ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మ
ఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు.
అతి భయంకరమైన జంతువు మనిషే
ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్‌ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సినిమాలో స్టార్స్
మనోజ్ బాజ్‌పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు.
There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready
— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025
చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment