HYD: కొంప ముంచిన వీడియో కాల్‌..  యువతి అందచందాలకు ఫిదా అయిపోయి.. | Obscene Video Call: Business Man Lost 9 Lakhs Woman Honey Trap Ameerpet | Sakshi
Sakshi News home page

Hyderabad: కొంప ముంచిన వీడియో కాల్‌..  యువతి అందచందాలను చూపించడంతో..

Published Sun, Nov 6 2022 11:16 AM | Last Updated on Sun, Nov 6 2022 11:24 AM

Obscene Video Call: Business Man Lost 9 Lakhs Woman Honey Trap Ameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్‌నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది.

ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయగా..ఇద్దరూ హాయ్‌ అంటూ మెసేంజర్‌లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్‌ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్‌ నంబర్‌కు వీడియో కాల్‌ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్‌ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్‌మెయిల్‌కు ఒడిగట్టింది.

సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు.  ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. 
చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement