ravulapalem
-
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
రావులపాలెం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు కథనం ప్రకారం.. గత నెల 16న రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడిపందాల కేసు నమోదు చేశారు. మండలంలోని పొడగట్లపల్లిలో నిర్వహించిన కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, అప్పట్లో పలువురిని అరెస్టు చేశారు. కొన్ని వాహనాలను, కోళ్లను స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసులో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమాని కుంచెర్లపాటి లక్ష్మణరాజు నుంచి సీఐ ఆంజనేయులు అప్పట్లో కొంత మొత్తం లంచంగా తీసుకున్నాడు. అనంతరం చార్జిషీటులో తక్కువ సెక్షన్లు నమోదు చేసేందుకు, లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేశాడు.దీంతో విసిగిపోయిన లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సీఐ ఆంజనేయులుకు లక్ష్మణరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం రూ.50 వేలు లంచం ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. -
జననేత కోసం పోటెత్తిన రావులపాలెం జనం
-
రావులపాలెంలో టీడీపీ సభలో వ్యాపారులపై నోరు జారిన చంద్రబాబు
-
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్మకాలు.. చంద్రబాబుకు మరో వర్గం దూరం..
-
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బీసీ, దళిత, మైనారిటీలను అణగదొక్కేందుకే చంద్రబాబు కుట్ర..
-
మిద్దెతోట పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట దంపతులు
-
కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!
‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం ధర ఘనం ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది. రావులపాలెం కేంద్రంగా.. ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్‌లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు. పోషకాలు అధికం ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. సాగులో ప్రతికూలతలు ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ. తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం రావులపాలెం మార్కెట్ యార్డ్‌కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్‌పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం పెట్టుబడి అధికం ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం -
బిగ్‌షాట్‌లే టార్గెట్: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం
సాక్షి, అమలాపురం టౌన్: కోటీశ్వరులను ఎంచుకుని అతడు తొలుత బెదిరింపులకు పాల్పడతాడు. దారికి రాకపోతే కిడ్నాపులు చేస్తాడు. దానికీ దిగిరాకపోతే హత్యలకు సైతం తెగబడతాడు. ఐ.పోలవరం మండలానికి చెందిన త్రినాథవర్మ ఒకటిన్నర దశాబ్దాల నేర చరిత్ర ఇది. గత నెలలో రావులపాలెంలోని ఓ ఫైనా న్స్ వ్యాపారి ఇంటి వద్ద తుపాకితో కాల్పులకు తెగబడ్డ ఘటనలో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పోలీసు రికార్డుల ప్రకారం ఒకటిన్నర దశాబ్దాల కాలంలో త్రినాథవర్మ రెండు హత్యలు, నాలుగు కిడ్నాపులకు పాల్పడ్డాడు. 2011 ఆగస్టు 28న అమలాపురంలో ఆక్వా రైతు కేవీ సత్యనారాయణరాజును డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి సత్యనారాయణరాజుకు సజీవదహనం చేశాడు. సాక్ష్యాధారాలు మా యం చేశాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో ధనికుడిని డబ్బుల డిమాండ్ చేశాడు. చివరకు అతడి ని కూడా కిడ్నాప్ చేసి, హతమార్చాడు. అప్పట్లో ఈ కేసు అమలాపురంలో సంచలనం రేపింది. డబ్బుల డిమాండ్ చేస్తూ బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి త్రినాథవర్మపై నాలుగు కేసులు ఉన్నాయి. డబ్బుల కోసమే రావులపాలెం కాల్పులు రావులపాలెంలో పైనాన్షియర్ గుడిమెట్ల వెంకట సత్యనారాయణరెడ్డి (కాటా బాస్) కుమారుడు ఆదిత్యరెడ్డిని కూడా బెదిరించి డబ్బులు గుంజాలనే లక్ష్యంతోనే గత నెల ఐదున త్రినాథవర్మ గ్యాంగ్ వెళ్లింది. ఆదిత్యరెడ్డి అనూహ్యంగా ఎదురు తిరగడంతో దుండగులు తుపాకి కాల్పులకు తెగబడ్డారు. ఈ తరహా నేరాలకు త్రినాథవర్మే సూత్రధారి అని, అతడి అనుచరులు పాత్రధారులని పోలీసులు చెబుతున్నారు. పోలీసు తనిఖీల్లో వర్మ రెండుసార్లు తుపాకులతో పట్టుబడ్డాడు. రావులపాలెం కాల్పుల ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, రావులపాలెం ఇన్చార్జి సీఐ డి.ప్రశాంతకుమార్లు ఈ కేసులో తీగ లాగారు. దీంతో త్రినాథవర్మ నేరాల డొంక కదిలింది. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. -
కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
సాక్షి, రావులపాలెం (కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రావులపాలేనికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిని చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. కాల్పుల్లో ఆదిత్యరెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఆదిత్యరెడ్డి ఎదురు తిరగడంతో గన్, బ్యాగ్ వదిలి దుండగులు పరారయ్యారు. దుండగులు వదిలి వెళ్లిన బ్యాగ్‌లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. చదవండి: ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో.. -
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
రావులపాలెంలో భారీ భద్రత బలగాలు
-
ద్విముఖ రూపుడు.. జగన్మోహనుడు
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): ముందు పురుష రూపం వెనుక భాగాన స్త్రీ రూపంతో ఏకశిలలో శివవిష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. సృష్టికి ఆదిలోనే స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ పుణ్యక్షేత్రంలో ముందు భాగం కేశవ రూపం, వెనుక భాగం జగన్మోహినీ స్త్రీ రూపం ఆకారంలో స్వయంభువుగా అవతరించాడు. స్త్రీ, పురుష రూపధారణతో కొలువైన శివ, విష్ణు దేవతామూర్తులను దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం. అంతేకాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి శివాలయం ఉండటం ఒక విశేషం. శివాలయంలో నీరు ఇంకిపోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెబుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు 6 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వుంటుంది. రావులపాలెం బస్టాండ్ నుంచి రెండు గంటలకోసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు 10న ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం గరుడ వాహనసేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కల్యాణం, 14న సదస్యం, 16న చక్రస్నానం, 17న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య తెలిపారు. -
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి వెల్లంపల్లి
-
తందూరీ టీ.. దీని కథేంటీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?
కొత్తపేట/రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా): బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిరియాల టీ వంటి వివిధ రకాల టీల గురించి విన్నాం.. తాగుతున్నాం.. భిన్న రుచులను ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ తందూరీ చాయ్ (టీ) ఏమిటనుకుంటున్నారా! ఇదో కొత్త రకం చాయ్.. సహజంగా అందరికీ తందూరీ అనే పదం చికెన్ వంటకాల్లో వింటాం. కోడి మాంస ప్రియులకు ఈ పదం గురించి బాగా తెలుస్తుంది. రెస్టారెంట్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి వండి తందూరీగా అందిస్తారు. మరి ఇక్కడ చాయ్‌లో తందూరీ ఏమిటనే సందేహం కలుగుతుంది కదా... చాయ్‌ను కూడా నిప్పుల పైనే తయారు చేస్తారు. దీని కథా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే రావులపాలెం అక్షర సినిమా థియేటర్స్ సమీపాన తందూరి చాయ్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ ఇలా చేస్తున్నారు.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమి మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిలో బొగ్గులు వేసి రోజంతా మండేలా తయారు చేశారు. ఎర్రగా బట్టీల్లో ఇటుకలా కాలుస్తుంటారు. సాధారణ టీ మాదిరిగానే పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి తయారు చేసి దానిని జార్‌లోకి తీసుకుని కొలిమి వద్దకు తీసుకువస్తారు. కొలిమిలో ఎర్రగా కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఒక ఇత్తడిపాత్రలో ఉంచుతారు. ఎర్రటి మట్టి గ్లాసులోకి ఆ చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టిపాత్ర వేడికి పొగలు చిమ్ముతూ, నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరి రుచి.. వాసన వస్తుంది. ఆ పాత్ర నుంచి మళ్లీ మట్టి గ్లాసులో పోసి విక్రయిస్తున్నారు. దీనిని తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. మంచి టేస్ట్ రిలాక్స్‌గా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం చాలా మంది చాయ్ తాగుతుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు చురుకుదనం, ఉత్సాహాన్ని పొందేందుకు చాలా మందికి చాయ్‌ని ఆస్వాదించడం అలవాటు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే, కొన్ని రుచి కోసమే తయారు చేస్తున్నారు. ఫిల్టర్ టీ, కాంటినెంటల్ టీ, స్ట్రాంట్ టీ, ధమ్ టీ పేర్లతో రకరకాలుగా అందిస్తున్నారు. రావులపాలెంలో యువకులు కొత్తగా ఆలోచించి ఉత్తరాది తందూరి చాయ్‌ను ఇక్కడ తయారుచేస్తూ స్థానికులను, టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు తందూరీ చాయ్ తయారు చేస్తూ టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. -
ఆరుగురు విలేకరులు అరెస్ట్..
సాక్షి,రావులపాలెం: రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించి, డ్రైవర్‌ను, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని సరకు యజమానిని బెదిరించిన ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. గురువారం రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14 తేదీ తెల్లవారుజామున స్థానిక అరటిమార్కెట్ యార్డు సమీపంలో తణుకు నుంచి రావులపాలెం వస్తున్న బియ్యం లోడు లారీని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఏడుగురు విలేకరులు ఆపారు. లారీ డ్రైవర్‌ను కిందకు దిగమని బిల్లులు చూపించాలని బెదిరించారు. డ్రైవర్ బిల్లులు చూపించినా ఇవి పీడీఎఫ్ రైస్, మీ ఓనర్‌కు ఫోన్ చేయ్, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఫోన్లో రైస్‌మిల్లు గుమస్తాతో మాట్లాడి రూ.రెండు లక్షలు ఇస్తే లారీని వదులుతామని లేకపోతే సీజ్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సరకు యజమాని గుంటూరుకు చెందిన కె.గంగాధరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆకొండి వీరవెంకటసత్య సూర్యనారాయణమూర్తి (పశ్చిమవాహిని, తిరుపతి), చిర్రా నాగరాజు (ఆర్టీఐ యాక్ట్ న్యూస్ చానల్), అయినవిల్లి విజయబాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక), ఉందుర్తి రవికుమార్ (డీఆర్ఎస్ యూట్యూబ్ చానల్), పలివెల రాజు (జైజనని తెలుగు దినపత్రిక), ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి దినపత్రిక)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడో ముద్దాయి సీహెచ్ రాజేంద్రప్రసాద్ (వి10 న్యూస్ చానల్) పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కొత్తపేట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ వి.కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు, అడిషనల్ ఎస్సై ఆర్. బెన్నిరాజు ఉన్నారు. -
అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి..
సాక్షి, రావులపాలెం: పండగకు కొత్త వస్త్రాలు తెస్తారని ఎదురుచూస్తున్న పిల్లలకు.. అమ్మ రాదనే విషయాన్ని ఎలా చెప్పాలి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఎలా వివరించాలని భార్య మృతదేహం వద్ద భర్త విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.. సంక్రాంతి పండగకు కొత్త దుస్తులు తీసుకొస్తామని పిల్లలకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురైన వార్త ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదంలో భార్య మృత్యువాత పడగా, భర్త గాయాలతో ఆస్పత్రి పాలవడం అందరినీ కలచివేసింది. రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అద్దంకి విజయ్‌కుమార్, జ్యోతికుమారి దంపతులు. వారు పిల్లలకు కొత్త దుస్తులు కొందామని మోటార్ సైకిల్‌పై రావులపాలేనికి వచ్చారు. చిన్నారులైన కొడుకు, కూతుర్లకు సరిపోయే అందమైన దుస్తులు వారికి దొరక్కపోవడంతో తణుకులో కొనుగోలు చేద్దామని సాయంత్రం రావులపాలెం నుంచి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఈతకోట వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడి పోయిన జ్యోతికుమారి (32)కి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలపాలైన విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై పి.బుజ్జిబాబు తెలిపారు. పిల్లలకు ఎలా చెప్పేది... పండగకు అమ్మ కొత్త వస్త్రాలు తీసుకొస్తుందని ఇంటి వద్ద ఎదురుచూస్తున్న పిల్లలకు నేనేమి చెప్పాలంటూ భర్త విజయ్‌కుమార్ సంఘటనా ప్రాంతంలో విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కొత్త దుస్తులతో పండగ చేసుకుందామని వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా... నేను పిల్లలను ఎలా పెంచాలి.. వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారంటూ ఆయన ఆవేదన చెందాడు. -
ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్
రావులపాలెం: ఎల్పీజీ గ్యాస్‌తో వెళుతున్న ట్యాంకర్‌ను క్రేన్‌తో వెళుతున్న లారీ వెనుకనుంచి ఢీ కొట్టడంతో గ్యాస్ లీకైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్‌ప్లాజా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పటంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని ఎల్పీజీ ప్లాంట్‌లో 17,920 కేజీల గ్యాస్‌ను నింపుకున్న ఒక ట్యాంకర్ హైదరాబాద్‌లోని చర్లపల్లి హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్‌కు బయలుదేరింది. ఆ ట్యాంకర్ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగా.. దాని వెనుక వస్తున్న లారీలోని క్రేన్ కొక్కెం ట్యాంకర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్‌కు గల ప్రెజర్ వాల్వ్ నాబ్ విరిగిపోయి గ్యాస్ లీకైంది. పెద్ద శబ్దంతో గ్యాస్ బయటకు రావడంతో టోల్‌ప్లాజా సిబ్బంది, రహదారి వెంబడి ఉన్న వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు. హైవే సిబ్బంది అప్రమత్తమై రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. కొత్తపేట, మండపేట, అమలాపురం, తణుకు పట్టణాల నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గ్యాస్ ట్యాంకర్‌పై నీళ్లు చల్లుతూ నిప్పంటుకోకుండా చూశారు. సుమారు రెండు గంటల పాటు గ్యాస్ లీకవుతూనే ఉంది. కాగా, ఈ గ్యాస్ ట్యాంకర్‌కు ముందు వెళుతున్న మరో గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ జార్ఘండ్‌కు చెందిన ఇర్ఫాన్ ఆలామ్ ఒక చెక్క ముక్కను గ్యాస్ లీకవుతున్న రంధ్రంలోకి నెట్టి ‘ఎంసీల్’ పూశాడు. ఈ చర్యలు ఫలితమిచ్చి గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హైవేపై రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా, సీఐ వి.కృష్ణ, ఎస్ఐ పి.బుజ్జిబాబు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. టోల్ ప్లాజా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై హైవే అధికారులకు నివేదిక ఇస్తామన్నారు. -
అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి
సాక్షి, తూర్పు గోదావరి : రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరటి లోడుతో వేగంగా వస్తున్న లారీ రావులపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి సర్వీస్ రోడ్లో నిలబడి ఉన్న భార్యభర్తలపై బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటనలో ఉప్పలపాటి సూర్యకుమారి మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలోకి వెళితే అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద డస్టన్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. రావులపాలెంకు చెందిన మోతమర్రి రాంబాబు తన పెళ్లిరోజు కావడంతో భార్యా,కుమార్తెతో కలిసి సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వర దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ....వారిని బయటకు తీశారు. కాగా వినాయకుడి దయవల్లే తాము ఘోర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని రాంబాబు పేర్కొన్నాడు. -
రావులపాలెంలో సినీ నటుల సందడి
రావులపాలెం : రావులపాలెం సీఆర్సీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు పలువురు సినీ నటులు హాజరుకావడంతో సందడి నెలకొంది. సీఆర్సీ కాట¯ŒS కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ళ భరణితోపాటు కృష్ణ భగవాన్, గౌతంరాజు, కోట శంకరరావు, బొడ్డు రాజుబాబులు ఆఖరి రెండు రోజులు పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో పలువురు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శన చూసిన సినీ నటుడు కృష్ణభగవా¯ŒS మాట్లాడుతూ వచ్చే ఏడాది మంచి హాస్య నాటికను తనికెళ్ళ భరణి రచించాలని, తమంతా ఆ నాటికను ప్రదర్శిస్తామన్నారు. ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన నటులను అభినందించారు. -
సమాజాన్ని మేల్కొలుపుతూ..
ఆలోచింపజేసిన నాటికలు సీఆర్సీ చేయూత అభినందనీయం : సినీనటుడు తనికెళ్ల భరణి రావులపాలెం (కొత్తపేట): భారతీయ సంస్కృతులను, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న నాటిక పోటీలు నాటక రంగానికి చేయూతనందిస్తున్నాయని సినీ నటుడు, సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి అన్నారు. సీఆర్సీ రాçష్ట్రస్థాయి 19వ ఉగాది నాటిక పోటీల్లో ఆఖరి రోజైన శుక్రవారం పోటీలను తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ నాటక రంగానికి జీవం పోసేలా 19 ఏళ్లుగా ఎంతగానో కృషి చేస్తున్న కళాపరిషత్ సేవలు అభినందనీయమన్నారు. ఈ పరిషత్‌కు తాను గౌరవ అధ్యక్షుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఈ ఏడాది సీఆర్సీ కాట¯ŒS కళాపురస్కారాన్ని నెల్లూరుకి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణభగవాన్, గౌతమ్‌రాజు, కోట శంకరరావు, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటకపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న నాటికలు ఆఖరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను ఆలోజింపజేశాయి. విజయవాడ యంగ్‌థియేటర్ ఆర్గనైజేష¯ŒS అనగనగా నాటిక ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు మారవని పాలక వర్గాల్లోనే మార్పురావాలని ప్రభోదిస్తూ నడిచిన ఈ నాటికను పి.మృత్యుంజయ రచించగా ఆర్.వాసు దర్శకత్వం వహించారు. అలాగే హైదరాబాద్ ఆర్ట్ ఫామ్ క్రియేష¯Œ్స ప్రదర్శించిన ఓ కాశీవాసీ రావయ్య నాటిక మానవతా విలువలను తెలియజేప్పింది. మానవత్వపు విలువలు లోపిస్తున్న సమాజంలో ఎవరి తలకు వాళ్లే కొరివి పెట్టుకునే రోజు వస్తుందనేది ఈ నాటిక ఇతివృత్తం. పీటీ మాధవ్ రచించిన ఈ నాటికకు నామాల మూర్తి దర్శకత్వం వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి.గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు. -
సందేశాత్మకంగా సీఆర్సీ నాటికల పోటీలు
రెండో రోజు నాటికలను ప్రారంభించిన సినీ నటుడు తనికెళ్ల భరణి రావులపాలెం (కొత్తపేట): ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) కాట¯ŒS కళాపరిషత్ ఆధ్వర్యంలో సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్న 19వ రాష్ట్ర స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. రెండో రోజు గురువారం రాత్రి పోటీలను సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి ప్రారంభించారు. రెండోరోజు మూడు నాటికలను ప్రదర్శించారు. సినీ నటులు గౌతంరాజు, కోట శంకరరావు ఈ నాటికలను తిలకించారు. మొదటిగా తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక దేహదానం విలువను తెలియజేసింది. మరణించిన తరువాత దేహం మట్టికో కట్టెకో అర్పించడం సరైంది కాదని రచయిత వల్లూరి శివప్రసాద్, దర్శకుడు గంగోత్రి సాయి ఈ నాటికలో సందేశమిచ్చారు. అనంతరం కొలకలూరి శ్రీ సాయిఆర్ట్స్ వారు ‘చాలు..ఇక చాలు’ నాటికను ప్రదర్శించారు. పీవీ భవానీప్రసాద్ రచించిన ఈ నాటికకు దర్శకుడు గోపురాజు విజయ్. ఆఖరిగా విశాఖపట్నం శిరీషా ఆర్ట్స్‌వారు ప్రదర్శించిన ‘ఒక రాజకీయ కథ’ నాటిక ఆలోచన రేకెత్తించింది. స్త్రీని ఆకాశంలో సగం అంటూ చెప్పడం కాదని, ఆచరణలో ఎంత వరకూ వారికి న్యాయం జరుగుతోందని దర్శకుడు, రచయిత దండు నాగేశ్వరరావు ఈ నాటిక ద్వారా ప్రశ్నించారు. ఈ నాటికల పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి. గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు. సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, కళాపరిషత్ నిర్వాహకుడు పలివెల త్రిమూర్తులు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్‌హెచ్‌ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు. స్థానిక ఊబలంక పీహెచ్సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.