Tanishq Jewellery
-
ప్రాంతమేదైనా.. ఆచారమేదైనా.. ఆభరణమంటే తనిష్క్ ‘రివాహ్’
ఎక్కడైనా ‘మీ ఊరి’ డిజైన్లతో తనిష్క్ ‘రివాహ్’ భారతదేశంలో విభిన్న సంప్రదాయాలు.. ఆహారం, ఆహార్యం, ఆచార వ్యవహారాలన్నీ ప్రాంతాలనుబట్టి మారుతుంటాయి. అందుకు అనువుగానే తనిష్క్ ‘రివాహ్’ కలెక్షన్ ఉండబోతోంది. ప్రాంతాలేవైనా... ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే డిజైన్లు రివాహ్ సొంతం. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న వధూవరుల మదిని దోచేందుకు... బంధుమిత్రుల ఇష్టాలను నెరవేర్చేందుకూ తనిష్క్ జ్యువెలరీ ‘రివాహ్’ కొత్త ఆభరణాలను పరిచయం చేస్తోంది. Rivaah by Tanishq పెళ్లి వేడుకల్లో భాగంగా, సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని సందర్భాలకూ ఉపయోగపడే ఆభరణాలూ రివాహ్ శ్రేణిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు దేశంలోని 259 నగరాల్లో మొత్తం 435 స్టోర్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. వ్యాపారం, ఉద్యోగాల కారణంగా చాలామంది...వేర్వేరు ప్రాంతాలు, దేశాల్లో స్థిరపడ్డారు. చాలా సందర్భాల్లో వీరికి అవసరమైన, భారతీయత ఉట్టిపడే డిజైన్లు ఉన్న నగలు అక్కడ వారికి లభించకపోవచ్చు. అయితే ‘రివాహ్’ షోరూమ్‌లలో మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించిన వివాహ ఆభరణాలు ‘రివాహ్’లో ఉన్నాయి. వివాహ సన్నాహాల్లో భాగంగా మధ్యతరగతి కుటుంబంలో పెళ్లికూతురు కనీసం 10 తులాల బంగారు ఆభరణాలు ధరిస్తుంది. ‘తనిష్క్ రివాహ్’ వివాహానికి తగిన ఆభరణాలను ఎంచుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లను అందిస్తోంది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్ నుంచి సంగీత్ వరకు అన్నింటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో ఆకర్షణీయంగా కనిపించేలా ఆభరణాలు ధరించాలి. ఒక్కోవేడుకకు ఒక్కో రకమైన నగలతో వినూత్నంగా కనిపించాలి. అందుకు సరైన జ్యువెలరీని ఎంచుకోవాలి. చెవి పోగులు, బ్యాంగిల్స్, నెక్లెస్ ఇలా ప్రతిదానిలో వైవిధ్యంగా ఉండాలి. అందుకోసం ‘తనిష్క్ రివాహ్’ ప్రత్యేక ఆభరణాలతో ఆకట్టుకుంటోంది. వివాహానికి హాజరయ్యే బంధువుల సొగసును పెంచేందుకు 'రివాహ్'లో ప్రత్యేక నగల కలెక్షన్ ఉంది. ఏళ్లపాటు నిలిచిపోయే వివాహబంధాన్ని మరింత గుర్తుండేలా తనిష్క్ డిజైన్లు తయారుచేస్తోంది. భారతీయ వివాహా వేడుకలో బంగారానికి కీలకపాత్ర ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు భారంగా భావిస్తున్న వారికి తనిష్క్ మంచి అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారుల పాత బంగారానికి మార్కెట్లో సరసమైన విలువను అందిస్తూ నాణ్యమైన కొత్త బంగారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘తనిష్క్ రివాహ్’ వంటి ప్రముఖ, విశ్వసనీయ బ్రాండ్ ద్వారా వివిధ డిజైన్ల్లో తయారుచేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందాన్ని పొందండి. కుసుమ, నవ వధువు “కస్టమ్-డిజైన్ నగల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన అనుభవాన్ని పంచుకుంది. వివాహం అనేది రెండు మనసుల కలయిక అని ఆమె చెప్పింది. తనిష్క్ 'రివాహ్' వారి స్థానిక డిజైన్లను ప్రతిబింబించే నగలను అందించిందని ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తన వివాహం మరింత గుర్తుండిపోయేలా చేసినందుకు రివాహ్కు కృతజ్ఞతలు” అని చెప్పింది. -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్‌ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
తనిష్క్ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ అక్షయ తృతీయ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.200, వజ్రాభరణాలపై 20% వరకు తగ్గింపు అందిస్తోంది. గోల్డ్ కాయిన్ల సులభతర కొనుగోళ్లకు ‘24కే ఎక్స్‌ప్రెస్’ పేరిట గోల్డ్ కాయిన్ ఏటీఎంలను లాంచ్ సంస్థ చేసింది. తనిష్క్ ఫ్లాగ్షిప్ స్టోర్లలో ఈ ఏటీఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. -
100 శాతం రికవరీ
తనిష్క్ జువెల్లరీ భారీ చోరీ కేసులో పూర్తయిన విచారణ మరో ఇద్దరు నిందితుల అరెస్టు పదిరోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు పంజగుట్ట, న్యూస్‌లైన్: నగరంలో సంచలనం సృష్టించిన పంజగుట్ట తనిష్క్ జువెల్లరీలో భారీచోరీ కేసును పోలీసులు పూర్తిగా ఛేదించారు. వందశాతం బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతనెల 25న జరిగిన ఈ చోరీ కేసులో ప్రధాన నిందితులు భూమన కిరణ్‌కుమార్(24), గంటినపాటి ఆనంద్(24)లు మీడియా ముందు లొంగిపోగా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు ఇటీవలే కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించారు. నిందితుడు కిరణ్ బేగంపేట ఫ్యామిలీవరల్డ్లో పనిచేసే సమయంలో పరిచయమైన స్నేహితుడు ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (35)కి దొంగతనం చేసిన రోజే రెండు బంగారు గాజులను అమ్మి పెట్టాలని ఇచ్చాడు. దీంతో ఆయన గాజులను ఎల్లమ్మబండలో ఉన్న శ్రీకృష్ణా జ్యువెలరీ అండ్ పాన్ బ్రోకర్ యజమాని మోహన్‌లాల్ (42)కు రూ.45వేలకు విక్రయించాడు. చంద్రశేఖర్ తాను రూ.15వేలు ఉంచుకొని కిరణ్‌కు రూ.30వేలు ఇచ్చాడు. కిరణ్ రూ.30వేలలో ఆనంద్‌కు రూ.20వేలు ఇచ్చాడు. కాగా కిరణ్ లొంగిపోయిన రోజున పోలీసులు అతడ్నించి రూ.8,600లు రికవరీ చేశారు. మంగళవారం దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు సహకరించిన చంద్రశేఖర్‌గౌడ్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు ఆయన్నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేసిన కృష్ణా జ్యువెలరీ యజమాని మోహన్‌లాల్‌ను కూడా అరెస్టు చేసి ఆయన్నించి రెండు బంగారుగాజులను స్వాధీనం చేసుకున్నారు. కిరణ్,ఆనంద్లతోపాటు చంద్రశేఖర్‌గౌడ్, మోహన్‌లాల్‌లను పంజగుట్ట పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా తనిష్క్ కేసులో చోరీకి గురైన 15.57 కిలోల బంగారం పూర్తిగా 100 శాతం రికవరీ సాధించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దొంగతనం చేసిన సమయంలో నిందితులు వాడిన మంకీ క్యాప్, గ్లౌజులు, సుత్తి, స్క్రూడ్రైవర్, కాళ్లకు కవర్లు, అద్దాలను పంజగుట్ట బస్టాపు వెనుకభాగంలో వాటిని పడేయగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగ సొత్తును ఎవరైనా కొనుగోలు చేసినా, కొనుగోలు చేసేందుకు సహకరించినా శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. -
అరెస్టుకు ముందే స్వచ్ఛంద వాంగ్మూలం
పోలీసు శునకాలకు చిక్కకుండా కారంపొడి సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా మాస్క్ పాదముద్రలు పడకుండా గోనె సంచులు వేలిముద్రలు లేకుండా ఉండేందుకు గ్లౌజ్‌లు కంటి పాపలు సైతం కనిపించకుండా కళ్లజోడు తల వెంట్రుకలు రాలకుండా ప్రత్యేక జెల్ సాక్షి, సిటీబ్యూరో: ఘరానా నేరగాళ్లను సైతం తలదన్నేలా సినీ ఫక్కీలో ఇంత పగడ్భందీగా తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో రూ.5.97 కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టిన కిరణ్, ఆనంద్‌లు పోలీసులకు నేరానంతరం మాత్రం ఓ బలమైన ఆధారాన్ని అందించారు. అదే స్వచ్ఛంద నేరాంగీకార వాంగ్మూలం. దీనికి సంబంధించి వారు మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలను సేకరిస్తున్న పోలీసులు వాటిని న్యాయస్థానంలో సమర్పించాలని నిర్ణయించారు. ఈ రికార్డులే కనుక లేకుంటే నిందితుల్ని దోషులుగా నిరూపించడం కష్టసాధ్యమయ్యేదని పోలీసులంటున్నారు. అది న్యాయస్థానంలో చెల్లదు... సాధారణంగా వివిధ నేరాల్లో నిందితుల్ని అరెస్టు చేశాక పోలీసులు వారి నుంచి నేరాంగీకార వాంగ్మూలం సేకరిస్తారు. పంచ్ విట్నెస్లుగా పరిగణించే సాక్షుల సమక్షంలో దీన్ని పత్రాలపై రికార్డు చేస్తారు. నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరిచేప్పుడు దీన్ని కూడా న్యాయస్థానానికి అందిస్తారు. ఈ వాంగ్మూలంపై పంచ్ లతో పాటు కొన్ని సందర్భాల్లో నిందితుల సంతకం కూడా ఉంటుంది. అయితే ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల మినహా మిగిలిన వాటిలో ఈ వాంగ్మూలం విచారణలో చెల్లదు. నిందితుడు పోలీసుల ముందు ఇచ్చినది కావడంతో బెదిరింపులు, బలవంతపు కోణం ఉండచ్చనే భావనతో కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఇది తిరుగులేని సాక్ష్యం... ‘తనిష్క్ దొంగలు’ కిరణ్‌కుమార్, ఆనంద్‌ల విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. పక్కా స్కెచ్‌లో భారీ చోరీ చేసినప్పటికీ... అమ్మే విషయంలో తలెత్తిన సమస్యలతో బెంబేలెత్తారు. దీంతో ఒకరు ఆదివారం, మరొకరు బుధవారం వేర్వేరు మీడియా ఛానళ్ల వద్దకు వెళ్లి వారంతట వారే ‘లొంగిపోయారు’. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందే నిందితులిద్దరూ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తామే నేరం చేశామని అంగీకరించారు. ఇది మొత్తం రికార్డు కావడంతో పాటు మాధ్యమంలో ప్రసారం కూడా అయింది. ఆ తరవాత పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేశారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆనంద్... ‘తనిష్క్’ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్‌ను బుధవారం అరెస్టు చేసిన పశ్చిమ మండ ల పోలీసులు గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం అరెస్టయిన కిరణ్, బుధవారం కటకటాల్లోకి చేరిన ఆనంద్ చెప్పిన అంశాల్లో కొన్ని తేడాలు ఉండటంతో ఇద్దరినీ కలిపి విచారిం చేందుకు నిర్ణయించిన పోలీసులు ఆ మేరకు కస్టడీకి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణలోనే ఇంకా మిగి లిన రెండు ఉంగరాలు, గాజుల్ని రికవరీ చేయడంతో పాటు నేరం చేయడానికి వినియోగించిన స్క్రూడ్రైవర్, స్పానర్లతో పాటు మాస్క్ లు, గ్లౌజ్‌లు స్వాధీనం చేసుకోవాలని అధికారు లు నిర్ణయించారు. ఇదిలా ఉండగా... తనిష్క్ షోరూంకు పోలీసులు గురువారం నో టీసులు జారీచేశారు. చోరీ అయిన మొత్తంపై తొలుత తప్పుడు ఫిర్యాదు ఇవ్వడం, షోరూం ముందుభాగంలో సీసీ కెమెరాలు అ మర్చకపోవడం, దుకాణం మూసేప్పుడు నగలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చకపోవడం వంటి కారణాలపై జనరల్ మేనేజర్ మణికందన్‌కు ఇవి అందించారు. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యంపై త్వరలోనే ఎస్ఐఎస్ సెక్యూరిటీ గ్రూప్ కు కూడా నోటీసులిస్తామని పోలీసులు తెలిపారు. స్ఫూర్తి, సాక్ష్యం... రెండూ మీడియానే... ఈ ఇద్దరు నిందితుల్లో ఎవరికీ గతంలో నేరచరిత్ర లేదు. కిరణ్ ఎప్పుడూ ఠాణా గడప కూడా తొక్కలేదు. ఆనంద్ మాత్రం రెండుమూడుసార్లు తమ స్వస్థలమైన ఈపూరులో పోలీసుల అదుపులోకి వెళ్లాడు. ఆ ఫిర్యాదు లు రాజీ కావడంతో కేసులు నమోదు కా లే దు. అయినప్పటికీ ఈ ఇద్దరూ ఇంత పక్కాగా స్కెచ్ వేసి, రెక్కీ చేసి, చోరీ చేయడానికి క్రైమ్ కథనాలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారమని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. ఏ మీడియా ద్వారా అయితే ఈ ‘తెలివి’ సంపాదిం చారో... అదే మీడియా ద్వారా నేరానికి సం బంధించిన బలమైన సాక్ష్యాన్ని అందించారు. -
తనిష్క్ లో చోరీ చేసింది కిరణే:సీపీ
హైదరాబాద్: తనిష్క్ బంగారం దుకాణంలో చోరీ చేసింది కిరణ్ అనే యువకుడని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుకాణంలో కి ప్రవేశించిన అనంతరం లైట్లను ఆఫ్ చేసి చోరీకి పాల్పడ్డారన్నారని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ లో ఉన్న మరోవ్యక్తి కిరణ్ రూమ్ మేట్ గా తేలిందన్నారు. అతని పేరు ఆనంద్ అని కిరణ్ తెలిపాడన్నారు. ఈ ఘటనలో రూ. 23 కోట్ల విలువైన 30 కిలోల బంగారం చోరీకి గురయిందన్న యాజమాని ఫిర్యాదుతో దర్యాప్తు ఆరంభించామన్నారు. ప్రస్తుతం 5.98 కోట్ల విలువైన 15.97 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. నగల దుకాణం యజమాని చెప్పినట్లు చోరీ గురయిన ఆభరణాల విలువ రూ.23 కోట్లు ఉండదన్నారు. చోరీకి పాల్పడిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. 24 వ తేదీ అర్ధరాత్రి దుకాణానికి కన్నం పెట్టి చోరీ చేసారన్నారు. చోరీ చేసే సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించారన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు. ఆభరణాలను రసూల్ పూర్ లో దాచినట్లు సీపీ తెలిపారు. కాగా బంగారంలోంచి ఒక ఉంగరాన్ని విక్రయించరన్నారు.ఈ చోరీతో సంబంధమున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంకా దొరకలేదన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్‌తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. -
'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన తనిష్క్ జ్యూయలరీ చోరీ కేసు మిస్టరీ వీడింది. చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు తేల్చారు. తనిష్క్ జ్యూవెలరీలో తానే దొంగతనానికి పాల్పడినట్లు కిరణ్ అనే యువకుడు గత రాత్రి బంజరాహిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. కిరణ్‌తో పాటు అతని స్నేహితుడు ఆనంద్‌కు కూడా చోరీలో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆనంద్‌ను గుర్తించారు. కాగా జనంలో కన్పించాలనే ఉద్దేశంతోనే తనిష్క్ నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ చెప్పిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. మరోవైపు తన కొడుకు దొంగతనం చేశాడని తాము నమ్మడం లేదని కిరణ్ తల్లి అంటోంది. తన కొడుకు ఎంతో మంచివాడని, కష్టపడే తత్వమని ఆమె చెప్తోంది. -
'సంచలనం కోసమే తనిష్క్లో చోరీ'
-
అవాక్కయిన ఈపూరు వాసులు
ఈపూరు: సంచలనం సృష్టించిన తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం కేసులో కిరణ్ అనే యవకుడు లొంగిపోయాడు. దీంతో కిరణ్ సొంతూరు గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరులో కలకలం రేగింది. కిరణ్ ఈ దొంగతనం చేశాడంటే ఆ ఊరి జనం నమ్మలేపోతున్నారు. దీని గురించి తెలియగానే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కిరణ్ ఇలాంటి పని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అయితే తన కొడుక్కి ఏమీ తెలియదని, అతడి వెనుక ఎవరోవుండి ఈ పని చేయించి వుంటారని కిరణ్ తల్లి అనుమానం వ్యక్తం చేశారు. ఐదో సంతానంలో నాలుగో వాడయిన కిరణ్ సంవత్సరం క్రితం హైదరాబాద్ వెళ్లాడు. బేగంపేటలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కిరణ్ తాతయ్య సైన్యంలో పనిచేసినట్టు తెలిసింది. అయితే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే అతడీ దొంగతనం చేసినట్టు కనబడుతోంది. జనం కోసమే బతకాలనిపిస్తోందని అతడు చెప్పాడు. అదే సమయంలో తక్కువ సమయంలో జనంలో గుర్తింపు పొందాలన్న ఆతృత అతడి మాటల్లో వ్యక్తమయింది. అయితే కిరణ్ మాటల్లో వాస్తమెంత అనేది కనుక్కునే పనిలో పోలీసులున్నారు. -
సంచలనం కోసమే తనిష్క్లో చోరీ చేశా: కిరణ్
హైదరాబాద్: జనంలో కన్పించాలన్న ఉద్దేశంతోనే తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ అనే యువకుడు తెలిపాడు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్‌తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. ఐదు నిమిషాలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపడానికే దొంగతనం చేసినట్టు కిరణ్ తెలిపాడు. దొంగతనానికి, రాజకీయానికి తేడా లేదన్నాడు. తాను ఒక రాత్రి దొంగ అయితే, రాజకీయ నాయకులు ఐదేళ్ల దొంగలని విమర్శించాడు. వ్యవస్థలో మార్పు రావాలని అతడు ఆకాంక్షించారు. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే తనను అవహేళన చేశారని చెప్పాడు. ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఊరిని బాగుచేయాలనుకున్నా అవకాశం ఇవ్వలేదన్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడం, సమాజంలో మంచితనం లేకపోవడం వల్లే దొంతనం చేశానన్నాడు. తన వెనుక ఎవరూ లేరన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. చనిపోయే హక్కు తనకు లేదని విరమించుకున్నట్టు చెప్పాడు. ఏదోక సంచలనం చేసి జనం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో తనిష్క్లో చోరీ చేసినట్టు చెప్పాడు. జనం, రాజకీయం, సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించాడు. తనకు అవకాశమిస్తే వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. ప్రజలను బాగు చేయగలన్న నమ్మకం తనకుందన్నాడు. తనిష్క్ లో తానే చోరీ చేశానని కిరణ్ చెబితే పోలీసులు మొదట నమ్మలేదు. తన గదిలో దాచిన దొంగిలించిన సొమ్మును చూపించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు చెబుతున్న మాటల్లో వాస్తమెంత, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
పంజాగుట్ట తనిష్క్ జ్యువెలర్లో భారీ చోరీ
-
పంజాగుట్ట తనిష్క్ జ్యువెలర్లో భారీ చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉంచిన దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. దుండగులు దుకాణం వెనుక భాగంలో గోడకు కన్నం వేసి ఈ చోరీకి పాల్పడ్డారు. సేప్ లాకర్‌ను పగలగొట్టి బంగారు నగలతో పాటు వెండి వస్తువులను కూడా దొంగిలించారు. ముగ్గురు అగంతకులు మాస్కులు వేసుకుని, సాక్సులు కూడా ధరించి లోపలికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. వాళ్లలో ఒకరు కొంచెం కుంటుకుంటూ లోనికి ప్రవేశించారని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజికి దొరక్కుండా, అలాగే ఫింగర్ ప్రింట్లు కూడా ఎక్కడా పడకుండా వాళ్లు జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది. దాదాపుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్లు లోనికి వెళ్లారంటున్నారు. సాధారణంగా ఇలాంటి చోరీ కేసులలో కంపెనీలో పనిచేసే వ్యక్తులను అనుమానిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా, పరిస్థితిని బట్టి చూసి అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు పక్కాగా స్కెచ్ వేసుకునే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అంటున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎవరో చూసి, వారిని విచారించే పనిలో పోలీసులున్నారు. అర్ధరాత్రి తర్వాత 12-1 గంట ప్రాంతంలో దోపిడీ జరిగితే దొంగలు ఈపాటికే రాష్ట్రం దాటి వెళ్లిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. శనివారం ఉదయం 10.20 గంటలకు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చారా, లేదా ఎలా వచ్చారనేది కూడా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే దుండగులు చోరీకి పాల్పడటం సంచలనం సృష్టించింది. గతంలో పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ బంగారు దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. చోరీ నిందితులను పోలీసులు ముంబాయిలో అదుపులోకి తీసుకున్నారు.