మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య | student sucide ravulapalem | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Jan 27 2017 12:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య - Sakshi

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

రావులపాలెం (కొత్తపేట) : తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన పితాని సత్యనారాయణ, తలుపులమ్మ కుటుంబం మండలంలోని ఊబలంకలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. వారి కుమారుడు పితాని వెంకటసాయి(17) కొత్తపేట మండలం వాడపాలెం నవనిధి ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సత్యనారాయణ సుమారు ఆరేళ్లు దుబాయిలో ఉండి ఇటీవల తిరిగి వచ్చాడు. మద్యానికి బానిపై అప్పులపాలవడంతో కుటుంబం ఇబ్బంది పడుతోంది. దీంతో సాయి కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లి తలుపులమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం రావులపాలెం గౌతమి కొత్త బ్రిడ్జి రింగ్‌బండ్‌ వద్దకు వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అదనపు ఎస్సై పి.శోభ¯ŒSకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్, పురుగులమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని తన చావుతో అయినా తండ్రి మారి కుటుంబాన్ని సరిగా చూసుకోవాలని ఆ నోట్‌లో రాశాడు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాస్పతికి తరలించి ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement