గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.7.49 వరకు, తదుపరి త్రయోదశి తె.6.11 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం: రోహిణి ప.12.28 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.51 నుండి 7.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.36 నుండి∙8.07 వరకు, అమృతఘడియలు: ఉ.9.25 నుండి 10.56 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిళ్లు.
వృషభం: కార్యజయం. ఆస్తిలాభం. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు. దైవదర్శనాలు.
మిథునం: పనిభారం. దూరప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో సమస్యలు. అనారోగ్యం.
కర్కాటకం: శుభవర్తమానాలు. అందరిలోనూ గుర్తింపు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
కన్య: బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
తుల: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
ధనుస్సు: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిదానం పాటించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కుంభం: పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.
మీనం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
Comments
Please login to add a commentAdd a comment