Video call
-
చనిపోతున్నా బిడ్డా..!
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్‌కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. -
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్‌లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్‌గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్‌ఘర్‌కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేశారు. -
ఫేక్ వీడియో కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్‌కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.‘‘ కామెరాన్‌కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్‌కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్‌గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్‌లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్‌తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్‌ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది. -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ ప్రైజ్ చేసిన రష్మిక !
-
‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో వర్చువల్ విధానం ద్వారా ఆయన్ను ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అత్యాధునిక ‘బ్లూ జీన్’ యాప్ ద్వారా ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మామూలుగా ఖైదీలను వర్చువల్ విధానం అంటే వీడియో కాల్ ద్వారా కోర్టులో హాజరు పరుస్తుంటారు. అప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు వారి స్థానం నుంచి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బ్లూ జీన్ యాప్‌ను వినియోగించినట్లు తెలిసింది. దీనిద్వారా జడ్జి తన ఛాంబర్లో కూర్చొనే విచారణ చేయొచ్చు. ఖైదీ సైతం తనకు కేటాయించిన బ్యారక్‌లో నుంచే కోర్టు ఎదుట హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరు పరిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ టీంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఎంత ఖర్చు అయినా సరే.. టాప్ లాయర్లను రంగంలోకి దింపాలని సూచించినట్లు సమాచారం. ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారుల్లో వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం నేడు జరగబోయే కస్టడీ విచారణపై చర్చించినట్లు తెలిసింది. పట్టాభికి భంగపాటు టీడీపీ నేత పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద భంగపాటు ఎదురైంది. జైలు వద్ద ఉన్న మీడియా పాయింట్‌కు వచ్చిన ఆయన.. కాసేపట్లో తీర్పు వస్తుందని, బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ప్రభుత్వంపై పోరాటం చేస్తారని ప్రకటించారు. ఇదిజరిగిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న అంశాలపై ఎందుకు మాట్లాడారని పార్టీలోని కొందరు పెద్దలు పట్టాభికి క్లాస్ పీకినట్లు తెలిసింది. -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్‌లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్‌ను జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్
వాషింగ్టన్: మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత ఏడాది కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను పొందుపర్చారు. ఆదాయం పెంపే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎక్స్’లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కలి్పంచనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యూజర్లతో కాల్స్‌ను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్‌్కటాప్ సహా వినియోగదారులంతా ఈ సదుపాయం పొందవచ్చని సూచించారు. ప్రభావవంతమైన ప్రపంచ ఆడ్రస్ బుక్కు ‘ఎక్స్’ వేదిక కానుందని, ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయని వివరించారు. ‘ఎక్స్’లో ప్రస్తుతం ట్వీట్ డెక్ సరీ్వసులు ఉచితంగా అందిస్తున్నారు. వాటిని పెయిడ్ సరీ్వసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. -
ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ట్విటర్ కంపెనీ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసింది. ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్‌కి 'ఎక్స్' అని నామకరణం చేసాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్‌కి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిని వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: 64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే? Video & audio calls coming to X: - Works on iOS, Android, Mac & PC - No phone number needed - X is the effective global address book That set of factors is unique. — Elon Musk (@elonmusk) August 31, 2023 -
ప్రియురాలికి చివరి కాల్ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి -
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్‌కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో
కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్‌ను ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్‌తో వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్‌లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విండోస్‌లోని కొంతమంది బీటా టెస్టర్లకు వీడియో కాల్ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు. లింక్‌లు పంపి.. మనకు డేటింగ్ యాప్‌లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్‌లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది. ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్‌లు, వాట్సాప్ వీడియో న్యూడ్‌కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు... ♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్లైన్ డేటింగ్ యాప్‌లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి. ♦ ఆన్లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్‌ల లింక్‌లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం. ♦ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు. ♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్‌తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. ♦ మొబైల్‌ఫోన్, ల్యాప్‌లాప్, డెస్క్‌టాప్‌లకు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది. ♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్‌లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్‌గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్లైన్ యాప్‌లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు. -
‘హాయ్ బావా.. నేను నచ్చితే వీడియో కాల్ మాట్లాడూ’
హిమాయత్‌నగర్: ‘హాయ్ జీజూ (బావ) నేను నీ మరదలు లాంటిదానిని. నేను నచ్చితే నాతో వీడియో కాల్ మాట్లాడు ప్లీజ్’ అంటూ 79 ఏళ్ల వృద్ధుడిని నిండా ముంచిందో సైబర్ కిలాడీ. 20 ఏళ్ల అందమైన యువతి ఫోన్ చేసి బావా అని పిలవడంతో అత్యాశకు పోయిన అతను రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. మరిన్ని లక్షలు కావాలంటూ డిమాండ్ చేయడంతో పాటు వీడియోను బంధువులకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 79 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ అమ్మాయి గొంతుతో ఫోన్ కాల్ వచ్చింది. మీరు నా బావ లాంటి వారు, మీతో మాట్లాడాలని ఉందనడంతో అతను ఆమెతో మాటలు కలిపాడు. రెండు గంటల్లోనే వీడియో కాల్ ద్వారా పరిచయమయ్యారు. వృద్ధుడిని బాత్రూమ్లోకి రప్పించిన కిలాడీ ‘ఐ లవ్యూ’ అంటూ న్యూడ్ వీడియోను రికార్డ్ చేసింది. పది నిమిషాల తర్వాత డబ్బు ఇస్తావా వీడియోను నీ కుటుంబ సభ్యులు, బంధువులకు పంపమంటావా అని బెదిరింపులకు పాల్పడింది. దీంతో పరువుపోతుందని భావించిన అతను ఆమెకు రూ.15 లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుండటంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
డాక్టర్‌తో వీడియో కాల్ చూస్తూ నర్స్ ఆపరేషన్.. గర్భిణీ మృతి
బిహార్:వీడియో కాల్లో చూస్తూ నర్స్ ఆపరేషన్ చేయడం వల్ల ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ ఘటన బిహార్‌లోని పూర్నియా ప్రాంతంలో జరిగింది. మాల్తీ దేవీ(22)కు నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సమర్పన్ మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ లేకపోయిన గర్భిణీని ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు సిబ్బంది. మాల్తీకి నొప్పులు ఎక్కువవగానే ఐసీయూలోకి తీసుకెళ్లారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్ సీతాకుమారి సలహాలు ఇస్తుండగా..గర్భిణీకి నర్స్ ఆపరేషన్ చేసింది. పుట్టిన కవలలు క్షేమంగానే ఉన్నప్పటికీ ఆపరేషన్ ఆనంతరం బాధితురాలికి విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. అనంతరం మాల్తీ మృతి చెందింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
సైంటిస్ట్‌ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
#ViratKohli: అనుష్కకు వీడియోకాల్.. కోహ్లి ఎమోషనల్
ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కింగ్ కోహ్లి 62 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్లో సెంచరీ సాధించి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు బాదిన గేల్ రికార్డును సమం చేశాడు. తన సెంచరీతో జట్టు గెలవడంతో పాటు కీలకమైన ప్లేఆఫ్ రేసులో ఆర్సీబీ నిలవడం కోహ్లికి తెగ సంతోషాన్నిచ్చింది. అందుకే మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులతో పాటు అభిమానులతో కోహ్లి తన సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూ కోహ్లి ఎమోషనల్ అయినట్లు అనిపించింది. కోహ్లి సెంచరీ చేసిన సమయంలో అనుష్క స్టేడియంలో ఉండుంటే ఆ ఫీల్ వేరుగా ఉండేదని అభిమానులు పేర్కొన్నారు. అయితే అనుష్క తన భర్త కోహ్లి సాధించిన ఘనతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ''He Is Bomb.. What An Innings My Love..''అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ఈ స్వీట్ కపుల్ తమ చర్యతో మరోసారి అభిమానులకు సంతోషాన్ని పంచారు. ఇక నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ హోంగ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ ఫీల్ ఎక్కడా కలగలేదు. ఎందుకంటే మ్యాచ్‌కు వచ్చినవారిలో ఎక్కువమంది అభిమానులు ఆర్సీబీకే మద్దతిచ్చారు. దీంతో మ్యాచ్ జరుగుతుంది బెంగళూరు లేదా హైదరాబాద్ అన్న అనుమానం కూడా వచ్చింది. Virat talking to Anushka Sharma on video call after the match, I wish she would also come to the stadium today to cheer Virat #ViratKohli𓃵 #ViratKohli #anushkasharma #RCBvsSRH pic.twitter.com/wParcOuvvP — Akshay Kumar (@AkshayK63721592) May 18, 2023 Job well done in Hyderabad ✅ pic.twitter.com/PjhKVupn2C — Virat Kohli (@imVkohli) May 18, 2023 A magnificent CENTURY by Virat Kohli 🔥🔥 Take a bow, King Kohli! His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d — IndianPremierLeague (@IPL) May 18, 2023 చదవండి: Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి! -
మస్క్ సంచలనం.. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు!
ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్లో కాల్స్, మెసేజ్‌లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు, లాంగ్ ఫార్మ్ ట్విట్లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెటా తరహాలో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్విటర్లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను బాస్‌గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
భర్త వీడియో కాల్ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య
అన్నానగర్: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు. రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఈ మొబైల్ ఉంటే ఇంట్లో థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్ల’తో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుంది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. సెల్ఫోన్లో ప్రొజెక్టర్ ఇన్‌బిల్డ్ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్ బీమ్–2 మోడల్స్ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. థియేటర్ క్వాలిటీతో.. ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి. 50 నుంచి 200 ఇంచుల స్క్రీన్ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇందులో హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. హోమ్ థియేటర్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డీటీఎస్ సౌండ్‌తో పూర్తిగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు చూడొచ్చు. వీడియో ప్రజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్‌ఫోన్‌తో ప్రజెంటేషన్ చేయొచ్చు. -
కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు వీడియో కాల్ సౌకర్యం
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 12 వేల మందికి పైగా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. జైళ్లశాఖ డీజీపీగా అమరేష్ పూజారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జైళ్లశాఖలో పలు మార్పులను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశఆల్లో మంత్రి రఘుపతి జైలులో ఉన్న ఖైదీలు వారి బంధువులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం చైన్నెలోని పుళల్ జైలులో ఖైదీలు వీడయో కాల్ ద్వారా బంధువులతో మాట్లాడే అవకాశాన్ని డీజీపీ ప్రారంభించారు. కరోనా కాలంలో ఖైదీలపై ఒత్తిడిని తగ్గించేందుకు వేలూరు పురుషుల జైలులో ఇది వరకే వీడియో కాల్ వసతిని ఏర్పాటు చేశారు. తాజాగా వేలూరు మహిళా జైలులో ఖైదీలు బంధువులతో వీడియో కాల్‌తో మాట్లాడే వసతిని జైళ్లశాఖ డీఐజీ సెందామరై కన్నన్ శనివారం ఉదయం ప్రారంభించి పరిశీలించారు. మహిళా ఖైదీలు వారి బంధువుల వద్ద వారంలో మూడు రోజులకు ఒక సారి 12 నిమషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
భార్య రితికాతో ఆసక్తికర సంభాషణ.. మధ్యలో ఈ సామీ ఎవరు?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. తిలక్ వర్మ 41 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మ్యాచ్ ముగిశాకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాకా రోహిత్ శర్మ తన భార్య రితికా సదేశ్కు వీడియో కాల్ చేశాడు. అయితే రోహిత్ మాట్లాడుతూ.. ''ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. సామీ నువ్వు ట్రోఫీ చూశావా అనగానే అందుకు నో అనే సమాధానం వచ్చింది. అయితే సరే.. ఈసారి సామీ కోసం కప్ తీసుకొస్తా''.. అంటూ పేర్కొన్నాడు. రితికాతో జరిగిన సంభాషణలో సామీ అనే పేరు రావడం అభిమానులకు ఆసక్తి కలిగించింది. మరి ఎవరా సామీ అని ఆరా తీస్తే విషయం తెలిశాకా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే సామీ ఎవరో కాదు.. రోహిత్, రితికాల గారాల పట్టి.. సమైరానే. రోహిత్ తన బిడ్డ సమైరాను ముద్దుగా సామీ అని పిలుస్తుంటాడు. ఇక రితికాతో రోహిత్ ఇంకా ఏం మాట్లాడాడంటే.. ''ఈరోజు మ్యాచ్ చాలా బాగుంది. కానీ చివరి ఓవర్ చూడలేక బయటికి, లోపలికి తిరిగాను. చివరి బంతికి నేను ముని వేళ్లపై నిలబడ్డా. కానీ ముంబై గెలిచాకా సంబరం చేసుకున్నా. కానీ గత 15 ఏళ్లలో ఐపీఎల్లో ఇలాంటి మ్యాచ్‌లు చాలానే చూశాను.. అలవాటైపోయింది '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్, రితికాల వీడియో కాల్‌ను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ro on call with Rits after a nail-biting win in Delhi 🥺💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/qCXaLj8dwT — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్; బలయ్యింది మాత్రం ఒక్కడే -
వీడియో కాల్లో ఫ్రెండ్‌ను గుర్తుపట్టిన శునకం.. వీటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..
శనకాలు వాటి యజమానులను గుర్తిస్తాయని అందిరికీ తెలుసు. తమ స్నేహితులను కూడా సులభంగా గుర్తుపెట్టుకుంటాయి. అయితే వీడియో కాల్లో శునకాలు ఇతరులను గుర్తించలవా? అంటే సమాధానం చెప్పలేదు. కానీ ఓ కుక్క మాత్రం తన ఫ్రెండ్‌ను వీడియో కాల్లో చూసిన వెంటనే టక్కున గుర్తుపట్టింది. దానితో ఆప్యాయంగా మాట్లాడింది. ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగిన సంభాషణ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ నెటిజన్లను కట్టిపడేసింది. View this post on Instagram A post shared by Rollo and Sadie (@rolloandsadie) శునకం మరో శుకనంతో వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. వీటి మధ్య ప్రేమను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్‌ను నిజంగా మిస్ అయితే ఇలానే ఉంటుందేమో? ప్రేమానురాగాల విషయంలో జంతువులకు మనషులకు తేడా లేదని ఈ శునకాలు నిరూపించాయి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మనకు ఇష్టమైన స్నేహితులు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగొచ్చేంతవరకు డోర్ దగ్గరే ఎదురుచూస్తుంటాం. ఇలాంటి ప్రేమ పొందడం నిజంగా అదృష్టం. మనుషులైనా, శునకాలైనా స్నేహం, ప్రేమ విషయంలో ఒక్కటే.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: జైలులో నన్ను టార్చర్ చేశారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి: నవనీత్ రానా -
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్లో ముద్దులు..
చండీగఢ్: అమృత్‌పాల్ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు.. అమృత్‌పాల్ సింగ్‌కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్లతో పాటు 12 వాయిస్ మెసేజ్‌లను సేకరించింది. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది. తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. అమృత్‌పాల్ సింగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్‌లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్‌లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్‌తో రిప్లై ఇవ్వడం గమనార్హం. ముమ్మర గాలింపు.. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్‌ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు. చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్‌దీప్‌తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్ అదేనా? -
ఆమె వయసు 39, అతనికి 21.. ‘సంబంధం’పై తండ్రి హెచ్చరించడంతో..
చిత్తూరు అర్బన్: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని కొడుకు భరత్ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి. ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్.. మహిళకు వీడియోకాల్ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్ ఆన్‌లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియో కాల్!
సాక్షి, హైదరాబాద్: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగా అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్ చేస్తానంటూ చెప్పి అతను కాల్ కట్ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్ చేశాడు. వీడియో కాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్‌ను సోషల్ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు