Mekathoti Sucharita
-
అవన్నీ అవాస్తవాలే.. ఆ వార్తలు నమ్మొద్దు: సుచరిత
తాడికొండ: మాజీ సీఎం వైఎస్ జగన్‌తోనే చివరి వరకు తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ తెలిపారు. కొన్ని మీడియా ఛానెళ్లలో తమపై వస్తున్న ఊహాగానాలపై వారు స్పందించారు. అవన్నీ అవాస్తవమన్నారు.గతంలో కూడా తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందని, అప్పుడే తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన మరణానంతరం వైఎస్సార్సీపీలో చేరి నాటి నుంచి నేటి వరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నానని తెలిపారు. -
ఆ ఒక్క అబద్ధం ఆడుంటే జగనన్న 2014 లోనే సీఎం అయ్యేవాడు కానీ..
-
ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది: సుచరిత
సాక్షి, గుంటూరు: పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో తప్పుడు ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, సుచరిత గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారితే నేను ఇంటికే పరిమితమవుతాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాను. ఎక్కడి టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందిస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. సీఎం జగనన్న ప్రభుత్వం అందరికీ విద్య అందిస్తోంది. ప్రజల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉంది. గడప గడపకు వెళ్తే ప్రజలు ఎంతో ఆనందంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే..
పెదనందిపాడు/గుంటూరు రూరల్: ‘నాడు వైఎస్సార్ భిక్షతోనే రాజకీయాల్లోకొచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని నేనే’ అని మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా నాగులపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న ప్రచారాలు అవాస్తవమన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై కొన్ని మీడియా చానళ్లు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించాలని, అలా కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తే ఎలా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారే ఆలోచనే లేదని, దుష్ప్రచారాలను మానుకోవాలంటూ ఆయా చానళ్లకు హితవు పలికారు. ‘మా ప్రతి అడుగూ జగనన్నతోనే’.. వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తున్న జననేత సీఎం జగనన్నతోనే మా ప్రతి అడుగూ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త, ఇన్‌కంటాక్స్ మాజీ కమిషనర్ మేకతోటి దయాసాగర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉన్నానని, దానిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా, ఇతర పద్ధతులు ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీ మారుతున్నారు.. అంటూ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర సర్వీస్‌లో ఉద్యోగిగా పనిచేసిన తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం ఉండే అవకాశాలు లేవన్నారు. -
గౌతమ్‌రెడ్డి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం
-
‘ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’
గుంటూరు: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు. జిన్నా టవర్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. చర్చలకు సహకరించండి’ అని పేర్కొన్నారు. -
మహిళలపై నేరాల్లో.. ఎవరినీ ఉపేక్షించబోం
గుంటూరు రూరల్: విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల చిన్నారి ఘటన చాలా బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలో నిందితుడైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్‌ను వెంటనే అరెస్టు చేశామన్నారు. సీఎం జగన్ పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఏ కేసులో అయినా పారదర్శకంగా విచారణ జరపి, నేరస్తులకు శిక్షపడేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ముఖ్యమంత్రి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. మహిళలపై నేరాల ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. బాలిక బలవన్మరణం కేసులో 54 ఏళ్ల వ్యక్తి ఇలా దారుణంగా ప్రవర్తించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాలిక తన బాధను బయటకు చెప్పుకోలేక ఎంత మనోవేదనకు గురైందో, ఆమె సూసైడ్ నోట్‌ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. బాలిక తన బాధను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే ఈ ప్రభుత్వం దిశ యాప్ తీసుకువచ్చిందని చెప్పారు. ‘దిశ’ యాప్‌ను ఉపయోగించండి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే కనీసం దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. అంతేకానీ.. భయాందోళనకు గురై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్ అఫెండర్స్‌పై నిఘా పెట్టి, వారి కదలికలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వారు, వీరు అనే తేడాలేకుండా, ఏ పార్టీ వారు నేరం చేసినా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. వ్యభిచార ఘటనలో 46 మంది అరెస్టు గుంటూరు జిల్లా మేడికొండూరులో వ్యభిచార ఘటనలో పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపారన్నారు. మొత్తం 46 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి సుచరిత వెల్లడించారు. ఈ కేసులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు ఉన్నాడని టీడీపీ వాళ్లు ఆరోపణలు చేసినప్పటికీ అతనిని కూడా అరెస్టుచేశామన్నారు. చదవండి: టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలి: ఆర్కే రోజా వినోద్ జైన్‌పై కఠిన చర్యలు విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు వినోద్ జైన్‌పై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 354, 354, 354, 509, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నానన్నారు. ఆ ఘటనల్లో ఇప్పటికీ టీడీపీ సమాధానం లేదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షిని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టిన కేసులో ఏం చర్యలు తీసుకున్నారని సుచరిత ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. టీడీపీ హయాంలోనే జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ఏం న్యాయం చేశారంటే టీడీపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదన్నారు. తాజాగా.. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలపై నారా లోకేష్ పీఏ లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనపై కూడా సమాధానంలేదని సుచరిత చెప్పారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? -
రాజకీయ లబ్ధికే టీడీపీ రాద్ధాంతాలు
గుంటూరు రూరల్: రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో బాలిక వ్యభిచారం కేసులో నిందితులందరినీ అరెస్టు చేసిన వారం తర్వాత టీడీపీ మహిళా నాయకులు రాద్ధాంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. సున్నితమైన ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 43 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి వెల్లడించారు. బాధితురాలు ఆరోపించిన వారితో పాటు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు మంత్రి చెప్పారు. ఈ కేసు విషయంలో తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిపైనా ఆరోపణలు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో వారినీ అరెస్టు చేసినట్లు సుచరిత తెలిపారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తుంటే టీడీపీ నేతలు రచ్చచేయడం మంచి పద్ధతి కాదన్నారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడాన్ని కూడా తప్పుబట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన నేరాల విషయంలో చంద్రబాబు ఏ విధంగా స్పందించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబునాయుడే స్వయంగా దళితుల గురించి, ఆడబిడ్డల పుట్టుక గురించి నీచంగా మాట్లాడి ఇప్పటివరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని సుచరిత గుర్తుచేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు సున్నితమైన మహిళల విషయాలను రాజకీయం చేయడం మానుకుని మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, స్వార్థ రాజకీయాల కోసం వారి జీవితాలను రోడ్ల మీదకు లాగడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
Guntur: ఆక్సిజన్ ప్లాంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత
-
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్: హీరో సుమన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్లో మానసిక వికలాంగులు, పేదలకు.. పండ్లు , స్వీట్స్ , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకూ పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు.పెదకూర పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్సార్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అందకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. -
చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు.. 2019లో లేవలేని స్థాయిలో..
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానియా అన్న అంశంపై చర్చ జరగాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తామర పురుగుతో నష్టపోయారు. చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు. 2019లో లేవలేని స్థాయిలో ప్రజలు పురుగు మందు కొట్టారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నాం. సెన్స్ ఉండే చంద్రబాబు మాట్లాడుతున్నారా? బాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి పెట్టారు. తోటలు తగులబెట్టి భూములు లాక్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడుతున్నారు. చంద్రు వాస్తవాలు మాట్లాడితే తప్పుపడుతున్నారు. చదవండి: (మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ..) అచ్చెన్నాయుడు తప్పెటగూళ్లు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారు. ముందు కుప్పం సంగతి చూసుకోండి. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవరు స్పాన్సర్డ్ అనేది అందరికి తెలుసు’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు: హోం మంత్రి ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేకపోతోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019లో అధికారం ఇచ్చారు. సీఎం జగన్‌ను వ్యక్తగతంగా దూషిస్తున్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాలని కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. సామాన్యుడు వెళ్లి రాజధానిలో ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్థలు ఏవిధంగా ఉన్నాయో ఉన్నది ఉన్నట్లు చంద్రు చెప్పారు' అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చదవండి: (ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం) -
సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం
సాక్షి, అమరావతి: శత్రుమూకల నుంచి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు సాయుధ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2021 నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గతంలో వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సైనికుల ఇళ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఇప్పటివరకు 140 మందికి 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసినట్టు చెప్పారు. ఆర్థిక సాయం అందజేత దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన అమర జవాను హవల్దార్ గుర్రాల చంద్రశేఖర్ సతీమణి మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాల కృష్ణసురపతి భార్య దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్ పాండ్రంకి చంద్రరావు సతీమణి సుధారాణి, కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు పొలుకనటి శివగంగాధర్ భార్య రాధిక, గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు ఎం.జస్వంత్ కుమార్‌రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని హోం మంత్రి అందజేశారు. 164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్ బొడ్డేపల్లి రామకృష్ణారావును సత్కరించారు. గత ఏడాది పతాక దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున విరాళాలను సేకరించిన తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్యప్రసాద్ (రిటైర్డ్), కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీఎస్ ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు వీవీ రాజారావు పాల్గొన్నారు. -
పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన భవానీపురం మోడల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు 250 రోజులు తీసుకునేవారని, ఇప్పుడు 42 రోజుల్లోనే సమర్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మహిళల కోసం ఉమెన్ హెల్ప్ డెస్క్.. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళల కోసం ఆయా పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని 14,500 మంది మహిళా పోలీసులు వీటిద్వారా సేవలందిస్తారని సుచరిత తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 98 లక్షల మంది మహిళలు తమ మొబైల్స్‌లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.చిరంజీవిరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల్లో డాడీస్‌రోడ్ యాప్‌తో రక్షణ
గుంటూరు రూరల్: ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ యాప్, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో డాడీస్‌రోడ్ యాప్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. హోంమంత్రి మాట్లాడుతూ ఈ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగినపుడు వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైనా, వైద్య సేవలు, వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసినా అలర్ట్ వస్తుందన్నారు. ఇటువంటి యాప్‌ను తయారు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఈ యాప్ సీఈఎఫ్ అనంతలక్ష్మి తదితరులున్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు
-
'ఏ ల్యాండ్‌మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
-
‘రాజకీయ లబ్ధి కోసం భయానక వాతావరణం సృష్టించారు’
సాక్షి, గుంటూరు: పక్కా ప్లాన్‌తోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పెదనండిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొప్పర్రులో వినాయక నిమజ్జనానికి వైఎస్సార్సీపీ నేతలు సహకరించారని తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్‌పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణ సృష్టించారని దుయ్యబట్టారు. చదవండి: USAID Mission Director Veena Reddy: కోవిడ్ సాయం.. ఐదు కోట్ల మందికి -
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
-
సంక్షేమంతో సమానంగా అభివృద్ధి
పోడూరు(ఆచంట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందన్నారు. తమది మహిళ, రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. ‘దిశ’ యాప్ ద్వారా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి, జుత్తుగ, భట్లమగుటూరు గ్రామాల్లో సుమారు రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం ఆమె ప్రారంభించారు. మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల కల నెరవేరుస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. తొలిదశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలన్నీ సజావుగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. మహిళా సాధికారతతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అభివృద్ధి పథకాల ప్రారంభం.. మల్లిపూడిలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, జుత్తుగలో దాదాపు రూ.1.40 కోట్ల తో నిర్మించిన 5 సీసీ రహదారులను, రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయం పైఅంతస్తు, రూ.13 లక్షల వ్యయంతో నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను మంత్రులు ప్రారంభించారు. భట్లమగుటూరులో రూ.16 లక్షలతో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.47.2 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రహదారులను ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జస్టిస్ రామస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు డి.మహాలక్ష్మి, టి.వీర్రెడ్డి, బి.సుగుణమ్మ, తహసీల్దార్ వై.దుర్గాకిషోర్, ఎంపీడీఓ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
తానేటి వనితకు స్వాగతం పలికిన మంత్రి రంగనాథరాజు
-
రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు సింహ భాగం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాజకీయ పదవుల్లో సైతం తమ వాటా సాధించుకునే స్థాయికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దేలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని పదవుల్లోనూ సగానికి పైగా మహిళలకు అవకాశం కల్పించి మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం చెప్పారని కొనియాడారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శనివారం విజయవాడ ఆర్అండ్బీ కార్యాలయంలో రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్ల నియామక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 నెలల పాలనలో.. మంత్రివర్గ కూర్పు నుంచి కార్పొరేషన్ డైరెక్టర్ల వరకు నిజాయితీ, నిబద్ధతతో సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 47 కార్పొరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటిస్తున్నామన్నారు. వీరిలో 248 మంది డైరెక్టర్ల (52 శాతం) పదవులను మహిళలకే ఇచ్చి అగ్రపీఠం వేశామని చెప్పారు. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పురుషులకు 233 డైరెక్టర్ల (48 శాతం) పదవులు ఇచ్చామని, మొత్తం డైరెక్టర్లలో 58 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వగా.. 42 శాతం పదవులు ఓసీలకు ఇచ్చామని వివరించారు. వైఎస్సార్సీపీ హయాంలో సామాజిక న్యాయం వైఎస్ జగన్ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అని, అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే అని చెప్పారు. రేపు రాబోయే మండలి అధ్యక్షుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉండే వీలుందన్నారు. ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో చెప్పిన దానికంటే మిన్నగా ఇస్తున్నారని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల్లో 83 శాతం ఆ వర్గాలకు చెందిన వారున్నారని, ఆ వర్గాలలో ఒక విశ్వాసం పాదుకొల్పేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ల పదవులు, 137 నామినేటెడ్ పోస్టుల్లో సగానికి పైగా పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చామని చెప్పారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే, వారిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారున్నారని వివరించారు. మాట నిలబెట్టుకున్నాం సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వెతికి మరీ అభ్యర్థులను ఎంపిక చేశామని సజ్జల తెలిపారు. కొన్ని కులాల్లో అలా వెతకాల్సి వచ్చిందని, ఇందుకోసం భారీ కసరత్తు చేశామని చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి కార్పొరేషన్లో మహిళలకు సగానికి పైగా పదవులు ఇచ్చామన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఒక వర్గం మీడియా అనవసర రాద్ధాంతం చేసే వీలుంది కాబట్టి, అన్నీ స్పష్టంగా చెబుతున్నామని తెలిపారు. 2014–19 మధ్య టీడీపీ కేవలం మాటలే చెప్పిందని.. బీసీ, ఎస్సీలను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ఒక నాయకుడికైతే పదవి ఇచ్చామని చెబితే, ఆయన కారులో బయలుదేరితే, మధ్యలోనే మొండిచేయి చూపారని గుర్తు చేశారు. ఇది బీసీల ప్రభుత్వం: మంత్రి చెల్లుబోయిన చంద్రబాబు ఎప్పుడూ బీసీల తోకలు కత్తిరిస్తానని, తోలు తీస్తానని చులకనగా చూసేవారని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల్లో సామాజిక న్యాయం చూపిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎంకు సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఏది చేయగలమో అదే చెప్పాలని, చెప్పింది చేయాలని ఆచరించి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ దేశానికి ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈరోజు ఒక భరోసా లభించిందని చెప్పారు. ఈ వర్గాలకు వివిధ పథకాల ద్వారా రూ.లక్షా 40 వేల 438 కోట్ల మేర లబ్ధి కలిగిందన్నారు. ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ కోరుకున్న పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తారన్నారు. సీఎం మహిళా పక్షపాతి : హోం మంత్రి సుచరిత సీఎం జగన్ మహిళా పక్షపాతి అని డైరెక్టర్ పదవుల కేటాయింపు ద్వారా మరోసారి నిరూపించారని హోం మంత్రి సుచరిత అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అణచివేతకు గురయ్యారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఆ వర్గాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళలను రాజకీయంగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా, వారు ఎదిగేలా ప్రోత్సాహిస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా మహిళల పేరు మీద ఒక తోబుట్టువులా స్థిరాస్తి కల్పిస్తున్నారని, తద్వారా మహిళా లోకం ఆయన్ను అన్నగా భావిస్తోందని తెలిపారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
-
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
-
రమ్య కుటుంబానికి ఇంటి పట్టా
సాక్షి, గుంటూరు : ప్రేమోన్మాది చేతిలో ఇటీవల హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను అందజేసింది. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శుక్రవారం వెళ్లి ఇంటి నివేశన స్థలం పట్టాను అందజేసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో అండగా నిలిచారని చెప్పారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. ఏటుకూరులో ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు రమ్య సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే యువతులు, మహిళలు వెంటనే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, షేక్ మహ్మద్ ముస్తఫా, మద్దాల గిరిధర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము, తదితరులు పాల్గొన్నారు. చదవండి : అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం : సీఎం జగన్ -
రమ్య హత్య ఘటన చాలా బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: జీజీహెచ్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. తర్వాత మంత్రి సుచరిత.. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని, మహిళను హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, రమ్య హత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారని తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరి వేయాలని అందరూ అంటున్నారని, కచ్చితంగా అలాంటి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తాం: వాసిరెడ్డి పద్మ బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని, నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.