
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో స్నానాలు చేసి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తారు... బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో ఇంటింటా దీపాలు అలంకరించి వెలిగించడం పౌర్ణమి ప్రత్యేకత.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన కుటుంబీకులకు వీడియోకాల్ చేస్తూ గోదారమ్మ ఒడిలో దీపాలు వదులుతున్న మహిళ ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది.