తల్లికష్టం చూడలేక విద్యార్థి ఆత్మహత్య | politechnic student sucide | Sakshi
Sakshi News home page

తల్లికష్టం చూడలేక విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Sep 30 2016 8:18 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

తల్లికష్టం చూడలేక విద్యార్థి ఆత్మహత్య - Sakshi

తల్లికష్టం చూడలేక విద్యార్థి ఆత్మహత్య

  తల్లికష్టం చూడలేక విద్యార్థి ఆత్మహత్య
తల్లి, విద్యార్థి, ఆత్మహత్య
Mother, student, sucide
politechnic student sucide
మంగళగిరి ( గుంటూరు జిల్లా ) : పట్టణంలోని జాతీయరహదారి వద్ద   శ్రీశైలం నగర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ జి బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు శ్రీశైలం నగర్‌లో నివాసముంటున్న కొడాలి పూర్ణచంద్రరావు, గాయత్రి దంపతులకు కుమారుడు వెంకటరమణ (21) కుమార్తె తేజస్విని  ఉన్నారు. పూర్ణచంద్రరావు ఏడు సంవత్సారాల క్రితమే మృతి చెందగా తల్లి గాయత్రి చిన్న హోటల్‌ నడుపుకుంటూ ఇద్దరిని చదివిస్తోంది. తండ్రి మృతితో వెంకటరమణ తల్లి సంపాదనతో ఇద్దరు చదువులు కష్టమని అప్పులు చేసి చదువుకున్నా ఉపయోగం ఉండదని ఏదైనా పని నేర్చుకుంటానంటూ ఇంటర్మీడియట్‌ అనంతరం చదువు మాని బంగారపు పనికి వెల్లారు. అయితే తల్లి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ తానే కష్టపడి చదివిస్తానంటూ బలవంతం చేసి విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో వికాస్‌పాలిటెక్నిక్‌ కళాశాలలో చేర్పించింది. సోదరి తేజస్విని బీటెక్‌ చదువుతోంది. పాలిటెక్నిక్‌ చదువుతున్న వెంకటరమణకు ఈ నెల 28వ తేదీన తల్లి కళాశాలలో ఫీజు కొరకు రూ.17 వేలు అప్పు చేసి చెల్లించింది. 29వ తేదీ గురువారం కళాశాల నుంచి వచ్చిన వెంకటరమణ అప్పులు చేసి చదవడం వలన ఎలాంటి ఉపయోగం వుండదని, ఉద్యోగాలు రావట్లేదని బంగారపు పనికి వెల్తానని తల్లితో వాదనకు దిగాడు. పాలిటెక్నిక్‌ పూర్తి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిచెప్పడంతో ఇరువురి మధ్య చిన్నపాటి వాదన చోటుచేసుకుంది. దీంతో తన గదిలోకి వెల్లిన వెంకటరమణ సూసైడ్‌ నోట్‌ రాసి రాత్రి సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి ఫోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement