'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు' | police chase Tanishq jewellery robbery case Mystery | Sakshi
Sakshi News home page

'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు'

Published Mon, Jan 27 2014 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు'

'తనిష్క్లో చోరీకి పాల్పడింది ఇద్దరు'

హైదరాబాద్ : హైదరాబాద్లో కలకలం సృష్టించిన తనిష్క్ జ్యూయలరీ చోరీ కేసు మిస్టరీ వీడింది. చోరీకి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు తేల్చారు. తనిష్క్ జ్యూవెలరీలో తానే దొంగతనానికి పాల్పడినట్లు కిరణ్ అనే యువకుడు గత రాత్రి బంజరాహిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. కిరణ్తో పాటు అతని స్నేహితుడు ఆనంద్కు కూడా చోరీలో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆనంద్ను గుర్తించారు.

కాగా జనంలో కన్పించాలనే ఉద్దేశంతోనే  తనిష్క్  నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ చెప్పిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. మరోవైపు తన కొడుకు దొంగతనం చేశాడని తాము నమ్మడం లేదని కిరణ్‌ తల్లి అంటోంది.  తన కొడుకు ఎంతో మంచివాడని, కష్టపడే తత్వమని ఆమె చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement