'వెరీ వెరీ అన్ హ్యాపీ దీవాళి' | Ram Gopal Varma Diwali wishes | Sakshi
Sakshi News home page

'వెరీ వెరీ అన్ హ్యాపీ దీవాళి'

Published Sun, Oct 30 2016 9:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

'వెరీ వెరీ అన్ హ్యాపీ దీవాళి'

'వెరీ వెరీ అన్ హ్యాపీ దీవాళి'

ప్రతీ పండుగకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపే రాంగోపాల్ వర్మ దీపావళి పండుగను కూడా వదిలి పెట్టలేదు. అందరికీ అన్ హ్యాపీ దీవాళి అంటూ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ' టపాకాయలు కాల్చటం ద్వారా జింక్, సోడియం, పోటాషియం లాంటి విష వాయువులను గాల్లోకి వదిలే వారందరికీ అన్ హ్యాపీ దీవాళి. టపాకాయలు కాల్చటం ద్వారా భారీ శబ్ధాలను సృష్టించి ఆరోగ్యం సరిగా లేని ముసలి వాళ్లను, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేవారికి అన్ హ్యాపీ దీవాళి.

బ్రొంకైటిస్ ఆస్థామా, క్రోనిక్ పల్మనరీ డిసీజెస్తో బాధపడుతున్న వారి సమస్యలను మరింత పెంచే వారికి అన్ హ్యాపీ దీవాళి. భారీ శబ్ధాలు, కాంతుల ద్వారా పక్షులను కష్టపెట్టేవారికి అన్ హ్యాపీ దీవాళి. నరకాసురుడు చేసిన నష్టం ఏంటో తెలియకుండానే అతని చావును సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ అన్ హ్యాపీ దీవాళి. ఇక ఈ రోజు దీవాళిని సెలెబ్రేట్ చేసుకోని వారందరికీ హ్యాపీ దీవాళి. నాకు మాత్రం ప్రతి రోజు దీవాళినే' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement