అవాక్కయిన ఈపూరు వాసులు | Epuru Villagers surprise on Tanishq Jwellery Robbery | Sakshi
Sakshi News home page

అవాక్కయిన ఈపూరు వాసులు

Published Mon, Jan 27 2014 9:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

అవాక్కయిన ఈపూరు వాసులు - Sakshi

అవాక్కయిన ఈపూరు వాసులు

ఈపూరు: సంచలనం సృష్టించిన తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం కేసులో కిరణ్ అనే యవకుడు లొంగిపోయాడు. దీంతో కిరణ్ సొంతూరు  గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరులో కలకలం రేగింది. కిరణ్ ఈ దొంగతనం చేశాడంటే ఆ ఊరి జనం నమ్మలేపోతున్నారు. దీని గురించి తెలియగానే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కిరణ్ ఇలాంటి పని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అయితే తన కొడుక్కి ఏమీ తెలియదని, అతడి వెనుక ఎవరోవుండి ఈ పని చేయించి వుంటారని కిరణ్ తల్లి అనుమానం వ్యక్తం చేశారు.

ఐదో సంతానంలో నాలుగో వాడయిన కిరణ్ సంవత్సరం క్రితం హైదరాబాద్ వెళ్లాడు. బేగంపేటలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కిరణ్ తాతయ్య సైన్యంలో పనిచేసినట్టు తెలిసింది. అయితే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే అతడీ దొంగతనం చేసినట్టు కనబడుతోంది. జనం కోసమే బతకాలనిపిస్తోందని అతడు చెప్పాడు. అదే సమయంలో తక్కువ సమయంలో జనంలో గుర్తింపు పొందాలన్న ఆతృత అతడి మాటల్లో వ్యక్తమయింది. అయితే కిరణ్ మాటల్లో వాస్తమెంత అనేది కనుక్కునే పనిలో పోలీసులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement