వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. బ్లాక్‌మెయిల్‌ | Nude Video call in Whatsapp to Extort Money Blackmail Adilabad | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. బ్లాక్‌మెయిల్‌

Published Fri, Aug 12 2022 8:36 AM | Last Updated on Fri, Aug 12 2022 3:33 PM

Nude Video call in Whatsapp to Extort Money Blackmail Adilabad - Sakshi

చాటింగ్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు 

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మంగేష్‌కుమార్‌కు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ న్యూడ్‌ కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్‌ వచ్చింది. మొదట వాట్సాప్‌లో హాయ్‌.. హయమ్‌ శివాని అంటూ చాటింగ్‌ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్‌యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు.

తర్వాత ఎవరో అని లిఫ్ట్‌ చేస్తే న్యూడ్‌కాల్‌ రావడంతో వెంటనే ఆయన కట్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్‌ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్‌ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు.  

చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్‌ హత్యకు ప్రతీకారంగానే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement