Hyderabad Cyber Crime News: నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి - Sakshi
Sakshi News home page

నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి 

Published Sun, Mar 14 2021 7:55 AM | Last Updated on Sun, Mar 14 2021 10:50 AM

Man Trapped Women Making Naked Video Call In Whatsapp In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుని ఆ తర్వాత వాట్సాప్‌ ద్వారా నగ్నంగా వీడియో కాల్‌ చేసి కవ్వించి తనను కూడా రెచ్చ గొట్టి నగ్నంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన ఓ యువతి రూ.2 లక్షల వరకు వసూలు చేసిందని మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం...మలక్‌పేట్‌కు చెందిన వ్యక్తికి ఫేస్‌బుక్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపితే యాక్సెప్ట్‌ చేశాడు.

ఆ తర్వాత మెసేంజర్‌లో నాలుగు రోజులు చాట్‌ చేసిన అనంతరం వాట్సాప్‌ నంబర్‌ అడిగితే ఇచ్చాడు. ఆ తర్వాత మూడు రోజులు వాట్సాప్‌కాల్‌లో మాట్లాడిన సదరు యువతి ఓ రోజు నగ్నంగా వీడియోకాల్‌ చేసింది. బాధితుడిని కూడా నగ్నంగా ఉంటే చూడాలని ఉందని కవ్వించి ఆ దృశ్యాలను స్క్రీన్‌ రికార్డు చేసింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో సేవ్‌ చేసిన ఆ వీడియో లింక్‌ను బాధితుడి వాట్సాప్‌ నంబర్‌కు పంపింది. దీంతో బాధితుడు ఆమెకు ఫోన్‌ చేయగా రూ.50వేలు ఇస్తే తొలగిస్తానని చెప్పడంతో నగదు బదిలీ చేశాడు.

ఆ తర్వాత ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నట్లుగా గుర్తు తెలియని మహిళ ఫోన్‌ చేసి ఓ యువతి మీ పైనా ఫిర్యాదు చేసిందని, నగ్నంగా ఉన్న ఆమె వీడియోను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, మీపైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో భయపడిన బాధితుడు వారు అడిగినట్లు రూ.1.5 లక్షలు వారి బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసి కేసు నమోదు కాకుండా చూడాలని కోరాడు. ఆ తర్వాత కూడా ఆ యువతి నుంచి మళ్లీ వేధింపుల కాల్స్‌ వస్తుండడంతో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement