woman professor
-
ముప్పయ్యేళ్ల క్రితం సాహసం.. వెచ్చూరు ఆవుల పరిరక్షణ
సోసమ్మ ఐపె.. ఈ మహిళా వెటర్నరీ ప్రొఫెసర్ ముప్పయ్యేళ్ల క్రితం సాహసంతో తన ఉద్యోగాన్నే దేశీ గోజాతి పరిరక్షణ ఉద్యమ కేంద్రంగా మార్చుకొని ఉండకపోతే.. ఇవ్వాళ అపురూపమైన వెచ్చూరు గోజాతి మనకు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయేది. అందుకే ఆమెను ‘వెచ్చూరమ్మ’ అని కేరళ రైతులు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన 80 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సోసమ్మ విశేష కృషి గురించి మహిళా దినోత్సవం సందర్భంగా ముచ్చటించుకుందాం.. ‘వెచ్చూరు’ అత్యంత అరుదైన పొట్టి దేశీయ గోజాతి. మన ‘పుంగనూరు’ కన్నా ఎత్తు తక్కువగా ఉండే ఆవులు ఇవి. కొట్టాయం జిల్లాలోని వెచ్చూరు గ్రామం ఈ జాతి పుట్టిల్లు. ‘1960లలో అధిక పాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం విదేశీ గోజాతులతో సంకరీకరణ విధానాన్ని భారీఎత్తున అమలు చేయటం ప్రారంభించింది. 1980ల నాటికి వెచ్చూరు దేశీయ జాతి ఆవుల సంతతి దాదాపుగా అంతరించిపోయింది..’ అని డా. సోసమ్మ గుర్తుచేసుకున్నారు. అటువంటి దశలో కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీలో బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. సోసమ్మ దృష్టి వెచ్చూరు ఆవుల పరిరక్షణ వైపు మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైన పనిని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. ఆమె ప్రయత్నాలకు 15–20 మంది వెటర్నరీ విద్యార్థులు, వ్యక్తులు మద్దతుగా నిలిచారు. మొదటి పని.. నికార్సయిన వెచ్చూరు ఆవులు ఎక్కడైనా మిగిలి ఉన్నాయా అని కొట్టాయం తదితర దక్షిణ కేరళ జిల్లాల్లో 1989లో వెతకడం ప్రారంభించారు. సెలవు రోజుల్లో ఆమె, విద్యార్థులు బృందాలుగా విడిపోయి కాలికి బలపం కట్టుకొని తిరిగారు. సొంత ఖర్చులతో ఊళ్లమ్మట తిరుగుతూ రైతులను వాకబు చేసేవారు. విద్యార్థుల కుటుంబాలు కూడా ఇందులో భాగస్వాములు కావటం విశేషం. ‘నా ఉద్యోగ జీవితంలోనే అవి అత్యుత్తమ ఘడియలు. మేం అంతా ఆ ప్రయాణంలో సంతోషదాయకంగా నిమగ్నమయ్యాం..’ అన్నారామె. ఒక్కోసారి చాలా రోజులు తిరిగినా ఒక్క వెచ్చూరు ఆవు జాడ కూడా దొరికేది కాదు. ఎట్టకేలకు మనోహరన్ అనే రైతు దగ్గర మొదటి ఆవును గుర్తించాం. ఆయన ఆవును మాకు అమ్మటానికి మొదట అంగీకరించలేదు. పరిశోధన చేసి జాతిని బతికిస్తాం అని నచ్చజెప్పిన తర్వాత అంగీకరించారు. మా అందరికీ పట్టలేని సంతోషం కలిగిన రోజు అది. ఒక ఏడాదిలో 24 నికార్సయిన 24 వెచ్చూరు ఆవులను సేకరించగలిగాం. మరింత సంతోషం ఏమిటంటే.. వీటి కొనుగోలుకు, పోషణకు యూనివర్సిటీ నుంచి రూ. 65 వేల గ్రాంటు అందటం. మన్నుతిలోని వెటర్నరీ యూనివర్సిటీ క్షేత్రంలోనే ఆవులను ఉంచి పోషించటం ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత పనులూ సులువుగా ఏమీ జరగలేదు. ‘మేం చేస్తున్న పని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైనది. మా పనిని యూనివర్సిటీలో కొందరు వ్యతిరేకించేవారు కూడా. అయితే, ఈ లోగా వెచ్చూరు దేశీ గోజాతి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తింపు వచ్చింది’ అన్నారామె. సంవత్సరం గడిచేలోగానే పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేక ఆవులు చనిపోయాయి. అందుకు పాల్పడింది ఎవరో తెలీదు. దర్యాప్తు కొనసాగింది. ‘నా జీవితంలో అతి కష్టమైన రోజులవి.. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా సరే.. లక్ష్యసాధనకు మా పోరాటాన్ని మాత్రం ఆపలేద’న్నారు డా. సోసమ్మ. 1998లో స్కాట్లండ్కు చెందిన రోస్లిన్ ఇన్స్టిట్యూట్ వెచ్చూర్ గోజాతి డిఎన్‌ఎపై పేటెంట్ పొందటం పరిశోధనారంగంలో సంచలనం కలిగించింది. ‘వెచ్చూరు జాతి పరిరక్షణకు మేం చేస్తున్న కృషికి చాలా ప్రతిఘటన ఎదురైన రోజులవి. రెండేళ్ల దర్యాప్తు తర్వాత.. వారిది తప్పుడు పని అని తేలిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాం’ అన్నారు డా. సోసమ్మ. వెచ్చూరు జాతి పరిరక్షణ కృషిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి అని భావించి వెచ్చూరు కన్సర్వేషన్ ట్రస్టును 1998లో రిజిస్టర్ చేయించారు. ట్రస్టు తరఫున మేలైన వెచ్చూరు ఆబోతుల వీర్యాన్ని సేకరించి రైతులకు అందించడం ప్రారంభించారు. వెచ్చూరుతోపాటు కాసర్గోడ్ గోజాతుల చిల్డ్/ఫ్రోజెన్ వీర్యాన్ని రైతులకు 2008 నుంచి ఈ ట్రస్టు అందిస్తోంది. మరోవైపు యూనివర్సిటీ తరఫున బయోడైవర్సిటీ బోర్డు, నాబార్డులతో కలసి వెచ్చూరు జాతిపై పరిశోధనా ప్రాజెక్టులు చేశారు. ఎఫ్.ఎ.ఓ., యు.ఎన్.డి.పి.ల నుంచి డా. సోసమ్మకు ప్రశంసలు, అవార్డులు సైతం లభించాయి. ఇప్పుడు కేరళ తదితర రాష్ట్రాల్లో 5 వేలకు పైగా వెచ్చూరు జాతి పశువులు ఉన్నాయని డా. సోసమ్మ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చెప్పారు. facebook.com/vechur – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి 2 అడుగులు.. 3 లీటర్లు.. వెచ్చూరు ఆవు సగటు ఎత్తు 90 సెంటీమీటర్లు (3 అడుగులు). అయితే, 61.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన వెచ్చూరు ఆవు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. కేరళకు చెందిన రైతు, పర్యావరణవేత్త బాలకృష్ణన్ నంబుకుడి కుటుంబంలో భాగంగా మారిపోయిన ఈ ఆవు పేరు ‘మాణిక్యం’. తమ కుటుంబానికి దైవమిచ్చిన కానుక మాణిక్యం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. వెచ్చూరు ఆవు తక్కువ మేత తింటుంది. సగటున 3 లీటర్ల పాలు ఇస్తుంది. పెరట్లోనూ పెంచుకోవచ్చు. నిర్వహణ సులభం. దీని పాలు ఔషధ విలువలతో కూడి ఉంటాయని చెబుతారు. -
మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు..
న్యూఢిల్లీ: మహిళా ప్రొఫెసర్‌ను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ధరంపాల్ రాయ్‌గా (36) గుర్తించారు. వివరాలు..36 ఏళ్ల ధరంపాల్ జోధ్‌పూర్‌లోని ఆర్ఓ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే రాయ్ గత కొద్దిరోజులుగా ఢిల్లీ వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడీయోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు. వాట్సాప్‌లో అభ్యంతరకర వీడియోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. దీంతో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు పంపి వేధిస్తున్నాడని మహిళా ప్రొఫెసర్ జనవరి 29న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సహకారంతో ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు వీడియో కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు. ఫేస్బుక్ సెర్చ్‌లో ఫ్రొఫెసర్ కాంటాక్ట్ నంబర్ దొరికిందని, అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించానని నిందితుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. ఇతర మహిళలనూ ఇదే తరహాలో నిందితుడు గతంలో వేధించాడనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి -
స్నేహితుడే అత్యాచారం చేశాడు
నోయిడా: తన స్నేహితుడే తనపై అత్యాచారం జరిపాడని, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడని ఓ మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసినట్లు iఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 26న ఈ సంఘటన జరిగిందన్నారు. సెక్టార్ 26లోని ఓ గెస్ట్ హోస్లో కలుసుకోమని శుభమ్ వర్మ అనే మిత్రుడు అడిగాడని, వివాహం చేసుకుంటానన్న సాకుగా అక్కడ తనపై అత్యాచారం జరిపాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు రాజస్థాన్‌లోని శికార్ జిల్లానుంచి వచ్చి కాన్పూర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరు స్నేహితులని, శికార్ జిల్లాకే చెందిన ఇతను యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తుంటాడని, 15 రోజుల సెలవుపై ఇండియాకు వచ్చాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షలకు పంపామని, నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. -
బీఫ్ ఫెస్టును సమర్థించినందుకే...
కేరళ విద్యా సంస్థల్లో బీఫ్ వివాదం ముదురుతోంది. ఓ కాలేజీలో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులను సమర్థించిన మహిళా ప్రొఫెసర్... వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ప్రొఫెసర్ దీపా నిశాంత్ ఖండించింది. శ్రీ కేరళ వర్మ కాలేజీ ప్రాంగణంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గో మాంసంతో విందు చేసుకోవడంతో యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడం.. విద్యార్థి సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అఖిల భారత విద్యా పరిషత్, రైట్ వింగ్ విద్యార్థి సంఘాల పిర్యాదు మేరకు కాలేజీ యాజమాన్యం... విద్యార్థులకు సపోర్ట్ చేసిన మలయాళం ప్రొఫెసర్ దీపా నిశాంత్ పై విచారణ ప్రారంభించింది. కేరళ వర్మ కాలేజీలో బీఫ్ వాడకం.. రాష్ట్రంలోని పలు కళాశాలల్లో నిరసనలకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలు వ్యతిరేకించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అయితే కాలేజీ యాజమాన్యం... విద్యాలయాన్ని దేవాలయంగా ట్రీట్ చేస్తున్నారు అని, దేవాలయాల్లోని ధార్మిక పద్ధతులను పాటించాల్సిన అవసరం విద్యా సంస్థలకు లేదని ప్రొఫెసర్ దీపా నిశాంత్ ఫేస్ బుక్ లో తన కామెంట్ ను పోస్ట్ చేశారు. విద్యా సంస్థలు మతపరమైన నియమాలను అనుసరించకూడదని, ఇప్పుడు మాంసాన్ని నిషేధించిన వారు.. మరోసారి ఏకంగా రుతుక్రమ సయంలో మహిళలు, వెనుకబడిన తరగతుల ప్రవేశాన్నీ నిషేధిస్తారని నిశాంత్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ వర్మ కాలేజీలో పరిపాలన విభాగం కూడ శబరిమళ ఆలయం నిర్వహిస్తోంది. అయితే శబరిమళ ఆలయంలో రుతు క్రమంలో మహిళల ప్రవేశం పూర్తి నిషిద్ధం అని.. కాలేజీ ప్రాంగణంలో అయ్యప్ప దేవాలయం ఉందని, బీఫ్ ఫెస్టివల్ నిర్వహణను నిషేధించడానికి అదో కారణమని దీపా నిశాంత్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా 1947 లో కళాశాల ప్రారంభించినప్పటినుంచీ ప్రాంగణంలో మాంసాహారం నిషేధాన్ని పాటిస్తున్నారని, నిబంధనలకు అనుగుణంగా తాము కూడ కాలేజీలో మాంసాహార వంటకాలను అందించడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ లత చెప్తున్నారు. నేను సోషల్ మీడియా ఎంతో శక్తి వంతమైనదని నమ్మాను. అందుకే నా వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాను. విద్యార్థులు సామాజిక మీడియా వినియోగదారులు నన్ను సమర్థించారు అంటున్నారు దీపా నిశాంత్. ఇప్పుడు దీపా పోస్ట్ కు ఫేస్ బుక్ లో సుమారు అరవై వేలమంది అనుచరులు కూడ ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా కేరళలో భారతీయ జనతా పార్టీ మాత్రం గొడ్డు మాంసం వినియోగంపై నిశ్శబ్దంగా ఉంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మురళీ ధరన్ ఇప్పటివరకూ రాస్టంలో గోవధ నిషేధంపై ఎటువంటి స్టాండ్ తీసుకోలేదని చెప్పారు. గోవధను కేరళలో నిషేధించలేదని, అక్కడ అదే ప్రసిద్ధ వంటకంగా ఉందని ప్రొగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రెటరీ కవితా కృష్ణన్ అంటున్నారు. చవక ధరలో అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే పోషకాహారం కూడ అని ఆమె చెప్తున్నారు. -
నాన్నా... ఆత్మహత్య చేసుకుంటున్నా!
హైదరాబాద్: 'నాన్నా... నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని డైరీలో రాసి... తండ్రికి ఫోన్ చేసి చెప్పింది ఓ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్. దాంతో ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి...పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగా బుధవారం ఉదయం యూనవర్శిటీకి వచ్చిన సదరు మహిళ ప్రొఫెసర్... తాను అత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అంతేకాకుండా ఆ డైరీ యూనివర్శిటీ లైబ్రరీలో ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో కంగారు పడిన వారు వెంటనే యూనివర్శిటీకి చేరుకున్నారు. అనంతరం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. యూనివర్శిటీలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆమె సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే అక్కడి పోలీసులను నగర పోలీసులు అప్రమత్తం చేశారు. దాంతో మహిళ ప్రొఫెసర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.