- రావులపాలెంలో అభిమానుల భారీ బైక్ ర్యాలీ
ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
Published Sun, Oct 23 2016 7:34 PM | Last Updated on Wed, Oct 3 2018 7:48 PM
రావులపాలెం:
బాహుబలి సినిమాతో సినీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా ఇండస్ట్రీయల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు ఆధ్వర్యంలో రావులపాలెంలో ఆయన అభిమానులు పండుగలా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి భారీగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలివచ్చి మోటరు బైకులపై చక్కర్లు కొడుతూ తీ¯ŒSమార్ డప్పులు బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. అనంతరం వందలాది బైకులపై ప్రభాస్ చిత్రాలు ఉన్న టీ షర్టులు ధరించి జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక జాతీయ రహదారిపై రవిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ మండలంలోని రావులపాలెం, ఈతకోట, వెదిరేశ్వరం, కొమరాజులంక, ఊబలంకల మీదుగా ఆత్రేయపురం మండలం వైపు సాగింది. ఈ ర్యాలీలో బాహుబలి–2 సినిమాకు సంబంధించి విడుదలైన చిత్రాలతో అభిమానులు సందడి చేశారు. డార్లింగ్ ప్రభాస్ అని ముద్రించిన పతాకాలు ఆకట్టుకున్నాయి.
Advertisement
Advertisement