మిర్చికి మద్దతు ధర అమలు ఏదీ?
సాక్షి, హైదరాబాద్ : మిర్చి ధరపై కేంద్రం చేసిన ప్రకటన రాష్ట్రంలో ఎక్కడా అమలు జరగడం లేదని, ఈ పంట కొనుగోళ్లపై కేంద్రం షరతులు విధించడం ఏమిటని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా? అని ప్రశ్నించారు.బాబుకు చెందిన హెరిటేజ్ షాపులో 200 గ్రాముల మిర్చి ధర రూ.44లుగా ఉందని ఆ ప్రకారం క్వింటాలు ధర రూ.22 వేలు అవుతుందని చెప్పారు. కానీ మార్కెట్‌లో రైతులకు ఇస్తున్నది క్వింటాలుకు కేవలం రూ.4 వేలు మాత్రమేనని తెలిపారు.