సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలక మండలిలో 50 శాతానికి పైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘బీసీ కార్పొరేషన్లో 50 శాతం పైగా చైర్మన్లు, డైరెక్టర్లగా మహిళలకే అవకాశం కల్పించారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మహిళలందరూ సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి కావాలని సుచరిత పిలుపునిచ్చారు. (చదవండి: మహిళలపై మమకారం)
ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు..
‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కనగాలలో పాదయాత్ర నిర్వహించారు. దుర్గిలో ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పెదకూరపాడు మండలం కొర్రపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. యడ్లపాడు మండలం మైదవోలులో ఎమ్మెల్యే విడదల రజిని.. ఫిరంగిపురంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. ఈపూరు మండలం కొండ్రముట్లలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment