
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.
నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment