extorting money
-
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
ఖలీల్‌వాడి: బోధన్ మండలం ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి వద్ద దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి(55) నుంచి దోపిడీ పాల్పడిన కేసులో ఆర్మూర్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న నల్ల నవీన్, ఇదేకాలనీలో ఉంటున్న గడ్డల దామోదర్, రాస ప్రవీణ్, ఒడ్డెర కాలనీకి చెందిన మేకల హరీశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా దారంగుల గంగాధర్ పరారీలో ఉన్నాడు. ఈ ఐదుగురు జల్సాల కోసం డబ్బు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు రెండు మోటార్ సైకిళ్లపై ఈనెల 23న నిజామాబాద్‌కు బయలు దేరినట్లు వెళ్లారు. గంగాధర్, ప్రవీణ్, హరీశ్, దామోదర్‌లు చిన్నాపూర్ గండి వద్ద కట్టెలు, స్క్రూ డ్రైవర్లతో వేచి ఉన్నారు. నల్లనవీన్ నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌కు అతని మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడ టీతాగుతున్న పోతుల పోశెట్టి దగ్గరకు వెళ్లి అతన్ని చంపుతానని బెదిరించాడు. అతడిని మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టుకొని చిన్నాపూర్ గండి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి స్క్రూడ్రైవర్‌తో పొడిచి కట్టెలతో కొట్టి బాధితుడి వద్ద ఉన్న వెండి, బంగారపు వస్తువులతో పాటు రూ. 600 దోపిడీ చేశారు. అంతేకాకుండా బాధితుడిని ఎరాజ్పల్లిలో తన ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న రూ. 35వేలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని మామిడిపల్లి రోడ్ వద్ద వదిలి ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, ఎస్సై హబీబ్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కిరణ్‌కుమార్ అభినందించారు. -
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్‌కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్‌నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్‌లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్‌కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్‌మెయిల్‌కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ..
లక్నో: ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్ సెంటర్‌ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, 22 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. -
చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసులను సస్పెండ్‌కు గురయ్యారు. ఓ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు సిమ్దేగా పోలీస్ సూపరింటెండెంట్ షామ్స్ తబ్రేజ్ ఆదివారం తెలిపారు. పోలీస్ శాఖ పరువు తీసే ఇటువంటి సంఘటనలను సహించమని ఎస్పీ అన్నారు. మే 22న సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వీడియోలో ఉన్నది ఈశ్వర్ మారండి, అనుజ్ కుమార్, ముఖేష్ కుమార్ మహతో, శివ్ ఒరాన్, అఖిలేష్ తిర్కీగా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోన్నట్టు వెల్లడించారు. (చదవండి: వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!) -
కేటీఆర్ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి
సాక్షి, బంజారాహిల్స్: మంత్రి కేటీఆర్ పీఏనని ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడ్డ నాగరాజు తేలికగా డబ్బులు సంపాదించే వ్యవహారాలపై దృష్టి సారించాడు. తాను కేటీఆర్ పీఏనని పరిచయం చేసుకుని, ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేశాడు. ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. తరువాత డాక్టర్ రమేశ్‌కు ఫోన్ చేసి తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని మాట్లాడుతున్నానని, ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. మీడియాలో ప్రకటనలిచ్చేందుకుగాను 50 లక్షలు సమకూర్చాలని తెలిపారు. అయితే అనుమానం వచ్చిన డాక్టర్ రమేశ్ ఆరా తీయగా ఆ నంబర్ తిరుపతిరెడ్డిది కాదని తేలింది. వెంటనే ఆస్పత్రి సీనియర్ మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు గతంలో కూడా ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తేలింది. జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్ క్రైం పోలీసులు గతంలోనూ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అడ్డంగా బుక్కైన రూ.251 స్మార్ట్‌ఫోన్ ఫౌండర్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చౌక ధరకే స్మార్ట్‌ఫోన్ అంటూ వార్తల్లో నిలిచిన రింగింగ్ బెల్స్ వ్యవస్థాపకుడు మోహిత్ గోయెల్ మరోసారి వెలుగులోకి వచ్చాడు. వ్యాపారవేత్తలను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు మోహిత్ గోయెల్‌ను అరెస్టు చేశారు. ఒక మహిళతో కలిసి అక్రమంగా గ్యాంగ్‌రేప్ ఆరోపణలు చేయడంతో పాటు బలవంతపు వసూళ్ళకు పాల్పడిన కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ‘భీవాండి గ్యాంగ్ రేప్ కేసు' గా పేరొందిన కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారవేత్తలపై ఓ మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందుతులనుంచి బలవంతపు వసూళ్లకు ప్రయత్నించారని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. కీలక సమాచారం మేరకు గోయెల్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న తనను పిలిపించి, మత్తుమందు ఇచ్చి, ఒక ఫాం హౌస్‌లో సామూహిక అత్యాచారం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత నెలలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అయిదుగురు వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కేసులో ఆమె, గోయెల్‌తో కలిసి వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు తన ముఠాతో కలిసి నిందితులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఈమె ఇప్పటికే 1.1 కోట్ల రూపాయలు కూడా తీసుకుంది. అయితే తాజాగా మరింత డబ్బును డిమాండ్ చేస్తూ, వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వలపన్నిన పోలీసులు చాకచక్యంగా గోయల్ అండ్ గ్యాంగ్‌ను ట్రాప్ చేశారు. కేసును వాపస్ తీసుకునేందుకు 2.5 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నటించి, వారి ఆటకట్టించారు. ఈ కేసులో ఆ మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా ఘజియాబాద్‌కు చెందిన ఓ కంపెనీనీ రూ.16 లక్షలు మోసంచేసిన ఆరోపణలతో గోయల్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు మూడునెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. మే 31న అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ముక్కలు చేసి.. సూట్‌కేస్‌లో పెట్టి
జైపూర్ : డబ్బు కోసం స్నేహితున్ని చంపి ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో పెట్టి రోడ్డు మీద పడేశారు. ఈ దారుణమైన సంఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన దుష్యంత్ శర్మ(29)కు సోషల్‌మీడియా ద్వారా బజాజ్ నగర్లో ఉండే ప్రియా సేథ్(27) అనే యువతి పరిచయం అయ్యింది. మే 2న ప్రియా సేథ్ దుష్యంత్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ప్రియ ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లిన దుష్యంత్‌ను తనకు పది లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేసింది. అందుకు దుష్యంత్ ఒప్పుకోకపోవడంతో, అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. అంతేకాక అప్పటికే తన ఇంటికి పిలిపించుకున్న మరో ఇద్దరు స్నేహితులు దీక్షంత్ కుమార్(27), లక్ష్య వాలియా(25) సాయంతో ప్రియ దుష్యంత్‌ను బంధించింది. అనంతరం దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసి మీ కుమారున్ని విడుదల చేయాలంటే పదిలక్షల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు దుష్యంత్ తండ్రి తన దగ్గర అంత సొమ్ము లేదని, మూడు లక్షల రూపాయలను దుష్యంత్ బ్యాంకు అకౌంట్లో జమచేశాడు. నిందితులు దుష్యంత్ ఏటీఎమ్ నుంచి 20 వేల రూపాయలను డ్రా చేశారు. అనంతరం దుష్యంత్ బతికి ఉంటే తమకు అపాయమని భావించి అతన్ని చంపి ముక్కలు చేసి, సూటికేస్‌లో పెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు జెత్వార్ ఏసీపీ ఆస్ మహ్మద్ తెలిపారు. -
జవాన్లనుంచీ లంచం డిమాండ్.. రేప్ బాధిత అరెస్ట్...
థానెః ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. డబ్బుకోసం కక్కుర్దిపడి అడ్డంగా బుక్కైంది. నిందితులైన జవాన్లనుంచి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ దివాకు చెందిన మహిళ గతవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో ఉండగానే సదరు బాధితురాలు.. కేసును వెనక్కు తీసుకునేందుకు నిందితులతో బేరసారాలకు దిగింది. అందులో భాగంగా నిందితుల్లోని ఓ జవాన్ ను.. మధ్యవర్తితోపాటు చాటుగా ఓ హోటల్ లో కలసి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (57) వద్ద 90,000 లంచం తీసుకునేందుకు సిద్ధపడిన బాధిత మహిళ పోలీసుల కంటపడింది. స్థానిక దొంబివిలి లోని ద్వారకా హోటల్లో నిందితురాలు జవాన్లతో జరిపిన సంభాషణ రికార్డు చేసినట్లు పోలీస్ పీఆర్వో సుఖద నర్కర్ తెలిపారు. అనంతరం మహిళను అరెస్టు చేశామని, ఆమె జవాన్ల నుంచీ 1,11,000 రూపాయలు డిమాండ్ చేసిందని, ఈ వ్యవహారంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తో బేరం కుదిర్చేందుకు మధ్యవర్తులుగా మోహన్ బిట్లా అనే వ్యక్తితోపాటు, స్థానికంగా పేరొందిన ఓ పత్రికలో పనిచేసే విలేకరి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళతో సహా బిట్లాను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. దివాకు చెందిన నిందితురాలు దొంబివిలిలోని ఓ బొటిక్ లో పనిచేస్తోంది. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె గతవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జవాన్లపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.