blackmailed with video
-
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్‌కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తితో పరిచయం కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన వివాహిత సౌజన్యకు కొద్దిరోజుల క్రితం తిరుపతి అనే వ్యక్తి నుంచి మిస్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరిగి కాల్ చేయడంతో అనుకోకుండా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఈ పరిచయం కాస్తా చనువుగా మారింది. దీంతో, తిరపతి.. సౌజన్యకు తరచుగా కాల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మాయ మాటలు చెప్పి క్లోజ్ అయ్యాక.. వీడియో కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే, వీడియో చేసిన తర్వాత థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సౌజన్య ఫోన్లోని డేటాను తిరపతి తస్కరించాడు. అనంతరం, వారిద్దరూ చనువుగా మాట్లాడుకున్న వీడియోలను తన భర్తకు, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇక, ఈ విషయం తన భర్తకు తెలియడంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో, నీటి సంపులో దూకి సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సౌజన్య మృతిచెందింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, సౌజన్య ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: విశాఖలో రియల్టర్, భార్య కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు -
ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లైన మహిళతో ఎఫైర్.. వీడియో కాల్స్ అడ్డం పెట్టుకొని..
దొండపర్తి(విశాఖ దక్షిణ): నగరానికి చెందిన వివాహిత ఇన్‌స్టాగ్రాంలో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కష్టాలు కొనితెచ్చుకుంది. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ అడ్డం పెట్టుకొని మానసికంగా, శారీరకంగా బెదిరింపులకు దిగుతున్న వ్యక్తి వేధింపులు భరించలేక చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గూడూరుకు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రాంలో నగరానికి చెందిన వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని ఆమె యాక్సెప్ట్ చేయడంతో నిందితుడు స్నేహం పేరిట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ చాటింగ్ ద్వారా మాయమాటలు చెబుతూ ప్రేమ పేరుతో వంచించాడు. తరువాత ఆ చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్‌తో పాటు రికార్డు చేసిన వీడియో కాల్స్ ద్వారా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆమె అనేకసార్లు డబ్బులు పంపించింది. అయినప్పటికీ అతడి వేధింపులు ఆగకపోవడంతో ఆమె విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీఐ కె.భవానీ ప్రసాద్ సాంకేతికత సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన చెన్నూరు శేఖర్(24)గా గుర్తించారు. దీంతో తన సిబ్బందిని గూడూరుకు పంపించి అతడిని అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం ఇక్కడ కోర్టులో హాజ రుపరిచి రిమాండ్‌కు తరలించారు. శేఖర్ ఇప్పటికే ఒక హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నాడు. చదవండి: గుంటూరు బ్యూటీషియన్ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా? -
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం..
-
మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..
సాక్షి, కామారెడ్డి: అపరిచిత మహిళల ఫోన్ కాల్స్ విషయంలో కొందరు చేస్తున్న ‘తప్పు’టడుగులు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముందువెన కా ఆలోచించకుండా అపరిచిత మహిళలతో జరిపే సంభాషణలు దారితప్పి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు వలపు వలలో పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో.. తెలిసీ తప్పు చేశామని తరువాత బాధపడుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కితే పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో మనోవ్యధకు గురవుతున్నారు. భిక్క నూరులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వలపు వలలో పడిన విషయంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఘటనలను పలువురు ‘సాక్షి’కి వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా వలపు వలలో పడి ఇబ్బందులపాలయ్యాడు. చాలా డబ్బు లు పోగొట్టుకున్నానని బాధితుడు ‘సాక్షి’కి వివరించాడు. ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా ఓ తల్లీకూతురు వలపు వలలో చిక్కి ఆర్థికంగా చితికిపోయాడు. వీడియోకాల్స్‌తో తల్లీ కూ తురు న్యూడ్‌గా లైవ్‌లో కనబడడం, దానికి సదరు వ్యక్తి కూడా న్యూడ్‌గా మారి వాళ్లు ఆన్లైన్లో డబ్బు లు పంపమని కోరినపుడల్లా పంపాల్సి వచ్చింది. వేల రూపాయలు వారికి చెల్లించాడు. అప్పట్లో కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్‌లో నివసించే ఓ గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి మాయలేడీల వలలో పడి ఇబ్బందులు పడిన విషయం ‘సాక్షి’ పాఠకులకు విధితమే. వీడియోకాల్‌తో కైపెక్కిస్తున్నారు.. వారం, పది రోజులు మాట్లాడిన మాయలేడీలు ఓ సారి వీడియోకాల్ చేయండి సార్ అంటారు. ఇంకేముంది మనోడు ఆ మాయలో పడి వీడియో కాల్ చేయడం, ఆమెను చూసి చొంగచార్చుకోవడం జరుగుతోంది. రోజూ ఒకటి, రెండు సార్లు వీడియో కాల్ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. భార్య, సెక్స్ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుతూ ‘నేను నచ్చా నా’ అంటూ మొదలవుతుంది. వీడియో కాల్లో ఉండగానే న్యూడ్‌గా మారుతున్నారు. దీంతో మగవాళ్లు కూడా ఆ మత్తులో న్యూడ్ అవుతున్నారు. ఎంతోమంది బాధితులు.. మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించే మాటలతో, కైపెక్కించే వలపులతో వలలో వేసుకుని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో చాలామంది ఇలా మోసపోతూనే ఉన్నారు. కొందరైతే తెలిసి మరీ మోసపోతున్నారు. అయితే తమకు జరిగిన ఇబ్బందిని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు. మాయలేడీల వలలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తియ్యటి మాటలతో స్నేహం అపరిచిత మహిళలు ఫోన్ చేసి ‘సార్’ అంటూ తియ్యగా మాట్లాడతారు. ఎవరు అని ప్రశ్నిస్తే మేం వేరే వాళ్లకు కాల్ చేశామని, పొరపాటున మీ కు వచ్చిందంటూ సారీ చెబుతారు. పరవాలేదని అంటే చాలు ‘మీ పేరు, మీ ఊరు సార్, ఏం చేస్తారు సార్’ అంటూ మాటలు కలుపుతారు. ఆడగొంతు, ఆపై తియ్యగా మాట్లాడడంతో సహజంగా మగవాళ్లు వాళ్లతో మాట కలపడం, ఇదే అదనుగా అపరిచిత మహిళ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. రోజూ కాల్ చేసి ఏదో మాట్లాడుతూ టైంపాస్ చేయడం ద్వారా, ఆమె ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితిని తీసుకువస్తున్నారు. వీడియో కాల్ రికార్డులు పంపి బ్లాక్ మెయిలింగ్.. పది, పదిహేను రోజులుగా ఫోన్‌కాల్ ఆ తరు వాత వీడియో కాల్స్ ద్వారా దగ్గరైన మహిళలు న్యూడ్ వీడియోలను రికార్డు చేసి, వాటిని వాట్సాప్‌కు పంపుతున్నారు. ఆ వీడియోలను చూసి మనోళ్లు షాక్ అవ్వాల్సిందే. వీడియో క్లిప్పింగులు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తున్నా రు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీ డియాలో వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. కొందరు బతిమాలుకుని ఎంతో కొంత డబ్బు అప్పగించి క్లోజ్ చేసుకుంటుండగా, డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా వేధిస్తున్నారు. -
కీచక భర్త.. భార్య వీడియోలు తీసి, స్నేహితుడితో కలిసి..
బనశంకరి(బెంగళూరు): తనను నగ్నంగా మార్చి వీడియోలు తీసి డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై బసవేశ్వర నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ముంబైలో తన భర్తతో కలిసి నివాసం ఉండేది. భర్తకు ఫోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. భార్యకు ఆ వీడియోలు చూపి నగ్నంగా మార్చి వీడియోలు తీశాడు. రూ.5 లక్షల డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో వెబ్సైట్లో ఉంచుతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆమె బెంగళూరుకు చేరుకుంది. భర్త కూడా బెంగళూరుకు చేరుకొని స్నేహితుడు సులేశ్కార్నిక్తో కలిసి మళ్లీ ఆమెను వేధించసాగారు. అంతేగాకుండా స్నేహితుడితో కలిసి ఫోర్న్సైట్ కూడా నిర్వహిస్తున్నట్లు భార్య గుర్తించింది. భర్త స్నేహితుడు కూడా తనను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: భార్య చేసిన చికెన్ పకోడ తిని.. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య -
చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో పంచుకునేలా నమ్మకం సంపాదించుకోవడం.. వలలో చిక్కని వారిని ముగ్గులోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత వారిపై అవినీతిపరులనే ముద్ర వేసి మానసిక వేదనకు గురిచేస్తాడు. దొంగ వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. చివరికి నయానో.. భయానో తన దారికి తెచ్చుకుని అక్రమార్జనకు మార్గంసుగమం చేసుకుంటాడు. ఇదీ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన చిరుద్యోగి ‘చీకటి బాగోతం’ . సాక్షి, తిరుపతి: అక్రమాలనే ఆదాయ వనరుగా మార్చుకున్న తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ చిరుద్యోగి లీలలు అన్నీఇన్నీ కావు. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఆయన ప్రమేయం లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. చిల్లర కోసం సదరు చిరుద్యోగి వేస్తున్న చీకటి వేషాలపై కార్యాలయం సిబ్బందే కథలు కథలుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులపైనే పెత్తనం చెలాయిస్తున్న ఆయన వైఖరిపై విస్తుపోతున్నారు. పథకం ప్రకారం ప్రలోభం తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి చిరుద్యోగే సర్వం సరç్ఛౌరా చేస్తుంటాడు. అందరితోనూ చనువుగా మసలుకుంటుంటాడు. అందరి అవసరాలను తానే తీరుస్తుంటాడు. తద్వారా తన అవినీతికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. బదిలీపై వస్తున్న అధికారులను సైతం ముందుగానే ఫోన్ లో సంప్రదించి తిరుపతిలో అన్నీ తానే అని నమ్మిస్తాడు. వారికి కావాల్సిన పనులన్నీ చేసిపెట్టి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఒకవేళ వచ్చిన అధికారి వలలో చిక్కకుంటే మరింత దారుణంగా వ్యవహారం నడిపిస్తాడు. ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఆహారం, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపేస్తాడు. మత్తులోకి జారుకున్న అధికారిపైకి వేశ్యలను ఉసిగొల్పి నగ్న వీడియోలను చిత్రీకరిస్తాడు. కొద్దిరోజుల తర్వాత ఆ అధికారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిలు చేస్తాడు. ఇక చేసేది లేక నిజాయితీపరులైన అధికారులు సైతం చిరుద్యోగికి అనుకూలంగా మారిపో తారు. అప్పటి నుంచి ఆ అధికారి ఉన్నన్ని రోజులు యథేచ్ఛగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. డబ్బుకు లొంగే అధికారులైతే చిరుద్యోగి మరింత దారాళంగా వ్యవహరిస్తాడు. నెలకు ఎంత కావాలి అని డీల్ కుదుర్చుకుంటాడు. ( చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు ) ఒకేసారి ఏడాదికి ఇవ్వాల్సిన సొమ్మును ముట్టజెప్పి మొత్తం కార్యాలయాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారులపై లేనిపోని నిందలు మోపి విస్తృతంగా ప్రచారం చేయిస్తాడు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో యథాలాపంగా మాట్లాడుతున్న అధికారుల వీడియోలను ఫోను లో చిత్రీకరించి అవినీతి మరకను అంటిస్తాడు. చిరు ద్యోగి బారిన పడి పలువురు అధికారులు మానసి క క్షోభకు గురై తిరుపతి నుంచి బదిలీ చేయిం చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఎవరితో కలవ కుండా తమ పని తాము చేసుకుని వెళ్లే అధికారులను సైతం చిరుద్యోగి వదిలిపెట్టడం లేదని పలు వురు సిబ్బంది తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఓ అధికారి ఒంటరిగా కూర్చుని మద్యం తాగుతున్న వీడియోను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని మరికొందరు అధికారులను బెదిరింనట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. -
మత్తు ఇచ్చి పనిమనిషిపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి..
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపారు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో ఆదివారం ఐదుగురిపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి సయ్యద్ హుస్సేన్, కాల్వ రామారావు, కాల్వ సుమతి, ఉబ్బన మాణిక్యం అనే వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో పనిమనిషి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని వెళ్తుండగా.. టీ తాగాలని కళావతి సూచించింది. టీలో అప్పటికే మత్తు మందు కలిపారు. ఆ టీ తాగిన పనిమనిషి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం పనిమనిషిపై సయ్యద్ హుస్సేన్ అత్యాచారం జరపగా, కళావతి వీడియో తీసింది. బాధితురాలు తేరుకున్న తర్వాత.. విషయం బయటకు చెబితే వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించింది. రూ.5 లక్షలు ఇవ్వాలని కొన్ని రోజులుగా వేధిస్తోంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రతీష్ ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన సయ్యద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఓ వ్యాపారినీ బెదిరించారు.. వీడియో తీసిన మహిళ గతంలో తన వలలో చిక్కుకున్న మార్కెట్ ఏరియాకు చెందిన ఓ వ్యాపారిని సైతం బెదిరించింది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. సదరు వ్యాపారి ఫిర్యాదు మేరకు గత సెప్టెంబర్ 20న కేసులు కూడా నమోదు చేశారు. వలపు వలలో మరికొందరు కూడా చిక్కుకున్నట్లు సదరు మహిళ సెల్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. -
వీడియో చూపి మహిళను బెదిరించి..
సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు) : ఓ యువకుడు మహిళను బ్లాక్మెయిల్ చేసి సుమారు రూ.60 లక్షలకు పైగా నగదు తీసుకున్నాడు. ఈక్రమంలో అతడిపై ఆమె సంబంధీకులు దాడి చేశారు. దీంతో యువకుడు వారిపై కేసు పెట్టిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. మున్సిపల్ పరిధిలో ఓ మహిళ ఫలసరుకుల దుకాణం నిర్వహిస్తోంది. ఆ పక్కనే ఓ యువకుడు సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తుంటాడు. అతను కరెంట్ పనులు కూడా చేస్తుంటాడు. ఈక్రమంలో ఆ మహిళ తమ ఇంట్లో కొత్త సీలింగ్ ఫ్యాన్ బిగించాలని అతడిని కోరింది. అతను ఆమె ఇంట్లో ఫ్యాన్ బిగించి బాత్రూమ్లో రహస్యంగా వీడియో కెమెరా ఏర్పాటు చేశారు. వారంరోజుల అనంతరం అందులో రికార్డైన దృశ్యాలను ఆమెకు చూపించి బెదిరించాడు. నగదు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు. భయపడిన ఆమె అతను అడిగిన మేరకు నగదు ఇచ్చింది. యువకుడు సదరు మహిళ వద్ద సుమారు రూ.60 లక్షలకు పైగా వసూలు చేశాడని చెబుతున్నారు. ఇలా బయటపడింది వ్యాపార నిర్వహణ పేరుతో పలువురు వద్ద మహిళ అప్పులు చేసిందని, సుమారు రూ.కోటికి పైగా అప్పులైందని, వారంరోజుల క్రితం గ్రామంలో పుకార్లు రావడంతో ఒక్కసారిగా ఆమెకు అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఆ యువకుడికి తాను నగదు ఇచ్చానని, అతను చేసిన పనిని భర్త, బంధువులకు చెప్పింది. ఈ క్రమంలో ఆమె బంధువులు ఆ యువకుడిని గట్టిగా ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా చెప్పాడు. దీంతో అతడిని తీసుకెళ్లి దాడి చేశారు. ఈ విషయం ఆత్మకూరు పోలీసులకు తెలియడంతో ఎస్సైలు సి.సంతోష్‌కుమార్‌రెడ్డి, రూరల్ ఎస్సై రోజాలతలు విడివిడిగా ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసులు అవసరం లేదని, మేము రాజీ చేసుకుంటామని ఆ వర్గాలు చెప్పడంతో వెనుదిరిగారు. నెల్లూరులో ఫిర్యాదు మంగళవారం రాత్రి సదరు యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మహిళ తరఫు వారు అతడిని ఓ ప్రైవేట్ కాంపౌండర్ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి అదే రాత్రి తన సిబ్బందితో కలిసి మీడియా వారిని వెంట తీసుకుని యువకుడి కోసం వెతికారు. అయితే వారి ప్రయత్నం వృథా అయింది. ప్రథమచికిత్స అనంతరం ఆ యువకుడు ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో తన బంధువుల ఇంట్లో ఒకరోజు తలదాచుకుని గురువారం నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు శుక్రవారం తెల్లవారుజామున ఆత్మకూరు పోలీసులకు సమాచారమిచ్చి మహిళతో సహా 18 మందిని నెల్లూరుకు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో వదిలేశారు. 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. యువకుడికి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. కాగా దీని విషయమై ఆత్మకూరు పోలీసులు మాట్లాడుతూ నెల్లూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో తాము వెళ్లామన్నారు. -
లైంగికదాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్
చౌటుప్పల్(మునుగోడు) : బ్లాక్మెయిల్ చేసి వివా హితపై మూడేళ్లు లైంగికదాడికి పాల్పడిన నింది తుడిని శుక్రవారం చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సహకరించిన ఇద్దరి యువకులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ రామోజు రమేష్ విలేకరులకు వివరించారు. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య బండలు తొలగించే కంప్రెషర్ పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఉన్నారు. వివాహం జరి గిన కూమార్తె కూడా ఉంది. గ్రామంలోని ఓ 35 ఏళ్ల వయస్సు కల్గిన మహిళపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. కుదరని పక్షంలో రహస్యంగా తను స్నానం చేస్తుండగా తీసిన వీడియోలను చూపించి లొంగదీసుకున్నాడు. అలా మూడేళ్లుగా వ్యవహారం నడిపిం చా డు. శృంగార సమయంలోనూ వీడియోలు తీశా డు. ఇటీవల కొంతకాలంగా సదరు మహిళ రంగయ్యను దగ్గరకు రానివ్వకుండా దూరంపెట్టింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రంగయ్య తనలోని శాడిజాన్ని బయటకు లాగాడు. శృంగార వీడియోలను వాట్సప్ గ్రూప్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్లోడ్ చేసే పరిజ్ఞానం తన వద్ద లేకపోవడంతో తమ గ్రామానికే చెందిన యువకుల సహాయం తీసుకున్నాడు. చౌటుప్పల్‌లో ఫొటోస్టూడియో నడుపుకుంటున్న గ్రామానికి చెందిన వరికుప్పల మహేష్, అదేగ్రామానికి చెం దిన నల్లెంకి ప్రశాంత్‌లను సంప్రదించాడు. వారు వీడియోలను తన కంప్యూటర్లోకి వేసుకున్నారు. అందులో ఉన్న వీడియోలను ముగ్గురూ కలిసి ఈ నెల 14న గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూప్‌లు, వ్యక్తిగత వాట్సప్‌లకు, ఫేస్‌బుక్‌లకు పంపిం చా రు. గ్రామంలో శృంగార వీడియోలు వైరల్‌గా మా రాయి. ఇంతలోనే విషయాన్ని తెలుసుకున్న బాధి త మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను తొలగించారు. నిందితుడు రంగయ్య, సహకరించిన మహేష్, ప్రశాంత్‌లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించారు. వారి నుంచి ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు, కంప్యూటర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ ఏరుకొండ వెంకటయ్య, ఎస్ఐ చిల్లా సాయిలు, సిబ్బం ది నర్సింహ, ఊడుగు సైదులు ఉన్నారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా.. నిందితుడు ఉప్పుతోట రంగయ్య గతంలో మా వోయిస్టు సానుభూతిపరుడు. దీంతో ఇతని వ్యవహారాల్లో గ్రామస్తులు పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదని స్థానికులు తెలుపుతున్నారు. -
భార్య వంకతో పిలిచి.. అత్యాచారం
విజయనగరం జిల్లా రామభద్రపురంలో దారుణం జరిగింది. తన భార్య పిలుస్తోందంటూ ఓ మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. రామభద్రపురానికి చెందిన శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా ఈ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడు. సెల్ఫోన్లో తీసిన దృశ్యాల్ని మరొకరికి షేర్ చేయడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పెడతానని బెదిరిస్తూ బాధితురాల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు బాడింగి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు సరిగా స్పందించడంలేదని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతోంది.