సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన పరిపాలనకు స్వీకారం చుట్టారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని ఆయన అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్)
అదే విధంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఏడాదిలో 3 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని ఆమె చెప్పారు. కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ సేవలు వెల కట్టలేనివని మంత్రి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చామని మేకతోటి సుచరిత అన్నారు. (సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’)
ఏడాది పరిపాలనను ప్రజా పరిశీలనలో పెట్టిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పరిపాలనలో రాజకీయాలు ఉండవని సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment