ప్రాంతమేదైనా.. ఆచారమేదైనా.. ఆభరణమంటే తనిష్క్‌ ‘రివాహ్‌’ | Jewellery is Tanishq Rivaah in Andhra Pradesh and Telangana | Sakshi
Sakshi News home page

ప్రాంతమేదైనా.. ఆచారమేదైనా.. ఆభరణమంటే తనిష్క్‌ ‘రివాహ్‌’

Published Tue, Jan 9 2024 12:04 PM | Last Updated on Sat, Jan 20 2024 4:47 PM

Tanishq Rivaah - Sakshi

తనిష్క్‌ జ్యువెలరీ ‘రివాహ్‌’ కొత్త ఆభరణాలు

ఎక్కడైనా ‘మీ ఊరి’ డిజైన్లతో తనిష్క్‌ ‘రివాహ్‌’ భారతదేశంలో విభిన్న సంప్రదాయాలు.. ఆహారం, ఆహార్యం, ఆచార వ్యవహారాలన్నీ ప్రాంతాలనుబట్టి మారుతుంటాయి. అందుకు అనువుగానే తనిష్క్‌ ‘రివాహ్‌’ కలెక‌్షన్‌ ఉండబోతోంది. ప్రాంతాలేవైనా... ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే డిజైన్లు రివాహ్‌ సొంతం. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న వధూవరుల మదిని దోచేందుకు... బంధుమిత్రుల ఇష్టాలను నెరవేర్చేందుకూ తనిష్క్‌ జ్యువెలరీ ‘రివాహ్‌’ కొత్త ఆభరణాలను పరిచయం చేస్తోంది. Rivaah by Tanishq

పెళ్లి వేడుకల్లో భాగంగా, సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని సందర్భాలకూ ఉపయోగపడే ఆభరణాలూ రివాహ్‌ శ్రేణిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు దేశంలోని  259 నగరాల్లో మొత్తం 435 స్టోర్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది.

వ్యాపారం, ఉద్యోగాల కారణంగా చాలామంది...వేర్వేరు ప్రాంతాలు, దేశాల్లో స్థిరపడ్డారు. చాలా సందర్భాల్లో వీరికి అవసరమైన, భారతీయత ఉట్టిపడే డిజైన్లు ఉన్న నగలు అక్కడ వారికి లభించకపోవచ్చు. అయితే ‘రివాహ్‌’ షోరూమ్‌లలో మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించిన వివాహ ఆభరణాలు ‘రివాహ్‌’లో ఉన్నాయి.

వివాహ సన్నాహాల్లో భాగంగా మధ్యతరగతి కుటుంబంలో పెళ్లికూతురు కనీసం 10 తులాల బంగారు ఆభరణాలు ధరిస్తుంది. ‘తనిష్క్ రివాహ్‌’ వివాహానికి తగిన ఆభరణాలను ఎంచుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్‌లను అందిస్తోంది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్‌ నుంచి సంగీత్‌ వరకు అన్నింటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో ఆకర్షణీయంగా కనిపించేలా ఆభరణాలు ధరించాలి.

ఒక్కోవేడుకకు ఒక్కో రకమైన నగలతో వినూత్నంగా కనిపించాలి. అందుకు సరైన జ్యువెలరీని ఎంచుకోవాలి. చెవి పోగులు, బ్యాంగిల్స్‌, నెక్లెస్‌ ఇలా ప్రతిదానిలో వైవిధ్యంగా ఉండాలి. అందుకోసం ‘తనిష్క్‌ రివాహ్‌’ ప్రత్యేక ఆభరణాలతో ఆకట్టుకుంటోంది. వివాహానికి హాజరయ్యే బంధువుల సొగసును పెంచేందుకు 'రివాహ్‌'లో ప్రత్యేక నగల కలెక్షన్‌ ఉంది. ఏళ్లపాటు నిలిచిపోయే వివాహబంధాన్ని మరింత గుర్తుండేలా తనిష్క్‌ డిజైన్‌లు తయారుచేస్తోంది.

భారతీయ వివాహా వేడుకలో బంగారానికి కీలకపాత్ర ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు భారంగా భావిస్తున్న వారికి తనిష్క్‌ మంచి అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ ద్వారా వినియోగదారుల పాత బంగారానికి మార్కెట్‌లో సరసమైన విలువను అందిస్తూ నాణ్యమైన కొత్త బంగారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘తనిష్క్‌ రివాహ్‌’ వంటి ప్రముఖ, విశ్వసనీయ బ్రాండ్‌ ద్వారా వివిధ డిజైన్‌ల్లో తయారుచేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందాన్ని పొందండి.

కుసుమ, నవ వధువు

“కస్టమ్-డిజైన్ నగల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన అనుభవాన్ని పంచుకుంది. వివాహం అనేది రెండు మనసుల కలయిక అని ఆమె చెప్పింది. తనిష్క్ 'రివాహ్‌' వారి స్థానిక డిజైన్‌లను ప్రతిబింబించే నగలను అందించిందని ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తన వివాహం మరింత గుర్తుండిపోయేలా చేసినందుకు రివాహ్‌కు కృతజ్ఞతలు” అని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement