అంతటి పేరు వస్తుంది
అంతటి పేరు వస్తుంది
Published Sun, Mar 2 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
‘‘విడుదలకు ముందు ‘ఆ నలుగురు’ చిత్రాన్ని కొందరికి చూపించాను. ‘తలకాయ్ ఉన్న ఎవరూ ఇలాంటి సినిమా తీయరు’ అని చెప్పారు. ‘తెర తీయగానే డెడ్‌బాడీని చూపించావ్. ఏం కలిసొస్తుంది?’ అన్నవారూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి వెళ్లాను. విజయం సాధించాను. ఈ సినిమా క్కూడా అంతటి పేరు వస్తుంది’’ అన్నారు చిత్ర సమర్పకుడు ప్రేమకుమార్ పట్రా. క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ముఖ్యతారలుగా, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో టి.ప్రసన్నకుమార్, వేణుస్వామి చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రేమ్‌కుమార్ పట్రానే ఈ చిత్రానికి నిజమైన హీరో. ఈ పాత్ర కోసం పోలీస్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకున్నాను’’ అని చెప్పారు. ‘‘అయిదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్‌తో ఈ కథ తయారు చేసుకున్నాను. సీఎం మంచివాడైతే రాష్ట్రం ఎలా ఉంటుంది? యువతరం ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా. రాజకీయ నేపథ్యంలో సాగే... యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. సుద్దాల అశోక్‌తేజ సంభాషణలు, పీజీ విందా కెమెరా ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర తారాగణం కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement