Rajasthan: Man Sending Lewd Messages And Harassing Woman Professor In Video Calls - Sakshi
Sakshi News home page

మహిళా ప్రొఫెసర్‌కు అ‍శ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు..

Published Fri, Feb 4 2022 6:49 PM | Last Updated on Fri, Feb 4 2022 7:52 PM

Rajasthan: Man Sends Lewd Messages To Woman professor, Harasses On Video Calls - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: మహిళా ప్రొఫెసర్‌ను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ధ‌రంపాల్ రాయ్‌గా (36) గుర్తించారు. వివరాలు..36 ఏళ్ల ధరంపాల్‌ జోధ్‌పూర్‌లోని ఆర్ఓ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే రాయ్‌ గ‌త కొద్దిరోజులుగా ఢిల్లీ వ‌ర్సిటీకి చెందిన మ‌హిళా ప్రొఫెస‌ర్‌కు అశ్లీల వీడీయోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు. వాట్సాప్‌లో అభ్యంత‌ర‌క‌ర వీడియోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టేవాడు.
చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని..

దీంతో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు పంపి వేధిస్తున్నాడని మహిళా ప్రొఫెసర్‌ జనవరి 29న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక స‌హ‌కారంతో ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు వీడియో కాల్స్‌ చేస్తూ వేధిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో ఫ్రొఫెసర్‌ కాంటాక్ట్‌ నంబర్‌ దొరికిందని, అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించానని నిందితుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. ఇత‌ర మ‌హిళ‌ల‌నూ ఇదే త‌ర‌హాలో నిందితుడు గ‌తంలో వేధించాడ‌నే కోణంలోనూ ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.
చదవండి: కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement