రజనీ ఇంట దీపావళి వేడుకలు | Rajinikanth Celebrates Diwali Festival With His Family Members | Sakshi
Sakshi News home page

రజనీ ఇంట దీపావళి వేడుకలు

Published Sat, Nov 14 2020 4:29 PM | Last Updated on Sat, Nov 14 2020 7:35 PM

Rajinikanth Celebrates Diwali Festival With His Family Members - Sakshi

పండగ వస్తే చాలు సినీ ప్రముఖులు ఏదో రకంగా తమ అభిమానులను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కొంతమంది హీరోలు తమ కొత్త సినిమాల ఆప్‌డేట్స్‌ ఇస్తే.. ఇంకొంతమంది సినిమా ట్రైలర్‌, పాటలు విడుదల చేసి అభిమానులకు పండుగ కానుగగా అందజేస్తారు. ఇక సినిమాలు ఏమీ లేకపోతే స్వయంగా వారే దీపావళి వేడుకలను జరుపుకొని ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. 

ఇక ఈ ఏడాది ఖాళీగా ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తన కుటుంబ సభ్యులతో దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ ఉల్లాసంగా కనిపించారు.తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రజనీకాంత్... భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు.  దీనికి సంబంధించిన ఫొటోలన రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, ఇటీవల రజనీకాంత్‌ అనారోగ్యం పాలయ్యారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి రోజు ఆయన కుటుంబ సభ్యులతో దర్శనమివ్వడం అభిమానులకు ఆనందం కలిగించే విషయమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement