
డాడీస్‌రోడ్ యాప్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను ఆవిష్కరిస్తున్న హోం మంత్రి సుచరిత
గుంటూరు రూరల్: ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ యాప్, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో డాడీస్‌రోడ్ యాప్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
హోంమంత్రి మాట్లాడుతూ ఈ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగినపుడు వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైనా, వైద్య సేవలు, వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసినా అలర్ట్ వస్తుందన్నారు. ఇటువంటి యాప్‌ను తయారు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఈ యాప్ సీఈఎఫ్ అనంతలక్ష్మి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment