప్పారు. ఇలా తిట్లు తిట్టించడం వల్ల తనకు బాధ లేదని, అయితే రాజకీయం రాజకీయమే అని తెలిపారు.కుటుంబంలో చిచ్చుపెట్టిన వారికి ఆ భగవంతుడే సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడని చెప్పారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు కూడా తన కుమార్తె మామ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తుచేశారు. నాటినుంచి నేటివరకు వారు తనకు ఏ విషయంలోను, ఏ రోజూ సహక రించలేదని తెలిపారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదుతాను 40 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, కుట్రలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ అలవాటయ్యాయన్నారు. తన తండ్రి ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అందుకే తాను ఈ రోజుకీ ఎవ్వరికీ భయపడకుండా, ఎవరి చేతి కిందా బతకకుండా ఉంటున్నానన్నారు. తాను ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి పదవులు కావాలని, ఉన్నతస్థానాలు, హోదాలు కల్పించాలని అడగలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించాలని తాను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచీ తనవంతు కష్టపడుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇటువంటి కుట్రలు పన్నడం రాజకీయాల్లో సహజమేనన్నారు.ఇటువంటి పథకాలు ఇచ్చే నాయకుడు భవిష్యత్‌లో పుట్టడు తాను ఒకసారి వైఎస్సార్సీపీలో చేరాక, ఇక పక్కచూపులు చూసేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడుగా ఉండటానికే తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చానన్నారు. ఎవరెన్ని అనుకున్నా జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పునరుద్ఘాటించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఊపిరి పోస్తున్నాయన్నారు.వైఎస్ తనయుడు జగన్ పేదల పెన్నిధిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడేదన్నారు. పేదల కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు భవిష్యత్తులో పుట్టడన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిత్యం పరితపించే జగన్‌కు తోడుగా అన్ని వర్గాలు నిలవాలని కోరారు. కూటమి ప్రజాసేవ కోసం వస్తున్నది కాదని, కేవలం అధికార దాహం తీర్చుకునేందుకు మాత్రమే వస్తోందని చెప్పారు. షూటింగ్‌ల కోసమే పవన్‌కు ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడుపోయే కులమని పవన్‌కళ్యాణ్ అన్న మాటలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. -
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గంని పరిపాలించే అభ్యర్థి ఎవరు?
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గం ఆందోల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్ తొలిసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహపై 16851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్రాంతికిరణ్‌కు 104229 ఓట్లు రాగా, దామోదర రాజనరసింహకు 87378 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ గతంలో టిఆర్ఎస్ తరపున గెలిచిన ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ 2018లో బిజెపి పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. కేవలం 2350 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. 2014లో దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆయనపై టిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి బాబూ మోహన్ 3291 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. బాబూ మోహన్ 2014లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరారు. బాబూమోహన్ 2014లో గెలవడంతో మూడోసారి గెలిచినట్లయింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. దామోదర రాజనరసింహ గతంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందారు. ఈయన తండ్రి రాజనరసింహ కాసు, పి.వి. అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. వీరిద్దరూ కలిసి ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. దామోదర అందోల్‌లో మూడుసార్లు, ఈయన తండ్రి రాజనరసింహ ఇక్కడ మూడుసార్లు, సదాశివపేటలో ఒకసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి గెలుపొందిన మరో ఇద్దరు కూడా మంత్రులయ్యారు. టిడిపి తరుఫున గెలిచిన రాజయ్య గతంలో ఎన్.టి.ఆర్, చంద్రబాబుల క్యాబినెట్లలో పనిచేసారు. 1998, 1999లలో సిద్దిపేట నుంచి లోక్‌సభకు కూడా రాజయ్య ఎన్నికయ్యారు. 1998లో లోక్‌సభకు ఎన్నికైన కారణంగా ఆందోల్ సీటుకు రాజీనామా చేయగా, జరిగిన ఉప ఎన్నికలో సినీనటుడు బాబూమోహన్ గెలుపొందారు. ఆయన తిరిగి 1999లో కూడా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2014లో టిఆర్ఎస్ పక్షాన గెలిచి, 2018లో బిజెపి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కుమార్తె
క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. గుంటక శ్రీనివాస్ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు. ‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
రైతులకు అండగా వ్యవసాయ పరిశోధనలు
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): వ్యవసాయ పరిశోధనలు రైతులకు అండగా నిలుస్తున్నాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐసీఏఆర్) శాస్త్రవేత్త డాక్టర్ కె.క్రాంతి అన్నారు. పంటల్లో నెమటోడ్స్(నులిపురుగులు) నివారణపై పరిశోధనలు చేస్తున్న ఆమె.. ఆలిండియా కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంపచోడవరం మండలం పెదపాడులో డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్–కొవ్వూరు నిర్వహించిన ‘ఉద్యాన పంటలను ఆశించే నులిపురుగుల నివారణ అవగాహన’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని చోట్లా నెమటోడ్స్‌పై పరిశోధన సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 1977 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సర్వే చేసి హాట్స్పాట్లను గుర్తించి.. వాటి నివారణకు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు పంటలను పట్టిపీడిస్తున్న నెమటోడ్స్ నివారణకు 200 రకాల విధానాలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నెమటోడ్స్‌తో భారీగా నష్టం.. నెమటోడ్స్ మొక్కల వేర్లపై బుడిపెలుగా వస్తాయని.. ఇవి మొక్క పై భాగానికి నీరు వెళ్లకుండా అడ్డుకుంటాయని వివరించారు. దీంతో మొక్కలు ఎండిపోతాయని తెలిపారు. ఉద్యాన పంటల్లో రూట్ నెమటోడ్స్ ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాలీహౌస్, షెడ్ నెట్లలో పెంచే కూరగాయ పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పంజాబ్, హరియాణా, జమ్మూ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో రైతులు రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో నెమటోడ్స్ వల్ల 90 శాతం పంట నష్టం జరుగుతుండగా.. ఏపీ, తెలంగాణలో నష్టం 10 శాతంగా ఉందని చెప్పారు. వీటిని నివారించాలంటే.. ఉత్తర భారతదేశంలో అయితే మే, జూన్ నెలల్లో, దక్షిణ భారతదేశంలో ఏప్రిల్, మే నెలల్లో పాలీహౌస్‌లలో కొద్దిగా తడి ఉండేలా 25 మైక్రాన్ మందం కలిగిన పాలిథిన్ కవర్లు పరచాలని సూచించారు. రెండు కేజీల బయో ఏజెంట్, పది గ్రాముల ఎఫ్ఐఎం పిచికారీ చేసి పాలీహౌస్ను మూసివేయాలన్నారు. క్రాప్‌కు ముందు రెండు నెలలపాటు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పంట మారి్పడి, కూరగాయల పంట మధ్యలో పూల మొక్కలు నాటడం ద్వారా కూడా వీటిని అడ్డుకోవచ్చన్నారు. -
నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్లాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి, కొంగరకలాన్‌లో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పల్లవి, క్రాంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. వండర్లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్లు, చాటింగ్ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్సాప్ చేసింది. అనంతరం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య పల్లవి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు ఇంటికి వెళ్లకుండా పల్లవి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం, ఇదే చివరి మెసేజ్ అని పెట్టడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదిబట్ల పోలీసులకు తెలిపాడు. పల్లవి అత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కని పించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
టైటిలే సగం సక్సెస్
క్రాంతి, కె.సీమర్ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సుధీర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు ట్రైలర్ చాలా బావుంది. టైటిలే సినిమాకు సగం సక్సెస్. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన నూతన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు గారికి ధన్యవాదాలు. యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన మా చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఆ వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయి: క్రాంతి
హైదరాబాద్ : తన భర్త రాసిన సూసైడ్‌నోట్‌లో ఉన్న అంశాలపై విచారణ జరపాలని హిమాయత్‌నగర్ కాల్పులు కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి డిమాండ్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే కేసును మూసేస్తామంటున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. బయట వినిపిస్తున్న వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయని క్రాంతి వ్యాఖ్యానించారు. లారెల్ ఆస్పత్రి లావాదేవీల్లో సమస్యలున్నాయని శశికుమార్ తనకు చెప్పారని ఆమె అన్నారు. ఉదయ్, సాయికుమార్, ఫోన్ చేస్తేనే శశి ఇంట్లో నుంచి వెళ్లారని క్రాంతి తెలిపారు. చంద్రకళ తన భర్తకు ఫ్రెండ్‌గానే తెలుసునని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ చంద్రకళ తనతో మాట్లాడింది లేదన్నారు. శశికుమార్ బ్రీఫ్ కేసుతో పాటు కారు కూడా ట్రేస్ అవుట్ అవలేదని, అవి రెండూ తనకు కావాలని క్రాంతి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ శశికుమార్ సూసైడ్ కేసును మొయినాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతారని కమలాసన్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌పై కాల్పులు జరిపింది శశికుమారేనని అన్నారు. ఇక బుల్లెట్ గాయమైన ఉదయ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. -
సివిల్స్‌లో మెరిశారు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ -2014 ఫలితాల్లో జిల్లా యువకులు మెరిశారు. జాతీయస్థారుులో ఉన్నత ర్యాంకులు సాధించి జిల్లావాసులను మురిపించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 24 ఏళ్ల క్రాంతి తొలి ప్రయత్నంలోనే 50వ ర్యాంకుతో.. హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన 26 ఏళ్ల పింగిళి సతీష్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంలో 97వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. - 50వ ర్యాంకు సాధించిన క్రాంతి - 97వర్యాంకు పొందిన పింగిళి సతీష్‌రెడ్డి - యువ అధికారుల స్ఫూర్తితో లక్ష్య సాధన - హోం స్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటామని వెల్లడి ముంబైలో బహుళజాతి కంపెనీలో సీఏగా పని చేస్తున్నప్పుడు చాలెంజింగ్‌గా ఉండే సివిల్స్ రాయాలని అనిపించింది. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయి. ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటాను. కొత్త రాష్ర్టంలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుక కృషి చేస్తా. సాక్షి, హన్మకొండ : తొలి ప్రయత్నంలోనే సివిల్స్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో క్రాంతి 50వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని నలుమూలల చాటాడు. క్రాంతి తల్లిదండ్రులు పాటి సురేందర్, జ్యోతి కాగా.. బాబారుు కొండల్రావు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లో డీఈగా పనిచేస్తున్నారు. క్రాంతికుమర్ తండ్రి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా పలు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రాంతికుమర్ ఐదో తరగతి వరకు మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఐదు నుంచి పది వరకు పెదవేగి, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో చదివారు. అనంతరం షోలాపూర్, మహారాష్ట్రలో నవోదయ విద్యాలయాల్లో చదివారు. ఆపై ఇరవై ఒక్క ఏళ్లకే పూణేలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి ముంబైలో ఓ బహుళజాతి కంపెనీలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల వేతనంతో సీఏగా పని చేశారు. ఈ వృత్తిలో ఉండగానే దీర్ఘకాలిక సెలవు పెట్టి ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించారు. మెయిన్స్‌లో ఆప్షనల్‌గా కామర్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ బురహన్పురంలో ఉన్న క్రాంతి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయని, దీంతో ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యానని చెప్పారు. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సివిల్స్‌లో 97 వ ర్యాంక్ సాధించిన సతీశ్‌రెడ్డి తల్లిదండ్రులు సీతారాంరెడ్డి, విజయలక్ష్మి. వీరు హన్మకొండలోని బాలసముద్రంలో నివాసం ఉంటున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌లో విఫలమైన సతీశ్‌రెడ్డి, ద్వితీయ ప్రయత్నంలో విజయం సాధించాడు. మెయిన్స్‌లో ఆయన సోషియాలజీని ఆప్షన్‌గా ఎన్నుకున్నారు. -
డాక్టర్ చదివినా యాక్టర్‌గా...
‘‘చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న మాట కాదనలేక ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకోవడం కోసం ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గర చేరాను. అప్పుడే ‘మల్లెల తీరంలో సిరి మల్లెపువ్వు’ చిత్రానికి అవకాశం వచ్చింది’’ అని క్రాంతి అన్నారు. ఆ తర్వాత ‘ఆ ఐదుగురు’లో నటించిన క్రాంతి, రేపు విడుదల కానున్న ‘వారధి’లో నటించారు. సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రాంతి మాట్లా డుతూ - ‘‘ఇందులో నాది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. నటుడిగా నాకు సవాల్‌లాంటి పాత్ర కాబట్టే, ఎంచుకొన్నా. హీరో, హీరోయిజమ్ అనే తరహా పాత్రలు మాత్రమే చేయాలనుకోవడంలేదు. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’ చిత్రంలో నటిస్తున్నాననీ, డాక్టర్‌గా చదివినా యాక్టర్‌గా కొనసాగాలన్నది తన ఆశయం అని క్రాంతి తెలిపారు. -
ఇలా కూడా లవ్ చేయొచ్చా!
ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీ దివ్య, హేమంత్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం’’ అని చెప్పారు. శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత గాఢంగా లవ్ చేస్తుందో నా పాత్ర తెలియజేస్తుంది. అసలు ఇలా కూడా లవ్ చేయవచ్చా అని చూసినవాళ్లకు అనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇందులో నేను శాడిస్ట్ లక్షణాలున్న పాత్ర చేశాను. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందరికీ గుర్తుండిపోతుంది’’ అని క్రాంతి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ. -
స్పష్టమైన హామీతోనే సమ్మె విరమణ
హైకోర్టు ఆదేశాలను శిరసావహిస్తాం: జూడాలు హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ లభించే దాకా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు స్పష్టంచేశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సమ్మెను బుధవారం వరకు కొనసాగించేందుకే నిర్ణయించినట్లు జూడాల సంఘం అధ్యక్షుడు క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. హైకోర్టు నుంచి బుధవారం రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు అందినా వాటిని శిరసావహిస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ సర్వీసులను శాశ్వతం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. కాగా, గ్రామాల్లో పని చేసే వరకు జూడాలకు సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ అధికారులు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నెల రోజులుగా సమ్మె చేస్తున్న జూడాలపై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమ్మె చేయడం ద్వారా జూడాలు చట్టాన్ని ఎలా తమ చేతుల్లోకి తీసుకుంటారంటూ వారిని ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరిని సైత ం న్యాయస్థానం తప్పుబట్టింది. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో తాము చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే జూడాలు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే లిఖితపూర్వకమైన ఆదేశాలు అందేవరకు సమ్మె కొనసాగించనున్నట్లు పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సమ్మెను విరమించాలని న్యాయస్థానం కోరిన ప్రతిసారీ తాము విరమిస్తున్నామని, ప్రభుత్వం మాత్రం ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తానని చెబుతుందే తప్ప ప్రభుత్వం ఆచరణలో ఎలాంటి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంపైన కోర్టు ధిక్కార కేసు వేయలేదెందుకని హైకోర్టు ప్రశ్నించిందని కూడా వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, న్యాయస్థానం తీర్పులు, తదితర పూర్తి వివరాలను బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కొనసాగిన దీక్షలు కాగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జూడాలు మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రిలే దీక్షలను మూడోరోజు కొనసాగించారు. నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్ష పాటించారు. వ్యాయామాలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం నాటి రిలే దీక్షల్లో జూడాలు అశోక్, వికాస్, తాహ, ప్రఫుల్, జీనత్, పార్వతి కూర్చున్నారు. జూడాల సంఘం కన్వీనర్ శ్రీనివాస్, నాగర్జున తదితరులు పాల్గొన్నారు. సమ్మె విరమించాలి: ఎమ్మెల్సీ కర్నె జూనియర్ డాక్టర్లు మొండివైఖరిని అవలంబించడం సరికాదని, వారు వెంటనే సమ్మెను విరమించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హితవు పలికారు. సమ్మెపై నిర్లక్ష్యం వద్దు: కాంగ్రెస్ జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా పేద రోగులు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేష్, కార్యదర్శి గాలి బాలాజీ ఒక ప్రకటలో విమర్శించారు. జూడాల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. -
అంతటి పేరు వస్తుంది
‘‘విడుదలకు ముందు ‘ఆ నలుగురు’ చిత్రాన్ని కొందరికి చూపించాను. ‘తలకాయ్ ఉన్న ఎవరూ ఇలాంటి సినిమా తీయరు’ అని చెప్పారు. ‘తెర తీయగానే డెడ్‌బాడీని చూపించావ్. ఏం కలిసొస్తుంది?’ అన్నవారూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి వెళ్లాను. విజయం సాధించాను. ఈ సినిమా క్కూడా అంతటి పేరు వస్తుంది’’ అన్నారు చిత్ర సమర్పకుడు ప్రేమకుమార్ పట్రా. క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ముఖ్యతారలుగా, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో టి.ప్రసన్నకుమార్, వేణుస్వామి చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రేమ్‌కుమార్ పట్రానే ఈ చిత్రానికి నిజమైన హీరో. ఈ పాత్ర కోసం పోలీస్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకున్నాను’’ అని చెప్పారు. ‘‘అయిదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్‌తో ఈ కథ తయారు చేసుకున్నాను. సీఎం మంచివాడైతే రాష్ట్రం ఎలా ఉంటుంది? యువతరం ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా. రాజకీయ నేపథ్యంలో సాగే... యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. సుద్దాల అశోక్‌తేజ సంభాషణలు, పీజీ విందా కెమెరా ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర తారాగణం కూడా మాట్లాడారు. -
తొలిప్రేమ పవిత్రత
నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, ఓ దొంగ, ఓ సాధారణమైన అమ్మాయి... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. రవిబాబు, క్రాంతి, చిత్రం శ్రీను, దిలీప్, సాయినాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయారుష్(వన్నీ) దర్శకుడు. ఆర్.సాయిరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి శివబాలాజీ కెమెరా స్విచాన్ చేయగా, డా.శ్రీహరి క్లాప్ ఇచ్చారు. తొలిప్రేమలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళతామని, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్, కెమెరా: దాము నర్రావుల, సంగీతం: దిలీప్, కళ: పి.కిరణ్‌కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి. -
తొలిప్రేమ పవిత్రత
నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, ఓ దొంగ, ఓ సాధారణమైన అమ్మాయి... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. రవిబాబు, క్రాంతి, చిత్రం శ్రీను, దిలీప్, సాయినాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయారుష్(వన్నీ) దర్శకుడు. ఆర్.సాయిరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి శివబాలాజీ కెమెరా స్విచాన్ చేయగా, డా.శ్రీహరి క్లాప్ ఇచ్చారు. తొలిప్రేమలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళతామని, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్, కెమెరా: దాము నర్రావుల, సంగీతం: దిలీప్, కళ: పి.కిరణ్‌కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి.