
( ఫైల్ ఫోటో )
సాక్షి, గుంటూరు: పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో తప్పుడు ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు.
కాగా, సుచరిత గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారితే నేను ఇంటికే పరిమితమవుతాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటాను. ఎక్కడి టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు.
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందిస్తున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. సీఎం జగనన్న ప్రభుత్వం అందరికీ విద్య అందిస్తోంది. ప్రజల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉంది. గడప గడపకు వెళ్తే ప్రజలు ఎంతో ఆనందంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment