తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య | student sucide in kenal | Sakshi

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Aug 26 2016 10:40 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య - Sakshi

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

 
నూజెండ్ల(శావల్యాపురం): తల్లిదండ్రలు మందలించారని 10 వతరగతి విద్యార్థి బండారు పవన్‌ (15)  అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌లో  దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వేల్పూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారు సారధి కుమారుడైన పవన్‌  వేల్పూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ చదువుతున్నాడు.  శుక్రవారం ఉదయం నుంచి కుమారుడు కన్పించక పోవటంతో వెతుకులాడుతున్న కుటుంబ సభ్యులకు కాల్వవైపు వెళుతున్నాడనే సమాచారం తెలుసుకుని వెతుకులాట ప్రారంభించారు. మధ్యాహ్నం తర్వాత  కెనాల్‌ ప్రాంతంలో పవన్‌ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement