విజయనగరం జిల్లా రామభద్రపురంలో దారుణం జరిగింది. తన భార్య పిలుస్తోందంటూ ఓ మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. రామభద్రపురానికి చెందిన శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా ఈ దారుణాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేశాడు. సెల్‌ఫోన్లో తీసిన దృశ్యాల్ని మరొకరికి షేర్ చేయడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పెడతానని బెదిరిస్తూ బాధితురాల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
వెంటనే కుటుంబ సభ్యులు బాడింగి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు సరిగా స్పందించడంలేదని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతోంది.
భార్య వంకతో పిలిచి.. అత్యాచారం
Published Sat, Jan 31 2015 6:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement
Advertisement