
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి రూ.19,000 నుంచి రూ. 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి’ అనేది మిర్చి రైతుల డిమాండ్.
మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..చంద్రబాబు వలనే మిర్చి మద్దతు ధర రూ.11,781 అంటూ రైతులపై ప్రేమను కురిపించే యత్నం చేశారు. ఇదే ఎక్కువ అని, ఇంతకుమించి అనవసరం అన్న రీతిలో లోకేష్ ఏదో బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. అదే మాట గుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా నారా లోకేష్ కు చాలెంజ్ విసిరారు.
చంద్రబాబు వల్లే క్వింట మిర్చి
మద్దతు ధర 11,781 రూపాయలు
అన్న లోకేష్ అదే మాటగుంటూరు
మిర్చి యార్డు ముందు చెప్పగలవా?@naralokesh @ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment