ఆరెంజ్ హీరోయిన్ షాజన్ పదంసీ (Shazahn Padamsee) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో రోకా జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. జనవరి 20న కొత్త ప్రయాణం మొదలైందంటూ '#roka #engagement' అన్న క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లోనూ అశీష్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆశిష్ నటి షాజన్ వేలికి ఉంగరం తొడిగాడు. ఇకపోతే జూన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చరణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించగా హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.
ఎవరీ షాజన్?
పలు వాణిజ్యప్రకటనల్లో మెరిసిన షాజన్.. రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్‌ఫుల్ 2 సినిమాలు చేసింది. తెలుగులో ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసి రూబాగా యాక్ట్ చేసింది. మసాలా మూవీలో రామ్ పోతినేని సరసన కథానాయికగా నటించింది. 2015లో సాలిడ్ పటేల్స్ (హిందీ) సినిమా చేశాక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్‌పన్: నెక్స్ట్ లెవల్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.
రోకా అంటే..
రోకా అంటే తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఇది ఉత్తరాది సాంప్రదాయం. రోకాతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. మా అమ్మాయికి.. వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది అని ప్రకటించే ప్రక్రియే రోకా వేడుక. ఇరు కుటుంబాలు తొలిసారి కలుసుకుని వివాహాన్ని నిశ్చయించుకుని స్వీట్లు తినిపించుకుంటారు. కొత్త జీవితం ప్రారంభించబోయే జంటను ఆశీర్వదిస్తారు. ఇది పెళ్లికూతురి ఇంటి వద్దనో లేదా ఆమె కుటుంబ సభ్యులు ఖరారు చేసిన వేదిక వద్ద జరుపుతారు. ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, హీరో రానా- మిహికా బజాజ్ పెళ్లి సమయంలో ఈ రోకా గురించి చర్చ జరిగింది.
చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!
Comments
Please login to add a commentAdd a comment