తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు | CM YS Jagan Diwali Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

Published Sun, Oct 23 2022 7:34 PM | Last Updated on Mon, Oct 24 2022 11:09 AM

CM YS Jagan Diwali Wishes To Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్ర‌తి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని సీఎం అభిలషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement