deepam
-
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా అలంకరించిన వాహనాల్లో ప్రతిరోజూ అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్లను వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లోని పలు ఘట్టాలు భక్తులను అమితంగా అలరిస్తాయి. భరణి దీపం: కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భరణి దీపం వేడుకను ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహాదీపం: ఉత్సవాల్లో ‘మహాదీపం’ వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మహాదీపం వెలిగిస్తారు. గిరివాలం: కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు గిరివాలానికి (ప్రదక్షిణ) తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు. 3500 లీటర్ల నెయ్యి వినియోగం: మహాదీపం వెలిగించేందుకు భక్తుల నుంచి స్వీకరించిన 3500 లీటర్ల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఇంతకుముందే కొండపైకి తీసుకెళ్లారు. మహా దీపాన్ని వీక్షించేందుకు 2,500 మందిని మాత్రమే కొండపైకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
బాల్కో లిస్టింగ్‌పై ప్రభుత్వ దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వాటా విక్రయం ఇలా 2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్‌యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్‌ను తిరస్కరించింది. దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం!
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) విభాగం అధికారిక ప్రకటన చేసింది. ఐడీఐబీ బ్యాంక్‌ను వ్యూహాత్మక అమ్మక ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ( Expression of Interest (EOI)దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై దీపం సెక్రటరీ తుహిన్‌కాంత పాండే ట్వీట్లు చేశారు. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈఏఐలు దాఖలయ్యాయని, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్రం, ఆర్బీఐ ఐడీబీఐ కొనుగోలు చేసేందుకు దాఖలైన బిడ్లను పరిశీలిస్తుంది. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి భద్రతాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే రెండో దశ బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. ఐడీబీఐలో కేంద్రం,ఎల్ఐసీ వాటా ఎంతంటే కేంద్రం, ఎల్ఐసీ ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. విక్రయంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
ఐడీబీఐ బ్యాంక్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా బిడ్స్ దాఖలు గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. కొనుగోలుదారులు 2023 జనవరి 7వరకూ ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు నోటీసు ద్వారా దీపమ్ పేర్కొంది. బ్యాంకులో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం సంయ్తుంగా విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) లేదా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు తొలుత 2022 డిసెంబర్ 16వరకూ గడువును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ నిర్వహిస్తున్న సలహాదారు సంస్థలకు గడువును పెంచవలసిందిగా అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కాగా.. ఈవోఐ ఫిజికల్ కాపీల దాఖలుకు గడువును సైతం 2022 డిసెంబర్ 23 నుంచి 2023 జనవరి 14వరకూ పొడిగిస్తున్నట్లు నోటీసులో దీపమ్ వెల్లడించింది. వాటాల వివరాలిలా.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ(49.24 శాతం), ప్రభుత్వం(45.48 శాతం) సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆఫర్లో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. దీంతో బ్యాంకును దక్కించుకున్న బిడ్డర్.. పబ్లిక్ నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. కొనుగోలుదారు సంస్థ కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు నికర లాభాలు ఆర్జించి ఉండాలి. ఒక కన్సార్షియంలో భాగంగా నాలుగు సంస్థలను మాత్రమే అనుమతిస్తారు. బ్యాంకును సొంతం చేసుకున్నాక కనీసం 40 శాతం ఈక్విటీ పెట్టుబడులను ఐదేళ్లపాటు తప్పనిసరిగా లాకిన్ చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.4% నీరసించి రూ. 57.3 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ ఐపీవో వాయిదా!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఎల్ఐసీ వాటా విక్రయ అంశాన్ని పునఃపరిశీలించే వీలున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనే చేపట్టేందుకు కట్టుబడితే.. ఇది ప్రగతిశీల విషయమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ‘2022 ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా’పై నిర్వహించిన ఏడో జాతీయ సదస్సులో భాగంగా పాండే ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాదికి సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించే బాటలో ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
నీలాచల్ ఇస్పాత్ రేసులో ఎంఈఐఎల్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రయివేటైజేషన్‌కు ఆసక్తిగల కంపెనీల నుంచి స్పందన లభించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. పీఎస్యూలో వ్యూహాత్మక వాటా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు వెల్లడించారు. దీంతో కంపెనీ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో ఎన్ఐఎన్ఎల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి వీలుగా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా కంపెనీలను దీపమ్ ఆహ్వానించింది. దరఖాస్తుకు మార్చి 29 తుది గడువుకాగా.. పలు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) దరఖాస్తులు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. మెటల్ రంగ ప్రయివేట్ దిగ్గజాలు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సీŠట్ల్, జేఎస్‌పీఎల్‌సహా.. ఇన్ఫ్రా రంగ హైదరాబాద్ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్) సైతం తాజాగా ఫైనాన్షియల్ బిడ్స్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గోదారమ్మ ఒడిలో... పౌర్ణమి వీడియో కాల్...
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో స్నానాలు చేసి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తారు... బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో ఇంటింటా దీపాలు అలంకరించి వెలిగించడం పౌర్ణమి ప్రత్యేకత.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన కుటుంబీకులకు వీడియోకాల్ చేస్తూ గోదారమ్మ ఒడిలో దీపాలు వదులుతున్న మహిళ ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. -
కార్తీక పౌర్ణమి: దేదీప్యం.. ఇంద్రవైభోగం
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): కోటి కార్తిక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు.. కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమరపిస్తూ దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం స్వా మిజీ పూజలు నిర్వహించి.. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కోటి ఒత్తుల భారీ దీపాన్ని వెలిగించారు. ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం కోటి దీపోత్సవానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలాసోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనానంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పుష్పాలతో రంగవల్లులు కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీరిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహా గణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, మహా మండప, కనకదుర్గనగర్‌లో దీపాలను ఏర్పాటు చేయగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని అర్చకులు వెలిగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
పీఎస్‌యూ వాటాల విక్రయంలో ముందుకే
న్యూఢిల్లీ, కోల్‌కతా: కేబినెట్ ఆమోదించిన ప్రభుత్వరంగ సంస్థల్లో (సెంట్రల్ పీఎస్‌యూ) వాటాల విక్రయాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వర్ధమాన దేశాల్లో భారత్‌కే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌డీఐ) అధికంగా ఉందని గుర్తు చేస్తూ.. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, సంస్కరణలు చేపట్టగల సామర్థ్యాలు, స్థిరమైన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలుగా పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ పెద్ద కంపెనీల్లో కొన్నింటిలో వాటాలను విక్రయించాలన్నది మా ప్రయత్నం. ఆసక్తి వ్యక్తీకరణలు అందాయి. తదుపరి దశ ఆరంభమవుతోంది. కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వాటాల విక్రయాలను దీపమ్ ( పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) మరింత చురుగ్గా నిర్వహించగలదని భావిస్తున్నాము’’ అని మంత్రి చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటి వరకు సమకూరింది కేవలం రూ.11,006 కోట్లే కావడం గమనార్హం. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సహా 25 ప్రభుత్వరంగ సంస్థల్లో పాక్షికంగా, పూర్తిగా వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేసింది. ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయి. పలు సావరీన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌కు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల అవి మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రగతిశీల సంస్కరణల వైపు ప్రభుత్వం చూస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదు. స్పష్టమైన పెట్టుబడుల ఉపసంహరణ అంజెండాను ప్రకటించాము’’ అని మంత్రి వివరించారు. ఏ చర్య తీసుకున్నా సరిపోదు ఆర్థిక రంగ పురోగతికి మద్దతుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్య అయినా సరిపోదన్నారు. కాకపోతే ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. -
గడువులోగా విక్రయించకపోతే, నిధుల కోత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌యూ)లు కీలకం కాని తమ ఆస్తుల విక్రయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ సీపీఎస్‌యూలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తారు. ఈ మేరకు సీసీఎస్యూల ఆస్తుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను దీపమ్ జారీ చేసింది. దీంతో పాటు శతృ సంస్థల స్థిరాస్థుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా దీపమ్ వెల్లడించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.., దీపమ్ కార్యదర్శి అధ్యక్షతన గల అంతర మంత్రిత్వ సంఘం(ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్–ఐఎమ్జీ) సీపీఎస్‌యూల కీలకం కాని ఆస్తులను గుర్తిస్తుంది. ఇలా గుర్తించడంలో ఐఎమ్జీ స్వతంత్రంగా గానీ, నీతి ఆయోగ్ సూచనలను గానీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్థిక మంత్రి, రహదారుల మంత్రి, సంబంధిత శాఖ నిర్వహణ మంత్రులు సభ్యులుగా గల ఆల్టర్నేటివ్ మెకానిజమ్.. సీపీఎస్‌యూ విక్రయించాల్సని ఆస్తులకు ఆమోదం తెలుపుతుంది. ఈ ఆమోదం పొందిన ఏడాదిలోపు సదరు ఆస్తుల విక్రయం జరిగాల్సి ఉంటుంది. ఈ ఆస్తుల విక్రయానికి కావాలంటే కొంత గడువును సీపీఎస్‌యూలు కోరవచ్చు. మరోవైపు శతృసంస్థల స్థిరాస్తులను హోమ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. -
దీపం పేరుతో పాపం
► దోపిడీకి తెర తీసిన అధికార పక్ష కార్యకర్తలు ► రెండు నెలల్లో రూ.11కోట్లు స్వాహా ► దీపం, ఉజ్వల పథకాల్లో భారీగా వసూళ్లు ► కనెక్షన్‌కు రూ.వెయ్యికి పైగా అదనపు బాదుడు ► జన్మభూమి కమిటీ సభ్యులదే భాగస్వామ్యం సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దల మాట. టీడీపీ కార్యకర్తలు ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయిపోతున్నారు. అయితే పేదింటిలో వెలగాల్సిన దీపాన్ని తమ ఇంటిలో వెలుగుకు వాడుకుంటున్నారు. దీపం, ఉజ్వల కనెక్షన్ల మంజూరులో దోపిడీ పర్వానికి తెర లేపి అందినకాడికి దండుకుంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలం గోపీనాథపురం గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడు సాక్షితో మాట్లాడుతూ ‘జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులకు రూ.3,100 చెల్లించి దీపం పథకం కనెక్షన్ తీసుకున్నాను. అంత చెల్లించే స్థోమత లేపోయినా వ్యతిరేకించలేకపోయాను. ఒకవేళ వ్యతిరేకిస్తే సంక్షేమ పథకాలు నాకు రాకుండా చేస్తారేమోనని భయం. మా గ్రామంలో చాలామంది వద్ద గ్యాస్ కోసం అదనంగా వసూలు చేశారు. నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీపం పేరుతో జరుగుతున్న పాపానికి ఈ మాటలే నిదర్శనం. రూ.11 కోట్ల దోపిడీ జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల ముసుగులో రూ.11 కోట్ల వరకూ పేదల నుంచి గుంజేశారు. ఈ వ్యవహారంలోనూ జన్మభూమి కమిటీ సభ్యులదే ప్రధాన భాగస్వామ్యం. వాస్తవానికి జిల్లాను పొగరహితంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటింటా సర్వే నిర్వహించి ఏ ఇంట్లో అయితే వంటగ్యాస్ కనెక్షన్ లేదో వారికి దీపం, ఉజ్వల పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగానే అతి తక్కువ ధరకే వంటగ్యాస్ కనెక్షన్‌ను లబ్ధిదారులకు మంజూరు చేయాల్సి ఉంది. దీపం పథకమైతే రూ.1,980లు, ఉజ్వల పథకమైతే రూ.700లు చెల్లించాలి. అదీ రాజకీయాలకు అతీతంగా తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలి. దీని కోసం సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ డీలరును సంప్రదిస్తే సరిపోతుంది. ఏ అధికారి సంతకం అవసరం లేదు. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండరు డిపాజిట్ చెల్లించనక్కర్లేదు. గ్యాస్ స్టౌ (చిన్నది), రెగ్యులేటర్, రబ్బరు ట్యూబు ఉచితం. వినియోగదారుల పుస్తకానికి కానీ, ఇన్స్టాలేషన్ చార్జీలు కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే 2011 సంవత్సరం జనాభా లెక్కల్లో పేరు నమోదై ఉండాలి. దీపం పథకం విషయానికొస్తే గ్యాస్ సరఫరా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమైనా రాయితీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్‌కు డిపాజిట్ చెల్లించనక్కర్లేదు. రెగ్యులేటర్ కూడా ఉచితం. కానీ ఇవి పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యులు చేతులు తడపాల్సి వస్తోంది. రూ.కోట్లలోనే వసూళ్లు రేషన్‌కార్డుల ఆధారంగా జిల్లాలో 8.22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ పథకాల కింద 6.47 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిలో సాధారణ కనెక్షన్లు 3.76 లక్షలు ఉన్నాయి. అలాగే దీపం కనెక్షన్లు 2.42 లక్షలు కాగా ఉజ్వల పథకం కింద 15,531 కనెక్షన్లు ఉన్నాయి. మరో 12 వేలు కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. గత రెండు నెలల కాలంలో దీపం, ఉజ్వల పథకాల కింద 1.14 లక్షల కనెక్షన్లు కొత్తగా మంజూరయ్యాయి. ఇవే జన్మభూమి కమిటీలకు వరంగా మారాయి. గ్రామస్థాయిలో ఆయా కమిటీల సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ అదనంగా వసూలు చేశారు. సగటున రూ.వెయ్యి చొప్పున లెక్క వేసినా అధికార పార్టీ వారి అక్రమ వసూళ్లు సుమారు రూ.11 కోట్ల పైమాటేనని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలుకూడాఏమీచేయలేక టీడీపీ నాయకులు సూచిం చిన వారికే దీపం కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. మచ్చుకు కొన్ని... దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కోసం పలాస మండలం చినంచల గ్రామంలో 20 మంది మహిళల వద్ద రూ.3,500లు చొప్పున జన్మభూమి కమిటీ సభ్యులు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలంలో దీపం గ్యాస్ కనెక్షన్‌కు రూ.3,100 నుంచి రూ.4,950 వరకు జన్మభూమి కమిటీ సభ్యులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నువ్వలరేవు గ్రామంలోనే సుమారు 220 కనెక్షన్లు మంజూరు చేయగా, వారందరి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం గమనార్హం. వీరఘట్టం మండలంలోని నీలానగరం గ్రామంలో దీపం పథకం కింద ఒక్కో కనెక్షన్‌కు రూ. 2500 చొప్పున వసూలు చేశారు. లబ్ధిదారులకు ఇచ్చే పరికరాలు దీపం (ధర) ఉజ్వల (ధర) 1. గ్యాస్ సిలిండర్ డిపాజిట్ ఉచితం ఉచితం(రూ.1450) 2. రెగ్యులేటర్ (రూ.150) ఉచితం ఉచితం 3. గ్యాస్ ఖరీదు రూ.700 రూ.700 4. రబ్బరు ట్యూబు రూ.190 ఉచితం 5. వినియోగదారుల పుస్తకం రూ.50 ఉచితం 6. ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.50 ఉచితం 7. గ్యాస్ స్టౌ(చిన్నది) రూ.990 ఉచితం మొత్తం రూ.1,980 రూ.700 -
వారం రోజుల్లో దీపం కనెక్షన్లు
- ప్రతి పంచాయతీలో రెండు ఫాంపాండ్స్ - జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ కర్నూలు(అర్బన్): దీపం కనెక్షన్ల గ్రౌడింగ్‌లో అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా అత్యంత దిగువ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు, ఉపాధిలో లేబర్ బడ్జెట్, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓ, డీఆర్డీఏ ఏపీఎంలకు దిశా నిర్దేశం చేశారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న కుటుంబాల సర్వేతో పాటు ఒకేసారి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో జిల్లా లక్ష్యం 1.50 లక్షలు కాగా, ఇప్పటి వరకు 2132 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జిల్లాలో ఉపాధి పథకం పనుల కింద లేబర్ బడ్జెట్ తక్కువగా నమోదవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రగతి తక్కువగా ఉన్న మండలాల ఏపీఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వారానికి రెండు ప్రకారం ఫాంపాండ్స్ పనులు పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, హౌసింగ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు హుసేన్‌సాహెబ్, డా.సీహెచ్ పుల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి ‘దీపం’ కనెక్షన్
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే నెల 2 నాటికి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ దీపం పథకం కింద కనెక్షన్ ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీపం పథకం అమలుపై ఆ శాఖ కమిషనర్ రాజశేఖర్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండి తీరాలని తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉండి ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు నుంచి జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు 1.75 లక్షలు ఉన్నాయని, వీటికి జూన్2 లోపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.1000 కే గ్యాస్ కనెక్షన్‌పై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీఎస్ఓ సుబ్రహ్మణ్యం, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు. -
రూ.1000కే దీపం గ్యాస్ కనెక్షన్
- ఒక కనెక్షన్ ఇప్పిస్తే రూ.25 ఇన్సెంటివ్ కర్నూలు(అగ్రికల్చర్): దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పంపిణీని వేగవంతం చేసేందుకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త పథకానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉండి ఇంత వరకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం జూన్ నెల నుంచి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ నెల చివరి లోపు కనెక్షన్ల పంపిణీని పూర్తి చేయాలని గ్యాస్ డీలర్లను ఆదేశించారు. రూ.1000కే గ్యాస్ సిలెండర్, రెగ్యులేటర్, గ్యాస్ పైపు, పాస్‌బుక్ ఇస్తారన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. లబ్ధిదారులు ఐఎస్ఐ మార్క్ కలిగిన స్టవ్‌ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇందుకు రూ.990 చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, డీలర్లు, గ్రామ డిజిటల్ అసిస్టెంట్లు రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలను గుర్తించి గ్యాస్ డీలరు దగ్గరకు తీసుకెళ్లి కనెక్షన్ ఇప్పిస్తే అక్కడికక్కడే రూ.25 ఇన్సెంటివ్ డీలరు చెల్లిస్తారని తెలిపారు. హెచ్పీసీ, ఐఓసీ కంపెనీలు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తాయన్నారు. గ్యాస్ సిలెండర్లు డోర్ డెలివరీ చేసే బాయ్‌లు బిల్లు ధర కంటే రూ.25 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని.. అడ్డుకట్ట వేయాలని డీలర్లకు ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ సుబ్రమణ్యం, మెప్మా పీడీ రామాంజనేయులు, ఏఎస్ఓలు రాజా రఘువీర్, వంశీకృష్ణారెడ్డి, ఐఓసీ, హెచ్పీసీ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు హరికృష్ణ, మురళీ, సీఎస్డీటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రతి కార్డుదారుడికి దీపం గ్యాస్ కనెక్షన్
– నగదురహిత లావాదేవీలపై మరింత దృష్టి – కొత్త డీఎస్ఓ వేము సుబ్రహ్మణ్యం వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి రేషన్ కార్డుదారుడికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇప్పించి, ప్రజా పంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచడం ప్రధాన లక్ష్యమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) వేము సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం కొత్త డీఎస్‌ఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్‌కు బొకే సమర్పించి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కాకి నాడకు చెందిన తాను మచిలీపట్నం ఏఎస్ఓగా పనిచేస్తూ శ్రీకాకులం జిల్లా ఇన్చార్జీ డీఎస్‌ఓగా 15 నెలలు బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. అక్కడి నుంచి పదోన్నతిపై కర్నూలు జిల్లాకు వచ్చినట్లు వివరించారు. జూన్ 2వ తేదీ లోగా తెల్ల కార్డుదారులందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. కొత్త డీఎస్ఓను ఆఫీసు సూపరింటెండెంటు రాజరఘువీర్, అర్బన్ ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, సీఎస్డీటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తదితరులు అభినందించారు. -
లాభదాయక పీఎస్‌యూల లిస్టింగ్
• నిర్దిష్ట గడువులోగా పూర్తి • ‘దీపం’ కార్యదర్శి నీరజ్ గుప్తా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తోంది. గత ఎనిమిదేళ్లలో కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టింగ్ కావడం దీనికి ప్రధాన కారణం. దీంతో నిర్దిష్ట కాలావ్యవధిలోగా లాభాల్లో ఉన్న అన్ని పీఎస్‌యూల(భారీ, మధ్య స్థాయి సంస్థలు) పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ)ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎస్‌యూల కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లన్నీ లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా మూడేళ్ల ఆడిటెడ్ అకౌంట్లు, తగినంత మంది స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన పూర్తిస్థాయి బోర్డులను అమల్లోకి తీసుకురావడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఎంతకాలంలో దీన్ని పూర్తిచేస్తారనేది గుప్తా వెల్లడించలేదు. దీపంలో మరో సీనియర్ అధికారి మాత్రం గరిష్టంగా మూడేళ్లలో లాభాల్లో ఉన్న సీపీఎస్ఈల లిస్టింగ్ ప్రక్రియను ముగించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం పేరును మోదీ సర్కారు ‘దీపం’గా మార్చిన సంగతి తెలిసిందే. కాగా, 2017–18 బడ్జెట్లో సీపీఎస్ఈల లిస్టింగ్‌కు సబంధించి స్పష్టంగా దిశానిర్ధేశం చేసిన విషయాన్ని గుప్తా ప్రస్తావించారు. చిన్న కంపెనీల లిస్టింగ్ అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘2009 నుంచి ఇప్పటివరకూ కేవలం ఆరు పీఎస్‌యూలు మాత్రమే లిస్టయ్యాయి. ఇందులో 2009 లో రెండు, 2010లో మూడు, 2012లో ఒకటి చొప్పున ఉన్నాయి. ఇక 2012లో నాలుగు కంపెనీలకు అనుమతి లభించినప్పటికీ.. ఇప్పటిదాకా ముందడుగు పడలేదు. 2014–16 మధ్య అసలు ఒక్క పీఎస్‌యూ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాలేదు. అందుకే ఈ ప్రక్రియ కోసం ఒక కచ్చితమైన కార్యాచరణ అవసరం’ అని గుప్తా తేల్చిచెప్పారు. -
దీపం దైవ స్వరూపం
కడప కల్చరల్: దీపం మానవ లోకానికి వెలుగునిచ్చే దైవ స్వరూపమని చిన్మయమిషన్ ఆచార్యులు నిర్మలానంద సరస్వతి పేర్కొన్నారు. చిన్మయమిషన్ కడపశాఖ ఆచార్యులు స్వామి శౌనకచైతన్య ఆధ్వర్యంలో ఆరు రోజులుగా స్థానిక మున్సిపల్ మైదానంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవ సభకు శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీపాన్ని జ్ఞాన జ్యోతిగా భావించాలని, ప్రాపంచిక జ్ఞానానికి చివరి దశ ఆధ్యాత్మికమేనని తెలిపారు. మానవుడు ఉత్తమ గుణాలతో ఆత్మజ్యోతిగా శివజ్యోతిని చేరుకునేందుకు సత్కర్మల ద్వారా ప్రయత్నించాలని సూచించారు. పరుచుకున్న వెలుగు – ఈ సందర్భఃగా వేదికపై శివలింగానికి విశేష అభిషేకాలు, అలంకారం అనంతరం స్వామిని నిర్మలానంద ప్రధాన జ్యోతిని వెలిగించారు. వెంటనే భక్తులు కూడా దీపాలను వెలిగించి శివనామ స్మరణ చేశారు. నిర్వాహకులు ముల్లంగి ప్రసాద్, ఎలిశెట్టి శివకుమార్, చింతకుంట పుల్లయ్య, మాకం నాగరాజు, ఆనంద్ తదితరులు భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.