HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం | Woman Head Was Found In Malakpet Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం

Published Wed, May 17 2023 11:35 AM | Last Updated on Wed, May 17 2023 12:02 PM

Woman Head Was Found In Malakpet Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్వ్యాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement