Deepawali
-
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం
దీపావళి.. తెలుగు వారి ముంగిట ఎంతో వెలుగులతో జరిగే పండుగ. నేడు ప్రతి ఇంటి ముందు కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి రివ్వున వెళ్లే తారా జువ్వలతో పాటు చిచ్చుబుడ్లు వెలుగుల ముందు అందరూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా ఇవన్నీ నిలుస్తాయి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో కూడా దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ సందర్భంగా కొన్ని పాటలు మీకోసం.. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన విచిత్రబంధం సినిమాలో “చీకటి వెలుగుల రంగేళి..” అంటూ సాగే దీపావళి పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది. మామగారు 1991లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున జంటగా నటించారు. ఇందులోని దిపావళి పండుగ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షాసేథ్, ప్రభాస్ మధ్య దీపావళీ సాంగ్ బాగా పాపులర్ అయింది. 1950 లో విడుదలైన షావుకారు తెలుగు సినిమా డ్రామా ఎంటర్టైనర్గా నిలిచింది. ఇందులో నటించిన వారు షావుకరు జానకి, గోవింద రాజుల సుబ్బ రావు, నందమురి తారక రామారావు. నిర్మాతగా బి నాగిరెడ్డి కాగా ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు. -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
అమెరికాలో వెల్లివిరుస్తున్న 'భారతీయం'.. మునుపు ఎన్నడూ లేనంతగా!
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అగ్రరాజ్యంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఉనికి చాటుకొనేలా, అందరూ గుర్తించేలా మనవాళ్లు ఉంటున్నారని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్‌హౌస్‌లో దివాలి వేడుకలు చెయ్యటం, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దివాలి వేడుకలలో పాల్గొనటం మనవాళ్ల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. వైట్‌హౌస్‌లో దీపావళి... బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌస్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓహెచ్ఆర్ షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్ పై గల అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా-దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు ప్రత్యేక అతిథులు ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్ ద డ్రీమ్’సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తోపాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం(అక్టోబర్ 28) నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరికీ కమలా హ్యారిస్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్.. అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటిని తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ.. అమెరికాలో ముఖ్య వేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగోలో(ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభలతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని.. శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంభించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను మట్టుబెడతామన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు. అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు. భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్ తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు. పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు. టెక్సాస్ గవర్నర్ ఇంట్లో దీపావళి వేడుకలు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణంలో తమ నివాస గృహంలో అక్టోబర్ 23న వైభవంగా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భగా గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ మాట్లాడుతూ.. ‘దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాల’ని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర.. గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు. (క్లిక్ చేయండి: బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ) న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద దీపావళి వేడుకలు న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15న న్యూ యార్క్ నగర బొడ్డున వున్నా టైం స్క్వేర్ సెంటర్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధిగా వచ్చి భారతీయ సంతతిని, భారతీయ సంస్కృతిని, పండుగలను అభినందించారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డాక్టర్ నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులు రాజేందర్ డిచ్పల్లి.. మేయర్ ఎరిక్ ఆడమ్స్కి అభినందనలు తెలిపారు. - వేంకట సుబ్బారావు చెన్నూరి అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ సంపాదకులు -
Diwali Festival 2022: 24నే దీపావళి పండుగ
సాక్షి, హైదరాబాద్: దీపావళి 24వ తేదీనా.. 25వ తేదీనా..? దివ్వెల పండుగపై నెలకొన్న గందరగోళం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ప్రతిష్టంభనా లేదని, నిస్సందేహంగా 24వ తేదీనే జరుపుకోవాలని పండితులు తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉన్నా, అనవసరంగా కొంతమంది లేవనెత్తిన సంశయం ప్రజల్లో అయోమయానికి కారణమైందని అంటున్నారు. నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి. ఇదీ కారణం..: దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది. సూర్యాస్తమయానికి అమావా స్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రహణంతో సంబంధం లేదు..: ‘అమావాస్య తిథి ప్రదోష వేళ ఉన్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం ఉన్నందున ఆ రోజే పండుగ. అంతేకానీ, మంగళవారం సూర్యగ్రహణం అడ్డుపడినందున పండుగను సోమవారానికి జరిపారు అన్న వాదన అర్థరహితం. పండుగ సోమవారం నిర్వహించాల్సి రావటానికి, సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు’అని ప్రముఖ పండితుడు పంతంగి రమాకాంత శర్మ పేర్కొన్నారు. -
ముంబైలో ఈనెల 16 నుంచి మీటింగ్‌లు, ఊరేగింపులు నిషేధం.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: ముంబైలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముంబై, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ముంబైకర్లు ఒకచోట నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి గుంపుగా ఉండరాదు. గుంపులుగా ఉంటే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి తోడు శివసేనకు అసలు వారసులం మేమేనని, మాకే సంఖ్యా బలం ఎక్కువ ఉందని, అందుకు పార్టీ గుర్తు విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం తాజాగా ఉండగానే రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో కూడా శిందే వర్గం తలదూర్చనుంది. ఠాక్రే వర్గం, శిందే వర్గం పరస్పరంగా ఎదురుపడితే ఘర్షణ జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. పోటాపోటీగా ఇరువర్గాలు... ఈ నెల 24 నుంచి దీపావళి పర్వదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు కానుకలు, నూతన సంవత్సర క్యాలండర్లు పంపిణీ చేయడం లాంటి పనులతో వారితో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఇరు పార్టీలూ పోటాపోటీగా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రజావ్యవస్ధలో నెలకొన్న ప్రశాంతతను దెబ్బతీసి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేలా కొన్ని ఆసాంఘిక దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరం, ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని ముంబై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 15 రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. చదవండి: కారులో ప్రయాణిస్తే అది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్! నిబంధనల్లో భాగంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నలుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదు. అదేవిధంగా నగరంలో ఎలాంటి ఊరేగింపులు, లౌడ్స్పీకర్లు, బ్యాండ్, ఇతర వాయిద్యాలు వినియోగించకూడదు. బాణసంచా పేల్చడం లాంటి పనులపై సైతం నిషేధం వి«ధించినట్లు సంజయ్ తెలిపారు. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఉంటే గడువు ముగిసిన తరువాత కూడా వీటిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించే వారికి జరిమానా లేదా జైలు శిక్ష, వాయిద్య సామాగ్రి జప్తు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దీపావళి పర్వదినం సందర్భంగా అనేక మంది భవనాల టెర్రస్ల పైనుంచి, సముద్ర తీరాల నుంచి ఆకాశంలోకి పెద్ద సంఖ్యలో కందిళ్లను (చుక్కలను) ఎగురవేస్తారు. వీటిపై కూడా నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. టపాసులు, దీపెంతలు, విద్యుత్ తోరణాలు తదితర ప్రమాదకర చైనా తయారీ వస్తువులు, కందిళ్లు నిల్వచేసే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్న రోజుల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల శోక సభలు, అలాగే కార్యాలయాలు, క్లబ్బులు, సొసైటీ ఆవరణలో, నాట్యగృహాలు, హాలులో, ఫ్యాక్టరీలు, షాపులు, సాధారణ వ్యాపారులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో జరిగే సభలు, సమావేశాలకు మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ముందస్తుగా స్ధానిక పోలీసు స్టేసన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. -
Diwali 2022: ఈ ఏడాది దీపావళిపై సందిగ్దత.. ఎప్పుడు జరుపుకోవాలి?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి వెనక రెండు కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసున్ని సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో లంకలో రావణుడిని హతమార్చి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత అయోమయం తలెత్తింది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే మరికొంతమంది నవంబర్ 25న ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించారని కాబట్టి ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు.. దీంతో కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమావాస్య రాత్రి తిథి ఉండగా దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్ 24వ తేదీన దీపావళి వేడక నిర్వహించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సాయంత్రం 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. రాత్రి సమయాల్లో అమావాస్య తిథి 24వ తేదీనే ఉండటం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. -
ప్రాణం తీసిన పేకాట.. దీపావళి రోజు పోలీసులకు చిక్కి..
సాక్షి, కామారెడ్డి: పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా.. తామెమరినీ కొట్టలేదని పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఈ నెల 4న (దీపావళి పండుగ రోజు) కొందరు పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ తొమ్మిది మంది పోలీసులకు చిక్కారు. అందులో భూమబోయి (55) అనే వ్యక్తి అక్కడే పడిపోయి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం మూలంగానే తలకు గాయమై భూమబోయి అస్వస్థతకు గురయ్యాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తూ 5వ తేదీన పోలీసు స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. రోజంతా అక్కడే ఆందోళన చేశారు. తామెవరినీ కొట్టలేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన భూమబోయి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాన్ని ఇవ్వాలన్నా, పోస్టుమార్టం చేయాలన్నా ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులు కొట్టడం మూలంగానే చనిపోయాడని ఫిర్యాదు చేయడాని కి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య గురు, శుక్రవారాల్లో రెండు రో జుల పాటు చర్చలు జరిగాయి. పోలీసుల తప్పిదం ఏమీలేదని, కొట్టలేదని పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తలదూర్చి మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించినట్టు సమాచారం. అనారోగ్యంతో చనిపోయినట్టు ఫిర్యాదు ఇవ్వడానికి మృతుడి బంధువులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు కొట్టారన్నది అవాస్తవం శాంతాపూర్ గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో ఈ నెల 4న పోలీసు పార్టీ గ్రామానికి వెళ్లింది. అక్కడ పేకాడుతున్న వారిని పట్టుకున్నారు. అందులో భూమబోయి ఉన్నారు. ఆయనకు ఏదో అనారోగ్య సమస్య ఉండడంతో పడిపోయారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న వారిలో ఏ ఒక్కరినీ పోలీసులు కొట్టలేదు. భూమబోయి మరణానికి పోలీసులు కారణం కాదు. – శోభన్, సీఐ, బిచ్కుంద గుండెపోటుతోనే మరణించాడు కామారెడ్డి అర్బన్: శాంతాపూర్ గ్రామానికి చెందిన భూమబోయి(55) గుండెపోటు కారణంగా మృతి చెందారని ఎస్పీ శ్వేత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన డెత్ సమ్మరీలో భూమబోయి గుండెపోటుతో మరణించినట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు భూమబోయి వైద్య చరిత్ర, పేకాట వీడియోగ్రఫీ వివరాలు, అక్కడి సంఘటన వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి బాణాసంచా ఎఫెక్ట్ దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)పై స్పష్టంగా కనిపించింది. పండుగ ముందు రోజులతో పోలిస్తే పండుగ తర్వాత నమోదైన వాయు నాణ్యత ఐదేళ్లలోనే అత్యల్పం కావడం గమనార్హం. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలుష్యం తోడయింది. దీంతో, ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. చదవండి: (పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడం, ఆకాశం మేఘావృతమైన కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జన్‌పథ్‌లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 655.07కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో పీఎం 2.5 స్థాయి 999గా నమోదైంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే దానిని తీవ్రమైందిగా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో సగటున వాయు నాణ్యత ఢిల్లీలో 462, ఫరీదాబాద్‌లో 469, ఘజియాబాద్‌లో 470, గురుగ్రామ్‌లో 472, నోయిడాలో 475, గ్రేటర్ నోయిడాలో 464కి చేరుకుంది. కోవిడ్ బాధితులపై తీవ్ర ప్రభావం దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు మార్నింగ్ వాక్ మానేయాలని, శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చదవండి: (కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ) -
Diwali: దీపావళి రెండు గంటలే.. హైకోర్టు కీలక ఆదేశాలు
భువనేశ్వర్: దీపావళి సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెండు గంటలు మాత్రమే దీపావళి జరుపుకోవాలని సూచించింది. దీంతో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా విజృంభణకు తావులేకుండా వేడుకల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. బేరియమ్ సాల్ట్స్‌తో తయారైన బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు అక్టోబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పండగ నిర్వహణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు కోవిడ్–19 వ్యాప్తి కట్టడి దృష్ట్యా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జారీచేసిన మార్గదర్శకాల పరిధిలో రాష్ట్రంలో బాణసంచా క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ఎస్ఆర్సీని కోరింది. దీనికోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కటక్–భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనరేట్‌తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. బాణసంచా క్రయ విక్రయాల అనుమతి అభ్యర్థనతో అఖిల ఒడిశా ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పెసో) ఆమోదించిన హరిత బాణసంచా క్రయవిక్రయాలు, వినియోగానికి ధర్మాసనం అనుమతించడం విశేషం. చదవండి: (నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్‌కుమార్) -
పడిపోయిన మొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి. వచ్చే డిసెంబరు నెలలో మరింత తగ్గుతాయి అని తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. (చదవండి: బడ్జెట్ లో రెడ్మీ నోట్ 9 5జీ మొబైల్స్) "పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్‌మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. -
రజనీ ఇంట దీపావళి వేడుకలు
పండగ వస్తే చాలు సినీ ప్రముఖులు ఏదో రకంగా తమ అభిమానులను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కొంతమంది హీరోలు తమ కొత్త సినిమాల ఆప్డేట్స్ ఇస్తే.. ఇంకొంతమంది సినిమా ట్రైలర్, పాటలు విడుదల చేసి అభిమానులకు పండుగ కానుగగా అందజేస్తారు. ఇక సినిమాలు ఏమీ లేకపోతే స్వయంగా వారే దీపావళి వేడుకలను జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ ఏడాది ఖాళీగా ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన కుటుంబ సభ్యులతో దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ ఉల్లాసంగా కనిపించారు.తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రజనీకాంత్... భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలన రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, ఇటీవల రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి రోజు ఆయన కుటుంబ సభ్యులతో దర్శనమివ్వడం అభిమానులకు ఆనందం కలిగించే విషయమే. -
దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్ ఫుల్, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్ Happy Diwali to everyone !! May this Diwali guide us into the light from this rather strange year !! Wishing you and your family all the love and light - a lot of people won’t be able to celebrate in the same way due to financial or emotional reasons so keep them in your prayers — shruti haasan (@shrutihaasan) November 14, 2020 Wishing you all a very happy Diwali! While we spread the light of love, hope and joy, let's remember to keep ourselves and the environment safe from pollution. Shine bright, always ✨🙏 pic.twitter.com/n1u0738A3j — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2020 దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా May the light of the diyas illuminate your life with joy and prosperity.. Wish you all a very #HappyDiwali 🪔☺️ pic.twitter.com/wSgAgWy9N3 — Raashi (@RaashiKhanna) November 14, 2020 ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్ Make someone’s Diwali Happy, that’s the best way to wish Happy Diwali 🪔 — sonu sood (@SonuSood) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు Rejoice on this blessed occasion and spread sparkles of peace and goodwill. Let’s celebrate the festival in the true sense by spreading joy, being safe and by illuminating each others life with love and happiness! ✨💥😍#LakshmiManchu #LakshmiUnfiltered #HappyDiwali pic.twitter.com/aIsLVHsh7M — Lakshmi Manchu (@LakshmiManchu) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున Wishing you and your family a very #happyDiwali! May the light of this Diwali drive away the darkness in our lives and continue to do so!!🙏#BiggBossTelugu4 🥼 #sabyasachi #styledbysonybhupathiraju pic.twitter.com/KjOqofG6BR — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2020 దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన Happy Diwali / Deepavali you guys! ✨🤍 No crackers..🙅🏻♀️ have lots of sweets today..☺️🤤 stay with family.. 🤗 celebrate.. 🤗 enjoy!! 🪔✨ Stay safe. Stay happy. God bless us all with a safer and a better tomorrow.. ✨ — Rashmika Mandanna (@iamRashmika) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్ Extending my heartfelt greetings to you and your family! A very Happy Diwali to you and your loved ones.✨💥 Stay safe 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) November 14, 2020 వీరితోపాటు అనపమ పరమేశ్వరన్, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్, వరుణ్ తేజ్, విజయ్ సేతుపతి, రామ్ పోతినేని, రకుల్‌ప్రీత్ సింగ్, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali 🪔 pic.twitter.com/YbtZPt9GMW — Anupama Parameswaran (@anupamahere) November 14, 2020 Wishing everyone a safe and happy Diwali ! #LoveStory @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/8pyaArr4ME — chaitanya akkineni (@chay_akkineni) November 14, 2020 -
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: కిషన్ రెడ్డి
సాక్షి, తిరుమల : కేంద్ర హోశాంఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పర్వదినంలో స్వామి వారిని దర్శించుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, మన దేశ సరిహద్దులైన చైనా, పాక్ సరిహద్దులో సమస్యల నుంచి దేశాన్ని గట్టెకించాలని స్వామి వారిని ప్రార్థించినట్లుత పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ దీపావళి పండుగ దేశ ప్రజల్లో వెలుగులు నింపాలని ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. చదవండి: భవిష్యత్తులో తిరుపతి ఐఐటీది కీలక పాత్ర తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి దేశానికి విముక్తి రావాలని కోరుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారిని వేంచేపు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక తిరు ఆభరణాలతో అలంకరించి, స్వామి వారికి ప్రత్యేక నివేదనలు సమర్పించామన్నారు. దీపావళి ఆస్థానం సందర్బంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి, అక్షితారోపణము, విశేష హారతులు సమర్పించినట్లు తెలిపారు. మంగళ హారతితో దీపావళి ఆస్థానం పరిసమాప్తం అయ్యిందన్నారు. -
గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. అరగంటపాటు వీరి భేటీ జరిగింది. -
ఆ వెలుగులకు వందేళ్లు
దీపావళి అంటే అందరికీ టపాసులు, మతాబులు గుర్తొస్తాయి. పూజలు మినహాయిస్తే మతాలకతీతంగా బాణసంచాను కాలుస్తారు. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. జ్ఞాపకాల దొంతరలో దీపావళి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. దీపావళి అనగానే విశాఖ జిల్లాలోని అనకాపల్లి గుర్తుకొస్తుంది. శతాబ్ధం నుంచి బాణసంచా తయారు చేస్తున్న సీతారామయ్య కుటుంబ సభ్యుల ఇంటిì పేరు మందుగుండుగా మారిందంటే వారి విశిష్టత అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది నవంబర్ 14న దీపావళి పండుగ నేపథ్యంలో అనకాపల్లి మందుగుండు సీతారామయ్యపై కథనం. – అనకాపల్లి అనకాపల్లి పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది బెల్లం. జాతీయ స్థాయిలో బెల్లం లావాదేవీలు నిర్వహించే బెల్లం మార్కెట్ ఉంది. వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న బాణ సంచా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. వందేళ్ల నుంచి అనకాపల్లి కేంద్రంగా బాణ సంచా తయారు చేసే సీతారామయ్య కుటుంబం ఇక్కడ ఉంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి బాణసంచా తయారు చేస్తున్న ఈ కుటుంబానికి చెందిన కొందరు ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగడం విశేషం. (విశాఖకు పోలవరం) శతాబ్ధానికి పైగా చరిత్ర వందేళ్ల క్రితం అనకాపల్లిలో జరిగిన దీపావళిని చూసి బుద్ద సీతారామయ్యకు మందుగుండు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీని కోసం ఆయన చాలా విషయాలు నేర్చుకున్నారు. 1920 సమయంలో అనకాపల్లికి చెందిన ఉప్పల వంశస్తులు కటక్ నుంచి బాణసంచా తీసుకొచ్చి వెలిగించారు. అది చూసిన సీతారామయ్య అదే బాణసంచా మనమెందుకు తయారు చేయకూడదని భావించారు. జాతర కార్యక్రమాలకు బాణసంచా విన్యాసాల సామగ్రి తయారీలో నిమగ్నమైన సిబ్బంది (ఫైల్) 1942లో అధికారిక అనుమతి 1920 నుంచి అనకాపల్లిలో మందుగుండు సీతారామయ్య బాణసంచా తయారీ చేసినప్పటికీ.. 1942లో అధికారికంగా తయారీకి అనుమతి పొందారు. మందుగుండు తయారీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడంతో బుద్ధ సీతారామయ్య పేరు కాస్త.. మందుగుండు సీతారామయ్యగా మారిపోయింది. బుద్ద సీతారామయ్య వంశంలో ఒకరిద్దరు తప్ప అందరూ బాణసంచా తయారీ, అమ్మకాల వృత్తిలో స్థిరపడ్డారు. ఏడాది పొడవునా బాణసంచా తయారీ చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, మతాబులు, మిన్నలు, టపాసులు తయారు చేయడంలో మందుగుండు సీతారామయ్య కుటుంబ సభ్యులకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. వీరి వద్ద నిత్యం పదుల సంఖ్యలో బాణసంచా తయారు చేసేందుకు కార్మికులు పని చేస్తుంటారు. కుటుంబ నేపథ్యం బుద్ద సీతారామయ్యకు ఒకే ఒక కుమార్తె ఉన్నారు. దీంతో మేనల్లుడైన యల్లపు సీతారామయ్యను కుమార్తె అమ్మాజమ్మకు ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తీసుకొచ్చారు. సీతారామయ్య, అమ్మాజమ్మకు ఐదుగురు కుమారులు. వీరిలో మూడో కుమారుడు సీతారామయ్య బాణసంచా వ్యాపారం చేయకుండా విశాఖలో వ్యాపారిగా స్థిరపడ్డారు. మొదటి కుమారుడు మరణించగా మిగిలిన కుమారులు, మనుమలు సైతం బాణసంచా వ్యాపారంలోనే స్థిరపడ్డారు. గ్రామీణ జిల్లాలో చాలా చోట్ల శుభ, అశుభ కార్యక్రమాలు, దీపావళి, వినాయక నవరాత్రులలో బాణసంచా కాలిస్తే.. అది ఒక్క సీతారామయ్య కుటుంబ సభ్యులు తయారు చేసిందే అనడం అతిశయోక్తి కాదు. బ్రిటీష్ క్రీడోత్సవాల్లోనూ.. ►1942లో బ్రిటిష్ పాలకులు నిర్వహించిన క్రీడోత్సవాల్లో మందుగుండు వెలిగించి అప్పటి పాలకుల అవార్డులు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్శర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేసినపుడు ఆయన సమక్షంలోనే బాణసంచా కాల్చి ప్రశంసలు అందుకున్నారు. ►మందుగుండు సీతారామయ్య 1977లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు పులివెందుల వెళ్లి బాణసంచా కాల్చడం ద్వారా తన పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసుకున్నారు. ►ముంబైలో అప్పటి కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ సమక్షంలో స్టేడియంలో బాణసంచా కాల్చి ప్రశంసలు అందుకున్నారు. ►మంగుళూరు, కోల్కత్తా, ఖరగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలకు కూడా సీతారామయ్యను ఆహ్వాంచడం ఆయన ప్రతిభకు నిదర్శనం. -
తిరుమల: ఆస్థానం కారణంగా ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. (శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్రస్వామి) ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. -
విరుష్క దీపావళీ సెలబ్రేషన్ పిక్చర్స్
ముంబై: దాదాపు రెండేళ్ల క్రిత వివాహ బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం దీపావళి రావడంతో ఆ పండుగను అనుష్కతో కలిసి ఘనంగా జరుపుకున్నాడు కోహ్లి. తన ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని దీపాలతో వెలుగులు నింపాడు. మరొకవైపు అనుష్కతో కలిసి ఫోజిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ మీకు, మీ కుటుంబానికి మా దీపావళి శుభాకాంక్షలు’ అంటూ కోహ్లి కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అదే సమయంలో అనుష్క శర్మ కూడా తన ట్వీటర్ అకౌంట్లో మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. Happy Diwali to everyone. May the Festival of Lights light up your lives and bring more love and peace to all 🙏😇❤️ pic.twitter.com/36Gr0aA6ae — Virat Kohli (@imVkohli) October 27, 2019 Happy Diwali from us to you and your family. I hope we all find the light in us and may truth always triumph. 💜✨🙏 pic.twitter.com/QupvcXjcMT — Anushka Sharma (@AnushkaSharma) October 27, 2019 pic.twitter.com/XG8ao3iSaW — Anushka Sharma (@AnushkaSharma) October 27, 2019 -
దీపావళి సందడి
-
దీపావళికి ఈ కొత్త రుచులు ట్రై చేయండి..
తీపి ఉన్న చోట దీప్తి ఉంటుంది. తియ్యదనం ఉన్న జీవితం మరొకరి జీవితంలో వెలుతురు పంచమంటుంది. చీకటిని తరిమికొట్టడానికి వెలిగించిన దీపంలో మిఠాయి రుచి నింపుకుంటుంది. ఇంటి ముందర దీపాలు, మనసులో అనుబంధాలు వెలిగే పండగ దీపావళి నోరు తీపి చేసుకోండి. నలుగురికీ పంచి బంధాల్ని కూడా తీపి చేసుకోండి. ► డ్రైఫ్రూట్ సున్నుండలు కావలసిన పదార్థాలు: మినప్పప్పు – 1/2 కప్పు; బాదం పప్పులు – 1/4 కప్పు; జీడిపప్పు – 1/4 కప్పు; తరిగిన పిస్తా – 1/4 కప్పు; బెల్లం – 3/4 కప్పు; నెయ్యి – 1/3 కప్పు. తయారీ విధానం: ∙జీడిపప్పు, బాదం పప్పులను విడివిడిగా వేయించుకొని బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ∙మినప్పప్పుని తక్కువ మంట మీద ఎర్రగా పచ్చి వాసన పోయేలా వేయించి చల్లార్చాలి ∙చల్లారిన మినప్పప్పుని కొద్దిగా బరకగా పొడి చేసి అందులోనే బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ∙పొడి చేసుకున్న జీడిపప్పు, బాదం, మినప్పప్పు మిశ్రమాలను, తరిగిన పిస్తా పప్పులను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి ∙వేడి నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకోవాలి ∙మిశ్రమం వెచ్చగా వున్నప్పుడే ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్ సున్నుండలు రెడీ. ► కోవా–రవ్వ బర్ఫీ కావలసిన పదార్థాలు: పచ్చి కోవా –1/2 కప్పు; బొంబాయి రవ్వ – 1/2 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 1/4 కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – 1/2 టీస్పూన్. తయారీ విధానం: ∙కుంకుమ పువ్వుని రెండు స్పూన్ల వేడి పాలలో నానబెట్టుకోవాలి ∙నెయ్యి వేడి చేసి అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగే వరకు కలియబెట్టాలి ∙దీనిలో చక్కెర కూడా వేసి కరిగేవరకు తిప్పాలి ∙ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు పొయ్యి కట్టేసి, నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకోవాలి ∙తరిగిన పిస్తా పప్పులను పైన వేసి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ∙కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► కొబ్బరి –మిల్క్ మెయిడ్ హల్వా కావలసిన పదార్థాలు: తురిమిన పచ్చి కొబ్బరి – 1 కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పాలు – 1/4 కప్పు; కండెన్సెడ్ మిల్క్ (మిల్క్ మెయిడ్ ) – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/4 టీస్పూన్; పిస్తా – తగినంత. తయారీ విధానం: ∙బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక, తురిమిన కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ∙ పాలు, మిల్క్ మెయిడ్ వేసి బాగా కలిపి దగ్గర పడేవరకు తిప్పుతూ ఉడికించాలి ∙ కొబ్బరి మిశ్రమం దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి దింపేయాలి ∙ తగినన్ని పిస్తా పప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి. ► వాల్నట్ హల్వా కావలసిన పదార్థాలు: వాల్నట్స్ – 1 కప్పు; పాలు – 1/2 కప్పు; పంచదార – 1/2 కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; సిల్వర్ ఫాయిల్ – గార్నిషింగ్ కోసం. తయారీ విధానం: వాల్నట్స్ని బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పాలు, పంచదార, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక మూకుడులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, పొడి చేసుకున్న వాల్నట్స్ని వేసి, తక్కువ మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వేగాక దీనిలో పాల మిశ్రమం పోసి, రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ∙మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుతూ అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి (హల్వా చల్లారాక ఇంకా గట్టి పడుతుంది) ∙పైన సిల్వర్ ఫాయిల్ అద్ది, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ► బ్రెడ్కాజా కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ – 6; పంచదార – 1/2 కప్పు; నీళ్లు – 1/4 కప్పు ; ఏలకుల పొడి – చిటికెడు; తరిగిన పిస్తా, బాదం – తగినంత; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙బ్రెడ్ స్లైసెస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙వేయించటానికి సరిపడా నూనె బాణలిలో వేసి, వేడి చేసి, కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి ∙ వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ ఏలకుల పొడి జత చేసి, ఒకసారి కలియబెట్టి, స్టౌ మీద నుంచి దించేయాలి ∙ వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి, కొన్ని క్షణాల వరకు పాకంలో ముంచి తీసేయాలి ∙పాకంలో ముంచి తీసిన బ్రెడ్ ముక్కలను పళ్లెంలో పరుచుకొని, అవి తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులను పైన చల్లుకోవాలి ∙ పూర్తిగా తడి ఆరిన తరవాత సర్వ్ చేయాలి. ► గర్ మఖానా కావలసిన పదార్థాలు: పూల్ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి – 2 టీస్పూన్లు. తయారీ విధానం: ∙మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్ స్టిక్ పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. ► మఖ్ఖన్ పేడా కావలసిన పదార్థాలు: పచ్చి కోవా – 1/2 కప్పు; మైదా పిండి – 1 కప్పు; పంచదార – 2 కప్పులు; డ్రై ఫ్రూట్ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వంట సోడా – 1/4 టీ స్పూను; ఏలకుల పొడి – 1/2 టీ స్పూన్; నూనె – వేయించటానికి సరిపడా. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో కోవా, మైదా పిండి, వంట సోడా, నెయ్యి వేసి, బాగా కలిసేలా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి పిండి మృదువుగా కలుపుకోవాలి (పిండిని ఎక్కువగా మర్దనా చేయకూడదు) ∙మూతపెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి ∙ఒక గిన్నెలో చక్కెర, రెండు కప్పుల నీళ్లు పోసి కరగనివ్వాలి ∙పంచదార కరిగి కొద్దిగా మరిగాక, ఏలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు చేసి, ఒక్కొక్క ఉండను కొద్దిగా చేతితో ఒత్తి మధ్యలో డ్రై ఫ్రూట్ ముక్కలను స్టఫ్ చేసి, అంచులను మూసి, చేతితో కొద్దిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఒత్తి పెట్టుకున్న పిండి ముద్దలను వేడి నూనెలో వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి ∙వేగిన వాటిని వేడి పాకంలో వేసి రెండు గంటలు నానిన తరవాత తినాలి. ► బెల్లం గవ్వలు కావలసిన పదార్థాలు: మైదా పిండి – 1 కప్పు; బెల్లం – 1 కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; వంట సోడా – చిటికెడు. తయారీ విధానం: ∙ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, వంట సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద గవ్వల ఆకారంలో వత్తుకోవాలి ∙ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేసి, అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బెల్లం వేసి, మునిగే వరకు నీరు పోసి, స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి ∙బెల్లం పాకం వచ్చాక, పొయ్యి కట్టేసి, వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ∙నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ∙చల్లారాక గవ్వలు విడివిడిగా వస్తాయి. -
పండుగ పరమార్థం.. పర్యావరణ హితం..!
దీపావళి అంటేనే టపాకాయల పండుగ. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ దీపావళి. కొన్నేళ్లుగా ఇది కాలుష్యమయంగా మారుతోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పర్యావరణ రహితంగా పండుగ చేసుకోవాలంటూ ఆదేశాలిచ్చే పరిస్థితికి వచ్చింది. వాతవరణ,శబ్ద కాలుష్యాన్ని నివారించి ఈ దీపావళిని పర్యావరణ హితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెతోపాటు పుత్తూరు, నగరి లాంటి చిన్న పట్టణాల్లో కూడా వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో పండుగను పర్యావరణహితంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికులు..సంస్కృతి, సంప్రదాయాల్ని పరిరక్షించేవారు సూచిస్తున్నారు. సాక్షి, చిత్తూరు అర్బన్ : దీపావళిలో బాణా సంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. టపాసులు కాలుస్తూ చీకట్లు తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బాణా సంచా ఎంపిక, కాల్చడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఏటా ఆస్తి.. ప్రాణ నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. పండుగకు మరో వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే చైతన్యపరచాలని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. పర్యావరణ హితంగా పండుగ చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లావ్యాప్తంగా వాయు కాలుష్యం అనూహ్యంగా పెరిగిందని ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే దేశంలోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంలో నాలుగో స్థానంలో ఉన్న చిత్తూరు లాంటి ప్రదేశాల్లో టపాకాయలను ఎక్కువగా కాల్చడం వల్ల గాలి కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ ఈ) నిర్వహించిన సర్వేలో జిల్లాలో అత్యధికంగా తిరుపతిలో కాలుష్యం ఉన్నట్లు తేలింది. దీన్ని తగ్గించకపోతే పిల్లలు, వృద్ధులు, మహిళలు రాబోయే రోజుల్లో తీవ్ర ముప్పు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తరుణంలో కాలుష్యం మరింత పెంచేలా బాణసంచా కాలిస్తే మన మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. రణగొణ ధ్వనులతో కూడిన బాణాసంచా పేలుళ్లతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు తీవ్రఇబ్బందులుంటాయి. చిన్నారులు, గర్భిణుల కు భద్రత ఇవ్వాలన్నా పర్యావరణహిత బాణసంచాలే మేలు. కేంద్ర ప్రభుత్వం ఇలా.. ► దీపావళిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాధి సాగిస్తుంటాయి. వారి ఉ పాధిని దెబ్బతీయకుండా పర్యావరణానికి ఎటువంటి హాని జరగనివ్వకుండా ప్రజలు సంతోషంగా బాణాసంచా కాల్చేలా పర్యావరణ హిత వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ► పర్యావరణానికి..జీవ వైవిధ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పెట్రోలియం, మందుగుండు సామగ్రి భద్రతా సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ► ఈనెల 5 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా సీఎస్ఐఆర్చే తయారు చేసిన బాణసంచా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్స్ (సీఎస్ఐఆర్) సంస్థ ద్వారా పర్యావరణహిత బాణాసంచా రూపకల్పన చేయించింది. ఈ సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా బాణసంచా తయారీ ప్రక్రియ చేపడుతున్నారు. శబ్ధం.. కాలుష్యం తక్కువ వెదజల్లే క్రాకర్లు, వి ద్యుద్దీపాలతో కూడిన రంగుల పూలకుండీలు, పెన్సిళ్లు, చక్కర్లు, మిరుమిట్లు గొలిపే వాటిని తయారు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీలు రాకుండా అడ్డుకోనున్నారు. రంగులు ఇలా... బాణసంచా కాలిస్తే బోలెడు రంగులు వచ్చి ఆనందింపజేస్తాయి. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం, స్ట్రోనియం అల్యూమినియం, బేడియంను బాణసంచా తయారీకి వినియోగిస్తారు. వీ టిలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ప్రమిదలతో కూడిన వెలుగులు మేలు. రంగుల బాణసంచా కాల్చాలంటే తక్కువ కాలుష్యం వెలువడే వాటినే ఎంచుకోవడం మంచిది. ఎంపిక ఇలా..... పెద్ద శబ్దాలొచ్చే బాణా సంచా కాల్చాలనే కుతూహలం పిల్లల్లో ఉంటుంది. ఏ చిన్నపొరపాటు జరిగినా వారు కళ్లు, చర్మ సంబంధ సమస్యల బారినపడే ప్రమాదముంది. దీనికి తోడు ధ్వని, వాతావరణ కాలుష్యాలకు ఆస్కారముంది. అదే బాణా సంచా ఎంపికలో వయసుల వారీగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ► 3 నుంచి 5 ఏళ్ల వారికి – రంగుల అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, తాళ్లు ► 6 నుంచి 12 ఏళ్ల వారికి – పెన్సిళ్లు, తాళ్లు, వెన్నముద్దలు, కాకరొత్తులు, భూచక్రాలు, పిస్తోళ్లు ►13 నుంచి 21 ఏళ్లవారికి – హైడ్రోజన్, బర్డ్స్, లక్ష్మీ, బుల్లెట్ బాంబులు, యాలీయాలీ టపాసులు, తాజ్, రెడ్ఫోర్డ్ బాంబులు ► 21 ఏళ్లకు పైబడిన వారికి చిచ్చుబుడ్లు, రంగుల ఫౌంటెన్లు, క్రాకర్ కింగ్స్, రాకె ట్లు, లక్ష్మీబాంబులు, రెడ్పోర్డు బాంబులు, డబుల్ సెవెన్స్ ఏకే 47, స్పీడ్ 2000, బుల్లెట్ ట్రైన్స్, గ్రాఫిక్ 180 తదితరాలు ► మహిళలకు – సింగిల్ సెల్స్, క్లాసిక్, స్ల్విర్ షవర్స్, స్టార్‌వార్స్, మూన్లైట్, రంగ్మేళా తదితర టపాసులు ఆలోచనల్లో మార్పు రావాలి ► దీపావళి జరుపుకునే విధానంలో ప్రజల ఆలోచనా ధోరణి క్రమంగా మారుతూ వస్తోంది. ప్రభుత్వంతో పాటు కొన్ని సంస్థలు చేస్తున్న కృషితో పర్యావరణహిత దీపావళి సాకారమవుతుంది. ► జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పర్యావరణహిత దీపావళి జరుపుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ► కాలుష్య నియంత్రణా మండలి కాలుష్య కారక పండుగ వద్దంటూ చైతన్య కార్యక్రమాలు ఏటా నిర్వహిస్తోంది. అత్యవసర సేవలు ఆనంద దీపావళి.. ఇదీ మనందరీ లక్ష్యం. అప్రమత్తతతోనే ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుంది. పండుగ రోజు ఊహించని సంఘటనలు ఎదురైతే వెంటనే అగ్నిమాపక, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలను సంప్రదించాలి. 100, 101 సేవల్ని వినియోగించుకోవచ్చు. అగ్నిమాపక శాఖ సేవలు ప్రత్యేకం. అందుకే ఆయా కార్యాలయాల ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకుని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వారి సేవలు పొందడం ద్వారా నష్టాల్ని నిలువరించుకోవచ్చు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే.. పర్యావరణాన్ని దెబ్బతీసేలా పండుగ చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు మనకు గుణపాఠంలా ఉన్నాయి. అక్కడ గాలి కాలుష్యానికి తోడు రసాయనాలతో కూడిన ప్రమాదకర బాణసంచా కా ల్చడంతో ప్రజలు ప్రాణాలు తోడేసేలా గాలి మారింది. -
చీకట్లు నింపిన వెలుగులు
గోల్కొండ: దీపావళి పండుగ కొందరు జీవితాల్లో చీకట్లు నింపింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దాదాపుగా కంటి చూపు కోల్పోయారు. బాణసంచా కాల్చిన సంఘటనలో గాయపడ్డవారు మొత్తం 45 మంది వివిధ రకాల కంటి గాయాలతో సరోజిని ఆసుపత్రిలో చేరారు. వీరిలో 33 మందిని ఔట్ పేషెంట్ చికిత్స చేసి పంపించి వేశారు. 14 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చి చికిత్స అందించారు. కాగా వీరిలో ఇద్దరికి శాశ్వతంగా ఒకరికి కంటి చూపు రాదని డాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి గేటు ఎదుట టపాకాయలు కాలుస్తుండటం చూస్తున్న వనస్థలిపురానికి చెందిన కృష్ణమాచారికి ఒక టపాకాయ వచ్చి కుడి కన్నుకు తాకింది. అదే విధంగా లాలాపేటలో రిషికేష్ (14)కి టపాకాయలు ముఖం మీద పడ్డాయి. ఇందులో రిషికేష్ ముఖానికి తీవ్ర గాయలయ్యాయి. బుధవారం రాత్రి ఇరుగుపొరుగువారి కాల్చిన టపాసుల్లో పేలనివాటిని మాదన్నపేట్‌కు చెందిన సమీర్‌ఖాన్ గురువారం ఉదయం వాటిని కాలుస్తుండగా అవి ఒకేసారి పేలి కంట్లో పడ్డాయి. కాగా ఈ సంఘటనలో మదర్సా విద్యార్థి అయిన సమీర్ పాషా (9) కనురెప్పలు పూర్తిగా కాలిపోగా ఎడమ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కోరంటికి చెందిన మైసమ్మ (60) ఆటోలో గోల్నాక నుంచి శ్రీరామ్‌నగర్‌కు వెళ్తుండగా అదే సమయంలో ఆటోలో రాకెట్ వచ్చి ఆమె కంటిపై పడింది. కనుగుడ్డుకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో ఆమెను సరోజిని ఆస్పత్రికి తరలించారు. మైసమ్మ పరిస్థితి విషమంగా ఉందని, కంటి చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంబర్‌పేట్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థి చరణ్ (11) టపాకాయలు కాలుస్తుండగా అవి పేలి ముఖంపై పడ్డాయి. దీంతో చరణ్ రెండు కళ్లకు గాయాలయ్యాయి. శంషాబాద్‌కు చెందిన కిరాణ షాపు వ్యాపారి రాజు గౌడ్ (38) తన కిరాణ షాపులో కూర్చుండి రోడ్డుపై దీపావళి వేడుకలను చూస్తున్నాడు. అదే సమయంలో ఓ రాకెట్ వచ్చి అతని ముఖానికి తాకింది. ఈ సంఘటనలో రాజు కళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ (28)రోడ్డుపై నిలబడి పిల్లలు టపాకాయలు కాలుస్తున్న దృశ్యాలను చూస్తుండగా ఓ టపాసు పేలి ఆయన కుడి కన్నుపై పడింది. దీంతో శ్రీనివాస్ కంటికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతంమెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటిఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చీకటి నింపిన దీపావళి..
విజయనగరం, బొబ్బిలి: దీపావళి పండుగ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బతుకులను చీకటిమయం చేస్తుంది. పట్టణంలోని తారకరామా కాలనీలో బాణసంచా విక్రయించే కుటుంబంలో మాత్రం రెండు ప్రాణాలు గాలిలో కలసి పోగా మిగిలిన ముగ్గు రు పిల్లల జీవితాలను చీకటి మయం చేసింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని చిన్నారులు బేలచూపులు చూస్తున్నారు. పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన చుక్క త్రినాథరావు లారీ డ్రైవర్‌గా పని చేయడంతో పాటు తారాజువ్వలు తయారు చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు కూడా బాణసంచా తయారుచేస్తూ విక్రయిస్తుంటారు. గత నెల 25న త్రినాథరావు, భార్య రమణమ్మ, కుమార్తె తనూజ బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇల్లంతా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ ఆటోలో బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, వైద్యుడు జి. శశిభూషణరావు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గత నెల 28న త్రినాథరావు, ఈ నెల ఆరున రమణమ్మ మృతి చెందారు. దీంతో పిల్లలు సాయి, నందిని, తనూజ అనాథలయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తనూజ ప్రస్తుతం కోలుకుంటున్నా తల్లిదండ్రుల మృతితో మనోవేదనకు గురైంది. గాయపడిన తనూజ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో... నందిని నెల్లిమర్లలో చదువుతున్నారు. సాయి పదో తరగతి పాసై నిరుద్యోగిగా ఉన్నాడు. దీపావళి పండుగ వీరి కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తమను ఆదుకునే ఆపన్నహస్తం కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు. -
దీపావళి సంబరాలు.. కేసులే కేసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో దీపావళి సంబరాలు మిన్నంటాయి. టపాసుల కాల్పుల మోతలు హోరెత్తాయి. వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగరీత్యా, వివిధ పనుల నిమిత్తం ఉన్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు రావడంతో గ్రామాల్లో మరింత పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల వద్ద బాణాసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా పేల్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల యువత నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. సొంత పూచికత్తుపై 400 మందిని విడుదల చేశారు. 200 మందిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కోయంబత్తూరులో 30 మంది, తిరుప్పూర్‌లో 42 మంది, విల్లుపురంలో 30 మంది, చెన్నైలో 10 మంది, తిరునల్వేలిలో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారిని బుజ్జగించడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. చాలా మందిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలేశారు. బాలుడు మృతి.. తండ్రిపై కేసు నమక్కల్ జిల్లాలో టపాసుల కారణంగా 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. బాణాసంచా పేలడంతో బాలుడికి ఛాతి దగ్గర గాయమైందని, ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. బాలుడి తండ్రి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. బాలుడి ఇద్దరు మిత్రులు కూడా గాయపడ్డారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి బాణాసంచ కాల్చినందుకు బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ‘మోత’ తగ్గింది! నిర్ణీత సమయంలోనే బాణసంచా కాల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఏడాది పటాకుల కాల్పుల మోత తగ్గిందని పర్యావరణవేత్త శ్వేత నారాయణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి చాలా మంది టపాసులు కాల్పుస్తున్నారని తెలిపారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు. రోజులో ఎప్పుడు బయటకు వెళ్లినా పటాసుల కాల్పుల మోత తప్పడం లేదన్నారు. పోలీసులు కూడా నియంత్రించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి కూడా పర్యావరణ మార్పులను అంచనా వేసేందుకు కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలివీ.. ♦ దీపావళికి ఏడు రోజుల ముందు, ఆ తరవాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి. ♦ దీపావళి రోజు దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ♦ తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి. ♦ బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి. ♦ నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి. ♦ టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. -
ఈ దీపావళి కుటుంబసభ్యులతో..
హిమాయత్‌నగర్ :దీపావళి పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొత్త దుస్తులు ధరించి, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఉండే ఆ ఆనందమే వేరు. సాయంత్రానికి టపాసులు కాల్చుతూ పండగను ఆస్వాదించడం ప్రతి ఏటా ఆనవాయితీ. అయితే ఈ బిజీ లైఫ్‌లో సెలబ్రిటీస్‌కు పండగను జరుపుకునేందుకు సమయమే దొరకట్లేదు. దొరికిన కొద్ది సమయంలో వేరే వేరు పనులతోనే సరిపోతుంది. ఎన్ని పనులున్నా..ఎంత బిజీ లైఫ్ అయినా ఈ దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్. పొద్దున్నే అమ్మ, నాన్నలకు విషెస్ చెప్పి, కొత్త దుస్తులు ధరించి, సాయంత్రానికి పూజల్లో పాల్గొని, ఆ తరువాత చిన్నపాటి టపాసులు కాల్చి పండగను ఎంతో సేఫ్‌గా జరుపుకోనున్నట్లు వివరించారు. దీపావళిని ఎలా జరుపుకోబోతున్నారు అనే విషయాలపై సెలబ్రిటీలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈసారి అమ్మానాన్నలతో.. కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండగకు అమ్మ,నాన్నలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఇక్కడ నేను స్నేహితులతో కలసి పండగ చేసుకునేవాడిని. గూఢచారి సినిమా విజయవంతం అవ్వడం ఒక ఆనందమైతే. ఈ దీపావళికి అమ్మానాన్నలు సిటీలోనే ఉండటం మరో ఆనందమైన విషయం. రెండు ఆనందాల మధ్య పంచెకట్టుతో దీపావళి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్రాకర్స్‌కు నేను చాలా దూరం. చిన్నపిల్లలు సరదా కోసం క్రాకర్స్‌ను కాలుస్తారు. వారి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పొల్యూషన్ ఫ్రీగా పండగ జరుపుకోవడంతో పాటు రోడ్డుపై చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకుంటే మనకే బాగుంటుంది. –అడవి శేషు(సన్నీ), సినీ హీరో సేఫ్ దీపావళి జరుపుకుంటాం... దీపావళి అంటే ఆనందం, భయం కూడా ఉంటుంది. టపాసుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రకృతికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి కాకరపువ్వొత్తులు లాంటివి కాలుస్తా. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెన్నైలో పండగ జరుపుకుంటా. మేముసేఫ్ దివాళీ జరుపుకుంటాం, మీరు కూడా సేఫ్‌గా, ఆనందంగా జరుపుకోవాలి.–విమలారామన్, హీరోయిన్ రెండో ఫెస్టివల్ పంజాబ్‌లో... నేను ఆల్రెడీ రెండ్రోజుల క్రితం సిటీలో స్నేహితులతో కలసి దీపావళి జరుపుకున్నా. మా అమ్మ, నాన్న, బంధువులు అంతా పంజాబ్‌లో ఉన్నారు. సో... రెండో ఫెస్టివల్‌ను కుటుంబ సభ్యులతో కలసి పంజాబ్‌లో జరుపుకుంటున్నా. పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ దీపావళి జరుపుకుంటే అందరూ బాగుంటారు. –సోనూసూద్, నటుడు ఈ దివాళీ ఎంతో ప్రత్యేకం ఈ దివాళీ నాకు ఎంతో ప్రత్యేకం. ఇటీవల విడుదలైన అరవిందసమేత, సవ్యసాచి సినిమాలు హిట్ అవ్వడం, షాపింగ్‌కు వెళ్లినప్పుడు బాగా యాక్ట్ చేశావ్ అని పబ్లిక్ విష్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంతో ఎంతో ఇష్టమైన దివాళీని ఇంట్లో అందరితో కలసి సెలబ్రేట్ చేసుకోబోతున్నా. క్రాకర్స్‌కి చాలా దూరం ఈసారి. అందరూ చక్కగా, సేఫ్‌గా పండగ చేసుకోవాలి. – ఈషారెబ్బ, హీరోయిన్ పోలాండ్‌లో తోటి ఆటగాళ్లతో లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ ఇక్కడే అమ్మ, అక్క, బావ, పిల్లలతో జరుపుకున్నా. క్రాకర్స్ కాల్చి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశా. ఈసారి నాకు ఆ అదృష్టం లేదు. గేమ్స్ నిమిత్తం పోలాండ్‌లో ఉన్నా. అయితే మన సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి, ఇతర దేశాలకు చెందిన నా తోటి క్రీడాకారులుతో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యా. వాళ్లు కూడా దీపావళి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. –బుద్దా అరుణారెడ్డి, జిమ్నాస్టిక్ శబ్దం లేకుండా... పొద్దు, పొద్దున్నే అమ్మ, నాన్నలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం. ఆ తర్వాత పక్కంటి వాళ్లకు స్వీట్లు ఇచ్చి పండగ విషెస్ చెప్పడం. సాయంత్రానికి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, వాళ్ల కుటుంబ సభ్యులందరం ఒక్క చోట కలుస్తాం. పూజలు చేసి, శబ్ధం లేని దీపావళిని ఘనంగా జరుపుకుంటాం. దీంతో పాటు మా నక్షత్ర ఫౌండేషన్ సభ్యులందరం కలసి పండగను జరుపుకోబోతున్నాం.– మాధవీలత, హీరోయిన్ -
సదర్‌కు సై!
హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ‘సదర్’ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజు నిజాంల కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం గురువారం ఖైరతాబాద్‌లోను, శుక్రవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. నిజాం నవాబుల కాలం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల ఐక్యతకు, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనం. ఏటా దీపావళి మరుసటి రోజు సదర్ వేడుకలను నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌లో ఈ నెల 8న, నారాయణగూడ వైఎంసీఏ ఈ నెల 9న వద్ద వేడుకలు జరుగనున్నాయి. అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా దేశంలోనే బాగా పేరొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో సైతం నిర్వహిస్తున్నారు.ఎంతో వైవిధ్యంతో, అబ్బురపరిచే దున్నల విన్యాసాలతో కనులపండువగా జరిగే ఈ వేడుకలు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటాయి. యువత కేరింతలు, హోరెత్తించే నినాదాలు, ఆనందోత్సాహాల నడుమ తెల్లవారు జాము వరకు నిర్వహిస్తారు. సదర్ ఉత్సవాల నేపథ్యం... హైదరాబాద్‌లో ఎలాంటి ఐక్యత లేకుండా కేవలం పశుపోషణే జీవనాధారంగా చేసుకొని బతికే గొల్ల, కుర్మలను ఐక్యం చేసిన పండుగ ఇది. వారి మధ్య బంధుత్వాలను, స్నేహాన్ని పెంచింది. చౌదరి మల్లయ్య యాదవ్ ఈ ఉత్సవాలకు ఆద్యుడు. సుమారు 75 ఏళ్ల క్రితం నగరంలోని యాదవులందరినీ సంఘటితం చేసేందుకు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు అఖిలభారత యాదవ సమాజం తెలిపింది. అత్యధికంగా పశువులను పెంచుతూ, వాటిని ఎంతో జాగ్రత్తగా పోషిస్తూ పేరు ప్రతిష్టలను తెచ్చుకున్న యాదవులను ‘సదర్’గా గౌరవించే సంప్రదాయం ఇది. సదర్ అంటే ప్రముఖులు. పెద్దవారు అని అర్థం. అలా ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ వేడుకలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ నిజాం కాలంలోనూ ఏడాదికోసారి గొల్లలు కలుసుకొనేవారని, తమ పశుసంపదను గురించి చర్చించుకొనేవారని చెబుతారు. మరోవైపు పురాణాల్లోనూ సదర్‌కు ఒక స్థానం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకష్ణుడు ఓ సారి ఇంద్రుడిని పరిహసిస్తాడు. కోపంతో ఇంద్రుడు యాదవులపై కుంభవృష్టి కురిపిస్తాడు. దీంతో యాదవులంతా ఆందోళన చెందుతారు. శ్రీకష్ణుడు తన లీలలను ప్రదర్శించి తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తి గోవులను, గోపబాలురను రక్షిస్తాడు. యాదవులకు శ్రీకష్ణుడు చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆయనకు ఎంతో ఇష్టమైన గోవులను అందంగా అలంకరించి ఒక దగ్గరికి తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. దారా దున్నపోతు విన్యాసం ఎల్లారెడ్డిగూడలో... శ్రీనగర్‌కాలనీ: ఎల్లారెడ్డిగూడలో గురువారం రాత్రి నిర్వహించే సదర్ ఉత్సవాలకు దున్నపోతులను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదర్ ఉత్సవాలకు మంగళవారం ఎల్లారెడ్డిగూడలో శక్తి, భీం అనే దున్నపోతులను ఎన్.మల్లేష్‌యాదవ్ సన్నద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దున్నపోతుకు రోజూ 10 లీటర్ల పాలు, యాపిల్స్, ఎండు కర్జూరాలు, ఉలవలలో పాటు పౌష్టికాహాన్ని తినిపిస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఆర్ క్షీరధార నుంచి రెండు దున్నపోతులను తెచ్చామన్నారు.దేశీయ మేలిరకం దున్నపోతులన్నారు సుమారు 1500 కిలోల బరువు ఉంటాయని చెప్పారు. గురువారం రాత్రి యాదవులతో పాటు అన్ని సామాజిక వర్గాలు సంఘటితమై సదర్‌ను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా సదర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గోపూజతో పాటు డప్పులు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సదర్ ఉత్సవాలకు ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉప్పరిగూడ సదర్‌కు ప్రాధాన్యం చంచల్‌గూడ: పాతబస్తీలోని కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడ, చావణి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రాంతంలో నిజాం కాలం నుంచి సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీ నుంచే కాక రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యాదవులు ఇక్కడి సదర్ ఉత్సవంలో తమ దున్నలతో పాల్గొంటారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో చంచల్‌గూడ మెయిన్ రోడ్డుపై వేదిక ఏర్పాటు చేసి సదర్‌లో పాల్గొన్న దున్నల యజమానులను సత్కరిస్తారు. సత్తర్‌బాగ్‌లో సందర్శకుల సందడి ముషీరాబాద్: హర్యాన రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న సత్తర్‌బాగ్‌లో సేదతీరుతున్న దున్నలను చూసేందుకు ముషీరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. దున్నల బలిష్టమైన దేహం, చూపు తిప్పుకోనివ్వని రూపు, కళ్లు చెదిరే విన్యాసాలు, చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉన్న ఈ దున్నలతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. బీబీసీ, ఎఎన్ఐ వంటి వార్తా చానళ్లతోపాటు జాతీయ, రాష్ట్ర మీడియా చానళ్లు వాటిని కెమెరాలలో బంధించేందుకు పోటీ పడుతున్నాయి. శరీరానికి తగ్గట్లే భారీగానే తిండి... దున్నల ఆలనాపాలన చూసేందుకు ముగ్గురు పని చేస్తున్నారు. గత ఏడాది వేడుకల్లో షహన్షా, యువరాజులు ఆకట్టుకుంటే ఈ సారి వాటితో పాటు యువరాజుకే పుట్టిన దారా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. దారాతో పాటు మరో రెండేళ్ల దున్న కాలా కూడా బుధవారం నగరానికి రానుంది. సుమారు వేయి నుంచి 1200 కేజీల బరువు ఉండే ఈ దున్నపోతులు ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు ఉన్నాయి. నిత్యం వాటికి రూ. 6 వేలకుపైనే ఖర్చు అవుతుందంటున్నారు నిర్వాహకులు. రోజూ 4 నుంచి 5 కిలోమీటర్ల వాకింగ్ చేస్తుంటాయి. దున్న@: రూ. 7 కోట్లు రసూల్‌పురా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కంటోన్మెంట్ అన్నానగర్‌లో యాదవ సంఘం నాయకులు సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు రూ. 7 కోట్ల విలువ చేసే దున్న (షహెన్షా)ను తీసుకొచ్చారు. ఆ దున్నను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదవ సంఘం నాయకుడు వెంకట్‌యాదవ్ మాట్లాడుతూ... అన్నానగర్‌లో మొట్టమొదటిసారి సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.వెంకటేష్, జి.వెంకట్‌యాదవ్, సాయి యాదవ్, పి.రవియాదవ్, ఎన్.రాజుయాదవ్, ఎం.శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పేలుతున్న టపాసుల ధరలు
తారాజువ్వల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిచ్చుబుడ్లు కాస్తా చెట్టెక్కి కూచున్నాయి. కాకరపువ్వొత్తుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. మతాబులు చూస్తేనే మండిపోతున్నాయి. అయినా ఏడాదికోసారి వచ్చే పండగకోసం... ఇంట్లో పిల్లల ఆనందం కోసం... ఎంతోకొంత వెచ్చించక తప్పదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. అసలేఅమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదనుగా వచ్చిన వారికే అధిక మొత్తానికి అంటగట్టి సొమ్ము చేసుకోవాలన్న తపన కనిపిస్తోంది. సందట్లో సడేమియాలా అనుమతుల్లేని దుకాణాలు పుట్టుకొచ్చేశాయి. విజయనగరం గంటస్తంభం: దీపావళికి ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటివరకూ అంతంతమాత్రంగా సాగిన వ్యాపారం కనీసం ఈ రెండు రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి ధరలు పెంచేశారు. గతేడాది కంటే 15 నుంచి 20శాతం పెరిగాయి. వ్యాపారులు పెరగలేదని చెబుతున్నా గతేడాది కొనుగోలు చేసిన సామగ్రి కొనుగోలు చేస్తే ఈ సారి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం కాకరపువ్వొత్తులు సాధారణ రకం బాక్సు(10) రూ.50 ఉండగా పదేసి ఉండే చిచ్చుబుడ్లురూ.80 నుంచి రూ.100లు, తాళ్లు రూ.60, లక్ష్మీబాంబులు(చిన్నవి) రూ.20,1000వాలా రూ.450, 12సాట్స్ రూ.100, 60సాట్స్ రూ.600 వరకు ఉన్నాయి. ఇవి గతేడాది కంటే 15 నుంచి 20శాతం ఎక్కువే అని వినియోగదారులు చెబుతున్నారు. గతేడాది రూ.2000 లు సరుకు కొనేవారు ఇప్పుడు వాటికే రూ.2400ల వరకు వెచ్చిస్తున్నారు. అనధికార అమ్మకాలజోరు జిల్లా బాణాసంచా వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లానుంచే కాకుండా పొరుగున ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడినుంచే సరకులు కొనుగోలు చేస్తుంటారు. ఇది చాలాకాలంగా వస్తున్నదే. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్మినెంట్ లైసెన్స్ కలిగిన దుకాణాలు 12 ఉన్నాయి. వీటికి ఎక్స్‌ప్లోజివ్ శాఖ అనుమతులు ఇస్తుంది. ఈ దుకాణాల్లో ఏడాది పొడవునా వ్యాపారాలు సాగుతాయి. ఇక దీపావళి ముందు తాత్కాలిక లైసెన్సుతో వ్యాపారాలు చేసుకునేందుకు రెవెన్యూశాఖ అనుమతులిస్తుంది. ఇలా ప్రతి ఏడాది 80కు పైగా తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవిగాకుండా అనధికారికంగా మరో 30 నుంచి 40 దుకాణాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సోమవారం నుంచి వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. కొందరు లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలో ఆర్డీఓ సోమవారం సాయంత్రం వరకు 24 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేస్తే ప్రస్తుతం ఒక్క కె.ఎల్.పురంలోనే 46 దుకాణాల్లో అమ్మకాలు జరుగుతుండడం విశేషం. కొత్తవలస, లక్కరవరపుకోట, ఎస్.కోట, గజపతినగరం, పూసపాటిరేగ మండలాలకు సంబంధించి 45 దుకాణాలకు అనుమతిస్తే అక్కడ 60కు పైగా ఉన్నాయి. పార్వతీపురం డివిజన్లో బొబ్బిలి, పార్వతీపురంలో మూడేసి, సాలూరులో ఒకటి తాత్కాలి లైసెన్సులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ అనధికార షాపులు లేకపోయినా మంగళ, బుధవారాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అమలు కాని నిబంధనలు అనుమతులు ఇచ్చిన తాత్కాలిక వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులతో విజయగనరం ఆర్డీఓ జె.వి.మురళి, పోలీసు, ఫైర్ అధికారులు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల గురించి కచ్చితమైన సూచనలు చేశారు. కానీ తాత్కాలిక దుకాణదారులు మాత్రం చివరికి నిబంధనలు పాటించకుండా షాపులు పెట్టారు. కె.ఎల్.పురంలో రాజులకాలనీకి ఆనుకుని పదుల సంఖ్యలో షాపులు పెట్టారు. వాస్తవానికి ఇళ్లకు, షాపులకు మధ్య 50మీటర్లు దూరం ఉండాలి. మరోవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలు అసలు లేవు. తాత్కాలిక షాపులు రేకులతో వేయాలని చెప్పినా టెంట్లుతో వేశారు. ఇసుక, నీరు బకెట్లు, డ్రైకెమికల్, అగ్ని మాపక పరికరాలు లేవు. ఇప్పటికే నిల్వలు అనుమతుల కంటే ఎక్కువ ఉన్నాయి. పరిశీలించి అనుమతులిచ్చాం స్థలాలు ముందే పరిశీలించాం. ఇళ్లకు వెళ్లేదారి కావడం, పక్కనే ఇల్లు ఉండడంతో ఒక ప్రదేశంలో పెట్టకూడదని చెప్పాం. ఇంకోచోట సూచించినా స్థల యజమాని అంగీకరించనందున జనావాసాలకు ఇబ్బంది లేకుండా పెట్టాలని సూచించాం. ఇళ్లకు 50మీటర్లు దూరంలో ఉండేలా చూసుకున్నాం. టేకు చెట్లు, ఇతర అడ్లు ఉన్నందున ఇబ్బంది ఉండదు. అనుమతి లేకుండా ఎక్కడైనా షాపులు పెట్టి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా పెడతాం.– జె.వి.మురళి,ఆర్డీవో, విజయనగరం -
దీపావళి దందా
తణుకు: జిల్లాలో దీపావళి దందా మొదలైంది. అనుమతుల పేరిట అధికారులు దుకాణదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలారు. జిల్లాలో అధికారికంగా కంటే అనధికారికంగా ఎక్కువ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుని ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 కోట్ల వ్యాపారం ఏటా రూ.వంద కోట్లు వ్యాపారం జరుగుతుంది.. అయినా నిబంధనలు ఎక్కడా అమలు కావు.. దీపావళి బాణసంచా వ్యాపారం పేరుతో నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకునే వ్యాపారులకు వివిధ శాఖల అధికారులు మామూళ్ల పేరుతో వారిని ముంచేస్తున్నారు. తాత్కాలిక షాపులకు అనుమతులు పేరుతో కొన్నిశాఖల అధికారులు, సిబ్బంది దీపావళి దందాకు దిగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రత్యేక రేటు పెట్టి మరీ దోచేస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించాల్సిన వ్యాపారులు సైతం అధికారులకు మామూళ్లు ఇచ్చేశాం కదా అని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా తయారీ కేంద్రాల్లో 15 కిలోలకు మించి తయారు చేయకూడదనే నిబంధనలు ఉన్నా జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. దీంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 550 దుకాణాలకు అనుమతులు జిల్లాలో ఈ ఏడాది తాత్కాలిక దుకాణాల ఏర్పాటు కోసం 550 వరకు అధికారులు అనుమతులు ఇవ్వగా మరో 19 తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే 2 వేల వరకు అనధికార షాపుల ద్వారా దీపావళి రెండ్రోజుల పాటు అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా వారం రోజుల పాటు జరిగే వ్యాపారం జిల్లాలో రూ.వంద కోట్లు పైగా ఉంటుందని అంచనా. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బాణసంచా దిగుమతి చేసుకుంటున్న ఇక్కడి వ్యాపారులు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన హోల్‌సేల్ వ్యాపారులకు ఇక్కడి నుంచే ఎగుమతులు అవుతుంటాయి. అయితే తయారీ కేంద్రాల్లో కేవలం 15 కిలోలకులోపు మాత్రమే బాణసంచా తయారు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో వయ్యేరుగట్టు ఆనుకుని తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాణసంచా తయారీ కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో ఏటా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే ప్రాంతంలో 2013లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇదే గ్రామంలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా ప్రమదవశాత్తూ పేలిపోవడంతో ఇద్దరు భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముడుపులిస్తేనే సర్టిఫికెట్.. బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు, రెవెన్యూ, ఫైర్, ట్రాన్స్‌కో ఇలా ఆయా శాఖలవారీగా డిమాండ్ చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అధికారులకు అడిగిన సొమ్ము ముట్టజెబితేనే నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఏదొక సాకు చెప్పి తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు బ్రోకర్లు అంతా మేం చూసుకుంటామంటూ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధిలో షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఒక్కో వ్యాపారి నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తాత్కాలికంగా షాపు ఏర్పాటు చేసుకోవాలంటే రూ.వెయ్యి చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం స్థానిక ఫైర్ అధి కారులతో పాటు రెవెన్యూ, డివిజన్ పోలీసులు, స్థానిక పోలీసులు, మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఇలా ఒక్కోశాఖ అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు మీరితే చర్యలు నిబంధనలు పాటించని బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే 550 తాత్కాలిక షాపులకు అనుమతులు ఇచ్చాం. మరో 19 తయారీ కేంద్రాలు అధికారికంగా ఉన్నాయి. ఎక్కడైనా అనధికారికంగా తయారు చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎ.వి.శంకరరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, ఏలూరు -
అదే నా సంకల్పం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలిగించాలన్నదే తన సంకల్పం, తపన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పే ర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశా రు. ‘‘గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చెడు మీద విజయానికి దీపావళి ప్రతీక దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలషించారు. గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతిత్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన. — YS Jagan Mohan Reddy (@ysjagan) 5 November 2018 -
దీపావళి వేళలను ధిక్కరిస్తాం
బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు కట్టుబాట్లను విధించడంపై అనేకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండుగంటలు కేటాయించడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలుఅసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. రోడ్లలో వెళ్లే వాహనాలు కాలుష్యపు పొగనువదలడం లేదా, కేవలం రెండుగంటలే వాహనాలు నడపాలని షరుతు విధించడం సాధ్యమా అని పలువురు దుయ్యబట్టారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: బాణసంచా కాల్చడం ద్వారా ఏడాదికోసారి సందడి చేసుకునే దీపావళి పండుగపై షరుతులు ఏంటి, బాణసంచా కాల్చేందుకు వేళల కట్టుబాటేంటి.. అన్నింటినీ ధిక్కరిస్తాం.. అంటున్నారు పలువురు పౌరులు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు అందరూ కలిసి జరుపుకోవడమే దీపావళి ప్రత్యేకతని చెన్నై టీ.నగర్‌కు చెందిన స్వప్న అన్నారు. దీపావళి వేళల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం చోద్యంగా ఉందని ఆమె అన్నారు. అనవసరమైన ఇలాంటి కట్టుబాట్ల వల్ల మరింత కసిగా అదనపు వేళల్లో బాణసంచా కాల్చాలనే భావన వస్తోందని చెప్పారు. హిందువులకు అనాదిగా వస్తున్న పండుగల్లో దీపావళి కూడా ఒకటి దాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానించాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీదివ్య అనే ఇంజినీరు సుప్రీం తీర్పును సమర్థించారు. దీపావళి కాలుష్యం చిన్ననాటి నుంచే తెలుసు. ఇకనైనా ప్రజల్లో మార్పురావాలి. సినిమాలకు, షికార్లకు వెళ్లడం ద్వారా దీపావళి పండుగ చేసుకోవడం అలవాటు కావాలని అన్నారు. దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చే హక్కును న్యాయస్థానాలు హరించరాదని అముద అనే యువతి అన్నారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల గడువును పాటించడం మంచదని వైష్ణవి అనే పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ రోడ్లపై ప్రతినిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదు, ఒక్క దీపావళి రోజున కాలుష్యాన్ని అరికడుతారా అని మేట్టుపాళయంకు చెందిన కన్నన్ విమర్శించారు. ఇపుడు దీపావళి బాణసంచాకు రెండుగంటలు విధించారు. భవిష్యత్తులో ఇక మిగిలిన పండుగలకు ఎలాంటి నియమ నిబంధనలు మీదవచ్చి పడతాయోనని భయంగా ఉందని జ్యోతిక అనే కళాశాల విద్యార్థిని ఆందోళన వ్యక్తంచేశారు. దీపావళి అంటేనే టపాసులు అవిలేకుండా పండుగా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించడం సాధ్యం కాదు, నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వారిని తెల్లవారుజామున 4 గంటలకు లేపికూర్చునబెట్టి టపాసులు కాల్చేదెలా అని కూలీ కార్మికుడు సుబ్రమణియం ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చెప్పింది అంటే పిల్లలకు అర్థం అవుతుందా, వారు వినిపించుకుంటారా అని నిలదీశారు. దీపావళి పండుగకు ఐదురోజులు సెలవులు వచ్చాయి, అయితే రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలనే నిబంధన బాధాకరమని ఆదికేశవన్ అనే పాఠశాల విద్యార్థి అన్నాడు. రెండుగంటల షరతు వల్ల బాణసంచా తయారీదారులు తీవ్రంగా నష్టపోతారు, ప్రజలు సరదాగా పండుగ చేసుకోలేరు, సుప్రీంకోర్టు మరోసారి ఆలోచిస్తే మంచిదని కడలూరుకు చెందిన తంగ ఆనందన్ సూచించారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు బాణసంచా వేళలను కట్టడి చేయడం స్వాగతించదగిందే, అయితే కట్టడి చేయడం అసాధ్యమని వేలూరుకు చెందిన డాక్టర్ శశిరేఖ అన్నారు. బాణసంచా కాల్చే హక్కులను కాలరాయడమేనని నాగర్‌కోవిల్‌కు చెందిన పాల్కని అన్నారు. రెండుగంటలు మాత్రమే టపాసులు కాల్చాలని చెప్పడం పిల్లల ఆనందాన్ని హరించడమేనని ఆమె అన్నారు. వేళల పునఃపరిశీలన చేయాలి కేవలం రెండే గంటల నియమాన్ని ప్రజలు అంగీకరించరని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. వీధి వీధికి పోలీసులను పెట్టి వ్యవధిని పర్యవేక్షిస్తారా అని ఆయన ఎద్దేవాచేశారు. దీపావళి అనేది సంతోషంగా జరుపుకునే పండుగ, సంతోషంగానే సాగనివ్వండని అన్నారు. వ్యవధిని పునఃపరిశీలించాలని వీసీకే అధినేత తిరుమావళవన్ కోరారు. బాణ సంచా వేళలను పెంచాలని సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటుడు శరత్‌కుమార్ కోరారు. పుదుచ్చేరి ఆఫర్ దీపావళి పండుగను పురస్కరించుకుని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు పలు ఆఫర్లను అందజేసేందుకు సిద్ధమైంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు, చక్కెర అందిస్తున్నారు. అలాగే రేషన్‌కార్డుదారులకు కిలో చక్కెర, కొత్త బట్టల కొనుగోలుకు రూ.1000ల నగదు పంపిణీ చేస్తున్నారు. -
బిగ్ ‘సి’లో రూ.3 కోట్ల బహుమతులు
సాక్షి, హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ దసరా, దీపావళి పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ కొనుగోలుపై దాదాపు రూ.3 కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఎండీ బాలు చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం తమ సంస్థ ఆనవాయితీ అని, ఇంత పెద్ద మొత్తంలో బహుమతులందించడం మొబైల్ వ్యాపార రంగంలో ఓ సంచలనమని పేర్కొన్నారు. -
మహేష్ బాబు దీపావళి గిఫ్ట్స్
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎవరితో పెద్దగా కలవకుండా దూరంగా ఉంటున్న మహేష్, ఈ మధ్యకాలంలో తన పద్ధతి మార్చుకున్నాడు. ఫిలిం ఫంక్షన్స్‌తో పాటు పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తున్నాడు. అంతేకాదు.. గతంలో ఎప్పుడు పెద్దగా వార్తల్లో కనిపించడానికి ఇష్టపడని ఈ సూపర్ స్టార్, ఈ మధ్య వరుసగా వార్తల్లో వ్యక్తిగా మారుతున్నాడు. ముఖ్యంగా శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. శ్రీమంతుడు సక్సెస్ తరువాత తనకు అంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు ప్రిన్స్. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అలాంటి న్యూస్ మరోటి క్రియేట్ చేశాడు మహేష్. తనకు అత్యంత సన్నిహితులైన కొంత మంది మిత్రులకు దీపావళి సందర్భంగా పండ్లు, స్వీట్లు పంపించాడు. మహేష్ పంపిన గిఫ్ట్ ప్యాక్ లో స్వీట్స్, ఆర్గానిక్ మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు మహేష్ స్వయంగా రాసిన శుభాకాంక్షల పత్రాన్ని కూడా తన సన్నిహితులకు పంపాడు. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో మరోసారి మహేష్ వార్తల్లో నిలిచాడు. మహేష్, క్రిష్‌ల కాంబినేషన్లో సినిమా తెరకెక్కాల్సి ఉన్నా, అది వర్క్అవుట్ కాలేదు. ఈ పరిణామంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఆశించవచ్చేమో. Thank you so much @urstrulyMahesh and Namrata for fabulous Deepavali wishes and wish you a great Deepavali too... pic.twitter.com/87ROmk4avr — Krish Jagarlamudi (@DirKrish) November 11, 2015