
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిని గుంటూరు పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ సబ్‌డివిజన్ డీఎస్పీ జె.కులశేఖర్ తెలిపిన మేరకు.. రామ్‌మహారాజ్ అనే ఫేస్‌బుక్ అకౌంట్‌తో హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టింగ్‌లు వచ్చాయి. పోస్టింగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దారం అశోక్‌కుమార్ పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ కులశేఖర్ విశాఖ జిల్లా రోగుగుంట మండలం ఎం.కొత్తపట్నంకు చెందిన సర్వశుద్ధి రాము ఆ పోస్టింగ్‌లు పెట్టినట్లు దర్యాప్తులో ధృవీకరించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్‌లతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment