Mirchi Price
-
మిర్చి అ‘ధర’హో !
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధర పరుగులు తీస్తున్నది. మంగళవారం కర్నూలు మార్కెట్‌కు 207 మంది రైతులు 295 క్వింటాళ్ల ఎండుమిర్చి తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.4,119, గరిష్ట ధర రూ.37,112, మోడల్ ధర రూ.18,009గా నమోదు అయ్యింది. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.37,112 ధర లభించడం విశేషం. ఈ నెల 24న మార్కెట్లో గరిష్ట ధర రూ.33,102 లభించింది. మూడు రోజుల్లోనే క్వింటాలుపై రూ.4,010 పెరగడం విశేషం. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.25 లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగయింది. కర్నూలు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ నెల 24న మార్కెట్‌కు 135 క్వింటాళ్లు మాత్రమే రాగా.. ఈ నెల 27న 295 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. -
తాలు’కూ టైమొచ్చింది..
-
ఘాటెక్కిన మిర్చి
దేవరపల్లి: మిర్చి అ‘ధర’హో అనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని ధర పలుకుతోంది. అయితే దిగుబడులు దారుణంగా తగ్గడంతో రైతులు నిట్టూరుస్తు్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండుమిర్చిని సాగుచేస్తున్నా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, కురుకూరు పంట ప్రత్యేకం. ఇక్కడ మిరపకాయలు దేశవాళీ కావడం వల్ల నాణ్యత, రుచి ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చిన పల్లంట్ల మిరపకాయలు కొనుగోలు చేస్తుంటారు. 639 హెక్టార్లలో.. జిల్లాలో 639 హెక్టార్లలో ఎండుమిర్చి సాగు ఉంది. దీనిలో దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, దేవరపల్లి గ్రామాల్లో పండిస్తుండగా పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లోనే సుమారు 150 ఎకరాల్లో పంట ఉంది. గతంలో దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో మిరప సాగు ఉండేది అయితే చీడపీడలు, దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో నాలుగేళ్లుగా రైతులు సాగు తగ్గించారు. సగానికి తగ్గిన దిగుబడి ఈ ఏడాది ఎండుమిర్చి దిగుబడులు దారుణంగా పడిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని అంటున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. దిగుబడులు మరింత తగ్గిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం ధర వీసె (1400 గ్రాములు) రూ.650 నుంచి రూ.700, గుల్లకాయలు రూ.450 నుంచి రూ.500 పలుకుతోంది. తెల్లదోమతో నష్టం ఈ ఏడాది మిరప తోటలకు తెల్లదోమ వ్యాపించింది. కాయ తయారు కాకుండానే పిందె దశలోనే పండిపోయి రాలిపోయిందని రైతులు అంటున్నారు. దీంతో కాపులు లేక తోటలు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర పెరిగే అవకాశాలు నేను మూడు ఎకరాల్లో మిరప పంట వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాను. ఎకరాకు 3 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మూడు ఎకరాల్లో దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీసె ధర రూ.700 ఉంది. వారం రోజుల్లో రూ.1,000 దాటవచ్చు. ఈ ఏడాది మిరప తోటలు నల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో ఎక్కువగా దెబ్బతిన్నాయి. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్ వైరస్ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు ‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’ – వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు -
మిర్చి@రూ.20 వేలు!
ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ‘తేజ’రకం మిర్చి ధర రూ.20 వేలు దాటింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం రూ.20,021 ధర పలికింది. మిర్చి పంట సాగు చరిత్రలో ఈ ధర అత్యధికం. గురువారం మిర్చి ధర రూ.18,600 పలకగా, ఆ ధర రూ.1,400లకు పైగా పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురానికి చెందిన రామా రావుకు చెందిన మిర్చికి వ్యాపారులు ఈ ధర పెట్టారు. ఈ ఏడాది ఆయా దేశాల్లో వర్షాలు, వాతావరణ కారణాలతో మిర్చి పంట ఆశించిన స్థాయిలో లేదని, దీంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. మన దేశంలో కూడా పంట అంత ఆశాజనకంగా లేకపోవడంతో గతేడాది పండిన పంటకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది పండించిన పంట ను వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పెట్టారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11 వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా రికార్డు స్థాయిలో క్వింటా మిర్చి ధర రూ. 19,500 పలికింది. -
మిర్చిః 18వేలు
ఖమ్మం వ్యవసాయం: ‘తేజా’రకం మిర్చి ధర ఆల్‌టైం రికార్డు సాధించింది. మిర్చి సాగు చరిత్రలో ఈ ధర ఎప్పుడూ లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి బుధవారం క్వింటాలు ధర రూ.18,100 పలికింది. ఈ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది జూలై నెల నుంచి ధర పెరుగుతూ వచి్చంది. జూలైలో రూ.11 వేలు ఉన్న ధర.. రూ.18 వేలు దాటింది. మిర్చి పండించే కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల ధర ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కిలో కొత్తిమీర.. రూ.150 విమానంలో తెప్పిస్తున్న వరంగల్ వ్యాపారులు వరంగల్: భారీ వర్షాల కారణంగా కొత్తిమీర పంటలు దెబ్బతినడంతో కిలో కొత్తిమీర బుధవారం వరంగల్‌లో రూ.150 పలికింది. స్థానికంగా కొత్తిమీర పంటలు దెబ్బతినడంతో కూరగాయల వ్యాపారులు బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ కూడా పంటలు పాడైపోవడంతో పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా కొత్తిమీర తీసుకువచ్చి ఇక్కడికి సరఫరా చేసేలా ఆ రాష్ట్రంలోని వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నట్లు వరంగల్‌లోని లక్ష్మీపురం మార్కెట్‌కు చెందిన వ్యాపారులు తెలిపారు. -
మిర్చి ధరపై అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మిర్చి ధర మార్కెట్లో రూ. 12 వేలు పలికింది. ఈ ఏడాది జనవరి 10న రూ. 11,500, ఫిబ్రవరి 6న రూ. 9,100కు చేరింది. ఇలా ఏప్రిల్ 27 నాటికి క్వింటాల్ మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయింది. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతన్నలు అక్కడి వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్వింటాల్ మిర్చి ధర రూ. 4,700 – రూ. 9,600 ఉందంటే రానురాను పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వ్యవసాయ మార్కెటింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లకు మిర్చి పెద్ద ఎత్తున తరలివస్తే, ధరలు మరింత పడిపోవచ్చనే భావన అధికారులను వెంటాడుతోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారుల వద్ద నగదు లేక కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఈ ఖరీఫ్‌లో 1.71 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఈ సారి 87,220 మెట్రిక్ ట న్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య పంట కావడంతో మిర్చికి ఎటువంటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని, ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. నిల్వకు అవకాశం లేక... మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో రైతులు మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక, ఉన్న కొన్ని స్టోరేజీలు వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
‘మిర్చి’ తరుణమొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మంచి తరుణం మించినా రాదు..అన్నట్లు ఇప్పుడు మిర్చి రైతులకు కలిసొచ్చే కాలమొచ్చింది. గతేడాది పండించిన మిర్చికి అప్పుడు క్వింటాకు రూ.4వేలు ఓ దశలో రూ.2వేలు మాత్రమే పలకడంతో..అడ్డికి అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఇప్పుడు రేటు అమాంతం పెరిగి క్వింటా రూ.10వేలకు చేరింది. ప్రస్తుతం ఈఏడాది సాగు చేసిన పంట ఇంకా చేతికి రాలేదు. అయినా..పాత మిర్చికి మాత్రం రేటు బాగా పలుకుతోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పలుకుతుండడంతో..మిరప కొనుగోళ్లకు ఆదరణ పెరిగింది. విదేశాల్లో డిమాండ్.. ఇక్కడ పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో మంచి ధర పడుతోంది. అక్కడ ఈ మిర్చి నుంచి నూనె (ఆయిల్) తీసి ఆహారంగా, ఇతర అవసరాలకు, రసాయనాల్లో వినియోగిస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో తేజా మిర్చి ఆయిల్ కొరత ఏర్పడటంతో ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా మిర్చికి రేటు పెరగడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి రానుండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు, రైతులు విక్రయించేస్తున్నారు. ఇప్పటికే 4 వేల క్వింటాళ్ల వరకు విక్రయించేశారు. ఖమ్మం, మధిర, తల్లాడ తదితర ప్రాంతాల్లో మిర్చి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఏసీ మిర్చితో పాటు, తాలు మిరప బేరం కూడా కొనసాగుతోంది. వ్యాపారులు నేరుగా కోల్డ్ స్టోరేజీలకు వెళ్లి కొంటున్నారు. ఊహించని ధర.. గతేడాది పంట సీజన్లో మిర్చికి రూ.4వేలకు మించి ధర పలకలేదు. ఓ దశలో (ఏప్రిల్ నెల) క్వింటాకు రూ.2వేలు కూడా పడలేదు. 2015–16 సంవత్సరంలో పంటకు రూ. 13 వేల వరకు కూడా ధర పలికింది. దీంతో గతేడాది మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఉత్పత్తి కూడా పెరగడంతో ధర మందగిస్తూ పూర్తిగా పడిపోయింది. కనీసం పంట కోత కూలి ఖర్చులకు కూడా రాలేదు. చేసేది లేక, భవిష్యత్‌పై ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పెద్ద ఎత్తున నిల్వలు పెట్టారు. వాటికి ప్రస్తుతం సీజన్‌తో పోలిస్తే రెట్టింపునకు పైగా రూ.10 వేల వరకు ధర పలుకుతుండడంతో ఆనందంలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 32 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80నుంచి 1.10 లక్షల బస్తాల వరకు నిల్వ సామర్థ్యం ఉంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 32లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండగా, ప్రస్తుతం పంటకు ధర పలుకుతుండటంతో నిల్వలు సగానికి చేరి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా 16 నుంచి 18 లక్షల బస్తాల వరకు స్టోరేజీల్లో నిల్వ ఉండి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు నెల రోజుల్లో ఈ నిల్వలు మొత్తం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. -
మిర్చి ధరపై దాగుడు మూతలా: గండ్ర
సాక్షి, భూపాలపల్లి : గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాల్ మిర్చిని బోనస్‌తో కలిపి రూ.6250 కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించి పది రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం దారుమణమన్నారు. నాఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేపట్టే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. -
మిర్చికి మద్దతు ధర అమలు ఏదీ?
సాక్షి, హైదరాబాద్ : మిర్చి ధరపై కేంద్రం చేసిన ప్రకటన రాష్ట్రంలో ఎక్కడా అమలు జరగడం లేదని, ఈ పంట కొనుగోళ్లపై కేంద్రం షరతులు విధించడం ఏమిటని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా? అని ప్రశ్నించారు.బాబుకు చెందిన హెరిటేజ్ షాపులో 200 గ్రాముల మిర్చి ధర రూ.44లుగా ఉందని ఆ ప్రకారం క్వింటాలు ధర రూ.22 వేలు అవుతుందని చెప్పారు. కానీ మార్కెట్లో రైతులకు ఇస్తున్నది క్వింటాలుకు కేవలం రూ.4 వేలు మాత్రమేనని తెలిపారు. -
మిర్చి@ రూ. 17,500
వరంగల్ సిటీ: మిర్చికి ధర తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మంగళవారం వరంగల్ మార్కెట్లో సింగిల్ పట్టి రకం మిర్చికి రికార్డుస్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 17,500 ధర పలికింది. గతేడాది సింగిల్పట్టి రకం మిర్చికి అత్యధికంగా రూ. 16,500 ధర పలికింది. మంగళ వారం పరకాలకు చెందిన రవీందర్ మొదటిసారి 7 బస్తాల నాణ్యమైన సింగిల్ పట్టి రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. దేశీ రకం మిర్చి కూడా మొదటిసారి క్వింటాల్‌కు రూ.14,500, 13,500 ధర పలికింది. ఇదే దేశీ రకం మిర్చికి గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18,001 రికార్డు ధర పలికింది.