చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి.
కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు.
అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు.
దీపంతో దోషం పరిహారం
- జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.
- పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట.
- పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట
- ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట.
- బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment