ముంబై: దాదాపు రెండేళ్ల క్రిత వివాహ బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం దీపావళి రావడంతో ఆ పండుగను అనుష్కతో కలిసి ఘనంగా జరుపుకున్నాడు కోహ్లి. తన ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని దీపాలతో వెలుగులు నింపాడు.
మరొకవైపు అనుష్కతో కలిసి ఫోజిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ మీకు, మీ కుటుంబానికి మా దీపావళి శుభాకాంక్షలు’ అంటూ కోహ్లి కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అదే సమయంలో అనుష్క శర్మ కూడా తన ట్వీటర్ అకౌంట్‌లో మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
Happy Diwali to everyone. May the Festival of Lights light up your lives and bring more love and peace to all 🙏😇❤️ pic.twitter.com/36Gr0aA6ae
— Virat Kohli (@imVkohli) October 27, 2019
Happy Diwali from us to you and your family. I hope we all find the light in us and may truth always triumph. 💜✨🙏 pic.twitter.com/QupvcXjcMT
— Anushka Sharma (@AnushkaSharma) October 27, 2019
— Anushka Sharma (@AnushkaSharma) October 27, 2019
Comments
Please login to add a commentAdd a comment