హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావులు ఆరోపించారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఇసుక అక్రమరవాణాపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మహిళా సంఘాల పేరుతో ఇసుక మాఫియా రూ. వెయ్యి కోట్లు దోచుకుందని వారు విమర్శించారు.
కృష్ణాజిల్లా వనజాక్షిపై దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యలకు రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత సమాధాన మిచ్చారు. ఇసుక్ర అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1200లకు పైగా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే రూ. 4 కోట్ల 64 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే అక్టోబర్ నుంచి ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీతల సుజాత వివరించారు.