bike rally
-
బాబూ.. విద్యుత్ బాదుడు ఆపండి
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు. -
పోలీసులు ఇలా.. వాహనదారులు అలా..!
ప్రయాణాల్లో హెల్మెట్ తప్పకుండా ధరించాలంటూ నెల్లూరులో (Nellore) పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తుండగా.. ప్రజలు మాత్రం ఇవేమీ తమకు పట్టవంటూ ర్యాలీ పక్కనుండే హెల్మెట్ (Helmet) లేకుండా ఇలా ప్రయాణిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుఅనంతపురంలో సూర్యోదయం (Sun Rise) వేళ ప్రకృతి తన సుందర రూపాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా సర్పం ఆకారంలో ఉన్న మేఘం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్‌ఫోన్‌ల్లో చిత్రీకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం విశాఖపట్నంలో 27వ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కాలేజీల క్రీడలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి ఇలా హైజంప్ (High Jump) చేస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కొన్నేళ్లుగా తమ కాలనీలోనే ఉంటున్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను తమకు దూరంలోని మోడల్ పాఠశాలకు తరలిస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం చుంచులూరు ఎస్సీ కాలనీ వాసులు ధర్నా. అనంతరం ఆత్మకూరు వెళ్లి ఆర్డీవో పావనికి వినతిపత్రం సమర్పించారు.పాఠశాలలో అక్షర జ్ఞాపకాల దొంతరలతో తడవాల్సిన బాల్యం పొట్ట చేతబట్టుకుని బతుకు జీవుడా అంటూ మండే ఎండలో స్వేదంతో తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం బడి బయట ఉన్న బడి ఈడు చిన్నారులను పాఠశాల బాట పట్టించడంలో విఫలమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు–చినకోండ్రుపాడు, నిమ్మగడ్డవారిపాలెం మార్గాల్లో చిన్నారులు ఇలా మేకలు కాసుకుంటూ కనిపించారు.శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని టేకుమంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జేజేలు పలికారు. జయహో ఇస్రో, జయహో భారత్ అంటూ పాఠశాలకు చెందిన కలాం సైన్స్ క్లబ్ నినాదాలు చేసింది. ‘ఇస్రో 100’ అనే అక్షర ప్రదర్శన నిర్వహించి జేజేలు పలికారు. -
కోస్ట్‌గార్డ్ రైజింగ్ డే బైక్ ర్యాలీ ప్రారంభం
సింథియా: ఇండియన్ కోస్ట్‌గార్డ్ 49వ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్ ర్యాలీని కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్‌గార్డ్ కమాండర్ జెండా ఊపి ప్రారంభించారు.49 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బందితో ఈ బైక్ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్ మెరైన్ బీచ్ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్‌లను సందర్శించి రైజింగ్ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్ ర్యాలీని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. -
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం
-
బద్వేలులో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
బైక్ ర్యాలీతో సీఎం జగన్ కు ఘన స్వాగతం...
-
పుప్పాల వాసుబాబు భారీ బైక్ ర్యాలి
-
భీమిలిలో వైఎస్సార్సీపీ నాయకుల భారీ బైక్ ర్యాలీ..
-
కొడాలి నాని బైక్ ర్యాలీ.. జై బీమ్...!
-
అంబటి రాయుడు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు
-
అభిమానుల ‘ఆత్మీయ’ వరద
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూసినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్‌లతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభిమాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం జగన్ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం జగన్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసేవారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్ తన కేబినెట్లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, తొగురు ఆర్థర్, కర్నూలు మేయర్ రామయ్య పాల్గొన్నారు. -
ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోండి
కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్ఎస్ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్ఎస్కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు. ముషీరాబాద్ బాధ్యత నాదే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజవర్గ కన్వి నర్ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు
సాక్షి, భూపాలపల్లి: కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. చదవండి: కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్ -
రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ
-
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
పవన్‌పై అనకాపల్లివాసుల అసహనం
సాక్షి, విశాఖపట్నం: ‘‘జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పర్యటనతో ఏం సాధిస్తున్నారు?. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం తప్పించి!’’ అనే విమర్శే వినిపిస్తోంది ప్రత్యర్థుల నుంచి. ఈ క్రమంలో.. స్థానికులు సైతం పవన్, జనసైనికుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడడం తప్పించి.. రూల్స్ ఫాలో అయ్యేది లేదు.. ఓ క్రమశిక్షణా లేదు.. జనసైనికులతో కలిసి తన పర్యటనతో పవన్ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాజాగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి హైవేకు ఇరువైపులా బైక్ ర్యాలీతో పవన్ దూసుకుపోగా.. ఆ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మొన్న రుషికొండ పర్యటన సందర్భంగా హడావిడి చేసిన పవన్.. ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా అభిమానులు గుమిగూడేందుకు కారణం అయ్యాడు. పైగా సాయంత్రం సమయం కావడంతో జనాలు ట్రాఫిక్ రద్దీతో బాగా ఇబ్బంది పడ్డారు. ఇదీ చదవండి: గొడవలు చేయడానికే పవన్ రుషికొండ వెళ్లింది! -
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
-
విశాఖ తూర్పు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ
-
Ananthapur: టవర్‌క్లాక్ బ్రిడ్జిపై రాకపోకలు షురూ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురానికి మణిహారమైన టవర్‌క్లాక్ బ్రిడ్జిపై సోమవారం రాకపోకలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. బళ్లారి బైపాస్‌లోని ఎంజీ పెట్రోల్ బంక్ నుంచి బ్రిడ్జి మీదుగా టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్‌బ్రిడ్జ్, గాంధీ బజార్, శ్రీకంఠం సర్కిల్, రైల్వే ఫీడర్ రోడ్డు, ఆర్ట్స్ కళాశాల వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ‘అనంత’ పార్టీ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్యే అనంతను పార్టీ కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. జై జగన్.. జై అనంత అంటూ నినదించారు. నూతన బ్రిడ్జిని తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో టవర్‌క్లాక్ – పీటీసీ వరకు పండుగ వాతావరణం కనిపించింది. ‘అనంత’లో రూ.650 కోట్ల అభివృద్ధి కోవిడ్‌తో ఏడాదిన్నర కాలం గడిచిపోయినా...మిగతా రెండున్నరేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చిన ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి అర్బన్ లింక్ ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణతో పాటు టవర్‌క్లాక్ బ్రిడ్జిని కూల్చి.. దాని స్థానంలో కొత్తగా నాలుగు వరసలతో బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం సప్తగిరి సర్కిల్, శాంతి థియేటర్ వద్ద పనులు, బ్రిడ్జ్ కింద అండర్ పాస్ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.రూ.311.93 కోట్లతో నిర్మించిన టవర్‌క్లాక్ బ్రిడ్జ్, ఫోర్‌వేను సీఎం జగన్, కేంద్ర మంత్రులు త్వరలో అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతవరకు ఇలాగే ఉంటే ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారని భావించి ముందస్తుగా బ్రిడ్జిపై రాకపోకలు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 నెలల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారని, ఎస్ఆర్సీ, ఎన్‌హెచ్, ఆర్అండ్బీ, నగరపాలక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. -
మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి
తణుకు అర్బన్(ప.గో. జిల్లా): 2024 ఎన్నికల్లో మళ్లీ జగనన్న ప్రభుత్వమే విజయం సాధించాలనే లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగుడు మాడెం అప్పారావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామానికి చెందిన అప్పారావు ఈనెల 4న ఇచ్చాపురం నుంచి విజయవాడకు బైక్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం తణుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన బైక్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆర్థికసాయం అందచేశారు. కార్యక్రమంలో కె.ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, వైఎస్సార్సీపీ పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. -
సంగారెడ్డి: టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో బాణాసంచా పేల్చారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే బాణాసంచా ఉన్న ఆటోకి మంటలు అంటుకుని.. భారీ శబ్ధాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, మంటలు అంటుకుని ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ఫ గాయంతో ఆయన బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లకు చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: అలా కాదు.. ఇలా ఉంటాడు.. -
విశాఖ రాజధాని కోసం నినదించిన విద్యార్థి లోకం
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. -
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
21 నుంచి ‘పల్లెగోస– బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ‘ప్రజాసంగ్రామయాత్ర’, పదిరోజులు ‘పల్లె గోస– బీజేపీ భరోసా’పేరిట బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈవిధంగా పాదయాత్ర, బైక్‌ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి ఒక క్రమపద్ధతిలో కొనసాగిస్తూ అసెంబ్లీ ఎన్నికల దాకా నిరంతరం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న బైక్‌ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్ నేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు. తొలివిడత బైక్‌ర్యాలీ ముగిసిన తర్వాత, ఆగస్టు 2 నుంచి సంజయ్ పాదయాత్ర–3 మొదలుకానుంది. ఇరవై రోజుల తర్వాత ఈ దశ పాదయాత్ర ముగియగానే రెండోవిడత బైక్‌ర్యాలీ... ఇలా వరసగా ఇవి సాగేటట్లు, వీటికి సమాంతరంగా పార్టీపరంగా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించేటట్లు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. సంజయ్,æ బైక్‌ర్యాలీలో పాల్గొంటున్న నేతలతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బైక్‌ర్యాలీ ప్రారంభకార్యక్రమాల్లో సంజయ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
-
కార్యకర్తలతో కలిసి బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
Maratha Reservation: ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా
సాక్షి ముంబై: రిజర్వేషన్ కోసం మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ముంబైలో బైక్ ర్యాలీ జరిగింది. వందాలది బైక్‌లతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠా సమాజం ప్రజలు పాల్గొన్నారు. యువకులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రారంభం నుంచి చివరి వరకు ‘ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా..’, ‘జై శివాజీ... జై భవానీ’, ‘హరహర మహదేవ్’ తదితర నినాదాలతో సాగింది. దీంతో పరిసరాలన్ని మారుమ్రోగాయి. ముంబై సైన్‌లోని సోమయ్య మైదానం నుంచి ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ర్యాలీ సైన్, మాటుంగా, దాదర్, పరెల్, భైకల్లాల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి, యువకులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. వివిధ రకాల బైక్‌లపై వందలాది మంది నినాదాలు చేస్తు మందుకు సాగారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని తలపై తెల్ల టోపీలు ధరించారు. ఇలా ప్రత్యేక వేషాధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మరాఠా సమాజం నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు ఆశీష్ శెలార్, ప్రవీణ్ దరేకర్‌లతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ర్యాలీగా వెళుతున్న మరాఠాలు సహనాన్ని పరీక్షించొద్దు.. మరాఠా సమాజానికి రిజర్వేషన్ తొందరగా ఇవ్వాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి సంఘర్స్ మోర్చా కన్వీనర్ రాజన్ శివసంగ్రామ్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వినాయక్ రావ్ మెటే హెచ్చరించారు. సీఎస్ఎంటి వద్ద ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. తొందర్లో ఈ అంశంపై నిర్ణయం వెలువడకపోతే ముంబైలో లక్ష మందితో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చా బైక్ ర్యాలీ కారణంగా సైన్– భైకళా–సీఎస్ఎంటీ ప్రధాన మార్గంపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో ముఖ్యంగా అంబేడ్కర్ నగర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన ర్యాలీలో సీఎస్ఎంటీ వద్ద శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు ఈ ర్యాలీని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును మోహరించారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేసింది. మే 5న రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రగడ మొదలైంది. కాగా, ఇప్పటివరకు జరిగిన ఎలాంటి నియామకాలకైనా ఈ ఉత్తర్వులు అడ్డుకోలేవని తెలిపింది. దీంతో కోటాను రద్దు చేయడానికి ముందే ఎంపీఎస్సీ పరీక్షలకు హాజరైన 2,200 మంది మరాఠా అభ్యర్థులను ఆర్థికంగా బలహీనమైన విభాగంలో లేదా ఓపెన్ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సేవా కమిషన్‌ను కోరింది. కాగా, గతంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి (లిమిట్)ను ఎత్తివేయాలని ప్రధానితో డిమాండ్ చేసినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా? -
స్టీల్ ప్లాంట్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం.. జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు రామారావు, ఆదినారాయణరావు, వెంకట్రావు, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం) సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎంవీవీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌లో రూ.4900 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను లోక్‌సభలో అడ్డుకుంటామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.(చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్) లోక్‌సభలో పోరాడతాం: ఎంపీ సత్యవతి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు లోక్‌సభలో పోరాడతామని ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను పోరాటాలతో సాధించుకున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్లను కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆర్జించి పెట్టిందన్నారు.ప్రైడ్ ఆఫ్ ఏపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటామని ఎంపీ సత్యవతి స్పష్టం చేశారు. -
విశాఖ ఘటన అమానుషం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: విశాఖ ఘటన అమానుషమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. (చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక) మహిళా మార్చ్‌లో భాగంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆమె చెప్పారు. రానున్న వంద రోజుల్లో ఇరవై అంశాలపైన మహిళా కమిషన్ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వంద రోజుల్లో జిల్లా, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ‘దిశ’ సెక్షన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 8న విజయవాడలో రెండు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. దిశ బిల్లును అమలులోకి తీసుకువచ్చి.. పది రోజుల్లోనే శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ') -
జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘30 యాక్ట్’ అమల్లో ఉన్నా.. జేసీ పవన్ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు జీపులపై ఎక్కి జేసీ వర్గీయుల హంగామా సృష్టించారు. నిబంధనలను పాటించని జేసీ పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి) శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. 30 యాక్ట్ అమలులో ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన కానీ జేసీ పవన్ పెడ చెవిన పెట్టారు. గతంలో కూడా కడపలో ఆయనపై నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదయిన విషయం తెలిసిందే. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు గతంలో ఆయనపై నమోదయ్యాయి. (చదవండి: ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..) చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం: డీఎస్పీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 15 మందిని అరెస్ట్ చేశామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని, కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు. -
కార్మికుల ఆధ్వర్యంలో..ఈనెల 15న బైక్ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని వైయస్సార్ టియుసీ రాష్ట్ర్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 18 వేలు వేతనం ఇస్తామని అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గౌతంరెడ్డి పేర్కొన్నారు. (నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం) విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టిడిపి నాయకులకు గౌతమ్ రెడ్డి సవాలు విసిరారు. ఐటి హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హాకర్స్ కు పదివేలు ఇవ్వడం కూడా పాదయాత్ర ఫలితమేనన్నారు. ఇప్పుడు కార్మికలు జయహో జగన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. (‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట) -
ఆ ఘనత సీఎం జగన్‌దే: సుచరిత
-
ఆ ఘనత సీఎం జగన్‌దే: సుచరిత
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలక మండలిలో 50 శాతానికి పైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘బీసీ కార్పొరేషన్లో 50 శాతం పైగా చైర్మన్లు, డైరెక్టర్లగా మహిళలకే అవకాశం కల్పించారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మహిళలందరూ సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి కావాలని సుచరిత పిలుపునిచ్చారు. (చదవండి: మహిళలపై మమకారం) ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు.. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కనగాలలో పాదయాత్ర నిర్వహించారు. దుర్గిలో ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పెదకూరపాడు మండలం కొర్రపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. యడ్లపాడు మండలం మైదవోలులో ఎమ్మెల్యే విడదల రజిని.. ఫిరంగిపురంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. ఈపూరు మండలం కొండ్రముట్లలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రలు నిర్వహించారు. -
మూడు రాజధానులే ముద్దు
-
శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!
సాక్షి, విజయవాడ: పెద్దల సభలో పెద్ద మనసుతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పైశాచిక ఆనందం, వికృత చేష్టలతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాసన సభ, శాసన మండలి సాక్షిగా టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్సీపీ సిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి థియేటర్ నుంచి సితార్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ విధానాన్ని, తన బినామీలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏను చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మార్చేశారని విమర్శించారు. బాబు విధానాలతో టీడీపీ తర్వాతి ఎన్నికల్లో 23 సీట్ల నుంచి సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని జోస్యం పలికారు. సామాన్యుడికి వాటితో పనిలేదు సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, హైదరాబాద్ తరహాలో పొరపాటు జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సామాన్యుడికి ఐకానిక్ టవర్స్‌తో, రాజధానితో పనిలేదని, సంక్షేమ ఫలాలు అందాలని మాత్రమే కోరుకుంటారని పేర్కొన్నారు. అమరావతిలోనే లక్ష కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక సీఎం జగన్ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చదవండి: అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్ -
సీఎం నాయకత్వం వర్థిల్లాలి
-
అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ
సాక్షి, అనంతపురం: మూడు రాజధానులు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా అనంతపురంలో యువకులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీని అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి సోదరుడు ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనంతచంద్రారెడ్డి ప్రారంభించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
ఎగ్జిక్యూటివ్ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల భారీ ర్యాలీ
-
కుప్పంలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
-
‘కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ జెండానే’
కుప్పం: రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనతో విసిగిపోయి కుప్పం ప్రజలు సైతం మార్పును కోరుతున్నారని.. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ భారీఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి కుప్పానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ప్రసంగించారు. చరిత్రలో ఊహించని విధంగా కుప్పంలో జరిగిన ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావడం హర్షణీయమన్నారు. పట్టణంలో బయల్దేరిన ర్యాలీ వంద పడకల ఆస్పత్రి నుంచి కుప్పం బస్టాండు వరకు వాహనచోదకులతో నిండిపోయిందని ఆయ న తెలిపారు. స్థానికులు మార్పును ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో.. ఈ ర్యాలీ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుప్పంలో ఈ సారి వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందన్నారు. మండల కేంద్రంలో జరిగే పార్టీ సమావేశాల్లో ప్రతి ఒక్కరికీ తన మనసులో మాటను తెలియజేస్తానని, ప్రస్తుతం ర్యాలీకి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పం నుంచే మరో చరిత్రను సృష్టించేందుకు వైఎస్సార్సీపీ బలంగా సిద్ధం అవుతోందని స్పష్టం చేశారు. -
ఎన్నికల ర్యాలీకి ఏకంగా ఆర్మీ డ్రెస్‌లో..!
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి మిలిటరీ దుస్తులు ధరించి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన మనోజ్ తీవారి జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్‌ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారు‘ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇచ్చారు. ‘మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్లో ఎదురుప్రశ్నించారు. -
ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ బైక్ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకున్నారంటూ.. అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ.. విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి సహా 10మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న పక్షపాతపూరితమైన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులను బనాయించడాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. -
కడుపు కాలి రోడ్డున పడ్డాం
కడప రూరల్ : తమకు ఉద్యోగ భద్రత లభించే వర కు ఉద్యమం ఆగదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ వెలుగు ఉద్యోగుల జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలి నుంచి దాదాపు 200 మంది సిబ్బంది కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా యాని మేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, ఆ జేఏసీ సభ్యులు గూగూడు, నరసింహులు, నీలకంఠారెడ్డి, సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగు సంస్ధలో కష్టించి పనిచేస్తున్నా తమకు ఇంతవరకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తమ కడుపులు కాలి రోడ్డు మీదకు వచ్చామన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని చెప్పి, మోసగించారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత లభించే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సుబ్బనాయుడు, అనంతయ్య, రామాంజనేయులు, అపర్ణ, సురేష్, రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం రాష్ట్ర ప్రభుత్వం వెలుగు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సభ్యులతో బుధవారం విజయవాడలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముందు మీరు సమ్మె ను విరమించండి, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని సెర్ఫ్ సీఈఓ తెలిపారు. అందుకు ఆ జేఏసీ సభ్యులు తమకు ఉద్యోగ భధ్రత లభించే వరకు సమ్మెను విరమించమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విరమించమని ఉద్యోగులను బెదిరిస్తోంది, ఆ మేరకు దిగువస్థాయి కేడర్‌ను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆ జేఏసీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె మరింతకాలం కొనసాగనుంది. ఫలి తంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్ధలో అమలవుతున్న దాదాపు 17కు పైగా పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడనుంది. -
నా బిడ్డను పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు
సాక్షి, రాజమహేంద్రవరం: అభిమానులు నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు వాపోయారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట. గత నెల 9న దేవరపల్లిలో పవన్ అభిమానుల బైక్ ర్యాలీలో పాల్గొన్న నా కుమారుడు రాజ మనోహర్‌ను బైక్ ఢీ కొట్టింది. మరో బైక్ అతనిపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్‌ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీని తొలగించి ప్రాణాలు కాపాడగలిగారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్‌కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా. దాతలు.. ‘మొల్ల వీరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నంబర్ 078910100059571, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ0000789’ ద్వారా సహాయం చేయొచ్చు. -
ధైర్యం చెబుతూ.. స్ఫూర్తి నింపుతూ...
సాక్షి సిటీ బ్యూరో: హైదరాబాద్ బైకర్నీ గ్రూప్.. 2013లో ప్రారంభమైన ఈ గ్రూప్ ఎన్నో సాహసోపేతమైన బైక్ యాత్రలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కర్దుంగ్లా యాత్రతో పాటు, 56 రోజుల పాటు 17వేల కిలోమీటర్ల మీకాంగ్ యాత్ర ఇలా అనేక సాహస బైక్ యాత్రలు ఈ గ్రూప్ తన ఖాతాలో జమ చేసుకుంది. తమ బైక్ యాత్రల ద్వారా అనేక మంది స్త్రీలలో ధైర్యం, స్ఫూర్తి నింపుతున్న ఈ గ్రూప్ ఈ బతుకమ్మ పండుగకు ఒక వినూత్న రైడ్ చేపట్టనుంది. జయభారతి నేతృత్వంలో 9 మందితో కూడిన బైకర్నీల బృందం 9వ తేదీన హైదరాబాద్ నుంచి తమ యాత్ర ప్రారంభించనుంది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొననుంది. సంబరాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీల భద్రత, సాధికారికతపై రోడ్ షోలు చేపట్టి వారితో ముచ్చటించనుంది. ఈ రైడ్‌లో మరింత ఆసక్తికర అంశం, వీరంతా తెలంగాణా చేనేత దుస్తులను ధరించి ఈ రైడ్ నిర్వహిస్తున్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో నిర్వహించే ఈవెంట్లలో బైకర్నీలు పాల్గొంటారు. చైతన్యపరుస్తాం నాతో పాటు ఈ రైడ్‌లో శాంతి, సురేఖ, కాత్యాయినీ, సత్యవేణి, హంస, కవిత, సుష్మ, పూర్ణిమ ఉంటారు.సాయంత్రానికి మేం చేరుకున్న జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంకోచం లేకుండా షీ టీమ్స్‌ని సంప్రదించ వచ్చని వారి సేవలు ఎలా పొందవచ్చనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రోడ్, బైక్ ద్వారా ట్రావెల్ చెయ్యడానికి సురక్షితమైంది అందుకు మా యాత్రలే ఉదాహరణ. అలాగే చేనేత వస్త్రాలు రోజువారిగా వాడుకలో భాగం చెయ్యాలని చెప్తాం. చివరి రోజు హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తాం. – జయభారతి -
విజయనగరంలో పాదయాత్రకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
-
బైక్ ర్యాలీలో అపశ్రుతి.. హరీష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అతి సమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో బైక్‌లను వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీష్ రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్మెన్లు ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
ఆ బాట.. జనం భావి భాగ్యరేఖ..
అచ్చం అలనాడు.. పెద్దాయన వైఎస్సార్‌పై కురిపించినట్టే.. ఇప్పుడు ఆయన తనయుడిపైనా మమతాభిమానాల జడివాన కురిపిస్తున్నారు జనం. అప్పుడాయన అడుగుల్లో తమ రేపటి అభ్యుదయం జాడను చూసుకున్నట్టే ఇప్పుడు జననేత నడిచిన బాటలో తమ భావిభాగ్యాన్ని చూసుకుంటున్నారు. ఆ జనం చూపే ప్రేమాదరాలతో.. వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా నడుస్తున్నారు జగన్. జనం బతుకులోని వెతలు, గతుకులను అధ్యయనం చేస్తూ, కమ్ముకున్న చీకటిలో పొడిచిన పొద్దులా వారి కళ్లలో కొత్త వెలుగులు నింపుతూ ఆయన సాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం విజయగనరం జిల్లా కొత్తవలసలో 3,000 కిలోమీటర్ల మజిలీని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జిల్లాలో పలుచోట్ల పార్టీ శ్రేణులు వేడుక జరిపాయి. తూర్పుగోదావరి, కాకినాడ: ప్రజాసంకల్ప యాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. అనేక నియోజకవర్గాల్లో పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి సందడి చేశారు. దేశంలో మునుపెన్నడూ ఏ నాయకుడూ చేయని రీతిలో సుదీర్ఘ యాత్రలో అలుపెరగని పథికునిగా ప్రజలతో మమేకమవుతూ జననేత జగన్ సాగిస్తున్న పాదయాత్ర మూడువేల కిలోమీటర్లకు చేరిన సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. తమ అభిమాన నేత యాత్ర మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తూ సంబరాలు జరుపుకొన్నారు. దేశంలోనే చారిత్రక ఘట్టం : బోస్ ∙రాజోలు నియోజకవర్గం మలికిపురంలో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి కావడం దేశ చరిత్రలోనే చారిత్రక ఘట్టమన్నారు. అమలాపురంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ కేక్ కట్ చేశారు. కాకినాడ సిటీలో కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 44వ డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్ చేశారు. నగరాధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కట్ చేశారు. అన్నవరంలో జరిగిన వేడుకల్లో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాజీవ్శర్మగుప్త సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు జగన్ ఫొటోతో, వైఎస్సార్ గుర్తులతో ఉన్న నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు కేక్ కట్ చేశారు. పెద్దాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు భారీ కట్ చేశారు. శివాలయంలో పూజలు చేశారు. సామర్లకోటలో పార్టీ నాయకుడు దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సిరిమానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. జగ్గంపేట పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు కేక్ కట్ చేశారు. స్థానికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. రాజమహేంద్రవరం రూరల్‌లో సర్వమత ప్రార్థనలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో, అనంతరం చర్చి, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజవోలులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు ఆధ్వర్యంలో ఆకుల వీర్రాజు కేక్‌కట్ చేశారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంకలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు స్వీట్లు పంచారు. తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చిన్నదొడ్డిగుంటలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్త ల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంచారు. -
హరితహారానికి మద్దతుగా బైక్ ర్యాలీ
-
బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్
శాయంపేట: బైక్ అదుపుతప్పి స్పీకర్ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్‌ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్ స్కిడ్ అయి అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్‌ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్ బైక్‌పై ర్యాలీ కొనసాగించారు. -
రేపు ఏపీ బంద్‌కు మద్ధతుగా వైఎస్సార్సీపీ నేతలు బైక్ ర్యాలీ
-
ప్రజలతో మమేకమై...
సాక్షి, అగనంపూడి (గాజువాక) : జీవీఎంసీ 55వ వార్డు పెదగంట్యాడ మండల శివారు గ్రామాల్లో రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీగా వెళ్లి గ్రా మాల్లోని పెద్దలు, మహిళలు, గ్రామ నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హా మీ ఇచ్చారు. మెడ్‌టెక్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన పర్యటన మదీనాబాగ్, ఇస్లామ్పే ట, పెదపాలెం, చినపాలెం, పిట్టవానిపాలెం, మరడదాసుడుపేట, దేవాడ, ఒనుముదొడ్డి, యల మంచిలిదొడ్డి, నమ్మిదొడ్డి, ఈసరవానిపాలెం, గొరుసువాని పాలెం, భూసదొడ్డి, పాలవలస, మురిభాయి, చేపలపాలెం (అప్పికొండ) సోమేశ్వరస్వామి గుడి, అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో వరకు సాగింది. ముందుగా మెడ్‌టెక్ భూ సమస్య, ఉపాధిపై విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండీ దావూద్, పెదపాలెం, చినపాలెం గ్రామపెద్దలు మదీనా వ ల్లీ, బాదుల్, సన్నా, అన్వర్, ఆదిల్, బాబాలు వినతిపత్రాలు అందించారు. ఇస్లామ్పేటకు చెందిన 162 మంది ఎక్స్‌సర్వీస్ మెన్లకు చెందిన భూములను మెడ్‌టెక్ కోసం సేకరించి కనీసం నష్ట పరి హారం కూడా చెల్లించకపోడంపై స్థానికులు ఆవేదన చెందారు. సర్దార్ మాస్టర్, మహమ్మద్ ముస్తాఫాల సారధ్యంలో వీరు వినతిపత్రాన్ని అందించారు. మసీదుకు ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు కావాలని కోరడంతో విజయసాయిరెడ్డి స్పందించి జనరేటర్‌ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇస్లామ్‌పేట, పెదపాలెం, చినపాలెంకు చెంది న 5380 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములకు ఈనా మ్ చట్టం ప్రకారం పట్టాలిచ్చి రద్దుచేశారు. పాత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పిట్టవానిపాలెంలో ఎన్టీపీసీ ఫ్లయాస్ వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు విజయసాయి రెడ్డికి పిట్టా సింహాచలం, బొట్ట అప్పలరెడ్డి, బట్టు వెంకటరెడ్డి, సావిత్రి విజయసాయిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందూజా రైలు పట్టాల కోసం సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించలేదని పి.నాగేశ్వరరావు, వి.వెంకటరావు, సోంబాబు, నౌషద్ తదితరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల ఈసరపువానిపాలెంలో సామాజిక భవనం దెబ్బతిందని, నేటికీ వాటిని పునర్నించమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసరపు వెంకటరావు, దాకారపు అప్పారావు, జగ్గారావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. గొరుసువానిపాలెంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై మద్ది అప్పారావు, రమణ, అప్పలనాయుడు, కనకరెడ్డి, బసా రమణరెడ్డి తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరంఎంపీ విజయసాయిరెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. భూసదొడ్డిలోని అమ్మవారి ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేసిన అనంతరం పాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూజా పవర్‌ప్లాంట్ డ్రైనేజీ తవ్వడంతో వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని మద్ది పైడిరెడ్డి, రావాడ అప్పలరెడ్డి, వెంపాడ పైడిరెడ్డి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మురుభాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో భూములన్నీ స్టీల్‌ప్లాంట్ ఆధీనంలో ఉన్నాయి. గ్రామం అడుగుపెట్టాలాన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని నాయకులు దేముడు, గౌరేష్, తాతారావు వేడుకున్నారు. అప్పికొండ (చేపలపాలెం)లోని సోమేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. స్టీల్‌ప్లాంట్ కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తుందని, శుద్ధి చేసి నీటిని వదలాల్సి ఉండగా, వ్యర్థ నీటినే వదులుతుండంతో స్థానికులు ¿¶ఆందోళన చెందుతున్నామని నాయకులు పంది అప్పారావు, దాసరి తాతారావు చెప్పారు. తరువాత అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, 55వ వార్డు సమన్వయకర్త బట్టు సన్యాసిరావు సార«ధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, జిల్లా నాయకులు బర్కత్ ఆలీ, పక్కి దివాకర్, రవిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు రాము నాయుడు, 56, 57, 60 వార్డుల అధ్యక్షుడు పూర్ణానందశర్మ, దాడి నూకరాజు, దాసరి రాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ పాల్గొన్నారు. -
పేరు హోదా... చేసింది బల ప్రదర్శన
పోరుమామిళ్ల: పోరుమామిళ్లలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం ప్రత్యేకహోదా పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీ బలప్రదర్శనను తలపించింది. పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని సవాల్ చేస్తూ చేసిన ర్యాలీగా కనిపించిందే తప్ప హోదా కోసం చేసినట్లు లేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి విజయమ్మ వర్గీయుడు రంతుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కమ్మవారిపల్లెకు చెందిన టీడీపీ నాయకులు రెండ్రోజుల క్రితం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు (శ్రీనివాసులరెడ్డి) దిష్టిబొమ్మ దహనం చేయడం, విజయమ్మ పార్టీ నుంచి బయటకుపోతేనే బద్వేలులో పార్టీ బతుకుతుందని నినదించడం, మంత్రులు ఆది, సోమిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో విజయమ్మ వర్గం హోదా పేరుతో ర్యాలీ నిర్వహించి తమ బలం చూపింది. శుక్రవారం జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే జయరాములు, పార్టీ బద్వేలు ఇన్చార్జి విజయజ్యోతి పాల్గొనలేదు. ఎమ్మెల్యే పోరుమామిళ్లలోనే ఉన్నా ఆయనకు సమాచారం లేదు. జ్యోతికి కూడా సమాచారం లేదని తెలిసింది. క్రమశిక్షణ తప్పితే ఊరుకోం ఆర్టీసీ బస్టాండు వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తే తోక కట్ చేస్తామని పరోక్షంగా కమ్మవారిపల్లె టీడీపీ వర్గీయులకు హెచ్చరిక చేశారు. పదవి రాలేదనే అక్కసుతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడాన్ని సహించబోమన్నారు. మంత్రి ఆది మాట్లాడుతూ విజయమ్మ ఎవరికి బొట్టుపెడితే వారికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నారు. విజయజ్యోతి కూడా విజయమ్మ వద్దకు వస్తేనే టికెట్ వస్తుందని, లేకపోతే రాదన్నారు. విజయమ్మ నాయకత్వంలోనే బద్వేలులో పార్టీ నడుస్తుందన్నారు. విజయజ్యోతి గోడ పక్క నుంచి పుల్లలు పెడుతుందన్నారు. ఎమ్మెల్యేకు విజయమ్మతో కలసిపోవాలని చెప్పామని, ఈ ర్యాలీకి ఆహ్వానించినా రాలేదన్నారు. వాసు, ఆది ఇద్దరూ అసలు ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనపెట్టి పార్టీలో అసమ్మతి వర్గీయులపై, వైఎస్సార్సీపీపై అక్కసు వెళ్లగక్కారు. ఆఖరుకు విజయమ్మ కూడా బద్వేలులో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నానని, అందరినీ కలుపుకొని పోతున్నానని, ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని పేర్కొన్నారు తప్పితే హోదా విషయం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. శుక్రవారం ర్యాలీలో విజయమ్మ వర్గీయులు మాత్రమే భారీగా బైకులపై కనిపించారు. -
పల్లె రఘునాథరెడ్డికు స్వల్ప గాయాలు
-
టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు. -
వైఎస్సార్సీపీ నేతల బైక్‌ర్యాలీ
వెల్దుర్తి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నాయకులు మంగళవారం వెల్దుర్తిలో బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వెల్దుర్తి నుంచి రామళ్లకోట మీదుగా గురువారం పాదయాత్ర సాగే సర్పరాజాపురం వరకు, అక్కడి నుంచి నర్సాపురం, బోయనపల్లె మీదుగా వెల్దుర్తి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ జగనన్న పాదయాత్ర ప్రజా సంకల్పమేనని, ఈ యాత్ర సందర్భంగా ప్రజలు ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు. ర్యాలీలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, నాయకులు చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, శ్రీరాంరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, గోవర్ధనగిరి ఎంపీటీసీ సభ్యులు గోపాల్, ఆరిఫ్, నాగిరెడ్డి, సుమన్, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేయండి
కోవెలకుంట్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను బనగానపల్లె నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర నియోజకవర్గంలో శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో శుక్రవారం పట్టణంలోని జీసీఆర్ పెట్రోల్ బంకు నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పాదయాత్ర కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్ట వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి మొదటి రోజు మండలంలోని భీమునిపాడు మీదుగా కోవెలకుంట్ల పట్టణానికి చేరుకుంటుందన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్దన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, మండల ఇన్చార్జ్ శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, వెలగటూరు, కలుగొట్ల సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బిజనవేముల, కోవెలకుంట్ల ఎంపీటీసీలు భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాషా, కలుగొట్ల, లింగాల, చిన్నకొప్పెర్ల, వెలగటూరు, పెద్దకొప్పెర్ల మాజీ సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, శేషిరెడ్డి, రఘునాథరెడ్డి, మాధవరెడ్డి, సూర్యశేఖర్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు అమడాల భాస్కర్‌రెడ్డి, జోళదరాశి రాంమోహన్‌రెడ్డి, చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి నాయకులు ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, చిన్నకొప్పెర్ల మోహన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మధుసుధాకర్, శేషిరెడ్డి, మహేశ్వరరెడ్డి, ఉసేనయ్య, ఎర్రం ఈశ్వరరెడ్డి, రేవనూరు తులసిరెడ్డి పాల్గొన్నారు. -
అల్లర్లకు బీజేపీ యత్నాలు
♦ నిరసనల తీరు ఇది కాదు ♦ సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: బైక్ ర్యాలీ ద్వారా బీజేపీ నేతలు సమాజంలో శాంతి, సామరస్యాలను చెడగొట్టి అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. గురువారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘మంగళూరులో పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేతలు ముందుగా చెప్పి ఉంటే అప్పుడే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండేవాళ్లం. అయితే వాళ్లు ప్రజాజీవనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అందువల్లే మేం అనుమతులు ఇవ్వలేదు. అంతేకాదు వారికి నిరసన తెలిపేందుకు, సమావేవం ఏర్పాటు చేసుకునేందుకు మేము ఎక్కడైతే అనుమతి ఇచ్చామో ఆ ప్రదేశాన్ని వదిలేసి, రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వబోము’ అని తెలిపారు. గౌరీ కేసు సీబీఐకి ఇచ్చేందుకు సిద్ధం ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని అన్నారు. గౌరి లంకేష్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తన పత్రికలో సంఘ్ పరివార్ గురించి హేళనగా కథనాలు రాయకపోయి ఉంటే ఈ రోజు గౌరి లంకేష్ చనిపోయి ఉండేవారు కాదు కదా? అన్న బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ వ్యాఖ్యల అర్థమేంటి? గౌరి లంకేష్ హత్య వెనక ఎవరి హస్తం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది కదా?’ అని సీఎం అన్నారు. -
చిత్తూరులో బైక్ ర్యాలీతో వైఎస్ఆర్కు నివాళి
-
నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
-
మత్తును తరిమేద్దాం
-
కర్నూలు జిల్లాలో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
ఒంగోలులో YSRCP బైక్ ర్యాలీ
-
కార్మిక సమస్యలు మంత్రికి పట్టవా!
► అసోసియేషన్ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ►డీఎంఎఫ్‌ను రద్దు చేయాలంటూ బైక్ ర్యాలీ ►ఐదో రోజుకు చేరుకున్న దీక్షలు టెక్కలి : వెనుక బడిన జిల్లాకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం అదనపు చార్జీలు విధించి ఆయా పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులంతా రోడ్డున పడుతుంటే కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా నష్టపోయే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 100, 36లను రద్దు చేసి అదనపు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టెక్కలి మైన్స కార్యాలయం వద్ద గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నారుు. దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలపై అదనపు చార్జీల విధించడం సమంజసం కాదన్నారు. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోకుండా వాటిపై అధిక చార్జీలు విధించి పరిశ్రమలు మూతపడే విధంగా కుట్రలు చేయడం దారుణమన్నారు. కొద్ది రోజులుగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు సీఎంతో సహా సంబంధిత మంత్రుల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతుంటే జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కనీసం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. గ్రానైట్ యజమానులు, కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను తమ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని రెడ్డి శాంతి భరోసా ఇచ్చారు. తిలక్ మాట్లాడుతూ పరిశ్రమలు మూతపడే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి చెందిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతి మాట్లాడుతూ పరిశ్రమలను బతికించుకోవాలంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు. అంతకు ముందు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కోత మురళీధర్, ప్రతినిధులు శ్రీనివాస్, రామకృష్ణ, సి.హెచ్.రావ్, వెంకటాచలపతి, పార్థు తదితరుల ఆధ్వర్యంలో కార్మికులంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎంఎఫ్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని నినదించారు. -
ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
రావులపాలెంలో అభిమానుల భారీ బైక్ ర్యాలీ రావులపాలెం: బాహుబలి సినిమాతో సినీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా ఇండస్ట్రీయల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు ఆధ్వర్యంలో రావులపాలెంలో ఆయన అభిమానులు పండుగలా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి భారీగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలివచ్చి మోటరు బైకులపై చక్కర్లు కొడుతూ తీ¯ŒSమార్ డప్పులు బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. అనంతరం వందలాది బైకులపై ప్రభాస్ చిత్రాలు ఉన్న టీ షర్టులు ధరించి జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక జాతీయ రహదారిపై రవిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ మండలంలోని రావులపాలెం, ఈతకోట, వెదిరేశ్వరం, కొమరాజులంక, ఊబలంకల మీదుగా ఆత్రేయపురం మండలం వైపు సాగింది. ఈ ర్యాలీలో బాహుబలి–2 సినిమాకు సంబంధించి విడుదలైన చిత్రాలతో అభిమానులు సందడి చేశారు. డార్లింగ్ ప్రభాస్ అని ముద్రించిన పతాకాలు ఆకట్టుకున్నాయి. -
నేడు ములుగు బంద్
ములుగు : ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతి, నాయకులు మాట్లాడారు. ములుగు జిల్లా కాకుంటే మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఆయా పార్టీల నాయకులు వేముల భిక్షపతి, చింతలపూడి నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్వామి, నూనె శ్రీనివాస్, మహేందర్, పైడిమల్ల శత్రజ్ఞుడు, చెట్టబోయిన సారంగం, వెంకట్, గుగులోతు సమ్మయ్య, కనకం దేవదాసు, హరి, లియాఖత్‌అలీ పాల్గొన్నారు. కాగా మంగళవారం జరిగే ములుగు బంద్‌కు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఓ ప్రకటనలో తెలిపారు. -
నర్సింహులపేటలో కొనసాగించాలని బైక్ ర్యాలీ
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామస్తులు నర్సింహులపేట మండలంలోనే కొనసాగుతామని మంగళవారం హైవేపై ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఏర్పడే ఎల్లంపేట మండలంలో చేర్చొద్దని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులు స్పందించి నర్సింహులపేట మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు వెంకన్న, మల్లయ్య, నర్సయ్య, పుల్లయ్య, నరేందర్ పాల్గొన్నారు. -
బైక్ ర్యాలీ ప్రారంభం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్న తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగా నిర్వహించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెతో ప్రభుత్వాలకు గుణపాఠం
బైక్ ర్యాలీలో కేంద్ర కార్మికసంఘాల పిలుపు కాకినాడ సిటీ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సాయంత్రం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాలు జేఎన్టీయూ నుంచి బైక్‌ర్యాలీ చేపట్టి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరాయి. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె జరుగుతోందన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా జేఏసీ మాజీ చైర్మన్ ఆచంటరామారాయుడు, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.అజయ్‌కుమార్, తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ ప్రచారం వివిధ పరిశ్రమల గేట్ల ముందు కార్మికుల కూడలిలో ఏఐటీయుసీ సమ్మె విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి నక్క కిషోర్ పాల్గొన్నారు. -
జనగామ జిల్లా కోరుతూ ర్యాలీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం అఖిలపక్షం ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కార్మికుల చట్టాలను కాలరాయొద్దు
సమ్మెను జయప్రదం చేయాలంటూ బైక్ ర్యాలీ శంషాబాద్ : కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాసే యత్నం చేస్తోందని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జీ పానుగంటి ఆనంద్ ఆరోపించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ మంగళవారం సీఐటీయూతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సుకు సంబంధించిన 12 డిమాండ్లను కేంద్ర సర్కారు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని కోరారు. ఈఎస్ఐ, బోనస్‌లు ప్రకటించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణతో కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ విధిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండడంతో పరిశ్రమల యజమానులు, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాజేంద్రనగర్ జోన్ నాయకులు నీరటి మల్లేష్ ఆరోపించారు. శంషాబాద్‌లో మొదలైన బైక్ ర్యాలీ సాతంరాయి, గగపహాడ్ పారిశ్రామిక వాడల మీదుగా కాటేదాన్ చేరుకుంది. ర్యాలీలో టీఆర్ఎస్కేవీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేష్, శ్రీధర్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో సిపిఎం బైక్ ర్యాలీ
-
బంద్ విజయవంతానికి బైక్ ర్యాలీ
-
సీఐటీయూ బైక్ ర్యాలీలు
కానూరు(పెనమలూరు)ః కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ కానూరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ కాశీం, యు.త్రిమూర్తి, వై.శ్రీనివాసరావు, పి.రామకోటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, జి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఉయ్యూరు : సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పెనమలూరు డివిజన్ అధ్యక్షుడు కోసూరి శివనాగేంద్రం కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సభల విజయవంతం కోరుతూ ఉయ్యూరులో గురువారం కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రత్నం భాస్కరరావు, రాజేష్, కొండలు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు : ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి నర్సింహారావు కోరారు. మైక్ ప్రచార జాతాను సంఘం కంకిపాడు డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సీఐటీయూ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పీ.రంగారావు, నరేష్, బీ.శివశంకర్, నార్ని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా భారీ బైక్ ర్యాలీ
బీర్కూర్ : నిజామాబాద్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా అధికారపక్షం నాయకులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా నుంచి నాచుపల్లి మీదుగా బీర్కూర్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు పుట్టుగతులు ఉండవని అధికార పక్ష నాయకులు విమర్శించారు. -
బీజేవైఎం బైక్ ర్యాలీ
నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వికాస్ పర్వ్‌లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మినీబైపాస్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడారు. నరేంద్రమోడీ రెండేళ్ల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వికాస్ పర్వ్ పేరుతో దేశంలో జరిగిన అభివృద్ధి, జరపాల్సిన అభివృద్ధిపై ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్రాల్లో సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఈక్రమంలో ఈనెల 16వ తేదీన నగరంలోని నర్తకి సెంటర్లో బహిరంగా సభ నిర్వహిస్తామన్నారు. సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ముఖ్య అతి«థిగా హాజరు కానున్నట్లు చెప్పారు. జిల్లా కార్యాలయం నుంచి బయలు దేరి నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కనకమహాల్ సెంటర్, నర్తకి సెంటర్, ఏసీ సెంటర్, ట్రంకురోడ్డు మీదుగా వీఆర్సీ, మద్రాసుబస్టాండ్, ఆర్టీసీ సెంటర్ వరకు కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మొగరాల సురేష్, ఉపాధ్యక్షుడు గుంజి కృష్ణ, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, నాయకులు ఉదయ్, మధుసూదన్, మల్లి, సతీష్, రవి, శ్రీను, పెంచలయ్య పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల బైక్ ర్యాలీ
జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన పోలీస్ కేసును వెంటనే ఎత్తివేయాలంటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఐన్యూస్ రిపోర్టర్ వాజిద్‌పై పెట్టిన పోలీస్‌లు పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలంటు వారు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట చౌరస్తా నుంచి తహశిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట ప్రెస్‌క్లబ్ (టీయూడబ్లుజే)అధ్యక్షుడు రాజాగౌడ్,సీఎస్జేయూ క్లబ్ అధ్యక్షుడు శ్వామ్, సీనియర్ జర్నలిస్టులు వెంకన్న, చంద్రంగౌడ్, వెంకట్‌రెడ్డి,యాదగిరి, క్రిష్ణాగౌడ్, నరేందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటా’ రన్.. అదిరెన్..
-
వైఎస్ జగన్ దీక్షకి మద్దతుగా బైక్ ర్యాలీ
-
రామచంద్రాపురంలో చెవిరెడ్డి బైక్ ర్యాలీ
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ దీక్ష చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో యువజన విభాగం జనరల్ సెక్రటరీ బి.ఓబుల్ రెడ్డితో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మార్మోగిన మానుకోట
మహబూబాబాద్ : మానుకోటను జిల్లాగా మార్చాలంటూ ఎనిమిది రాజకీయ పార్టీలు మానుకోట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన భారీ బైక్ ర్యాలీతో పట్టణం మార్మోగింది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా సాధన కోసం నేడు(బుధవారం) చేపట్టే బంద్‌ను విజయవంతం చేయూలని అఖిలపక్ష నాయకులు కోరారు. నాయకులు దేవరం ప్రకాశ్‌రెడ్డి, భూపతి మల్లయ్య, బి.అజయ్, యాప సీతయ్య, కొత్తపల్లి రవి, లింగ్యానాయక్, దార్ల శివరాజ్, జిల్లా సాధన కమిటీ చైర్మన్ డోలి సత్యనారాయణ , పిల్లి సుధాకర్, పొన్నాల యుగేంధర్, మూలగుండ్ల వెంకన్న, కొండపల్లి రాంచందర్‌రావు, దర్శనం రామకృష్ణ, ఇనుగుర్తి సుధాకర్, తప్పెట్ల వీరన్న, పూనెం మురళి, ధర్మారపు కనకయ్య, కామ సంజీవరావు, గుంజె హన్మంతు తదితరులు పాల్గొన్నారు. బంద్‌కు గిరిజన జాక్ మద్దతు న్యూశాయంపేట : మానుకోట బంద్‌కు గిరిజన సంఘాల రాజకీయ జేఏసీ వరంగల్ జిల్లా స్టీరింగ్ కమిటీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు బానోతు నవీన్‌నాయక్, జువారి రమేష్ నాయక్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
నీరాజనం
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం .. ⇒ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్ ⇒ కార్మికులకు అండగా ఉంటామని హామీ ⇒ సన్నిధి కల్యాణమండపంలో నూతన వధూవరులు సాయినివ్య, జగన్మోహన్లకు ఆశీర్వాదం ⇒ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోపార్టీ నేతలతో భేటీ ⇒ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలపై దిశా నిర్దేశం సాక్షిప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. శుక్రవారం పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవరాలు, పార్టీ నాయకులు కిలారు రోశయ్య కుమార్తె సాయినివ్య, జగన్మోహన్ల వివాహానికి హాజరైన జగన్‌కు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గుంటూరు చేరుకున్న ఆయనకు రహదారికి ఇరువైపులా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినదించారు. గుంటూరు ఆటోనగర్ నుంచి యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలతో జననేతకు ఘనస్వాగతం పలికింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పేరులోనే కర్షకులు, కార్మికులు, యువజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆటో కార్మికుల సమస్యలను అధినేతకు వివరించారు. అలాగే నగరపాలక సంస్థకు చెందిన కాంట్రాక్టు, ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలను అధినేతకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిందని పేర్కొనడంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జగన్ హమీ నిచ్చారు. అక్కడి నుంచి జీటీ రోడ్డు లోని సన్నిధి కల్యాణమండపానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న జగన్ పార్టీ నాయకులతో రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలపై సమీక్షించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, డివిజన్లలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. టీడీపీ అనుసరిస్తున్న అక్రమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియపరచాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.పార్ధసారథి, మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మొహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురామ్, నియోజకవర్గ ఇన్చార్జిలు రావి వెంకటరమణ. అన్నాబత్తుని శివకుమార్, కత్తెర క్రిస్టినా, నన్నపనేని సుధ, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనే యులు, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), లీగల్‌సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బండారు సాయిబాబు, బీసీ సెల్ అధ్యక్షులు సునీల్‌కుమార్, సేవా దళ్ జిల్లా అధ్యక్షులు కొత్త చినపరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మొగిలి మధు, సేవాదళ్ జిల్లా కార్యదర్శి ఆర్. ముత్యాలరాజు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మాబు, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు, దుగ్గిరాల జెడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి , దేవళ్ల రేవతి, కొలకలూరి కోటేశ్వరరావు, ఎం.ప్రకాశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి అత్తోట జోసఫ్‌కుమార్, డైమండ్ బాబు, కత్తెర సురేష్, సి.హెచ్.రవికుమార్, కర్నుమా, పూనూరి నాగేశ్వరరావు, కొరిటి పాటి ప్రేమ్‌కుమార్, మండేపూడి పురుషోత్తం, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మెహమూద్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు అతిథి గృహం నుంచి జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్లారు. -
కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన రాక సందర్భంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయాడు. దోమకొండ మండలం బీబీపేట్‌కు చెందిన చాట్ల మహంకాళి(50) బైక్‌ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే ప్రమాదవశాత్తూ బైక్ నుంచి కిందపడి పోవటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అతను మరణించాడు. (బిక్నూర్) -
జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు బైక్ ర్యాలీ
కాకినాడ : రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్ఆర్ సీపీ ఆ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి భారీ బైక్ ర్యాలీతో కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్నారు. అలాగే ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
ఆంక్షల్లేని రుణమాఫీ చేయాలి
అంబాజీపేట :ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణ మాఫీ హామీని అమలు చేయకుండా పూటకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు మోటార్‌బైక్‌ల ర్యాలీ నిర్వహించారు. రుణమాఫీపై చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. అనంతరం పార్టీ అంబాజీపేట మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.కె.రావు, కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ రైతులను, ఆడపడుచులను మోసంచేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి నైతికంగా కొనసాగే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకోమాట చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అంబాజీపేట, కె.పెద పూడి, పుల్లేటికుర్రు, ఇరుసుమండ, ముక్కా మల, మొసలపల్లి, గంగలకుర్రు, గంగలకుర్రు మలుపులో మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని పి.కె.రావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.ఎం.శెట్టి, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి చినబాబు, ఎంపీటీసీ సభ్యులు కోట విజయరాజు, బూడిద వరలక్ష్మి, ఉందుర్తి ఆనందబాబు, కోమలి అనంత లక్ష్మి, పార్టీ జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ కుడుపూడి సత్తిబాబు, ఆయా గ్రామాల నాయకులు పేరి శ్రీనివాసరావు, మైలా ఆనందరావు, విత్తనాల సుబ్బారావు, మట్టా వెంకటేశ్వరరావు, అప్పన శ్రీను, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట సుబ్రహ్మణ్యం, మంచాల వ్బైయి, విత్తనాల శేఖర్, మట్టపర్తి సోమేశ్వరరావు, దొమ్మేటి సాయిరాం, నేతల నాగరాజు, అప్పన సురేష్, సరెళ్ళ వెంకట్రావు, గంటి శ్రీరామచంద్రమూర్తి, కుడుపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురులో.. మామిడికుదురు : మామిడికుదురు మండలంలోనూ గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పాశర్లపూడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మామిడికుదురు, మాకనపాలెం, ఆదుర్రు, లూటుకుర్రు, ఈదరాడ గ్రామాల మీదుగా నగరం, తాటిపాక కూడలి వరకు జరిగింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదుటి మోహన్, పి.గన్నవరం కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రుణమాఫీ అమలులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, సర్పంచ్ కశిరెడ్డి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు జోగి వెంకటరామకృష్ణ, ఆయా గ్రామాల నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, కొమ్ముల రాము, భూపతి వెంకటపతి, కొనుకు నాగరాజు, ముత్యాల నర్సింహారావు, యూవీవీ సత్యనారాయణ, జక్కంపూడి వాసు, గుత్తుల బాబి, జగతా అరుణాచలనాయుడు, అన్వర్‌తాహిర్ హుస్సేన్, ఎండీవై షరీఫ్, బొక్కా సత్యనారాయణ, పేరాబత్తుల నర్సింహారావు, కొమ్ముల సూరిబాబు, లంకే ఏసు, మోకా విజయరాజు, కొంబత్తుల నిషాంత్, మజహర్ అలీ, అక్బర్ అలీ, కుంపట్ల పెద్దిరాజు, పెదపూడి శ్రీను, గెద్దాడ నాగరాజు, పెంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలతో బాబు మోసం : వరుపుల ఏలేశ్వరం : చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేపట్టాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. లింగంపర్తి గ్రామంలో గురువారం రుణమాఫీపై డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడిపై రైతులు, డ్వాక్రా మహిళలను చైతన్యం చేసేందుకు ఎమ్మెల్యే వరుపుల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగంపర్తి, ఏలేశ్వరం, యర్రవరం, పేరవరం తదితర గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రుణమాఫీ చేపట్టకపోవడం దారుణమన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి పార్టీశ్రేణులతో పాటు రైతులు, డ్వాక్రామహిళలు అధికసంఖ్య పాల్గొనాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, పర్వత శేషగిరిరావు, కొండమూరి వెంకటేశ్వరరావు, జువ్వల చినబాబు పాల్గొన్నారు. -
''ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు చెవిరెడ్డి నిరసన''
-
గోరేగావ్‌లో శివసేన బైక్‌ర్యాలీ
బోరివలి, న్యూస్‌లైన్: గోరేగావ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన శివసేన అభ్యర్థి సుభాష్ దేశాయ్ ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. గోరేగావ్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలైన ర్యాలీ ఎస్వీ రోడ్డు మీదుగా సర్వోదయ బాలికల పాఠశాల వరకు సాగింది. ఈ ర్యాలీలో శివసేన మహరాష్ట్ర తెలుగు సంఘటన కార్యకర్తలు పాల్గొని శివసేనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ దేశాయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచి పేదవాని నడ్డి విరిచిందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, పేదోడు నగరంలో జీవించే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రలో శివసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్త పరిచాడు. ఈ ర్యాలీలో బాలీవుడ్ నటుడు ప్రదీప్‌రావత్ కూడా పాల్గొన్నారు. సుభాష్ దేశాయ్‌కి మద్దతు తెలిపాడు. శివసేన మహరాష్ట్ర తెలుగు సంఘటన కార్యాధ్యక్షుడు టి. ప్రకాష్ స్వామి మాట్లాడుతూ... గోరేగావ్ నియోజక వర్గంలో ఉన్న పదివేల మందికిపైగా తెలుగు ఓటర్లు శివసేనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చాడు. సుమారు 25 సంవత్సరాల నుండి తెలుగు ప్రజల యోగ క్షేమాలు చూస్తూ.. ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకు వచ్చేది సుభాష్ దేశాయ్ మాత్రమేనని గుర్తుచేశారు. -
బీజేపీ భారీ బైక్ ర్యాలీ
సంగారెడ్డి క్రైం : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం బీజేపీ, టీడీపీ సమైక్యంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. పట్టణ శివారులోని వైకుంఠపురం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కలెక్టరేట్, పోతిరెడ్డిపల్లి వరకు కొనసాగింది. యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి, జిల్లా నాయకుడు మాణిక్యం తదితరులు ఓపెన్టా ప్ జీప్‌లో నిల్చుని ప్రజలకు అభివాదం చేశా రు. పోతిరెడ్డిపల్లి నుంచి కంది, చేర్యాల్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట తదితర గ్రామాల్లో ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడు తూ బీజేపీని గెలిపిస్తే మెతుకుసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం నుంచి అధిక ని దులు జిల్లాకు మంజూరయ్యే అవకాశముం దని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ను గెలిపిస్తే ఉపయోగమేమీ ఉండదన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ రప్పిస్తానని, ఇంటింటికీ మంజీరా నీరు అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కె.జగన్, వాసు, విష్ణువర్దన్ పాల్గొన్నారు. -
సిటీలో ‘గాలిపటం’ సందడి
కరీంనగర్ కల్చరల్ : దర్శకుడు సంపత్ నిర్మించిన ‘గాలి పటం’ చిత్ర యూనిట్ శనివారం నగరంలో సందడి చేసింది. దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హిరోరుున్ క్రిసీన అఖినా, సంగీత దర్శకుడు బీమ్స్ సెసీ రోలియో కరీం‘నగరం’లోని వేంకటేశ్వర థియేటర్ ప్రేక్షకులను కలిశారు. సినిమాను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆధరాభిమానాలు ఎప్పటికీ ఉండాలన్నారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతకు ముందు చిత్ర యూనిట్ న గరానికి చేరుకోవడంతో వివిధ సినిమా అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు.. మిత్రుల సహకారంతో లాస్ఏంజిల్స్ టాకీస్ బ్యానర్‌పై నవీన్‌గాంధీ దర్శకత్వంలో తాను నిర్మించిన గాలిపటం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలని దర్శకుడు సంపత్ నంది అన్నారు. హీరో, నటుడు సాయికుమార్ తనయుడు ఆది మాట్లాడుతూ తమ కుటుంబం సినిమా పరిశ్రమతో పెనవేసుకుందని తెలిపారు. నటి క్రిసీనా అఖినా మాట్లాడుతూ సంపత్ నంది దర్శకత్వంలో నిర్మించిన ‘గాలిపటం’ చిత్రంలో నటించడం తన అదృష్టమన్నారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ యూనిట్ సభ్యులను అభినందిస్తూ జిల్లాకు చెందిన సంపత్ నిర్మించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహ్మద్ ఆరీఫ్, నలువాల రవీందర్, మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, థియేటర్ లీజుదారుడు కన్న కృష్ణ, వివిధ నటుల అభిమాన సంఘాల బాధ్యులు మిడిదొడ్డి నవీన్‌కుమార్, తూము నారాయణ, అంజియాదవ్, గుమ్మడి శ్రీనివాస్, గోసిక అజయ్, నామాల శ్రీనివాస్, సినిమా డిస్ట్రిబ్యూటర్ వెల్పుల సంపత్, చిర ంజీవి, వెంకట్, శ్రీనివాస్, కట్ట స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్‌షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన
చర్ల, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చర్ల మండలంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన లభించింది. ఉదయం సుబ్బంపేట వద్ద ప్రారంభమైన ర్యాలీ కొయ్యూరు, ఉప్పరిగూడెం, సీ కత్తిగూడెం, జీపీపల్లి. వీరీపురం, మొగళ్లపల్లి, గొంపల్లి, దండుపేట, చర్లకు చేరింది. మధ్యాహ్నం చర్ల నుంచి భయలు దేరిన ఈ రోడ్‌షో, బైక్‌ర్యాలీలు దోశిళ్లపల్లి, పెదమిడిసిలేరు, తేగడ, ఆర్ కొత్తగూడెం, దేవరాపల్లి మీదుగా రాళ్లగూడెం వరకూ సాగింది. వైఎస్ఆర్ సీపీ మద్దతుతో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీసభ్యుడు కడెం రామాచారి, జిల్లా మహిళా నాయకురాలు దామర్ల రేవతి పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సీపీఎం మద్దతుతో బరిలో ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్యలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కూటమి నాయకులు కొప్పినీడి నానిబాబు, రామగిరి యాకయ్య, పొడుపుగంటి సమ్మక్క, కలిదిండి సోమరాజు, తెల్లం సమ్మయ్య, చీమలమర్రి మురళీకృష్ణ, మేరెడ్డి చలపతిరెడ్డి, లంకా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకే ప్రజాదరణ
పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి మేడ్చల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీని ప్రజలు విశేషంగాఆదరిస్తున్నారని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ పరిధిలో ఎక్కడకు వెళ్లినా అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో మురికి వాడలు లేకుండా చేస్తానన్నారు. తాగునీటి వసతి, మెరుగైన రోడ్లు తదితర వసతులు కలిపిస్తానని పేర్కొన్నారు. కాగా.. మండలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ జోరుగా సాగింది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డు, బస్‌డిపో, ముకుంద్ థియేటర్, కిష్టాపూర్, పూడూర్ గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బి.వి. ప్రకాష్ వంజరి, నాయకులు శ్రీధర్‌గౌడ్, మహబూబ్అలీ, అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ఘనత వైఎస్‌దే కీసర: మహానేత వైస్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయారని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. కీసరలో శనివారం నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఆయన మాట్లాడారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. వైఎస్ పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ ఆశయ సాధనకోసమే జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే వైఎస్సార్ సీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని, తనను గెలిపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ దర్గాసుఖేందర్రెడ్డి, కీసర ఇన్చార్జి ముజిబ్, నేతలు డా.నరహరి, ప్రవీణ్, నారాయణ, రమేష్ , కుంటోళ్ల సత్యనారాయణ, రత్నం, మంగమ్మ, ప్రకాష్‌రెడ్డి, కోటేశ్వర్రావు, ముఖేష్‌రాజ్, అంజి, రాజు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం ఘట్కేసర్ టౌన్: రైజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఘట్కేసర్ పట్టణంలో శనివారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్‌శాఖను ప్రక్షాళన చేశానని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించానన్నారు. పేదల పక్షపాతి వైఎస్సార్‌ను బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. సూర్య, చంద్రాదులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సుస్థిర పాలన, రామ రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తూకుంట కృష్ణారెడ్డి, సామల యాదిరెడ్డి, పెరమాండ్ల అశోక్, శ్యామ్‌రావ్, రాజు, గణేష్, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్తంభించిన పాలన
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు నిరసనగా ఎన్జీఓలు గురువారం నుంచి సమ్మె బాట పట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన స్తంభించింది. పార్లమెంటులో విభజన బిల్లు పెడితే ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా వున్నామంటూ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులు, ఇరిగేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అనంతపురం జిల్లాలో వున్న 22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమ్మెలో వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు వెనుదిరిగి వెళ్లారు. వీటి వల్ల రూ. అర కోటి ఆదాయానికి బ్రేక్ పడింది. ఎన్జీఓలు అనంతపురం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ, డీపీఓ, మున్సిపల్ కార్పొరేషన్, డ్వామా, జెడ్పీ తదితర ప్రభుత్వ కార్యాలయాల గేట్లకు తాళాలు వేసి అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. = కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను అడ్డుకొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, సిబ్బందిని బయటకు పంపారు. కలెక్టర్ కార్యాలయంలో ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలలేదు. ట్రెజరీ కార్యాలయం నుంచి వెళ్లాల్సిన బిల్లులకూ అంతరాయం ఏర్పడింది. ట్రెజరీ అధికారులు సమ్మెలో లేకపోయినప్పటికీ కార్యకలాపాలను ఎన్జీఓలు అడ్డుకున్నారు. -
సమైక్యమే ఊపిరి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్రే ఊపిరిగా..వైఎస్ఆర్సీపీ ఉద్యమించింది. బైక్ ర్యాలీలు, మానవహారాలతో నియోజకవర్గ కేంద్రాలు దద్దరిల్లాయి. పార్టీ జెం డాలు పట్టుకుని ఎక్కువగా వయుకులు పాల్గొనడంతో కొత్తదనం ఉట్టిపడింది. శ్రీకాకుళంలోసమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం చేపట్టిన బైకు ర్యాలీ విజయవంతమైంది. పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కళ్యాణి డీసీసీబీ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రారం భమైన బైక్ ర్యాలీ వైఎస్ఆర్ కూడలి మీదుగా డే అండ్నైట్కు చేరుకుంది. అక్కడ బైక్‌లతో హారంలా ఏర్పడ్డా రు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరో సమన్వయకర్త వైవీ సూర్యనారాయణ, ఎన్ని ధనుంజయ్, పీస శ్రీహరి, అంధవరపు సూరి బాబు తదితరులు పాల్గొన్నారు. పాలకొండలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాల వలస రాజశేఖరం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం వైఎస్సార్సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేశారు. నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజాంలో పార్టీ కార్యాలయం వద్ద పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను ర్యాలీ ని ర్వ హించారు. మాజీ ఎమ్మెల్యే జోగులు, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు పాల్గొన్నారు.టెక్కలిలో నియోజకవర్గ స మన్వయ కర్త దువ్వాడ శ్రీ నివాస్ ఆధ్వర్యంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన పార్టీ నా యకులు పెద్ద ఎత్తున బైక్ ర్యా లీ నిర్వహించారు. దువ్వాడ వాణి, సంపతిరావు రాఘవరావు, బాడా న మురళీ, తమ్మన్నగారి కిరణ్, దేవాది గోపి, శిమ్మ సోమేశ్వరరావు, తిర్లంగి జానకిరామయ్య, చింతాడ ధర్మారావు పాల్గొన్నారు. ఆమదాలవలస క్రిష్ణాపురం జంక్షన్ నుంచి పట్టణ శివార్లలోని ఓవర్‌బ్రిడ్జి వరకు రెండు సార్లు ర్యాలీ నిర్వహిం చారు. నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురి, పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, పైడి కృష్ణప్ర ాద్, దవల అప్పలనాయుడు, ఎస్ రాజు పాల్గొన్నారు.ఇచ్ఛాపురంలో బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏఎస్‌పేట, పురుషోత్తపురం గ్రామాల వరకు ర్యాలీ సా గింది. అనంతరం బస్టాండ్‌లో బైక్‌లతో మానవహారం నిర్వహించారు. ఇచ్ఛాపురం, సోంపేట మండలాల కన్వీనర్లు పి.పోలారావు, కె.మోహనరావు, పి.ఈశ్వరరావు, వివిధ విభాగాల కన్వీనర్లు ఆనంద్, ఎస్.చత్రపతి, కోటి,టి.రామారావు,తులసీ, సుగ్గు చత్రపతిరెడ్డిలు పాల్గొన్నారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే కృష్ణదాస్ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, మార్కెట్ మీదుగా పలు వీధుల్లో ర్యాలీ సాగింది. ధర్మాన రామలింగన్నాయుడు, ఆరంగి మురళీధర్, కేసీహెచ్‌బీ గుప్త, ఎస్.కృష్ణబాబు, పి.గిరీశ్వరరావుపాల్గొన్నారు. సుమారు 100 మోటారు సైకిల్లు ర్యాలీలో పాల్గొన్నాయి. పలాసలో పలాస ఇందిరాచౌక్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. మూడు రోడ్ల కూ డలి వద్ద యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు,బళ్ల గిరిబాబు, డబ్బీరు భవానీ శంకర్, యవ్వారి మోహన్‌రావు, నర్తు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పాతపట్నం: నియోజక వర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో పాతపట్నం నుంచి, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కొమరాపు తిరు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నాయకులు పి.కృష్ణారావు, మాత ల తిరుమలరావు, షణ్ముఖరావు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం నుంచి లావేరు జంక్షన్ వరకు సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ైబెకు ర్యాలీ నిర్వహించారు. పిన్నింటి సాయికుమార్, గొర్లె అప్పలనర్సునాయుడు, కరిమజ్జి భాస్కరరావు పాల్గొన్నారు. -
సమైక్య దారి.. చైతన్య ర్యాలీ
కర్నూలులో నియోజకవర్గసమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించాచరు. మంత్రాలయంలో స్థానిక నాయకులు భీమిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో కర్ణాటక, కర్నూలు రహదారిని దిగ్బంధించారు. ఆదోనిలో పార్టీ కార్యాలయం నుంచి మోటర్ సైకిళ్లతో భీమా సర్కిల్ చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు డాక్టర్ మధుసూదన్ ,చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆలూరులో నియోజకవర్గసమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో బీవీ.రామిరెడ్డి, బనగానపల్లెలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబోతుల ఉదయ భాస్కర్‌రెడ్డి, కాటసాని ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగింది. ఆత్మకూరులో స్థానిక నాయకులు ఇస్కాల రమేష్, ఏర్వ రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు. ప్యాపిలిలో రామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండ్ నుంచి కింది గేరి వరకు ర్యాలీ సాగింది. పాణ్యంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త మణిగాంధీ ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్, గుత్తిరోడ్డు, కృష్ణానగర్, చెన్నమ్మ సర్కిల్, రాజ్‌విహార్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
బైక్ ర్యాలీ జోరు సమైక్య హోరు
అనంతపురం జిల్లా పరిషత్తు/అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీకి పంపిన విధానానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. శుక్రవారం జిల్లా బంద్‌ను విజయవంతం చేయగా రెండు రోజు శనివారం బైక్ ర్యాలీలతో సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. నియోజక వర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. పార్టీ జిల్లా కన్వీనర్, ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎక్కడిక్కడ బైక్ ర్యాలీలు నిర్వహించి పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతపురం నగరంలో పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వందలాది మంది పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీతో సందడి చేశారు. హిందూపురంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఇనాయతుల్లా పాల్గొన్నారు. కదిరిలో పార్టీ నేత ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. మడకశిర, రొళ్ల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని నియోజకవర్గ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కొత్తచెరువులో పార్టీ శ్రేణులు గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపట్టాయి. పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో కణేకల్లు, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, డీ.హీరేహాల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. కనగానపల్లిలో వైఎస్సార్సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో బైక్‌లతో ర్యాలీ చేశారు. సమైకాంధ్రకు మద్దతుగా శింగనమలలో నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలు పేరం నాగిరెడ్డి, మున్నా అధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వుహాధర్నా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. -
సమైక్య ర్యాలీ
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు కొనసాగుతోంది. నిరసనలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల నుంచి వందలాది బైకుల్లో కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని సమైక్య ర్యాలీ చేపట్టారు. సమైక్య ప్రకటన వచ్చే వరకూ పోరును ఆపేది లేదని నినదించారు. సాక్షి, కడప: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై చర్చకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కడపలో జిల్లా కన్వీనర్ కొత్తమద్ది సురేష్‌బాబు, మాజీ మేయర్ పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, షేక్ బె పారీ అంజాద్‌బాషా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంజాద్తోపాటు పార్టీ అధికారప్రతినిధి అప్జల్‌ఖాన్, హఫీజుల్లా, మాసీమ బాబు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. నేతలంతా బైక్‌లను నడిపి సమైక్యనినాదాలు చేశారు. కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని నినదించారు. సమైక్య ప్రకటన చేసేవరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిరసనల పర్వానికి విరామం చెప్పే ప్రసక్తే లేదని జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. కేంద్రం విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పట్టణ కన్వీనర్ కోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. సమైక్య తీర్మాణం చేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా సీఎం, స్పీకర్ పట్టంచుకోవడం లేదని అమర్నాథరెడ్డి ఆరోపించారు. పులివెందులలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. వైఎస్‌తో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవినాష్ పూలమాల వేశారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, సమైక్యరాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని వైఎస్ అవినాష్ డిమాండ్ చేశారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కడప-కర్నూలు, ప్రొద్దుటూరు-నెల్లూరు ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. 70ఏళ్ల వయస్సులోనూ రఘురామిరెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ స్కూటీ నడుపుతూ ర్యాలీలో పాల్గొనడం విశేషం.కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని రఘురామిరెడ్డి విమర్శించారు. జమ్మలమడుగులో నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తనయుడు భూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. పోరుమామిళ్లలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జునరెడ్డి, చిట్టాబ్రదర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ైరె ల్వేకోడూరులో డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ప్రొద్దుటూరులో పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. -
బైక్ ర్యాలీలతో సమైక్య హోరు
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. బస్టాండ్ సెంటర్, నల్ల వంతెన, ఎర్ర వంతెనల మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకూ ఈ ర్యాలీ సాగింది. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో కాకినాడ గొడారిగుంట నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఎన్ఎఫ్సీఎల్ రోడ్, ఎస్. అచ్యుతాపురం, ప్రతాప్‌నగర్, స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ మీదుగా కొవ్వాడ వరకూ సాగింది. అక్కడ నుంచి గంగనాపల్లి, స్వామినగర్‌లలో వేణు ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం పాదయాత్ర చేపట్టారు. రిటైర్డు డీఐజీ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పిఠాపురం పట్టణ పురవీధులు, మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది. కేంద్ర కమిటీ సభ్యుడు గంపల వెంకట రమణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి నుంచి బైక్‌లపై పార్టీ శ్రేణులు మండల పరిధిలోని గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి నగర కో- ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ సాగింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. పార్టీ కో-ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరం కాసివాని తూము నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అనాతవరం వరకు సాగింది. పార్టీ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై గంగిరెద్దులతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణ కన్వీనర్లు పేర్నిడి ఈశ్వరరావు, గుణ్ణం రాజబ్బాయిలు పాల్గొన్నారు. కో-ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ మండపేట నుంచి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ద్వారపూడి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాజులూరు మండలం కుయ్యేరు నుంచి గొల్లపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఏనుగుల మహల్ వరకూ జరిగిన బైక్ ర్యాలీలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డి చంటి, ముసునూరి వేంకటేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు నుంచి బైకు ర్యాలీ ప్రారంభించిన పార్టీ శ్రేణులు మోరంపూడి, హుకుంపేట, శాటిలైట్ సిటీ డీ-బ్లాక్ మీదుగా సాగింది. శివకోడు నుంచి రాజోలు సెంటర్ వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. -
విభజనపై భగ్గుమన్న యువజనం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా యువత భగ్గుమంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో యువజనులు, విద్యార్థులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ యువత గళం విప్పారు. ఒంగోలులో ఉదయం పార్టీ కార్యాలయం నుంచి యువకులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో రాస్తారోకో చేపట్టారు. జిల్లాస్థాయి నేతల సహా అందరూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం అశాస్త్రీయమైనదన్నారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి ప్యాకేజీలు కోరడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చే హక్కు జైరాం రమేష్కుగాని, దిగ్విజయ్‌సింగ్‌కు గానీ ఎక్కడిదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రాల్లో ప్రజల చేత ఛీకొట్టించుకునేవారా తెలుగువారిని విభజించేది అంటూ మండిపడ్డారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయేది ఎక్కువగా విద్యార్థులే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికారప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నత్తల భీమేష్, జాజుల కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మారెడ్డి రామకృష్ణారెడ్డి, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విద్యార్థులు, యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం సమీపం నుంచి పట్టణం మొత్తం ర్యాలీ చేపట్టారు. అనంతరం దర్శిలోని గడియారస్తంభం సెంటర్లో మానవహారం చేపట్టడంతోపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు ఒక పక్క అన్యాయం జరుగుతుందని తెలిసినా సీమాంధ్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తమపై విశ్వాసముంచి గెలిపించిన నాయకులకు వెన్నుపోటు పొడిచిన వారికి బుద్ధి చెప్పేందుకు జనం మొత్తం సమాయత్తం కావాలన్నారు. కనిగిరిలో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి పాల్గొన్నారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం కేవలం ఆ రాష్ట్రాల్లోని వ్యతిరేకత మాత్రమే కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలన్నారు. సంతనూతలపాడులో నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా మోటారు బైకు ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే తొలినుంచి సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి సంఘీభావం పలికేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్కాపురంలో జరిగిన యువజనుల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. కోర్టుసెంటర్‌లో రాస్తారోకో చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి చేతగానితనం వల్లే రాష్ర్టం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకుంటేనే సీమాంధ్రలో సంతోషం ఉంటుందన్నారు. ముందుగా గిద్దలూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో యువకులు, విద్యార్థులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని, రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం కాకతప్పదని ఆయన అన్నారు. -
‘రాయల’ తెలంగాణ అంటే యుద్ధమే
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ అంటే టీఆర్ఎస్ మరో యుద్ధం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బంద్‌లో భాగంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తెల్లవారు జామున 5 గంటలకే జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ముందు బైఠాయించి, బస్సులను బయటికి రాకుండా ధర్నా చేశారు. ఆ తర్వాత పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీయే విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రుల దోపిడీని శాశ్వతంగా కొనసాగించేందుకు రాయల ప్రతిపాదనను కాంగ్రెస్ చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు, భూములను కాపాడుకోవడానికి సీమాంధ్రులు ఎంతకైనా తెగిస్తున్నారని, అందులో భాగమే రాయల తెలంగాణ అని అన్నారు. నీటి దోపిడీని సాగించేందుకు కేంద్రంపై సీమాంధ్రులు వత్తిళ్లు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేంద్ర రాయల తెలంగాణ ప్రకటిస్తే టీఆర్ఎస్ మరో మహోద్యం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాయల తెలంగాణతో కేంద్ర ముందుకు వస్తే టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టాలని, అందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలను తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు పి.చంద్రశేఖర్, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటి దోపిడీని చట్టబద్ధం చేసేందుకే రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైందని, బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బెక్కం జనార్దన్, మహబూబ్, గుండా మనోహర్, నాగరాజు, కృష్ణముదిరాజ్, మోసిన్‌ఖాన్, మిట్టేనర్సింహ్మ, గౌతంశ్రీను, కిరణ్ పాల్గొన్నారు. -
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏరప్డింది. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు జెండాలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ బారికేడ్ల మీద నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అలాగే విద్యార్థులు ప్రారంభించిన బైకు ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయూ వద్ద భారీగా మోహరించారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం తెలంగాణ బంద్‌కు కూడా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది ఇంకెంత ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓయూలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు కొన్ని డ్రమ్ములకు నిప్పంటించి వాటిని కూడా విసిరేసిన ఘటనలు కనిపించాయి. -
రెండు నెలలుగా ఉద్యమం
‘‘రెండు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. అన్ని పనులు వదులుకుని సమైక్యమే ధ్యేయంగా రోడ్లపైకొచ్చాం. విభజిస్తే మా బతుకులు అంధకారమవుతాయని గొంతు చించుకుని అరుస్తున్నాం. ఎన్ని విధాలుగా నిరసన తెలపాలో అన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాం. మేము సైతం అంటూ మాతో పాటు చిన్న పిల్లలు కూడా ఉద్యమంలో కదం తొక్కుతున్నారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.’’ - సకల జనం ఆవేదన ‘‘ రాష్ట్ర విభజన జరిగితే అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మరింతగా నష్టపోతుంది. ఎంతగా అంటే నిత్యం తాగు, సాగు నీటి కోసం కొట్టుకోవాల్సినంత. హంద్రీ-నీవా నీరు ఇక వస్తుందో.. రాదో దేవుడికే ఎరుక.’’ - రైతన్న ఘోష సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు, ఉద్యోగులు కదం తొక్కుతుండడంతో రెండు నెలలుగా ఉధృత స్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగింది. అనంతపురం నగరంలో ఏపీఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకులకు కళాకారులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆట పాటలతో సమైక్యవాదాన్ని వినిపించారు. ఉపాధ్యాయులు, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఫేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జిల్లా పరిషత్ ఎదుట మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఎస్కేయూ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై ‘ఎస్కేయూ..60’ ఆకారంలో కూర్చుని రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదంటూ ఉరవకొండలో వేలాది మంది విద్యార్థులు గర్జించారు. ఒక్కసారిగా ై‘జె సమైక్యాంధ్ర’ అంటూ నినదించడంతో ఉరవకొండ దద్దరిల్లింది. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తూ ఉరవకొండలో సాయిప్రగతి పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో విద్యార్థులు రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. తాడిమర్రిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. గుంతకల్లులోని పాతబస్టాండ్ సర్కిల్లో ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. హిందూపురంలో ఎన్జీఓలు ర్యాలీ చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తోపుడు బండ్లపై ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిరుధాన్యాలు అమ్ముతూ, ఉపాధ్యాయులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు గంజి పంపిణీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో ఓడీచెరువు మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు ఉరి తగిలించుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మినీ సర్కస్ నిర్వహించారు. మడకశిరలో సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. జేఏసీ నాయకులు ఎస్బీఐని ముట్టడించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. కర్ణాటక బస్సులపై వీరప్పమొయిలీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు రాశారు. పుట్టపర్తిలో హిజ్రాలు ర్యాలీ చేశారు. జేఏసీ నాయకులు గ్రామ దేవత సత్యమ్మకు పూజలు నిర్వహించారు. అమడగూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నల్లమాడలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. కొత్తచెరువులో జేఏసీ నాయకులు యూపీఏ పెద్దల చిత్రపటాలతో శవయాత్ర నిర్వహించారు. పెనుకొండలో ట్రాక్టర్ యజమానుల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, రొద్దంలో జేఏసీ నాయకులు ప్రజా బ్యాలెట్ చేపట్టారు. గోరంట్లలో జేఏసీ నాయకులు శరీరానికి ఆకులు చుట్టుకుని, సోమందేపల్లిలో టీ అమ్ముతూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో డాక్టర్లు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. కణేకల్లులో ఉప్పర కులస్తులు, ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రాప్తాడులో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ను శుభ్రం చేసి సమైక్యవాదులు నిరసన తెలిపారు. కల్లూరు వద్ద పెన్నానదిలో ‘సమైక్యాంధ్ర’ మంటలు వేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు మానవహారం నిర్మించి.. పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి రాష్ట్రం విడిపోకుండా చూడాలని ప్రార్థించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ఇంటి ంటికీ వెళ్లి సమైక్య నినాదాన్ని విన్పించారు. కాగా.. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42), గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన దాదావలి(25) శనివారం గుండెపోటుతో మరణించారు. -
నేడు యూత్ కాంగ్రెస్ బైక్‌ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న బైక్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు పశ్చిమ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ శర్మ తెలిపారు. బీజేపీ వికాస్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయానికే కాంగ్రెస్ పార్టీ యూత్ ర్యాలీ చేపట్టడం గమనార్హం. ర్యాలీలో ఐదు వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఉత్తమ్‌నగర్ నియోజకవర్గంలోని విపిన్ గార్డెన్ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్‌లపై కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకుని ర్యాలీగా బయలుదేరనున్నారని చెప్పారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళతామని రాహూల్ శర్మ అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్యర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న వికాస్ ర్యాలీ ఓ నాటకమన్నారు. ఢిల్లీలోని యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విధాన సభ ఎన్నికల్లో ఉత్తమ్ నగర్ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందన్నారు. ఆదివారం నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో గుజరాత్ నుంచి సైతం ఎన్ఎస్యూఐ సభ్యులు పాల్గొంటున్నట్టు తెలిపారు. -
బైక్ ర్యాలీతో దద్దరిల్లిన అనంత
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీతో అనంతపురం దద్దరిల్లింది. వేలాది మంది కార్యకర్తలు జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పాతవూరు, శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్ట్స కళాశాల, క్లాక్‌టవర్ మీదుగా సుభాష్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, రాప్తాడు, శింగనమల నియోజకవర్గ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తీర్మాన బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. పజల మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. 59 రోజుల నుంచి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారన్నారు. కాగా, టీడీపీ ఎటూ తేల్చుకోలేక వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేక నిందలు వేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైన పార్టీ వైఎస్సార్ సీపీనేనన్నారు. సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు నేతృత్వంలో పాడిన పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, మిద్దె భాస్కర్ రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లింగాల రమేష్, రంగంపేట గోపాల్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చింతకుంట మధు, విద్యాసాగర్‌రెడ్డి, మారుతీనాయుడు, బలరాం, గౌస్, సత్తీష్, మారుతీ ప్రకాష్, రఫి, జయరాం నాయక్, మహానంద రెడ్డి, బోయ సుశీలమ్మ, ప్రమీలమ్మ, ఉషారాణి, శ్రీదేవి, కృష్ణవేణి, దేవి, అంకిరెడ్డి ప్రమీల, ప్రశాంతి, సావిత్రమ్మ, కే పార్వతి, పుష్పావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారి బైకు ర్యాలీ
-
ఊరూవాడా.. జగన్నినాదం
రెండో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు సాక్షి నెట్వర్క్: పదహారు నెలల జైలు జీవితం నుంచి వైఎస్ జగన్ జనంలోకి అడగుపెట్టగానే వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కక్షిదారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఆళ్లగడ్డ మండలం అహోబిలం దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు. కడపలో అప్సర సర్కిల్లో ఆటోకార్మికులు, మాసీమ బాబు ఆధ్వర్యంలో మాసీమ సర్కిల్లో, అల్మాస్‌పేట యూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సర్కిల్‌లో, పవర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం నిర్వహించారు. జిల్లాలోని అనేక దేవాలయాల్లో టెంకాయలు కొట్టి అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లాలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయగా, కార్యకర్తలు అన్నదానం నిర్వహించారు. జైలు నుంచి జగన్ విడుదల దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తిరుపతి తుడా సర్కిల్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు. విశాఖ జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు బైక్‌ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా ర్యాలీలు, పూజలు చేసి, బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజవర్గంలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున మిఠాయిలు పంచిపెట్టడంతోపాటు, బైక్ ర్యాలీలు తీశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జగన్ అభిమానులు కోయవేషాలతో సందడి చేశారు. జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడిలో పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి, కూనవరంలలో దళిత పేటల్లో సామూహిక భోజనాలు చేశారు. అంధుల పాఠశాలలో పండ్లు పంచిపెట్టారు. ఏజెన్సీలో ప్రదర్శన నిర్వహించి చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు, దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లాలో వృద్ధులు, మహిళలకు నూతన వస్త్రాలు, పండ్లు పంచిపెట్టారు. మంగళగిరిలోని పానకాల స్వామికి 101 బిందెల పానకాన్ని సమర్పించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్నారులకు స్వీట్లు, పండ్లు, బెలూన్లు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో వైఎస్ అభిమానులు తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇల్లెందులో సమ్మక్కసారక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. నల్లగొండ జిల్లాలో స్వీట్లు పంపిణీ చేసి, ర్యాలీలు తీశారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బెంగళూరులోనూ మంగళవారం సంబరాలు కొనసాగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఉదయం నుంచే సంబరాల్లో మునిగితేలారు. పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చారు. స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. -
మహా సంకల్పం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ఉద్యమమే ఊపిరిగా జిల్లా ప్రజలు అలుపెరుగని సమరం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర తప్పా మరో ప్రత్యామ్నాయం లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు... ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు కదం తొక్కుతుండడంతో ‘సమైక్య’ సమరం ఉవ్వెత్తున సాగుతోంది. 54వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. అనంతపురంలో జాక్టో నేతలు దీక్షలు కొనసాగిస్తూనే.. చెవిలో పూలు పెట్టుకుని, బూట్లు శుభ్రం చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే వేపాకు మండలతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ఎన్జీఓలు, పంచాయితీరాజ్, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24న జిల్లాలో తలపెట్టిన మహా మానవహారం విజయవంతం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో వివిధ సంఘాల జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బహుజన మేధావుల సదస్సు నిర్వహించి.. ఉద్యమానికి మద్దతు పలికారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన సర్పంచులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ప్రభుత్వానికి పంపారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏన్టీయూ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. మడకశిరలో విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రోడ్డుపైనే చదువులు కొనసాగించారు. అమరాపురంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి... కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ధర్మవరంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే యజ్ఞం చేశారు. ధర్మవరంతో పాటు బత్తలపల్లి, ముదిగుబ్బ, ఆత్మకూరు, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, పెనుకొండ, పామిడి, గుత్తి, రొద్దం, పరిగి, కణేకల్లులో సమైక్యవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వేలాది మంది వాల్మీకులు గర్జించారు. ర్యాలీ, బహిరంగసభతో ‘సమైక్య సింహ గర్జన’ చేశారు. జేఏసీ నేతలు రోడ్డుపైనే మిరపకాయలు, బజ్జీలు విక్రయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు రిలేదీక్షలను కొనసాగించారు.లేపాక్షిలో సోమవారం తలపెట్టిన ‘బసవన్న రంకె’ సభకు సర్వం సిద్ధం చేశారు. హిందూపురంలో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు బడిత పూజ చేశారు. కదిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24న నిర్వహించనున్న మహా మానవహారంపై కదిరి డివిజన్లోని అన్ని మండలాల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చెవిలో పూలు, పొర్లు దండాలు, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎరుకల కులస్తులు, న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. ఓడీసీలో జేఏసీ నేతలు రాస్తారోకో చేపట్టారు. కొత్తచెరువులో రిటైర్డ్ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ, పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. పెనుకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లిలో సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ నేతలు గడ్డితింటూ నిరసన తెలిపారు. పరిగిలో జేఏసీ నేతలు ఈలలు వేస్తూ ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, రాజకీయ జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. క్లబ్ హోటల్ రామయ్య ఉచితంగా టిఫిన్ పెట్టారు. మేదర్లు రోడ్డుపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. కణేకల్లులో కుమ్మర్లు కుండలు చేస్తూ నిరసన తెలిపారు. నార్పలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. సోనియా, షిండే, దిగ్విజయ్, కేసీఆర్ మాస్కులు ధరించిన వ్యక్తులను కొరడాలతో కొడుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థులు రిలేదీక్షలు చేశారు. మహిళా ఉద్యోగులు గాలిపటాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పెద్దపప్పూరులో జాతీయపతాకంతో జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. యాడికిలో రాయలచెరువు, యాడికి గ్రామనౌకర్లు రిలేదీక్షలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కూడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి. -
విభజనాగ్ని
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు గర్జిస్తున్నారు. పట్టణాలే కాదు.. పల్లెల్లోనూ స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు. 53వ రోజైన శనివారం కూడా జిల్లాలో ఉద్యమ సెగలు ఉవ్వెత్తున ఎగిశాయి. అనంతపురం నగరంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన.. బైక్ ర్యాలీ నిర్వహించారు. రామన్ స్కూలు విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన, స్థానిక తెలుగుతల్లి విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. సోనియా, షిండే, కేసీఆర్, దిగ్విజయ్ మాస్కులు ధరించిన విద్యార్థులు మోకాళ్లపై నిలబడగా.. తెలుగుతల్లి వేషధారణలోని విద్యార్థిని వారిని కొర డాతో కొడుతూ వినూత్న నిరసన తెలపడం నగర వాసులను ఆకట్టుకుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ లెక్చరర్స్ (జాక్‌లో) ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లు, గ్లాసులతోనూ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణ దేవరాయలు, తెలుగుతల్లి, స్వామి వివేకానంద వేషధారణతోనూ ర్యాలీలు చేశారు. అంతకుముందు టవర్‌క్లాక్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి... సమైక్యాంధ్రపై ఆలోచనాత్మకమైన ప్రదర్శన చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేశారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు స్థానిక సప్తగిరి సర్కిల్లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. హౌసింగ్, నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్ శాఖల ఉద్యోగులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జేఎన్టీయూలో ఉద్యోగుల రిలే దీక్షలకు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ధర్మవరంలో ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో ఐసీడీఎస్ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీ చేశారు. గుంతకల్లులో జేఏసీ నాయకులు హంద్రీ-నీవా కాలువలో శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు కసాపురానికి పాదయాత్రగా వెళ్లి... ఆంజనేయస్వామికి 101 టెంకాయలు కొట్టారు. గుత్తిలో ఉపాధ్యాయులు ఖాళీ డబ్బాలతో ర్యాలీ చేశారు. పామిడిలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది పాల్గొని జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఇదే పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విద్యుత్ ఉద్యోగులు పచ్చిమిరప కాయలు కొరుకుతూ, సమైక్యవాదులు గుగ్గిళ్లి అమ్మి.. కేసీఆర్ వేషధారణలో బూట్ పాలీష్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థుల భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కదిరిలో అమడగూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, కదిరి మార్కెట్ యార్డు ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో మహిళలు పెద్దఎత్తున ర్యాలీ చేశారు. మడకశిరలో మార్కెట్‌యార్డు ఉద్యోగులు, జేఏసీ నాయకులు మానవహారం నిర్మించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అమరాపురంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు సంతలో కూరగాయలు అమ్ముతూ నిరసన తెలిపారు. ఓడీచెరువులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు దుకాణాలు మూసివేయించి, ర్యాలీ చేశారు. పరిగిలో కొడిగెనహళ్లి గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. రొద్దంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్డుపైనే పాఠాలు చెప్పారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయకుండా.. శవాలపై చిల్లర ఏరుకుంటున్నారని రాయదుర్గంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంత్రుల మాస్కులు ధరించి శ వయాత్ర నిర్వహించారు. కుమ్మర్లు, విద్యార్థులు ర్యాలీ చేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కుండలు తయారు చేసి నిరసన తెలిపారు. కణేకల్లులో ఏపీ ఎన్జీఓలు బెలూన్లతో ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లిలో సమైక్యాంధ్రపై గ్రామసభలు నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయినులు రిలేదీక్షలు చేపట్టారు. శింగనమలలో సమైక్యాంధ్రకు మద్దతుగా సర్పంచులు, కార్యదర్శులు తీర్మానం చేశారు. బుక్కరాయసముద్రం నుంచి వందలాది మంది సమైక్యవాదులు అనంతపురానికి పాదయాత్ర చేపట్టారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. నార్పలలో జేఏసీ నాయకులు ర్యాలీ, తాడిపత్రిలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గొడుగులతో నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. కూడేరులో జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో మహిళా గర్జన నిర్వహించారు. -
34వ రోజూ జోరుగా సమైక్యాంధ్ర ఉద్యమం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 34వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు మెడలో తగిలించుకుని ప్రదర్శన చేశారు. ఎన్జీవో, మెడికల్ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, వాణిజ్య పన్నులశాఖ, మున్సిపల్ జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డ్వామా ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధర్మవరంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. వేలాది మంది సమైక్యవాదుల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో వైద్య సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. చిలమత్తూరులో పూసల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. ఆదర్శ రైతులు రిలే దీక్షలకు దిగారు. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అమడగూరు మండలం మహమ్మదాబాద్ హైస్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కదిరి డివిజన్ జర్నలిస్టులు క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతిలో శవపేటికలో సోనియా దిష్టిబొమ్మ ఊరేగించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర ఎన్పీకుంటకు చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2-కే రన్లో వేలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు. మడకశిరలో దేవుళ్ల చిత్రపటాలతో నిరసన ప్రదర్శన చేశారు. అమరాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఓడీ చెరువులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తచెరువులో రెడ్డ్డి సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, పుట్టపర్తిలో అంగన్వాడీ మహిళలు రిలే దీక్షలు చేశారు. పెనుకొండలో కార్మికులు నిరసన ప్రదర్శన, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గోరంట్లలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, శాంతి హోమం చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్, డీలర్లు పాల్గొన్నారు. వివిధ సంఘాల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో రజకులు ర్యాలీ చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నెలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో కళాశాల ఉద్యోగుల ర్యాలీలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విభజన అనివార్యమైతే... రాయల తెలంగాణ కోరుకోవడం తప్పుకాదని ఆయన అన్నారు. ఇదే పట్టణంలో మున్సిపల్, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఉరవకొండలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. జనవరం ధర్మవరం, న్యూస్‌లైన్ : ఇసుకేస్తే నేల రాలనంత జనం.. దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదం.. వెరసీ ధర్మవరం పట్టణం సోమవారం లక్ష గళ ఘోషతో మార్మోగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. ఉదయం నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా భారీ ఎత్తున జనం పట్టణంలోని కాలేజీసర్కిల్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కళాజ్యోతి, పీఆర్టీ సర్కిల్ మీదుగా సుదర్శన్ కాంప్లెక్స్ వరకు... మరోవైపు సబ్‌జైల్ వరకు, ఇంకొకవైపుఆర్డీఓ కార్యాలయం వరకు... ఇలా అన్ని రహదారులు జనంతో నిండిపోయాయి. 11 గంటల సమయంలో అందరూ ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. జన నినాదాలతో పట్టణం దద్దరిల్లిపోయింది. అంతకు ముందు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వివిధ వేషధారణలతో నిరసన తెలిపారు. సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ నాయకులు ఎవరూ లేకుండా కేవలం జేఏసీ ఆధ్వర్యంలోనే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, జేఏసీ నేతలు రామమోహన్‌నాయుడు, ఉరుకుందప్ప, భాస్కరరెడ్డి, నాగార్జునరెడ్డి, నర్సింహులు, శెట్టిపి జయచంద్రారెడ్డి, పార్వతమ్మ, పెనుబోలు శంకర్, వేణుగోపాల్, ముత్యాలప్ప, బలరామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ధర్మవరం ఆర్టీఓ నాగరాజు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
వాడవాడలా‘మహా’ నివాళి
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి జిల్లాలో సోమవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన మేలును జిల్లా వాసులు స్మరించుకున్నారు. జిల్లావ్యాప్తంగా సంస్మరణ సభలు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు విరివిగా నిర్వహించారు. జిల్లాకు మేలు చేసిన రాజన్నా.. నిన్ను మరువం అంటూ అనేక చోట్ల స్థానికులు, గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో, గౌరవరంలో జరిగిన సభల్లో ఉదయభాను పాల్గొన్నారు. జగయ్యపేటలో స్థానిక నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నంలో పార్టీ పట్టణ నేతలు కిలారి రాధ, షేక్ సలార్ దాదా, గొర్రా విఠల్ పలువురు నేతలు జిల్లా కోర్టు, బైపాస్ రోడ్డు సెంటర్లో ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. వలందపాలెంలోని పాఠశాలలో పార్టీ నాయకులు శీలం మారుతీరావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మొత్తం 209 మంది రక్తదానం చేశారు. నాగాయలంకలో పార్టీ నాయకులు గుడివాక శివరావు వెయ్యిమందికి అన్నదానం చేశారు. హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన భారీ అన్నదాన, రక్తదాన శిబిరంలో పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు. గుడివాడలో స్థానిక నేత పొలుసు సురేంద్ర నేతృత్వంలో లయన్స్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన నేతృత్వంలో వెయ్యి మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు. మైలవరంలో పార్టీ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌లు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. జోగి రమేష్ నేతృత్వంలో రెండు వేల మందికి అన్నదానం, జ్యేష్ఠ రమేష్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడులో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిగామలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోనాయపాలెం, కొడకటికల్లులో పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌ల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ నాయకుడు తిరుపతి నారాయణరెడ్డి రక్తదాన శిబిరం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త తాతినేని పద్మావతి నేతృత్వంలో పెనమలూరు, గంగూరులో కార్యక్రమాలు జరిగాయి. గంగూరు సర్పంచ్ నందేటి దేవమణి, పార్టీ నేత రహీమ్‌లు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు మండలంలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో 23 అడుగుల దివంగత వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మూడు వేల మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు. -
సమైక్య గర్జన
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు సింహగర్జన చేస్తున్నారు. రాష్ట్ర విభజన ఆగేదాకా ఉద్యమ కెరటం ఎగిసిపడుతూనే ఉంటుందని స్పష్టీకరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 33వ రోజైన ఆదివారం కూడా జిల్లాలో సమైక్య నినాదం మార్మోగింది. వాడవాడలా దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది.వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం నుంచి తరలివచ్చిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తాడిపత్రి బస్టాండ్ , పాతవూరు, సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు, టవర్‌క్లాక్, నడిమివంక, శ్రీకంఠం సర్కిల్ తదితర ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. అలాగే నగరంలో జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ పరిధిలోని ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలు జెడ్పీ ఎదుట రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, అధ్యాపకులు, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ, మెడికల్ జేఏసీ, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టవర్‌క్లాక్ సర్కిల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోగటం విజయభాస్కర్‌రెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. కాంగ్రెస్ నేతలు దీక్ష కొనసాగించారు. పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. రోడ్డు డివైడర్లకు ఉచితంగా పెయింటింగ్ వేశారు. ఎరికల సంఘం ఆధ్వర్యంలో కర్రసాము ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాడిదలు, గొర్రెలకు సోనియాగాంధీ చిత్రపటాలు తగిలించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇటుకలపల్లిలో వాల్మీకులు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఎస్కేయూలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు. మడకశిరలో సమైక్యవాదులు గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్లిన పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని అడ్డుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలోని అమరజీవి శిబిరంలో దీక్ష చేస్తున్న జాక్టో నాయకులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలంటూ ఉపాధ్యాయులు భజన చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ యజమానుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపైనే వంటా వార్పు, ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలకు ఎమ్మెల్యే కాపు సంఘీభావం తెలిపారు. అలాగే నాయకులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు. ఇదే పట్టణంలో టీచర్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో నిరసనలు పెద్దఎత్తున జరిగాయి. బత్తలపల్లిలో వాల్మీకులు బంద్ నిర్వహించారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో న్యాయవాదులు రోడ్డుపైనే కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. వ్యాపారులు నడిరోడ్డుపై కూరగాయలు విక్రయించారు. విద్యార్థులు బైక్ ర్యాలీ చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయులు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు చేపట్టారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. క్రైస్తవులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. వడ్డెర్లు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు, న్యాయవాదుల దీక్షలకు వైఎస్సార్సీపీ నేత ఎల్ఎం మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు కోలాటాలు, వంటా వార్పుతో హోరెత్తించారు. బుక్కపట్నం, కొత్తచెరువులో సమైక్యవాదుల రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్ సంఘీభావం ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలని పుట్టపర్తిలో ఎమ్మెల్సీ గేయానంద్‌ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. పెనుకొండలో జర్నలిస్టులు రక్తదాన శిబిరం నిర్వహించారు. జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. అలాగే మంత్రులు ఎక్కడున్నారంటూ జ్యోతిష్కున్ని అడిగారు. గోరంట్లలో సమైక్యవాదులు భారీ ర్యాలీ చేశారు. శింగనమలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నార్పలలో తాపీ మేస్త్రీలు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటా వార్పు చేపట్టారు. మున్సిపల్ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఒంటికాళ్లతో నిరసన తెలిపారు. ఉరవకొండలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు వైఎస్సార్సీసీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు తుంగభద్ర జలాలతో తెలుగు తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. -
జోరు తగ్గని పోరు
జిల్లాలో సమైక్యపోరు జోరు తగ్గడం లేదు. ఉద్యమ జ్వాల రగులుతూనే ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా, జగన్‌కు సంఘీభావంగా యలమంచిలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యికి పైగా బైక్‌లతో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. మునగపాక, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల మీదుగా సుమారు వంద కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. చోడవరం నియోజకవర్గంలోనూ భారీ ర్యాలీ సాగింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఏజెన్సీ 11 మండలాల్లో బంద్ విజయవంతమైంది. -
సమైక్యహారం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు శనివారం కదం తొక్కారు. రోజురోజుకూ వారి ఉద్యమం తీవ్రమవుతోంది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం 32వ రోజు ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు ర్యాలీలు, నిరసన దీక్షలు కొనసాగించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడి ఇంటిని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖాధికారులు రిలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మంత్రి ఆనం నివాసం ముట్టడిలో ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేసినందుకు నిరసనగా నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టులో బంద్ పాటించారు. ఉద్యోగులు ధర్నా చేసి, వంటావార్పు నిర్వహించారు. పొదలకూరు మండలంలోని రేషన్‌షాపు డీలర్లు ప్రదర్శన జరిపారు. మనుబోలు ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో జరిపి, మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీపీగూడూరు మండలం నరుకూరు సెంటర్లో సమైక్యవాదులు రాస్తారోకో జరిపారు. గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఆదర్శరైతులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. పాస్టర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే ప్రార్థన జరిపారు. విద్యార్థులు రోడ్లపైనే చెస్, క్యారం ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 6వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగించారు. కోవూరు ఎన్జీఓ హోంలో మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం నుంచి పల్లిపాళెం వరకు జేఏసీ నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండు వద్ద అనంతసాగరం మండలానికి చెందిన గ్రామ సేవకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు నెల్లూరుపాళెం- ఆత్మకూరు రహదారిపై, ఆర్టీసీ డిపో ఎదుట పొట్టి శ్రీరాములు మాస్కులు ధరించి రాస్తారోకో నిర్వహించారు. చైతన్యపాఠశాల విద్యార్థులు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో తెలుగుతల్లి అవతారంలో వినూత్న నిరసన తెలిపారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని కళాశాల ప్రాంగణం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో,మెరిట్స్కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర, భరతమాత చిత్రాల వద్ద విద్యార్థులు, ఉద్యమకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వింజమూరులో 26వ రోజు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. కావలి ఆర్డీవో కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కాంగ్రెస్ నేత గ్రంధి యానాదిశెట్టి ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేతికి నల్లరిబ్బన్లతో సంకెళ్లులాగా వేసుకొని మోకాళ్లపై ట్రంకురోడ్డుపై నడిచి నిరసనను తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు, భీమసేనుడి వేషధారణలో ర్యాలీ కొనసాగించారు. జెడ్పీ బాలుర పాఠశాల తలుపులకు సమైక్యవాదులు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు లోపలికి వెళ్లలేకపోయారు. పోలీసులు కలుగజేసుకొని ఉపాధ్యాయులను పాఠశాలలోకి పంపారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 18 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. నాయుడుపేటలో ప్రయివేట్ స్కూల్ విద్యార్థులంతా భారీ ప్రదర్శన నిర్వహించి పాతబస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. -
ఉద్యమాగ్ని
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నిర్ణయంపై ‘అనంత’ అట్టుడుకుతోంది. నెల రోజులుగా ఉద్యమాగ్ని ప్రజ్వరిల్లుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకుసాగారు. అనంతపురంలో పశు సంవర్ధకశాఖ ఉద్యోగులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఏపీ ఎన్జీఓలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ర్యాలీలు నిర్వహించారు. ముస్లిం యువకులు ఒంటెలు, గుర్రాలపై ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టగా.. చిన్నారులు తెలుగుతల్లి, జాతీయ నాయకుల వేషధారణలతో నగరంలో ర్యాలీ చేపట్టారు. జాక్టో, ఆర్ట్స్‌కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లుభవనాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజాసంఘాలు, ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, కార్మికశాఖ, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుర్నాథ్రెడ్డి, కాపురామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటించింది. ఆయాశాఖలు చేపట్టిన రిలేదీక్షా శిబిరాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. బోధనేతర ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించి సోనియా, దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిరసనల హోరు ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. తాడిమర్రి, బత్తలపల్లిలో సమైక్యవాదులు ర్యాలీలు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ముదిగుబ్బలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కులాల ఆధ్వర్యంలో సమైక్య నిరసనలు పెల్లుబికాయి. గుంతకల్లులో జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. గుత్తి, పామిడిలో జేఏసీ, జాక్టో ఆధర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో మాల కులస్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సడ్లపల్లె మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో టీచర్లు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీట్రాన్స్కో డివిజనల్ కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. చిలమత్తూరులో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు రిలేదీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో విద్యార్థి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. తేరువీధి, గాంధీబజార్‌కు చెందిన ప్రజలు ర్యాలీ చేశారు. అమరాపురంలో రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. పుట్టపర్తిలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఓడీచెరువులో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాలీ నిర్వహించి..రాస్తారోకో చేశారు. గోరంట్లలో వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ముగ్గుల పోటీలు నిర్వహించారు. రొద్దం, పరిగిలో ట్రాన్స్‌కో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లెలో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మహిళా టీచర్లు పూర్ణకుంభం చేతపట్టుకుని ర్యాలీ చేశారు. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యవాదులు రాయదుర్గంలో బంద్ చేశారు. చిరు వ్యాపారులు రిలే దీక్షలు చేపట్టారు. శింగనమలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరులో రోడ్లపైనే వరినాట్లు వేసి నిరసన తెలిపారు. బుక్కరాయసముద్రంలో జేఏసీ నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నార్పలలో బెస్త సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ వద్ద రిలేదీక్షలు చేపట్టగా.. మునిసిపల్ ఉద్యోగులు మునిసిపల్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. యాడికిలో హమాలీలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో సమైక్యవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో వీఆర్ఓలు రిలేదీక్షలు చేపట్టారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర గొప్పతనాన్ని చాటిచెప్పారు. -
జగన్ దీక్షకు మద్దతుగా అనంతపురంలో బైక్ ర్యాలీ
-
జిల్లాలో ఉధృతమవుతోన్న సమైక్య ఆందోళన
సాక్షి, అనంతపురం : జిల్లా నలుమూలలా విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉంది. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కుపాదం మోపినా ఉద్యమకారులలో ఇసుమంతైనా ధైర్యం సడలలేదు. అణచివేత యత్నాలను తిప్పికొట్టి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సింహాలై గర్జిస్తున్నారు. సమైక్యవాదుల వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం ఉధృతంగా సాగింది. అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన వందలాది మంది ప్రజలు వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య గళాన్ని వినిపించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ జాక్టో, స్వర్ణకారుల సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. న్యాయవాదులు 48 గంటల దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు జోలె పట్టి భిక్షాటన చేశారు. టవర్‌క్లాక్ సర్కిల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లేవారికి ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా అంటూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ముసుగులు వేసుకుని.. మోకాళ్లతో నడిచారు. న్యాయశాఖ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. పశుసంవర్ధక, ట్రాన్స్‌కో ఉద్యోగులు నగరంలో ర్యాలీ చేశారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, మునిసిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. ఎస్కేయూలో ఆరని సమైక్య సెగ ఎస్కేయూలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి పిండప్రదానం చేశారు. వాడవాడలా నిరసనలు.. ధర్మవరంలో మెకానిక్, విద్యుత్ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, రెవెన్యూ, ప్రజాసంఘాలతో పాటు వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సమైక్య వాదులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్లులో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. గుత్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. మోకాళ్లపై నడిచి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హిందూపురంలో ఆర్యవైశ్య సంఘం వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షిలలో ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కదిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బందితో పాటు ఆర్య వైశ్యులు, ఫ్రూట్ మర్చంట్, మటన్ వ్యాపారులు, కుమ్మరవాండ్లపల్లి గ్రామస్తులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించి సమైక్యవాదం విన్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చీపుర్లు చేతబట్టి పుర వీధులు శుభ్రపరిచి నిరసనను తెలియజేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. అనంతరం సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కుందుర్పిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మంది గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో హిజ్రాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. అమరాపురంలో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. రైతులు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేశారు. ఓడీసీ, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. పెనుకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై ప్రార్థనలు చేశారు. ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రొద్దం, పరిగి మండలాల్లో సమైక్య ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలో వైద్యసిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు, రాప్తాడులో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శింగనమలలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్లూరులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. నార్పలలో కురబసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. తాడిపత్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై మానవహారంగా ఏర్పడి.. యోగాసనాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు రోడ్డుపైనే చదువుకుంటూ నిరసన తెలిపారు. యాడికిలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. పెద్దవడుగూరులో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపై స్నానాలు చేశారు. టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. బెలుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరులో ఉద్యోగులు, సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించారు. -
జన గర్జన
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు సమరోత్సాహంతో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన ఆపేదాకా విశ్రమించబోమంటూ శపథం చేస్తున్నారు. 22వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ప్రజలు, వివిధ జేఏసీల నాయకులు, ఎన్జీఓలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు చురుగ్గా పొల్గొన్నారు. అనంతపురం నగరంలో జేఏసీ, ఎన్జీఓల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. శ్రీకంఠం సర్కిల్లో అరగంట పాటు మానవహారం నిర్మించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చేసి.. ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో స్థానిక సప్తగిరి సర్కిల్లో బైక్‌లతో రౌండ్లు కొడుతూ.. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. డ్వామా ఉద్యోగులు ప్రదర్శన చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు వేలాది మంది రైతులతో ర్యాలీ చేశారు. చిన్న ట్రాక్టర్లతో ర్యాలీ చేయడంతో నగరమంతా హారన్లతో మార్మోగింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఆస్పత్రి, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన నగరంలో వాహనాలకు సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. నగరానికి చెందిన వేలాది మంది మహిళలు, వృద్ధులు కూడా ర్యాలీ నిర్వహించారు. ‘హైదరాబాద్ వెళ్లేవారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా జారీ చేస్తామం’టూ సమైక్యవాదులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో కట్టిన బ్యానర్ ఆకట్టుకుంది. ఎస్కేయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ నాయకుడు నాగభూషణ్‌రెడ్డి, ఇటుకలపల్లి సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లతో వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ సమీపంలోని మారుతీనగర్ కాలనీ మహిళలు ర్యాలీగా వచ్చి.. వర్సిటీ ఎదుట సోనియా దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేశారు. సేతు, పాంచజన్య, రాధాస్కూల్ ఆఫ్ లర్నింగ్ పాఠశాలల విద్యార్థులు వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం, రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. గుంతకల్లులో సమైక్యవాదులు జాతీయరహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ఉపాధ్యాయులు క్యాట్ వాక్ చేస్తూ నిరసన తెలిపారు. పామిడిలో సమైక్యవాదులు, హిందూపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రెడ్డిసేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు చేశారు. కదిరిలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ చేశారు. కటారుపల్లి రైతులు, విద్యార్థి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. జేఏసీ నాయకులు, సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మడకశిరలో వక్కలిగులు ఎడ్లబండ్ల ప్రదర్శన, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. వెటర్నరీ సిబ్బంది, వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుడిబండలో సమైక్యవాదుల ఆందోళనలు మిన్నంటా యి. అమరాపురంలో ఉపాధ్యాయులు, వీఆర్వోలు, వీఆర్ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఓడీసీ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో సమైక్య నిరసనలు కొనసాగాయి. పెనుకొండలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాయదుర్గంలో సై మెక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, కురిహినశెట్టి సమాజ జనుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఇద్దరు సమైక్యవాదులు ఆమరణ దీక్ష చేపట్టారు. సీకేపల్లిలో జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. ఆత్మకూరులో ఐకేపీ ఉద్యోగులు, రామగిరిలో విద్యార్థులు, శింగనమలలో పెయింటర్లు, నార్పలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తాడిపత్రిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై యోగాసనాలు వేశారు. యాడికిలో జేఏసీ నాయకులు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఉరవకొండలో ప్రదర్శన నిర్వహించారు. విడపనకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. -
ఎగిసిన ఉద్యమ జ్వాల
కర్నూలు, న్యూస్‌లైన్: విభజన జ్వాలల్లో జిల్లా అట్టుడుకుతోంది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అన్ని ప్రాంతాలు ఉద్యమాలతో రగిలిపోతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనన్న భావన ప్రజల్లోకి వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా సమైక్యపోరు మహోద్యమంగా మారింది. నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల ప్రజలు సైతం పోరుబాట పట్టడం ద్వారా ప్రజా జీవనం స్తంభించిపోతోంది. నిరసన కార్యక్రమాలకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు అవుతున్నారు. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలలు సక్రమంగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొంటుండటంతో జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన స్తంభించిపోయింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లాలో తొమ్మిదో రోజు గురువారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలు నగరంలో మెడికల్ దుకాణాలను బంద్ చేసి నిర్వహకులు సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. డ్రగ్ డీలర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగర ప్రధాన రహదారులన్నీ ఆందోళనకారులతో కిటకిటలాడాయి. పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించేందకు ప్రయత్నించినా ఉద్యమకారులు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వైద్యులు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. సమైక్య రాష్ట్రం కోసం వినాయక్‌ఘాట్ వద్ద అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఆదోనిలో దాదాపు కిలో మీటరు మేర రోడ్డుకు ఇరువైపులా సమైక్యవాదులు చేయిచేయి కలిపి మానవహారంగా నిలబడి సమైక్య నినాదాలు వినిపించారు. జేఏసీ పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మానవ హరంలో పాల్గొన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. కాంగ్రెస్, పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేశారు. గోస్పాడులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఒంటెద్దు బండ్లతో ప్రదర్శన జరిపారు. కోడుమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు సమైక్య ఆందోళన నిర్వహించారు. ఆలూరులో ఆర్ఎంపీల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. హాలహర్విలో జేఏసీ ఆద్వర్యంలో నడిరోడ్డుపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరులో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గౌడుసెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చెర్మైన్ మాచాని నాగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వై.రుద్రగౌడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి. రిలే దీక్షల విరమణ కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర కన్వీనర్ సీ.హెచ్. మద్దయ్య చేపట్టిన రిలే దీక్షలను ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమీటి సభ్యులు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మ్యుజియం ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు నాల్గో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే తెలుగు జాతిని రెండు ముక్కలుగా విభజించేందుకు పూనుకుందన్నారు. దీక్షలకు ప్రముఖ సామాజిక వేత్త సంజీవరెడ్డి, పలు ప్రజా సంఘాలు సఘీభావం తెలిపారు. దీక్షలలో నాగన్న, సుధాకర్, ప్రభాకర్, ఏసు, గోపాల్లచే ఆ పార్టీ నాయకులు డా.సలీం, పులిజాకబ్, ఎస్.ఎ రేహ్మాన్, తోఫిక్ అహ్మద్‌లు పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన హైలెవల్ కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని భూమన వ్యాఖ్యానించారు. అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ఆటోమోబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
బైక్ ర్యాలీ నిర్వహించిన భూమన