diwali wishes
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’’అలాగే.. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2024క్లిక్ చేయండి: పులివెందులలో.. జనంతో జగన్ -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం అభిలషించారు. దీపావళి అంటే దీపాల వరస... దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక... మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు! — YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2022 -
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన దేశంలోని మైనార్టీలైన హిందువులకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. కాగా, దీపావళి పండగను పాకిస్తాన్ హిందూవులు ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లో మాదిరే దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుంటారు. ఆలయాలు, గృహాలను అందంగా అలంకరించుకుని సంబరాలు జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు, మాటియారి, టాండో అల్లాహార్, టాండో ముహమ్మద్ ఖాన్, జంషోరో, బాడిన్, సంఘర్, హాలా, టాండో ఆడమ్, షాదాద్‌పూర్‌లలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాకిస్తాన్ మైనారిటీ వర్గాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అధికార ఘణాంకాలు చెబుతున్నాయి. -
రజనీ ఇంట దీపావళి వేడుకలు
పండగ వస్తే చాలు సినీ ప్రముఖులు ఏదో రకంగా తమ అభిమానులను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కొంతమంది హీరోలు తమ కొత్త సినిమాల ఆప్డేట్స్ ఇస్తే.. ఇంకొంతమంది సినిమా ట్రైలర్, పాటలు విడుదల చేసి అభిమానులకు పండుగ కానుగగా అందజేస్తారు. ఇక సినిమాలు ఏమీ లేకపోతే స్వయంగా వారే దీపావళి వేడుకలను జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ ఏడాది ఖాళీగా ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన కుటుంబ సభ్యులతో దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ ఉల్లాసంగా కనిపించారు.తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రజనీకాంత్... భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలన రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, ఇటీవల రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి రోజు ఆయన కుటుంబ సభ్యులతో దర్శనమివ్వడం అభిమానులకు ఆనందం కలిగించే విషయమే. -
దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్ ఫుల్, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్ Happy Diwali to everyone !! May this Diwali guide us into the light from this rather strange year !! Wishing you and your family all the love and light - a lot of people won’t be able to celebrate in the same way due to financial or emotional reasons so keep them in your prayers — shruti haasan (@shrutihaasan) November 14, 2020 Wishing you all a very happy Diwali! While we spread the light of love, hope and joy, let's remember to keep ourselves and the environment safe from pollution. Shine bright, always ✨🙏 pic.twitter.com/n1u0738A3j — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2020 దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా May the light of the diyas illuminate your life with joy and prosperity.. Wish you all a very #HappyDiwali 🪔☺️ pic.twitter.com/wSgAgWy9N3 — Raashi (@RaashiKhanna) November 14, 2020 ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్ Make someone’s Diwali Happy, that’s the best way to wish Happy Diwali 🪔 — sonu sood (@SonuSood) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు Rejoice on this blessed occasion and spread sparkles of peace and goodwill. Let’s celebrate the festival in the true sense by spreading joy, being safe and by illuminating each others life with love and happiness! ✨💥😍#LakshmiManchu #LakshmiUnfiltered #HappyDiwali pic.twitter.com/aIsLVHsh7M — Lakshmi Manchu (@LakshmiManchu) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున Wishing you and your family a very #happyDiwali! May the light of this Diwali drive away the darkness in our lives and continue to do so!!🙏#BiggBossTelugu4 🥼 #sabyasachi #styledbysonybhupathiraju pic.twitter.com/KjOqofG6BR — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2020 దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన Happy Diwali / Deepavali you guys! ✨🤍 No crackers..🙅🏻♀️ have lots of sweets today..☺️🤤 stay with family.. 🤗 celebrate.. 🤗 enjoy!! 🪔✨ Stay safe. Stay happy. God bless us all with a safer and a better tomorrow.. ✨ — Rashmika Mandanna (@iamRashmika) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్ Extending my heartfelt greetings to you and your family! A very Happy Diwali to you and your loved ones.✨💥 Stay safe 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) November 14, 2020 వీరితోపాటు అనపమ పరమేశ్వరన్, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్, వరుణ్ తేజ్, విజయ్ సేతుపతి, రామ్ పోతినేని, రకుల్‌ప్రీత్ సింగ్, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali 🪔 pic.twitter.com/YbtZPt9GMW — Anupama Parameswaran (@anupamahere) November 14, 2020 Wishing everyone a safe and happy Diwali ! #LoveStory @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/8pyaArr4ME — chaitanya akkineni (@chay_akkineni) November 14, 2020 -
'వెరీ వెరీ అన్ హ్యాపీ దీవాళి'
ప్రతీ పండుగకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపే రాంగోపాల్ వర్మ దీపావళి పండుగను కూడా వదిలి పెట్టలేదు. అందరికీ అన్ హ్యాపీ దీవాళి అంటూ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ' టపాకాయలు కాల్చటం ద్వారా జింక్, సోడియం, పోటాషియం లాంటి విష వాయువులను గాల్లోకి వదిలే వారందరికీ అన్ హ్యాపీ దీవాళి. టపాకాయలు కాల్చటం ద్వారా భారీ శబ్ధాలను సృష్టించి ఆరోగ్యం సరిగా లేని ముసలి వాళ్లను, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేవారికి అన్ హ్యాపీ దీవాళి. బ్రొంకైటిస్ ఆస్థామా, క్రోనిక్ పల్మనరీ డిసీజెస్‌తో బాధపడుతున్న వారి సమస్యలను మరింత పెంచే వారికి అన్ హ్యాపీ దీవాళి. భారీ శబ్ధాలు, కాంతుల ద్వారా పక్షులను కష్టపెట్టేవారికి అన్ హ్యాపీ దీవాళి. నరకాసురుడు చేసిన నష్టం ఏంటో తెలియకుండానే అతని చావును సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ అన్ హ్యాపీ దీవాళి. ఇక ఈ రోజు దీవాళిని సెలెబ్రేట్ చేసుకోని వారందరికీ హ్యాపీ దీవాళి. నాకు మాత్రం ప్రతి రోజు దీవాళినే' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. I wish a very #unhappydiwali to all those who release poisonous fumes of Zinc, Sodium, magnesium and potassium through their crackers — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 I wish very #unhappydiwali to ppl who raise noise levels of crackers to unbearable levels torturing unwell old people nd vulnerable babies — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 I wish a very #unhappydiwali to all those who aggravate the condition of bronchitis asthma and chronic pulmonary diseased patients — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 I wish a very #unhappydiwali to those who create misery to birds and animals using noise and dazzling fire light as torture weapons — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 I wish a very very #unhappydiwali to all those who don't even know what narakasura did that they have to celebrate his death — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 Finally I wish a very very happy Diwali to all those who do not celebrate Diwali .....As per me everyday is a Diwali for me — Ram Gopal Varma (@RGVzoomin) 30 October 2016 -
దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు
-
దీపావళి శుభాకాంక్షలు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షాలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వెలుగు జిలుగుల తెలంగాణను దీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు.