నువ్వే​ కావాలి అంటూ లవ్‌ ప్రపోజ్‌.. క్లోజ్‌గా వీడియో కాల్స్‌ మాట్లాడి.. | Young Woman Was Blackmailed By Video Calls On Instagram At Eluru District | Sakshi
Sakshi News home page

నువ్వే​ కావాలి అంటూ లవ్‌ ప్రపోజ్‌.. క్లోజ్‌గా వీడియో కాల్స్‌ మాట్లాడి..

Published Thu, Jul 6 2023 9:07 PM | Last Updated on Thu, Jul 6 2023 9:07 PM

Young Woman Was Blackmailed By Video Calls On Instagram At Eluru District - Sakshi

సాక్షి, ఏలూరు: సోషల్‌ మీడియాలో హాయ్‌ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్‌, కాల్స్‌ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్‌ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. 

వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్‌.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్‌, కాల్స్‌ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, స్పీడ్‌ పెంచిన నవీన్‌.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్‌ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. 

ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్‌ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్‌ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్‌ చేశారు. తన ఇంటి వద్దే నవీన్‌కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్‌.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్‌ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement